close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రష్యా టీకాపై క్లినికల్‌ పరీక్షల నిర్వహణ

డాక్టర్‌ రెడ్డీస్‌కు డీసీజీఐ అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, ఆర్‌డీఐఎఫ్‌ (రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌) సంయుక్తంగా మనదేశంలో ‘స్పుత్నిక్‌ వి’ కొవిడ్‌-19 టీకాపై క్లినికల్‌ పరీక్షలు నిర్వహించనున్నాయి. రష్యా ఆవిష్కరించిన ఈ టీకాపై 2/3వ దశల పరీక్షలు నిర్వహించటానికి డీసీజీఐ (డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) అనుమతి లభించినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ శనివారం ఇక్కడ వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ‘రాండమైజ్డ్‌ కంట్రోల్డ్‌ స్టడీ’ పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు, భద్రత- ఇమ్యునోజెనిసిటీ అధ్యయనాలు కూడా ఇందులో భాగంగా ఉన్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది. క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు డీసీజీఐ అనుమతి లభించటాన్ని కీలకమైన మైలురాయిగా డాక్టర్‌ రెడ్డీస్‌ సహ-ఛైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ పేర్కొన్నారు. భద్రమైన, సమర్థమైన కొవిడ్‌-19 టీకా తీసుకురావటానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. భారతదేశంలో పరీక్షల నిర్వహణ సందర్భంగా స్పుత్నిక్‌ వి టీకాపై రష్యాలో నిర్వహించిన 3వ దశ పరీక్షల సమాచారాన్ని కూడా అందించనున్నట్లు ఆర్‌డీఐఎఫ్‌ సీఈఓ కిరిల్‌ డిమిట్రివ్‌ వివరించారు.


Tags :

కథనాలు

మరిన్ని

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.