close

అవీ... ఇవీ

Tech10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు (11/02/2020)

1. 25న శాంసంగ్‌ కొత్త మొబైల్‌

శాంసంగ్‌ నుంచి ఎం సిరీస్‌లో మరో మొబైల్‌ రాబోతున్న విషయం తెలిసిందే. ఎం 31 పేరుతో ఈ నెల 25న ఈ మొబైల్‌ను లాంచ్‌ చేస్తారట. గతేడాది వచ్చిన ఎం 30కి సక్సెసర్‌గా వస్తున్న ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు బయటికొచ్చాయి. ఈ మొబైల్‌లో వెనుకవైపు నాలుగు కెమెరాలుంటాయి. అందులో ప్రధాన కెమెరా 64 ఎంపీ. ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ ఆమోలెడ్‌ స్క్రీన్‌ ఉంటుంది. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారని తెలుస్తోంది. ఎగ్జినోస్‌ 9611 ప్రాసెసర్‌తో ఈ మొబైల్‌ రావొచ్చు.

2. తొలిసారి 44 ఎంపీ కెమెరాతో...

కెమెరా సెంట్రిక్‌ మొబైల్స్‌ అంటే ముందుగా గుర్తొచ్చే ఫోన్లలో ఒప్పొ రీనో సిరీస్‌ ఒకటి. తాజాగా ఈ సిరీస్‌ నుంచి రీనో3 ప్రో రాబోతోంది. ఈ మొబైల్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఒకటి బయటికొచ్చింది. ఇందులో 44 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండబోతోందట. పిక్సల్‌ బిన్నింగ్‌ సాంకేతికత ద్వారా 11 ఎంపీ సెల్ఫీలు వస్తాయని తెలుస్తోంది. సిరీస్‌లోని గత మొబైల్‌లో 32 ఎంపీ కెమెరా ఇచ్చారు.  చైనాలో ఈ మొబైల్‌ను 5జీతో తీసుకురాగా... మన దేశంలో మాత్రం 4జీ వెర్షనే తీసుకొస్తారని తెలుస్తోంది. అలాగే ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 765జీ ప్రాసెసర్‌ ఉండనుంది. 

3. ఐఫోన్‌ ఎస్‌ఈ కేసులు వచ్చేశాయ్‌

ఆపిల్‌ నుంచి ఐఫోన్‌ ఎస్‌ఈ2 వస్తుందని గత కొద్ది సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది పక్కా అని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మొబైల్‌ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని అనడమే కానీ పక్కాగా సమాచారం లేదు. అలాగే స్క్రీన్‌ సైజు విషయంలో అదే పరిస్థితి. కానీ మొబైల్‌ కేస్‌లు తయారీదారులు అప్పుడే ఐఫోన్‌ ఎస్‌ఈ2 కోసం కేసులు సిద్ధం చేశారు. అంతర్జాతీయ ఆన్‌లైన్‌ మార్కెట్‌లో సేల్‌కి తీసుకొచ్చారు. 4.7 అంగుళాల స్క్రీన్‌కు తగ్గట్టుగా వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది.

5. ఒక కెమెరా పెంచి తీసుకెళ్తున్నారు

బడ్జెట్‌ మొబైల్స్‌ వినియోగదారుల కోసం రియల్‌మీ ఇటీవల మన దేశంలో రియల్‌మీ సీ3ని తీసుకొచ్చింది. మీడియాటెక్‌ హీలియో జీ70 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ మొబైల్‌లో వెనుకవైపు రెండు కెమెరాలుంటాయి. ఇప్పుడు ఇదే ఫోన్‌ని ఓ కెమెరా పెంచి అంతర్జాతీయ మార్కెట్‌కి తీసుకెళ్తున్నారు. మన దగ్గర 12 ఎంపీ, 2ఎంపీ కెమెరాలు ఇచ్చారు. వీటికి అదనంగా మరో 2 ఎంపీ కెమెరా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ నెల 19న ఈ మొబైల్‌ను ఇండోనేసియాలో లాంచ్‌ చేయబోతున్నారు. 

6. బ్లూటూత్‌తో మొబైల్స్‌ కలుపుతున్నారా?

షేర్‌ఇట్‌ లాంటి యాప్స్‌ వచ్చాక తగ్గిపోయింది కానీ.. అంతకుముందు డేటా ట్రాన్స్‌ఫర్‌కి బ్లూటూత్‌నే ఎక్కువగా వాడేవారు. అయితే ఇప్పటికీ కొన్నిసార్లు బ్లూటూత్‌ వాడుతున్నారు. మీరూ అలా వాడేవాళ్లే అయితే జాగ్రత్త. ఒక మొబైల్‌ నుంచి మరో మొబైల్‌లోకి బ్లూటూత్‌ ద్వారా మాల్‌వేర్‌ వ్యాపిస్తోంది. ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత మొబైల్స్‌ వినియోగించేవాళ్లకే ఈ సమస్య వస్తోందట. అదీ అవతలి వ్యక్తి ఆండ్రాయిడ్‌ 10 లోపు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్న ఫోన్లు వాడుతుంటేనే. ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్‌ను వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకొని (అందుబాటులో ఉంటే) దీని నుంచి బయట పడొచ్చని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 

7. TIP : ఐఫోన్‌ వాట్సాప్‌ టు ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌

ఆపిల్‌ మొబైల్స్‌లోని వాట్సాప్‌ ఛాట్‌ను... ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లోకి తీసుకోవచ్చు. అయితే దీని కోసం కొన్ని థర్డ్‌ పార్టీ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దీంతో పేమెంట్‌ కూడా చేయాల్సి రావొచ్చు. కానీ ఈ కిటుకుతో ముఖ్యమైన వాట్సాప్‌ ఛాట్స్‌ను ఐఫోన్‌ నుంచి ఆండ్రాయిడ్‌కు బట్వాడా చేయొచ్చు.

* ఐఫోన్‌లో వాట్సాప్‌ ఛాట్‌ లిస్ట్‌ మీకు కావాల్సిన చాట్‌ నేమ్‌ బ్లాక్‌ని ఎడమైపునకు స్వైప్‌ చేయాలి. అక్కడ మోర్‌ని క్లిక్‌ చేస్తే ‘ఎక్స్‌పోర్ట్‌ ఛాట్‌’ వస్తుంది. దాన్ని సెలక్ట్‌ చేస్తే మీకు ఎక్కడికి ఎక్స్‌పోర్ట్‌ చేయాలి అని అడుగుతుంది. అక్కడ మెయిల్‌ని ఎంచుకోవాలి. అప్పుడు ఆ ఛాట్‌ ఫైల్‌ మెయిల్‌లోకి చేరుతుంది. దానిని సెండ్‌ చేసుకోవాలి.

* ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఆ మెయిల్‌లోంచి ఛాట్‌ ఫైల్‌ని డౌన్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత మొబైల్‌లో ఉన్న వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసి.. మళ్లీ ఇన్‌స్టాల్‌ చేయాలి. అప్పుడు రీస్టోర్‌ అడుగుతుంది. డేటాను రీస్టోర్‌ చేసుకుంటే మీ మొబైల్‌లో పాత ఛాట్స్‌ వచ్చేస్తాయి. 

8. కాస్త ఆపిల్‌ కీ బోర్డు మార్చరూ!

సినిమాకు సంబంధించిన వివరాలు వినిపించే ఆస్కార్స్‌లో ఆపిల్‌ మ్యాక్‌బుక్స్‌ ప్రస్తావన వచ్చింది. ఆస్కార్స్‌కు యాపిల్‌కు ఏం సంబంధం అనుకుంటున్నారా? కానీ జరిగింది. ఇటీవల ప్రకటించిన ఆస్కార్స్‌లో ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే కింద టైకా వైటి పురస్కారం సాధించాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘యాపిల్‌ తన కీబోర్డులను మార్చాలి. ఇప్పుడున్న కీబోర్డులతో కంపోజ్‌ చేయడం కష్టంగా ఉంది. బటన్‌ను క్లిక్‌ చేస్తున్నప్పుడల్లా అవి బౌన్స్‌ అవుతున్నాయి’’ అని అన్నాడు. మరి ఆపిల్‌ ఏం చేస్తుందో చూడాలి.

9. డార్క్‌ మోడ్‌ లేకపోయినా...

ఆండ్రాయిడ్‌ 10 వచ్చాక చాలావరకు యాప్స్‌ డార్క్‌ మోడ్‌లోకి వచ్చేశాయి. అయితే ఇప్పటికీ కొన్ని యాప్స్‌లో డార్క్‌ మోడ్‌ అందుబాటులో లేదు. అలాంటివాటిని కూడా డార్క్‌ మోడ్‌లోకి మార్చడానికి ఓ యాప్‌ ఉంది. అదే డార్క్యూ. అయితే దీనిని ఎక్స్‌డీఏ డెవలపర్స్‌ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఫోర్స్‌ డార్క్‌ థీమ్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే మొత్తం యాప్స్‌ డార్క్‌ మోడ్‌లోకి మారిపోతాయి. అయితే థర్డ్‌పార్టీ యాప్స్‌ వాడాలా వద్దా అనేది మీ ఇష్టం.

10. రూబిక్‌ క్యూబ్‌ని ఎంతవేగంగా సాల్వ్‌ చేసిందో?

షావోమీ నుంచి చైనాలో ఈ నెల 13న ఎంఐ 10 సిరీస్‌ మొబైల్స్‌ రాబోతున్నాయి. ఎంఐ 10, ఎంఐ 10 ప్రో పేరుతో వస్తున్న ఈ మొబైల్స్‌లో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ ఉండబోతోంది. దీని స్పీడ్‌ గురించి చెబుతూ షావోమీ తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే... ఎంఐ 10లోని ప్రాసెసర్‌ రూబిక్‌ క్యూబ్‌ని 1.43 సెకన్లలోనే సాల్వ్‌ చేసింది. మనుషులు రూబిక్‌ సాల్వ్‌ విషయంలో ప్రపంచ రికార్డు సమయం 3.47 సెకన్లు కావడం గమనార్హం. ఈ మొబైల్‌ ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.