close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాణ్యతా పోటీల్లో అమరరాజాకు ప్రథమస్థానం

ఈనాడు-తిరుపతి: సీఐఐ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 33వ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి డిజిటల్‌ క్వాలిటీ సర్కిల్‌ పోటీల్లో చిత్తూరు జిల్లా అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ (రెక్టిఫైయర్స్‌ క్యూసీ బృందం, పవర్‌ రాకర్స్‌ క్యూసీ బృందం)కు ప్రథమ, ద్వితీయ స్థానాలు దక్కాయి. తృతీయ స్థానాన్ని ఐటీసీ లిమిటెడ్‌ (ఛాలెంజర్స్‌ క్యూసీ బృందం) సొంతం చేసుకుంది. 2020 సంవత్సరానికి సంబంధించి డిజిటల్‌ ఫ్లాట్‌ఫారంపై పోటీలు నిర్వహించారు. మొత్తం 12 బృందాలు రాష్ట్రస్థాయి క్వాలిటీ సర్కిల్‌ పోటీల్లో పాల్గొన్నాయి. తొలి మూడుస్థానాలు సాధించిన సంస్థలు దక్షిణ భారత ప్రాంతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాయి. అక్కడ విజేతలుగా నిలిచిన సంస్థలు జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటాయి.
‘టాలెంట్‌ యాక్సిలరేటర్‌ ఫర్‌ ఇండియా-2020’ అవార్డు కూడా:  వ్యాపార పరివర్తనలో క్లిష్టమైన పురోగతులు సాధించినందుకు తమ సంస్థకు ‘టాలెంట్‌ యాక్సిలరేటర్‌ ఫర్‌ ఇండియా-2020’ అవార్డు దక్కిందని అమరరాజా ఎలక్ట్రానిక్స్‌ సీఈవో విక్రమ్‌ గౌరినేని తెలిపారు. ముంబయిలో ఇటీవల నిర్వహించిన 4వ వార్షిక ఐడీసీ డిజిటల్‌ ట్రాన్సర్మేషన్‌ అవార్డులలో పీపుల్‌స్ట్రాంగ్‌ భాగస్యామ్యంతో అమలు చేస్తున్న ట్రాన్సర్మేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ సిస్టమ్స్‌ అండ్‌ ప్రాసెస్‌ డబ్ల్యుఈ, ఏఆర్‌ ప్రాజెక్టుకు అవార్డును పొందినట్లు తెలిపారు. ఇది ఆసియా, పసిఫిక్‌ అంతటా అసాధారణమైన 1200 అధిక నాణ్యత ఎంట్రీలను మించిపోయిందన్నారు.


Tags :

కథనాలు

మరిన్ని

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.