close

అవీ... ఇవీ

Tech 10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు (10/03/2020)

1. రెడ్‌మీ నోట్‌ 9 ఇలానే ఉంటుందా?

షావోమీ నుంచి ఈ నెల 12న రెడ్‌మీ నోట్‌ 9 సిరీస్‌ మొబైళ్లు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి బ్యానర్లు అమెజాన్‌, ఎంఐ.కామ్‌లో కనిపిస్తున్నాయి. తాజాగా మరికొన్ని వివరాలు బయటికొచ్చాయి. వాటి ప్రకారం చూస్తే... రెడ్‌మీ నోట్‌ 9 మొబైల్‌ 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ... 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ అంతర్గత మెమొరీతో వస్తాయి. 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌ ఇస్తున్నారు. ముందువైపు పంచ్‌ హోల్‌లో 16 ఎంపీ కెమెరా ఉండొచ్చు. వెనుకవైపు నాలుగు కెమెరాల సెటప్‌లో 48 ఎంపీ మెయిన్‌ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా, 5 ఎంపీ మాక్రో సెన్సర్‌, డెప్త్‌ కెమెరా ఇస్తారు. స్నాప్‌డ్రాగన్‌ 720జీ ప్రాసెసర్‌ ఉంటుంది. 5020 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండొచ్చు. ఇది18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుందని సమాచారం. 


2.  మోటోరోలా ఫోన్‌లో 108 ఎంపీ కెమెరా

ఫుల్‌ స్క్రీన్‌ డిస్‌ప్లేతో మోటోరోలా నుంచి ఎడ్జ్‌ ప్లస్‌ పేరుతో ఒక ఫోన్‌ వస్తోంది. ఈ సంస్థ నుంచి జెడ్‌ సిరీస్‌లో కాకుండా.. కొత్తగా వస్తోన్న ఫ్లాగ్‌షిప్‌ సిరీస్‌ ఇది. దీనికి సంబంధించిన కొన్ని రెండర్‌ ఇమేజెస్‌ బయటికొచ్చాయి. వాటి ప్రకారం చూస్తే ఇందులో వెనుకవైపు మూడు కెమెరాల సెటప్‌ ఉండబోతోంది. అందులో ఒకటి 108 ఎంపీ కెమెరా అని తెలుస్తోంది. దీంతో 108 ఎంపీ కెమెరా క్లబ్‌లో చేరబోతున్న ఐదో ఫోన్‌ ఇది. గతంలో ఎంఐ నోట్‌ 10, ఎంఐ 10, ఎంఐ 10 ప్రో, గెలాక్సీ ఎస్‌ 20 అల్ట్రా ఉన్నాయి. ముందువైపు పంచ్‌ హోల్‌ కెమెరా సెటప్‌ ఉండబోతోంది.  అందులో 25 ఎంపీ కెమెరా ఇస్తారు. 12 జీబీ ర్యామ్‌తో రాబోతున్న ఈ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ ఉండొచ్చు. 


3. యాపిల్‌ వాచ్‌లో వావ్‌ ఆప్షన్లు

యాపిల్‌ వాచ్‌ వినియోగదారులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న కొన్ని కీలక ఫీచర్లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి.  ఐవోఎస్‌ కొత్త వెర్షన్‌ ఐవోఎస్‌ 14లో ఈ వివరాలు తెలిశాయి. తల్లిదండ్రులకు ఉపయుక్తంగా ఉండేలా కిడ్స్‌ ఫీచర్‌ను తీసుకురాబోతున్నారు. దాని ద్వారా పిల్లల స్మార్ట్‌ వాచ్‌ యూసేజ్‌ను లిమిట్‌ చేయొచ్చు. దీంతోపాటు స్లీప్‌ ట్రాకింగ్‌ ఫీచర్‌ కూడా అందుబాటులోకి రానుంది.  ప్రస్తుతం ఒకే అకౌంట్‌తో లాగిన్‌ అయిన స్మార్ట్‌ వాచీలను మాత్రమే పెయిర్ చేసుకునే సౌకర్యం ఉంది. ఈ ఆప్షన్‌ కూడా కొత్త ఓఎస్‌లో మారబోతోందని తెలుస్తోంది. 


4. కొత్త పిక్సల్‌ లైవ్‌ ఫొటో మరోసారి

గూగుల్ నుంచి పిక్సల్‌ 4ఏ పేరుతో ఓ మొబైల్‌ వస్తుందని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. ఇవే ఫీచర్లు అంటూ ఓ జాబితా కూడా వచ్చింది. తాజాగా మరోసారి లైవ్‌ ఇమేజ్‌ ఒకటి నెట్‌లో కనిపించింది.  ఈ మొబైల్‌లో ఫ్రంట్‌సైడ్‌ పంచ్‌ హోల్‌ సెటప్‌లో కెమెరా ఉండబోతోంది. వెనుకవైపు కెమెరా బంప్‌ ఉంటుంది. దీంతోపాటు ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కూడా తీసుకొచ్చారు. కాబట్టి ముందువైపు ఎల్‌సీడీ స్క్రీన్‌నే వాడుతున్నట్లు అర్థమవుతోంది. ఇందులో 3.5 ఎంఎం హెడ్‌ ఫోన్‌ జాక్‌ను ఇస్తున్నారని సమాచారం. ఈ మొబైల్‌ 4జీ, 5జీ వేరియంట్లలో తీసుకొస్తారట.


5. ఆమోలెడ్‌ లేకపోయినా ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌

ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌.. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌. అయితే ఈ తరహా ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ కావాలంటే మొబైల్‌లో ఆమోలెడ్‌ స్క్రీన్‌ ఉండాల్సిందే. అయితే షావోమీ ఇప్పుడు ఎల్‌సీడీ డిస్‌ప్లేలలో కూడా ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను తీసుకొస్తోంది. తాజాగా వీటి తయారీ మొదలైంది. ఇన్‌ఫ్రారెడ్‌ సాంకేతికతతో ఈ ఫింగర్‌  ప్రింట్‌ సెన్సర్‌ పని చేస్తుంది. ఇన్‌ఫ్రారెడ్‌ హై ట్రాన్స్‌మిటెన్స్‌ ఫిల్మ్‌తో ఈ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను రూపొందించారు. రెడ్‌మీ మొబైల్స్‌లో ఈ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ త్వరలో అందుబాటులోకి వస్తుంది.


6. ఒక బైక్‌ రైడ్‌ జీవితాన్ని మార్చేసింది

సెంట్రల్‌  ఫ్లోరిడాకు చెందిన జాచరీ మెక్‌  కాయ్‌ అనే వ్యక్తికి ఇటీవల ఓ మెయిల్‌ వచ్చింది. మీ గూగుల్‌ అకౌంట్‌కు సంబంధించిన సమాచారం కావాలని అందులో కోరారు.  కంగారుపడ్డ మెక్‌ కాయ్‌ వివరాలు పరిశీలించేసరికి తనను పది నెలల క్రితం జరిగిన ఓ ఇంటి దొంగతనం కేసు కింద ప్రశ్నించినట్లు అర్థమైంది. కుటుంబసభ్యులు లాయర్‌ను సంప్రదించగా... మెక్‌ కాయ్‌ మీద జియో ఫెన్స్‌ వారెంట్‌  జారీ అయినట్లు గుర్తించారు.  అంటే పోలీసులు కోరిన ప్రాంతంలో.. ఆ నిర్ణీత సమయంలో ఉన్న డివైజెస్‌ డేటా గూగుల్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా మెక్‌ కాయ్‌ డేటా అడిగారు. ఆ సమయంలో మెక్‌ కాయ్‌ ఆ ప్రాంతంలో రన్‌ కీపర్‌ యాప్‌ను ఆ ప్రాంతంలో వినియోగించాడు. దీంతో మెక్‌ కాయ్‌ నోటీసులు వచ్చాయి. అయితే మెక్‌ కాయ్‌ మీద ఎలాంటి ఆరోపణలు లేవు. అయితే ఆ ప్రాంతంలో సైకిల్‌ మీద తిరగడం వల్ల మెక్‌ కాయ్‌ ఈ ఇబ్బందులు పడ్డాడు. 


7. ₹300 ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ ఇది

ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ల వాడకం పెరిగిపోతున్న రోజులివీ. దీంతో అలాంటి పోలికలతో తక్కువ ధరలో స్మార్ట్‌ బ్యాండ్‌లు వచ్చేస్తున్నాయి. తాజాగా షావోమీ నుంచి వచ్చిన ఎంఐ బ్యాండ్‌ 4కు క్లోనింగ్‌గా ఎం4 అనే బ్యాండ్‌ వచ్చింది. అచ్చంగా అలానే ఉండే ఈ బ్యాండ్‌ ధర ₹300 మాత్రమే. ఇందులో 0.96 అంగుళాల కలర్‌ స్క్రీన్‌ ఉంటుంది. షావోమీ బ్యాండ్‌ సైజులోనే ఇదీ ఉంటుంది. బ్లూటూత్‌ 4.0కి సపోర్టు చేస్తుంది. 90 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్‌ ఛార్జి చేస్తే 10 రోజులు వస్తుంది. అలాగే దీనికి ఐపీ67 వాటర్‌ప్రూఫింగ్‌ కూడా ఉంది.


8. ఆసుస్‌ ఆర్‌వోజీ3.. 865 ప్లస్‌తో

గేమింగ్‌ ఫోన్ల స్పెషలిస్ట్‌ ఆసుస్‌ ఆర్‌వోజీ సిరీస్‌లో మరో మొబైల్‌ రాబోతోంది. ఆసుస్‌ ఆర్‌వోజీ 3 పేరుతో రానున్న ఈ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్‌ కొత్త ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ 865 ప్లస్‌ ఉండబోతోందట. ఆసుస్‌ ఇందులో 5జీ టెక్నాలజీ ఉండబోతోందట. వాస్తవానికి ఈ మొబైల్‌ ఈ నెలలో అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే  కొవిడ్‌ - 19 కారణంగా ఉత్పత్తిలో ఆలస్యమై లాంచింగ్‌ వాయిదా పడింది. ఈ మొబైల్‌ మన దేశానికి కూడా వచ్చే అవకాశం ఉంది.


9. నోకియా 5.3 మళ్లీ మెరిసింది

నోకియా నుంచి 5.3 పేరుతో ఓ మొబైల్‌ వస్తుందని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. అడపాదడపా ఇదే ఆ మొబైల్‌ అంటూ కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. తాజాగా మరోసారి 5.3 కనిపించింది. దాని ప్రకారం చూస్తే ఈ మొబైల్‌లో వెనుకవైపు నాలుగు కెమెరాల సెటప్‌ ఉండబోతోంది. గత వివరాల ప్రకారం చూస్తే ఇందులో స్నాప్‌ డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌  ఉంటుంది. ఈ నెల 19న జరిగే ఈవెంట్‌లో ఈ మొబైల్‌ను లాంచ్‌ చేస్తారని సమాచారం. 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉన్న ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండబోతోంది. 


10. శాంసంగ్‌ స్టోర్‌లో గూగుల్‌ యాప్స్‌

శాంసంగ్‌ స్టోర్‌లో ఇప్పుడు గూగుల్‌ యాప్స్‌ కూడా కనిపించబోతున్నాయి. అదేంటి ఇన్నాళ్లూ ఉన్నాయిగా అనుకుంటున్నారా. ఇన్నాళ్లూ చాలా డెవలపర్ల యాప్స్‌ ఉన్నా... గూగుల్‌కి సంబంధించిన యాప్స్‌ మాత్రం లేవు. ఇన్నాళ్లకు గూగుల్‌కు చెందిన ట్రాన్స్‌లేట్‌, వేర్‌ ఓఎస్‌ ఇప్పుడు శాంసంగ్‌ గెలాక్సీ స్టోర్‌లోకి వచ్చాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరుగుతుందని  సమాచారం. మరోవైపు శాంసంగ్‌కు చెందిన 24 యాప్స్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉండటం గమనార్హం. 


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.