సెలవు రోజునా.. ఈఎంఐ
close

Published : 30/07/2021 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెలవు రోజునా.. ఈఎంఐ

బ్యాంకు నుంచి నేరుగా వెళ్లే రుణ వాయిదాలు సాధారణంగా సెలవు రోజుల్లో బ్యాంకు నుంచి డెబిట్‌ కావు. కానీ, ఆగస్టు 1 నుంచి ఇది మారనుంది. నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌస్‌ (నాచ్‌) ఇక నుంచి అన్ని రోజులూ పని చేస్తుందని ఆర్‌బీఐ జూన్‌లో వెల్లడించింది. కాబట్టి, ఈఎంఐ వాయిదా రోజు సెలవు దినం ఉన్నా బ్యాంకు నుంచి ఆ మొత్తం డెబిట్‌ అవుతుంది.

దీంతోపాటు.. సెలవు రోజు ఉన్నా.. వేతనాలు, పింఛన్లు, డివిడెండ్లు, వడ్డీ చెల్లింపుల్లాంటివీ బ్యాంకులో జమ అవుతాయి. ఇప్పటికే నిర్ణీత తేదీ నాడు చెల్లింపు చేయాల్సిందిగా నాచ్‌ ధ్రువీకరణ ఇచ్చిన సందర్భాల్లో అదే తేదీన ఆ చెల్లింపులు జరిగిపోతాయి. టెలిఫోన్‌ బిల్లులు, బీమా పాలసీల ప్రీమియం, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడుల్లాంటి వాటికి సెలవు రోజునాడూ బ్యాంకు నుంచి ఆ మొత్తం వెళ్లిపోతుంది.

* ఐసీఐసీఐ బ్యాంకు నగదు లావాదేవీలపై పరిమితిని విధించింది. ఈ కొత్త నిబంధనలూ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నగదు జమ, వెనక్కి తీసుకునేందుకు మొత్తం 4 ఉచిత లావాదేవీలనే అనుమతించనుంది. ఆ తర్వాత నుంచి ప్రతి లావాదేవీకి   రూ.150 రుసుము విధిస్తుంది. మూడో వ్యక్తులు చేసే నగదు  జమలపైనా పరిమితులు విధించింది. రూ.25,000 వరకూ రూ.150 రుసుము వసూలు చేయనుంది. ఆపై జమను అనుమతించదు. ఏడాదికి 25 చెక్కులు ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత 10  చెక్కులుండే ఒక్కో చెక్‌బుక్‌కు రూ.20 చెల్లించాలి.


వడ్డీ రేట్లు ఇలా...

త కొంత కాలంగా బ్యాంకులు అందిస్తోన్న వివిధ రుణాల  వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. దీంతోపాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని అగ్రశ్రేణి బ్యాంకుల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై               వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయన్న వివరాలు మీకోసం.. (వడ్డీ రేట్లు శాతాల్లో)


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని