హెచ్చుతగ్గులే అవకాశాలుగా...
close

Published : 27/08/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హెచ్చుతగ్గులే అవకాశాలుగా...

బరోడా బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌

బరోడా మ్యూచువల్‌ ఫండ్‌ ఒక వినూత్నమైన పథకాన్ని ఆవిష్కరించింది. అదే ‘బరోడా బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌’. వ్యాపార రంగంలో కొన్ని రంగాలు వేగంగా ఎదగటం, మరికొన్ని రంగాలు కిందపడిపోవటం సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఈ హెచ్చుతగ్గులను గుర్తించి ‘డైనమిక్‌ అసెట్‌ అలకేషన్‌’ పద్ధతిలో ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం. సెక్టోరియల్‌ లేదా థీమ్యాటిక్‌ ఇన్వెస్టింగ్‌తో పోల్చితే బిజినెస్‌ సైకిల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పద్ధతి పూర్తిగా భిన్నమైనదనే విషయాన్ని గుర్తించాలి.
ఈ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ వచ్చే నెల 6. ఎన్‌ఎఫ్‌ఓ ద్వారా కనీసం రూ.5,000 పెట్టుబడిగా పెట్టాలి. బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ సూచీతో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. సంజయ్‌ చావ్లా, అబుల్‌ ఫతే, ప్రతీష్‌ కృష్ణన్‌ దీనికి ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. తమ మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడుల్లో కొంత వైవిధ్యం ఉండాలని భావించే మదుపరులకు ఇది పరిశీలించదగిన పథకమే. ఫండ్‌ మేనేజర్‌ అంచనాలు కలిసి వస్తే బరోడా బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌ అధిక లాభాలు పండించే అవకాశం ఉండవచ్చు. కాకపోతే దీర్ఘకాలం పాటు మదుపరులు ఈ ఫండ్‌లో కొనసాగాలి. అప్పుడే ఫలితం కనిపిస్తుంది.
ఈ విభాగంలో ఎల్‌అండ్‌టీ మ్యూచువల్‌ ఫండ్‌   2014 నుంచి ఒక పథకాన్ని నిర్వహిస్తోంది. అదే ఎల్‌అండ్‌టీ బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌. ఈ ఫండ్‌ గత అయిదేళ్ల కాలంలో రెండంకెల వార్షిక ప్రతిఫలాన్ని అందించింది. కొద్దికాలం క్రితం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌ వచ్చింది. అదేవిధంగా ఈ ఏడాది జులైలో టాటా మ్యూచువల్‌ ఫండ్‌.. టాటా బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇప్పుడిప్పుడే పలు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఈ విభాగానికి చెందిన పథకాలను తీసుకువస్తున్నాయి.

 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని