close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విపణిలోకి కేటీఎం 250 అడ్వెంచర్‌

ధర రూ.2,48,256

దిల్లీ: బజాజ్‌ ఆటో గ్రూప్‌నకు చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్‌ బ్రాండ్‌ కేటీఎం, తమ అడ్వెంచర్‌ మోడల్‌ ‘కేటీఎం 250’ని విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.2,48,256 (ఎక్స్‌-షోరూమ్, దిల్లీ). దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కేటీఎం విక్రయ కేంద్రాల్లో శుక్రవారం నుంచి వీటిని బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. కేటీఎం 250 బైక్‌ 248 సీసీ సింగిల్‌-సిలిండర్‌ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో రూపొందింది. 30 హెచ్‌పీ పవర్, 6-స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ దీని ప్రత్యేకతలు. బాష్‌ రూపొందించిన యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌తో (ఏబీఎస్‌) పాటు డాష్‌బోర్డులో అదనపు ఆఫ్‌-రోడ్‌ మోడ్‌ బటన్‌ కూడా ఉంటుంది. దీంతో రైడర్లు కార్నర్స్‌లో (మూలల్లో) వెనుక వైపు చూడకుండా సులభంగా బైక్‌ను నడిపించే అవకాశం ఉంటుంది.


Tags :

కథనాలు

మరిన్ని

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.