close

అవీ... ఇవీ

Tech10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు (28/02/2020)

1. నోకియా ఎక్స్‌ప్రెస్‌ మ్యూజిక్‌ గుర్తుందా?

నోకియా ఫీచర్‌ మొబైల్స్‌లో బాగా గుర్తుండిపోయేవాటిలో ఎక్స్‌ప్రెస్‌ మ్యూజిక్‌ (5130) ఒకటి. మొబైల్‌ కుడి,  ఎడమలో ఎరుపు రంగు అంచు, మ్యూజిక్‌ బటన్స్‌తో భలే ఉండేది కదా. ఇప్పుడు అలాంటి ఫీచర్‌ ఫోన్‌ను నోకియా మరొకటి తీసుకొస్తోంది. టీఏ - 1212 పేరుతో ఆ మొబైల్‌ రాబోతోంది. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు నెట్‌లో సందడి చేస్తున్నాయి. ఇందులో 8 ఎంబీ ర్యామ్‌, 16 ఎంబీ స్టోరేజీ ఉంటుంది. మెమొరీ కార్డుతో 32 జీబీ వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు. 1200 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండబోతోంది. అయితే ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్‌ అవుతుందనే సమాచారం లేదు.


2. ఐనాక్స్‌లో  కొత్త డాల్బీ సౌండ్‌

దేశంలోని ఐనాక్స్‌ సినిమా థియేటర్లలో కొత్త రకం డాల్బీ సౌండ్‌ సిస్టమ్‌ను తీసుకురానున్నారు. డాల్బీ మల్టీ ఛానల్‌ ఆంప్లిఫయర్స్‌ (డీఎంఏ) పేరుతో ఈ సరికొత్త సౌండ్‌ సర్వీసును తీసుకురాబోతున్నారు. ఈ కొత్త ఆంప్లిఫయర్స్‌ చిన్నగా ఉండటం వల్ల ర్యాక్ స్పేస్‌ తగ్గుతుందట. విద్యుత్తు వినియోగం కూడా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఆడియో రీ ప్రొడక్షన్‌లో డిస్టార్షన్‌ తక్కువగా ఉండటం వల్ల మెరుగైన శబ్దాన్ని వీక్షకులు ఆస్వాదించొచ్చని ఐనాక్స్‌ చెబుతోంది.  త్వరలో దేశవ్యాప్తంగా డీఎంఏ సౌండింగ్‌ అందుబాటులో ఉంటుంది. 


3. టూస్టెప్‌ కోడ్స్‌కూ రక్షణ లేదా?

మీ జీమెయిల్‌ ఖాతాకు మరింత రక్షణ అంటూ.. గూగుల్‌  టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ను సూచిస్తోంది. అయితే ఇప్పుడు మాల్‌వేర్‌ కారణంగా అది కూడా అంత భద్రం కాదంటున్నారు నిపుణులు. సెర్‌బెరస్‌ అనే ఆండ్రాయిడ్‌ బ్యాంకింగ్‌ ట్రోజన్‌ వల్ల మీ మొబైల్‌లోని గూగుల్‌ అథెంటికేటర్‌ యాప్‌లోని టూస్టెప్‌ వెరిఫికేషన్‌ కోడ్స్‌ దొంగిలించే అవకాశం ఉందట. డచ్‌కు చెందిన థ్రెట్‌ ఫ్యాబ్రిక్‌ అనే మొబైల్‌  సెక్యూరిటీ సంస్థ ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది. అయితే ఈ సెర్‌బెరస్‌ వెర్షన్ ఇంకా లైవ్‌లోకి రాలేదట. త్వరలో అందుబాటులోకి వస్తే మొబైల్‌ వినియోగదారులు ఇబ్బందిపడతారని చెబుతోంది. మరి సెర్‌బెరస్‌ ఏం చేస్తుందో చూడాలి. 


4. హెచ్‌టీసీ కొత్త ఫోన్‌ ఇదిగో...

అంతర్జాతీయ మార్కెట్‌లోకి హెచ్‌టీసీ కొత్త మొబైల్‌ను  తీసుకొస్తోంది. హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్‌ ఆర్‌70 పేరుతో వచ్చే ఈ మొబైల్‌లో వెనుకవైపు మూడు కెమెరాల సెటప్‌ ఉంటుంది. ఇందులో మీడియాటెక్‌ హీలియో పీ23 ప్రాసెసర్‌ ఉంటుంది. 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో తీసుకొస్తున్నారు. మెమొరీ కార్డుతో 256 జీబీ వరకు స్టోరేజీని పొందొచ్చు. వెనుకవైపు 16ఎంపీ, రెండు 2 ఎంపీ కెమెరాలు ఉంటాయి. 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. మన దేశంలో ఈ ఫోన్‌ మరోసారి పూర్వపు ఫామ్‌లోకి రావాలని హెచ్‌టీసీ చూస్తోంది. అయితే ధర, విడుదల తేదీ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. 


5. వివో 5జీ ఫోన్‌ ఇలా ఉంటుంది

5జీ మొబైల్స్‌ లాంచింగ్‌ వేగం పుంజుకుంటోంది. తాజాగా వివో ఓ 5జీ మొబైల్‌ను తీసుకొచ్చింది. వివో జీ6పేరుతో వచ్చిన ఈ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 765జి ప్రాసెసర్‌ ఉంటుంది. 6.57 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌ ఉంటుంది. వెనుకవైపు 48 ఎంపీ మెయిన్‌ కెమెరా, 8 ఎంపీ వైడ్‌యాంగిల్‌ లెన్స్‌, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌, 2 ఎంపీ మాక్రో లెన్స్‌ ఉంటుంది. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంటుంది. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్న్‌ మెమొరీ వెర్షన్‌ మన  దేశంలో ₹22 వేలు ఉండొచ్చు. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వెర్షన్‌ ₹26 వేలు ఉండొచ్చు. అయితే ఈ మొబైల్స్‌ మన దేశంలోకి ఎప్పుడొస్తాయనేది తెలియాల్సి ఉంది. 


6. టిక్‌టాక్‌పై రెడిట్‌ సీఈవో కామెంట్‌

50 కోట్లమందికిపైగా యాక్టివ్‌ యూజర్లు ఉన్న ఓ యాప్‌ గురించి రెడిట్‌ సీఈవో చేసిన కామెంట్లు ఇప్పుడు టెక్‌ ప్రపచంలో చర్చనీయాంశమయ్యాయి. ‘టిక్‌టాక్‌ యాప్‌ వినియోగం ఆరోగ్యానికి హానికరం’ అంటూ ఇటీవల రెడిట్‌ సీఈవో స్టీవ్‌ హఫ్‌మాన్‌ వ్యాఖ్యానించాడు. ‘‘టిక్‌టాక్‌ వినియోగిస్తున్న సాంకేతికత చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకే ఆ యాప్‌ను నా మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేయాలనుకోవడం లేదు. నేను ప్రజలకు కూడా అదే పిలుపు ఇస్తున్నాను. దయచేసి స్పైవేర్‌ను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు’’ అని హఫ్‌మాన్‌ అన్నారు.  మరి టిక్‌టాక్‌ దీనిపై ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. 


7. యాపిల్‌ కీబోర్డులో ట్రాక్‌ ప్యాడ్

ఐప్యాడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వచ్చాక... యాపిల్‌ ఐప్యాడ్స్‌ వాడకం మరింత సులభంగా మారింది. ఇప్పుడు దీనికి మరికొన్ని కొత్త ఆప్షన్లు తీసుకొస్తున్నారు. తాజాగా ఐప్యాడ్‌ కీబోర్డుకు ట్రాక్‌ప్యాడ్‌ను కూడా యాడ్‌ చేస్తున్నారు. ఈ ఏడాది మధ్యలో ఈ కీబోర్డు యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటికే బ్రిడ్జ్‌ లాంటి సంస్థలు ఐప్యాడ్స్‌ కోసం ట్రాక్‌ ప్యాడ్‌ ఉన్న కీబోర్డులను అందిస్తున్న విషయం తెలిసిందే. 


8. వివో అపెక్స్‌ 2020 ముచ్చట్లు...

అపెక్స్‌ పేరుతో వివో ఏటా ఓ కాన్సెప్ట్‌ ఫోన్‌ను తీసుకొస్తుంటుంది. ఆ వరుసలో ఈ ఏడాది అపెక్స్‌ 2020 పేరుతో ఓ మొబైల్‌ రాబోతోంది. మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లోనే ఈ మొబైల్‌ ఆవిష్కరణ జరగాల్సి  ఉన్నా.. కార్యక్రమం రద్దు అవ్వడంతో ఆలస్యమవుతోంది. ఈ మొబైల్‌కు  సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. ఇందులో 6.45 అంగుళాల ఫుల్‌వ్యూ డిస్‌ప్లే ఉండబోతోంది. ఇందులో 120 డిగ్రీ కర్వ్డ్‌ ఎడ్జస్‌ ఉంటాయి. వెనుకవైపు 48 ఎంపీ గింబల్‌ తరహా కెమెరా ఉంటుంది. ఈ కెమెరా వల్ల ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ 200 శాతం మెరుగ్గా ఉంటుందట. ఈ ఫోన్‌ 60 వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుందట. స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ ఉండనున్న ఈ మొబైల్‌ 5జీతో రానుంది.


9. రగ్‌డ్‌ ఫోన్స్‌లో దీని రూటే వేరు

రగ్‌డ్‌ ఫోన్స్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? స్మార్ట్‌ఫోన్‌ ఫోన్‌ అయినప్పటికీ ధృడమైన కేసుతో.. కాస్త అటు ఇటైనా ఎలాంటి ఇబ్బంది లేని ఫోన్స్‌ అవీ. ధర విషయంలో మాత్రం కొంచెం ఎక్కువ పెట్టాల్సిందే. అయితే ఇవి మన దేశంలో అంతగా అందుబాటులో ఉండవు. ఈ వరుసలో  డూగీ ఎస్‌68 ప్రో... అనే కొత్త మొబైల్‌ వచ్చింది. అయితే దీని ధర అంత ఎక్కువ కాకపోవడం గమనార్హం. సుమారు 200 డాలర్లు అంటే ₹15వేల ధరలోనే ఈ ఫోన్‌ లభిస్తోంది. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ అంతర్గత మెమొరీ ఉన్న ఈ మొబైల్‌లో మీడియాటెక్‌ హీలియో పీ70 ప్రాసెసర్‌ ఉంటుంది. 5.9 అంగుళాల స్క్రీన్‌ ఉన్న ఈ మొబైల్‌లో 6800 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. గేర్‌బెస్ట్‌ వెబ్‌సైట్‌లో ఈ మొబైల్‌ అందుబాటులో ఉంది. 


10. వందకోట్ల మొబైల్స్‌... ఇబ్బందుల్లో

బ్రాడ్‌కామ్‌, సైప్రెస్‌ సెమీ కండర్టర్స్‌లోని చిప్స్‌లో క్రూక్‌ అనే ఫ్లా అంతర్జాతీయ మార్కెట్‌లో వంద కోట్లకుపైగా మొబైల్స్‌ ఇబ్బందుల్లో పడ్డాయి. అయితే దీనికి తగ్గట్టు ఆయా సంస్థలు ఇప్పటికే ప్యాచ్‌లను విడుదల చేసి సమస్యను ఫిక్స్‌ చేశాయి. అమెజాన్‌ ఎకో సెకండ్‌ జెనరేషన్‌, కిండిల్‌ 8వ జనరేషన్‌, ఐప్యాడ్‌ మిని 2, ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌ 8, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, మ్యాక్‌ బుక్‌,  ఐప్యాడ్‌ ఎయిర్‌, గూగుల్‌ నెక్సస్‌, నెక్సస్‌ 6, నెక్సస్‌ 6పి, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 4, గెలాక్సీ ఎస్‌8, షావోమీ రెడ్‌మీ 3ఎస్‌ మొబైల్స్‌... క్రూక్‌ వల్ల ఇబ్బందుల్లో పడ్డాయంట. వీటితోపాటు ఆసుస్‌, హువావే రూటర్లలోనూ ఈ సమస్య కనిపించింది.  అయితే  క్వాల్‌కమ్‌‌, రియల్‌టెక్‌, రాలింక్‌, మీడియాటెక్‌ ప్రాసెసర్లతో రూపొందిన ఫోన్స్‌లో ఈ సమస్య లేదు. 


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.