close

తాజావార్తలు

జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.90వేల కోట్ల డిపాజిట్లు

ముంబయి: జన్‌ధన్‌ ఖాతాల్లో ప్రజల డిపాజిట్ల మొత్తం త్వరలో రూ.90వేల కోట్లు దాటనుంది.  ప్రభుత్వం ఈ ఖాతాదారులకు రూ.2లక్షల మేరకు ప్రమాద బీమా కల్పించడం ప్రజలను ఆకర్షిస్తోంది. దీంతో భారీ సంఖ్యలో కొత్తగా ఖాతాలను తెరుస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం జనవరి 30 నాటికి ఈ ఖాతాల్లో జమైన మొత్తం రూ.89,257.57కోట్లుగా ఉంది. ముఖ్యంగా మార్చి 2017 నుంచి ఈ ఖాతాల్లో జమ చేసిన మొత్తం పెరుగుతూ వస్తోంది.

ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజనాను 2014 ఆగస్టు 28 ప్రారంభించారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అమలు చేయాలని నిర్ణయించారు. గత ఏడాది ఆగస్టు 28 తర్వాత నుంచి ఈ ఖాతాదారులకు అందించే ప్రమాద బీమా మొత్తాన్ని రూ.2లక్షలకు పెంచారు. ఓవర్‌ డ్రాఫ్ట్‌ మొత్తాన్ని కూడా రూ.10వేలు చేశారు. ఈ పథకం ప్రారంభించిన మొదట్లో ప్రతి ఇంటికీ ఒక ఖాతా అనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రతి వ్యక్తికి ఒక ఖాతాగా మార్చారు. ఇప్పటి వరకు అందుబాటలో ఉన్న సమాచారం మేరకు ఈ మొత్తం 341.4 మిలియన్ల ఖాతాలను ప్రారంభించారు.

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.