close

తాజావార్తలు


యమహా నుంచి కొత్త బైక్‌..

ధర రూ.లక్ష పైనే


దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ ఇండియా యమహా మోటార్‌ నుంచి మరో కొత్త బైక్‌ మార్కెట్లోకి వచ్చింది. ఎంటీ-15 పేరుతో సరికొత్త 155సీసీ బైక్‌ను కంపెనీ నేడు విడుదల చేసింది. దీని ధర రూ. 1.36లక్షలు(ఎక్స్‌ షోరూం దిల్లీ)గా నిర్ణయించింది. లిక్విడ్‌ కూల్‌ ఫోర్‌ స్ట్రోక్‌ ఇంజిన్‌, 6 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, సింగిల్‌ ఛానల్‌ యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, వేరియబుల్‌ వ్యాల్యూ ఆక్చుయేషన్‌ తదితర అధునాతన ఫీచర్లతో యమహా ఈ బైక్‌ను తీసుకొచ్చింది.
ఎంటీ సిరీస్‌లో యమహా ఇప్పటికే పలు మోడళ్లను తయారుచేసింది. అయితే భారత్‌లో ఎంటీ-09 మోడల్‌ను మాత్రమే విడుదల చేసింది. 2015 నుంచి ఈ మోడల్‌ విక్రయాలు కొనసాగుతున్నాయి. దాని తర్వాత మళ్లీ ఎంటీ సిరీస్‌లో ఇప్పుడు ఎంటీ-15 బైక్‌ను తీసుకొచ్చింది. ఈ ఏడాది 60వేల ఎంటీ యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండియా యమహా మోటార్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రవీంద్ర సింగ్‌ తెలిపారు. మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి ఎంటీ-03 లాంటి బైక్‌లను కూడా భారత్‌లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.