close

అవీ... ఇవీ

Tech10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు (03/02/2020)

1. వీడియో: శాంసంగ్‌ రెండో ‘మడత’ ఫోన్‌ 

శాంసంగ్‌ నుంచి రెండో ఫోల్డబుల్‌ ఫోన్‌ రావడానికి ఇంకా ఎనిమిది రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో మొబైల్‌కు సంబంధించిన ఫొటోలు, వివరాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ హ్యాండ్స్‌ ఆన్‌ వీడియో కూడా బయటకు వచ్చింది.  అయితే ఇది నిజమైనదా? కాదా? అనే విషయం తేల్చడంలో టెక్‌ వర్గాలు బిజీగా ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన రెండు ఫోల్డబుల్‌ ఫోన్స్‌ గెలాక్సీ ఫోల్డ్‌, హువావే మేట్‌ ఎక్స్‌కు భిన్నంగా ఇది ఉంది. మోటోరోలా రేజర్‌ మొబైల్‌కు దగ్గరగా ఉంది. మీకు తెలుసుగా కొత్త ‘మడత’ ఫోన్‌ 11న లాంచ్‌ చేస్తున్నారు.


2. ఫోన్‌పేలో ఛాటింగ్‌

‘డబ్బులు ఫోన్‌పే చేసి.. ఓ మెసేజ్‌ పెట్టు లేదంటే వాట్సాప్‌ చేయ్‌..’ అని మీరో లేదంటే మీ మిత్రులో అనే ఉంటారు. ఇకపై ఆ అవసరం లేదు ఎందుకంటే ఫోన్‌పేలోనే ఛాటింగ్‌ ఆప్షన్‌ వచ్చేసింది. గూగుల్‌ పేలో ఉన్న ఈ తరహా ఆప్షన్‌ను ఫోన్‌పే కూడా తీసుకొచ్చింది. ఓ వారం క్రితం ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌ ఇప్పుడు యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఫోన్‌పే చెబుతోంది. మొత్తంగా ఫోన్‌పే యాప్‌ను 18.5 కోట్ల మంది వినియోగిస్తున్నారని సంస్థ చెబుతోంది. 


3. గూగుల్‌ మ్యాప్స్‌నే తప్పుదోవ పట్టించాడు

ఎక్కడికైనా వెళ్లాలంటే.. దారిలో ట్రాఫిక్‌ ఎలా ఉందో తెలుసుకోవడానికి గూగుల్‌ మ్యాప్స్‌ వాడుతుంటాం. అలాంటిది ఒక యువకుడు ఏకంగా గూగుల్‌ మ్యాప్స్‌నే మోసం చేశాడు.  బెర్లిన్‌కు చెందిన సైమన్‌ వెకర్ట్‌ అనే యువకుడు ఓ చిన్న ట్రాలీలో 99 మొబైల్స్‌ వేసుకొని ఓ రోడ్డులో నడిచాడు. వాటన్నింటిలో గూగుల్‌ మ్యాప్స్‌ నేవిగేషన్‌ ఆన్‌ చేసి పెట్టాడు. దీంతో ఆ రోడ్డులో ట్రాఫిక్‌ ఎక్కువుందని గూగుల్‌ మ్యాప్స్‌ చూపించింది. దీంతో ఖాళీగా ఉన్నా రోడ్డువైపు ఎవరూ రాలేదు. ఈ విషయాన్ని సైమర్‌ యూట్యూబ్‌లో వీడియోగా పెట్టాడు. దీని బట్టి చూస్తే మన డేటాను గూగుల్‌ తీసుకుంటోందని సైమస్‌ అంటున్నాడు. మరి దీనికి గూగుల్‌ ఏం చెబుతుందో చూడాలి. 


4. ఐక్యూ మన దేశానికీ వస్తోంది...

వివో సబ్‌ బ్రాండ్‌ ఐక్యూ (IQOO) మన దేశానికి కూడా రాబోతోంది. వస్తూ వస్తూ 5జీ ఫోన్‌ని తీసుకురాబోతోంది. చైనాలో ఈ ఫోన్‌ లాంచ్‌ ఉంటుందని ఇప్పటికే ప్రకటించినా... మన దేశానికి సంబంధించి ఐక్యూ తీపి కబురు చెప్పేసింది. ఈ మేరకు ఐక్యూ కమింగ్‌ సూన్‌ అంటూ ఓ ట్వీట్‌ చేసింది. ఈ మొబైల్‌లో కొత్త తరం స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ ఉంటుందని సమాచారం. ఐక్యూ అంటే ఏంటి అనేగా మీ ప్రశ్న.. ఇదిగో ఇది. I Quest On and On. తపన పడుతూనే ఉంటాను అనేది సంస్థ పేరు. 


5. ఐఫోన్‌లో సులభంగా రీబూట్‌ చేయాలా?

ఆండ్రాయిడ్‌ మొబైల్‌ను రీబూట్‌/రీస్టార్ట్‌ చేయాలంటే పవర్‌ బటన్‌ను లాంగ్‌ చేస్తే సరిపోతుంది. అదే ఐఓఎస్‌లో అయితే అంత సులభం కాదు. ఐఫోన్‌  X కంటే ముందు మొబైల్స్‌లో పవర్‌ బటన్‌, హోమ్‌ బటన్‌ ఒకేసారి లాంగ్‌ ప్రెస్‌ చేయాలి. ఐఫోన్‌ X సిరీస్‌ వాటికైతే పవర్‌ బటన్‌, వాల్యూమ్‌ బటన్‌ను ఒకేసారి ప్రెస్‌ చేయాలి. ఈ ఇబ్బంది లేకుండా ఓ కిటుకు ఉంది. దీనికి మీరు చేయాల్సిందల్లా... మీ ఐఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులో యాక్సెసబులిటీ ఆప్షన్‌లోకి వెళ్లండి. అందులో వాయిస్‌ కంట్రోల్‌ ఆప్షన్‌ను ఆన్‌ చేసుకోండి. ఆ తర్వాత మీ మొబైల్‌ రీస్టార్ట్‌ చేయాల్సినప్పుడల్లా ‘Reboot Device’ అని మొబైల్‌ దగ్గర చెబితే చాలు. వెంటనే రీస్టార్ట్‌ చేయాలా అని పాప్‌ అప్‌ వస్తుంది. మీరు ఓకే చేస్తే రీస్టార్ట్‌ అయిపోతుంది. 


6. నోకియా కొత్త మొబైల్‌ ఇలా...

మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకురావడానికి అన్ని సంస్థలు ఆసక్తి చూపుతుంటాయి. అలా నోకియా కూడా కొన్ని మొబైల్స్‌ తీసుకురాబోతోంది. బడ్జెట్‌ బ్రాకెట్‌లో నోకియా 5.2 ను తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన లైవ్‌ ఇమేజ్‌ లీక్‌ అయ్యింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఇందులో 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీ ఉంటుంది. దీని ధర 180 డాలర్ల వరకు ఉండబోతోందని తెలుస్తోంది. మార్చి 4న ఈ మొబైల్‌ను లాంచ్‌ చేయబోతున్నారు. 


7. రెడ్‌మీ నోట్‌ 9 వస్తోందా?

బడ్జెట్‌ మొబైల్స్‌ అంటే రెడ్‌మీ సిరీస్‌ అన్నట్లుగా షావోమీ ఫోన్లను తీసుకొస్తుంటుంది. రెడ్‌మీ 8 సిరీస్‌తో ఈ ఏడాది దుమ్మురేపిన షావోమీ రెడ్‌మీ నోట్‌9 సిరీస్‌ తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. షావోమీ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మను కుమార్‌ జైన్‌ ఈ రోజు ఓ వీడియో ట్వీట్‌ చేశాడు. అందులో పెద్దగా సమాచారం లేకపోయినా.. అది రెడ్‌మీ నోట్‌9 కి సంబంధించిన ట్వీట్‌ అని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. రెడ్‌మీ 9లో మీడియాటెక్‌ హీలియో జీ70 ప్రాసెసర్‌ ఉండబోతోందట.  మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది. 


8. జియో సెట్‌టాప్‌ బాక్స్‌లో అమెజాన్‌ ప్రైమ్‌

జియో సెట్‌ టాప్‌ బాక్స్‌లో యూట్యూబ్‌, సోనీ లివ్‌, హాట్‌ స్టార్‌, వూట్‌ లాంటి చాలా ఓటీటీ యాప్స్‌ ఉన్నాయి. అయితే అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి యాప్స్‌ లేవు. వీటిని ఇంకా జియో ఇంటిగ్రేట్‌ చేయలేదు. అయినా వీటిని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చని టెక్‌ పరిశీలకులు చెబుతున్నారు. దీని కోసం జియో సెట్‌టాప్‌ బాక్స్‌ ఉన్న టీవీలో జియో పేజెస్‌ (బ్రౌజర్‌) యాప్‌కి వెళ్లాలి. అందులో మీకు కావాల్సిన యాప్‌ పేరుతో ఏపీకేను సెర్చ్‌ చేస్తే... జియో సెట్‌టాప్‌ బాక్స్‌కు సపోర్టు చేసే యాప్స్‌కు సంబంధించి ఏపీకేలు కనిపిస్తాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. అయితే కొన్ని సెట్‌టాప్‌ బాక్స్‌ల్లో మాత్రమే ఇది పనిచేస్తోంది.  అయితే ఇలా థర్డ్‌ పార్టీ యాప్స్‌ వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 


9. ఏడేళ్ల తర్వాత కొత్త యాపిల్‌ మ్యాప్స్‌ 

2012లో విడుదల చేసిన తొలి వెర్షన్‌ ఆశించిన మేర ఆకట్టుకోకపోవడంతో సీఈవో టిమ్‌ కుక్‌ కూడా క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లకు యాపిల్‌ మ్యాప్స్‌కు అప్‌డేట్‌ చేసిన వెర్షన్‌ను సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతానికి అమెరికాలో కొంతమందికి కొత్త వెర్షన్‌ మ్యాప్స్‌ను రోల్‌ అవుట్‌ చేశారు. కొత్త వెర్షన్‌లో సైన్‌ ఇన్‌ అవసరం లేదు. గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూ తరహాలో లుక్‌ అరౌండ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చారు.  లైవ్‌ డిపార్చర్‌ టైమ్స్‌, అరైవల్‌ టైమ్స్‌, బస్‌/ట్రైన్‌ రూట్‌ లాంటి వివరాలూ కొత్త యాపిల్‌ మ్యాప్స్‌లో ఉండబోతున్నాయి. 


10.  కరోనా వల్ల ఆలస్యమవుతోంది...

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం మొబైల్‌ మార్కెట్‌ మీద కూడా పడింది. ఈ కారణంగా యాపిల్‌ ఫోన్ల తయారీ ఆలస్యమవుతోందట. ఇప్పటివరకు ఐఫోన్ల షిప్‌మెంట్స్‌లో 10 శాతం తగ్గుదల కనిపించిందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ ప్రభావం వల్ల చైనాలో ఈ నెల 9 వరకు రిటైల్ స్టోర్స్‌ ను మూసేస్తున్నట్లు యాపిల్‌ ఇటీవల ప్రకటించింది. ఆర్‌వోజీ మొబైల్స్‌ విషయంలో ఇదే సమస్య ఎదురైందని ఆసుస్‌ చెబుతోంది. 



కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.