close

తాజావార్తలు

సత్యానికంటే వాస్తవానికే నా ప్రాధాన్యం

996 వ్యాఖ్యలను సమర్థించుకున్న జాక్‌ మా

బీజింగ్‌: పని గంటలపై ఇ-కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా గ్రూప్‌ ఛైర్మన్‌ జాక్‌ మా చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో తీవ్ర దుమారానికి తెరలేపాయి. రోజుకు 12 గంటల చొప్పున వారంలో ఆరు రోజుల పాటు పనిచేయాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా స్పందించిన జాక్‌ మా తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. సత్యానికంటే వాస్తవాలు చెప్పడానికే ప్రాధాన్యమిస్తానని, తాను వాస్తవాలే మాట్లాడానని అన్నారు. 

‘నేను ఊహించినట్లుగానే 996 షెడ్యూల్‌పై ఇటీవల నేను చేసిన వ్యాఖ్యలు చర్చలకు, తీవ్ర విమర్శలకు దారితీశాయి. నేను అర్థం చేసుకోగలను. నేను సత్యాలు మాట్లాడాల్సింది అని వీరంతా(విమర్శలు చేసే వారిని ఉద్దేశిస్తూ) అనుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో ప్రపంచంలో సత్యాలు మాట్లాడే వారికి కొరతే లేదు. ప్రజలను ఆలోచింపజేసే వాస్తవాలకు మాత్రం కొరతే ఉంది’ అని జాక్‌ మా బ్లాగులో రాసుకొచ్చారు. తాను సత్యాల కంటే వాస్తవాలు చెప్పేందుకు ఇష్టపడతానని అన్నారు. 996 షెడ్యూల్‌ యువ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 

ఇటీవల జరిగిన కంపెనీ అంతర్గత సమావేశంలో జాక్‌ మా సంస్థ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ 996 షెడ్యూల్‌ గురించి ప్రస్తావించారు. ‘ఉద్యోగులు 996 పని సంస్కృతిని అలవాటు చేసుకోవాలని, అలా పనిచేయడం అదృష్టంగా భావించాలి. మీరు ఆలీబాబా గ్రూప్‌లో చేరాలనుకుంటే దీనికి సిద్ధంగా ఉండాలి. లేకపోతే మీరు చేరనందుకు బాధపడాల్సిన అవసరం లేదు’ అని జాక్‌మా చెప్పుకొచ్చారు. 996 అంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారంలో ఆరు రోజులూ పనిచేయాలన్నది జాక్‌ మా ఉద్దేశం. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.