
తాజావార్తలు
భారత ఆటోమొబైల్ తయారీ సమాఖ్య నివేదిక వెల్లడి ముంబయి: దేశీయ మార్కెట్లలో అమ్మకాలు తగ్గినా ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో 2018-19 ఆర్థిక సంవత్సరం ఏఫ్రిల్-జనవరి కాలంలో 19.49 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం 23,09,805 ద్విచక్రవాహనాలు ఎగుమతి కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 27,59,935 ద్విచక్రవాహనాలు ఎగుమతి అయినట్లు భారత ఆటోమొబైల్ తయారీ సమాఖ్య నివేదిక వెల్లడించింది. మొత్తం ద్విచక్రవాహనాల్లో మోటార్ సైకిళ్లు గత ఆర్థిక సంవత్సరం ఏఫ్రిల్-జనవరి మధ్య 20,34,250 ఎగుమతి కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 18.61 వృద్ధి నమోదై 24,12,800 ఎగుమతి అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఏఫ్రిల్, జనవరి మధ్య స్కూటర్లు 2,62,253 ఎగుమతి కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 3,32,197 ఎగుమతి అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఏఫ్రిల్,జనవరి మధ్య మోపెడ్లు 13,302 ఎగుమతి కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 12.3 శాతం వృద్ధి నమోదై 14,938 ఎగుమతి అయ్యాయి. కంపెనీల వారీగా ఎగుమతులను పరిశీలిస్తే టీవీఎస్ మోటార్స్29.19 శాతం, బజాజ్ ఆటో 24.87,హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ 10.3, ఇండియా యమహా మోటార్ 2. 39, హీరో మోటో కార్పొరేషన్స్ 5.74 శాతం వృద్ధి నమోదు చేశారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- ఇక ఆ హోటల్కి అస్సలు వెళ్లను: రకుల్
- వామ్మో..! రోడ్డుపై ఎంత పే..ద్ద యంత్రమో!!
- పుల్వామా దాడి: పక్కా ప్లాన్
- బాబుతో విభేదాలపై అశోక్ గజపతి రాజు క్లారిటీ
- దాడికి రావల్పిండి ఆస్పత్రి నుంచే మసూద్ ఆదేశాలు
- పాక్పై దాడి చేయండి: బలూచ్ పోరాట యోధులు
- వేర్పాటువాద నేతలకు భద్రత ఉపసంహరణ
- ప్రపంచకప్:భారత్-పాక్ మ్యాచ్ జరగడానికి వీల్లేదు
- వీర జవాను కుటుంబానికి అర ఎకరా భూమిస్తా
- ‘పెళ్లికి ముందే బిడ్డను కన్నాను’