close

అవీ... ఇవీ

Tech10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు (05/03/2020)

1. నోకియా 5జీ 11 రోజుల ముందే చూడొచ్చు

నోకియా నుంచి ఈ నెల 19న 5జీ మొబైల్‌ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. జేమ్స్‌బాండ్‌ సినిమాలో ఈ మొబైల్‌ను వాడబోతున్నారట. అంటే బాండ్‌ ఫ్రాంచైజీ కొత్త సినిమా ‘నో టైమ్‌ టు డై’లో ఈ మొబైల్‌ కనిపించబోతోంది. ఈ నెల 8న ‘నో టైమ్‌ టు డై’ టీజర్‌ రానుంది. అందులో ఏజెంట్‌ నోమి చేతిలో ఈ మొబైల్‌ కనిపిస్తుందని సమాచారం. అంటే అఫీషియల్‌ లాంచ్‌కి 11 రోజుల ముందే ఈ మొబైల్‌ను చూడొచ్చన్నమాట.

2. మీడియాటెక్‌ - శాంసంగ్‌ కలసి...

ప్రపంచంలోనే తొలి  వైఫై6 టీవీని శాంసంగ్‌ - మీడియాటెక్‌ సంయుక్తంగా తీసుకురాబోతున్నాయి. QLED Y20 model (Q950, Q900)గా పిలిచే ఈ ఫ్లాగ్‌షిప్‌ టీవీలో  8K స్క్రీన్‌ ఉంటుంది. వైఫై6 చిప్‌సెట్‌ వాడటం వల్ల కనెక్టివిటీ మరింత మెరుగ్గా ఉంటుందని శాంసంగ్‌ చెబుతోంది. హయ్యర్‌ ట్రాన్స్‌మిషన్‌ వల్ల విద్యుత్తు కూడా ఆదా అవుతుందట. అదే సమయంలో 8K స్క్రీన్‌ వాడటం వల్ల పిక్చర్‌లో నాణ్యత ఉంటుంది. అయితే ఈ టీవీ ఎప్పుడు అందుబాటులోకి వచ్చేది తెలియాల్సి ఉంది.

3. ట్విటర్‌లో స్టోరీస్‌

స్నాప్‌ చాట్‌లో మొదలై.. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి.. అక్కడి నుంచి ఫేస్‌బుక్‌కీ వచ్చాయి. ఇప్పుడు నెక్ట్స్‌ ట్విటర్‌. అవును ట్విటర్‌లో ‘స్టోరీస్’ తరహా ఫీచర్‌ రాబోతోంది. దీనికి ఫ్లీట్స్‌ అని పేరు పెట్టారు. స్టోరీస్‌ తరహాలోనే ఇందులో పెట్టే పోస్టులు 24 గంటలు పాటు ఉంటాయి. అలాగే దీనికి రీట్వీట్‌, రిప్లై ఆప్షన్‌ కూడా ఉండదు. ఫ్లీట్స్‌ క్లిక్‌ చేసి డైరెక్ట్‌గా ఆ వ్యక్తికి మెసేజ్‌ చేయొచ్చు. ఫీడ్‌, ప్రొఫైల్‌ పేజీల్లో టాప్‌లో ఈ ఫ్లీట్స్‌ ఉంటాయి. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ ప్రయోగ దశలో కొంతమందికి అందుబాటులోకి తీసుకొచ్చారు.

4. ఆరు రంగుల్లో జబ్రా 75టి

డెన్మార్క్‌కు చెందిన జబ్రా నుంచి భారత్‌లో కొత్త వైర్‌లెస్‌ ఇయర్ బడ్స్‌ రాబోతున్నాయి.  జబ్రా యాక్టివ్‌ 75టి పేరుతో రూపొందిన ఈ ఇయర్‌ బడ్జ్‌లో ఐపీ56 డ్యూరబిలిటీ ఉంటుంది. దుమ్ము, నీరు వల్ల వచ్చే సమస్యల నుంచి రెండేళ్ల వారంటీ ఇస్తున్నారు. యూఎస్‌బీ-సి ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు ఉంటుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 28 గంటలపాటు బ్యాటరీ వస్తుంది. ఈ నెల 11 నుంచి అమెజాన్‌ వెబ్‌సైట్‌లో వీటి అమ్మకాలు నిర్వహిస్తారు. నేవీ, కాపర్‌ బ్లాక్‌, టైటానియం బ్లాక్‌, సియేనా, మింట్‌, గ్రే రంగుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. 

5. వాట్సాప్‌ డార్క్‌ మోడ్‌: ట్విటర్‌ మీమ్స్‌ చూశారా?

యూజర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డార్క్‌ మోడ్‌ను వాట్సాప్‌ ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సోషల్‌ మీడియాలో వాట్సాప్‌ డార్క్‌ మోడ్‌పై మీమ్స్‌ పంచ్‌లు పేలుతున్నాయి. ఇప్పటికైనా ఇచ్చారంటూ కొందరు, వేల సంవత్సరాల తర్వాత అంటూ మరికొందరు మీమ్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. అలాంటి కొన్ని మీరూ ట్వీట్‌ క్లిక్‌ చేసి దిగువన చూసేయండి.

6. ఏడేళ్ల బాలిక చేసిన యాప్‌ ఇది

అంబులెన్స్‌ దారివ్వండి... అంటూ ఓ ఏడేళ్ల చిన్నారి చేసిన యాప్‌కు అవార్డు దక్కింది. బెంగళూరుకు చెందిన బృందా అనే చిన్నారి ‘అంబులెన్స్‌ విజ్‌’ అనే యాప్‌ రూపొందించింది. అంబులెన్స్‌ వెళ్లేదారిలో ట్రాఫిక్‌ను సులభంగా క్లియర్‌ చేయడం దీని ఉద్దేశం. యాప్‌లో అంబులెన్స్‌ డ్రైవర్‌ వెళ్లాల్సిన ప్రదేశాన్ని ఎంచుకుంటే.. ఆ దారిలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులకు ఆ సమాచారం అందుతుంది. దీంతో వాళ్లు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయొచ్చు. దాని వల్ల ఆ అంబులెన్స్‌ వేగంగా ఆస్పత్రికి చేరుతుంది. వైట్‌హ్యాట్‌ జూనియర్‌ నిర్వహించిన సిలికాన్‌ వాలీ ప్రోగ్రామ్‌లో గెలుపొందిన 12 మంది విజేతల్లో బృందా ఒకరు. మన దేశం నుంచి వెళ్లిన 7000 ఎంట్రీల నుంచి బృంద గెలుపొందం విశేషం.

7. వన్‌ప్లస్‌ 8 లైట్‌ వస్తుందా?

వన్‌ప్లస్‌ నుంచి ‘8’ సిరీస్‌ మొబైల్స్‌ రావడానికి రంగం సిద్థమవుతోంది. ఎప్పటిలాగే వన్‌ప్లస్‌ 8, వన్‌ప్లస్‌ 8 ప్రో తీసుకొస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మరో మొబైల్‌కు సంబంధించిన వివరాలు బయటికొచ్చాయి. వన్‌ప్లస్‌ 8 సిరీస్‌కు లైట్‌ వెర్షన్‌ను కూడా తీసుకొస్తున్నారట. లైట్‌ వెర్షన్‌లో స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌ కాకుండా మీడియాటెక్‌ చిప్‌సెట్‌ వాడబోతున్నారట. మీడియాటెక్‌కొత్త డైమెన్‌సిటీ 1000 ప్రాసెసర్‌తో తీసుకొస్తారని సమాచారం. 6.4 అంగుళాల 90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఉన్న ఈ మొబైల్‌ ధర సుమారు ₹38 వేలు ఉండొచ్చు. ఈ మొబైల్‌ జులైలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

8. రెండు కలసి ఒకటిగా...

ఆంబ్రేన్‌ సంస్థ ఓ కొత్త తరహా బ్లూటూత్‌ స్పీకర్‌ను తీసుకొచ్చింది. ఫైర్‌ బూమ్‌ 2 ఇన్‌ 1 డిటాచబుల్‌  స్పీకర్‌గా పిలిచే ఇందులో రెండు స్పీకర్లు ఉంటాయి. అంటే అవసరమైతే స్పీకర్‌ను రెండుగా విడగొట్టొచ్చు. ఈ స్పీకర్‌ ఐపీఎక్స్‌ 7 వాటర్‌ప్రూఫ్‌ కవర్‌తో వస్తుంది. సింగిల్‌ యూనిట్‌గా ఉన్న ఈ స్పీకర్‌ 20 వాట్‌ సరౌండ్‌ సౌండ్‌ అవుట్‌పుట్‌ ఇస్తుంది. దీంతోపాటు ఇది 360 డిగ్రీ సౌండ్‌ను అందిస్తుంది. ఇందులో 3000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్‌ ఛార్జింగ్‌ పెట్టుకుంటే నాలుగు గంటలపాటు పాటలు ప్లే చేయొచ్చు. దీని ధర ₹3,999. 

9. డ్రోన్స్‌ను కట్టడి చేయడానికి...

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - మద్రాస్‌ (ఐఐటీ -ఎం) పరిశోధకులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత డ్రోన్‌ను రూపొందించారు. ఇది పోలీసులు, భద్రతా సిబ్బంది, సైన్యానికి ఉపయుక్తంగా ఉంటుందని ఐఐటీ-ఎం చెబుతోంది. సిబ్బంది చేరలేని ప్రదేశాలకు ఈ డ్రోన్లు సులభంగా వెళ్లడమే కాకుండా, ప్రత్యర్థి డ్రోన్‌లను కట్టడి కూడా చేస్తాయట. ఆ డ్రోన్ల జీపీఎస్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌ను హ్యాక్‌ చేసి వాటి గమనాన్ని మార్చేస్తాయట. ఈ ఏఐ డ్రోన్లు ఇంటర్నెట్‌ ఆధారంగా పని చేస్తాయి. ప్రస్తుతం ఈ డ్రోన్‌ ప్రయోగదశలో ఉంది. 

10. రియల్‌మీ కొత్త ఫోన్లు... వచ్చాయ్‌

రియల్‌మీ భారత మార్కెట్‌లోకి మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. రియల్‌మీ 5, 5ప్రోకు కొనసాగింపుగా రియల్‌మీ 6, రియల్‌మీ 6ప్రోని విడుదల చేసింది. ఈ రెండింటిలో ముందువైపు పంచ్‌ హోల్‌ కెమెరా సెటప్‌ ఉంటుంది. రియల్‌మీ 6లో ముందువైపు ఒక కెమెరా, 6ప్రోలో రెండు కెమెరాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.