Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111109
            [news_title_telugu_html] => 

యూకేలో కీలక పదవికి రాజన్‌ పోటీ!

[news_title_telugu] => యూకేలో కీలక పదవికి రాజన్‌ పోటీ! [news_title_english] => Raghuram Rajan A Contender For Huge UK Position [news_short_description] => రిజర్వ్‌బ్యాంక్‌ ఇండియా మాజీ గవర్నర్‌, ప్రముఖ ఆర్థిక వేత్త రఘురామ్‌ రాజన్‌ యూకేలో కీలక పదవికి పోటీ పడుతున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గవర్నర్‌ పదవికి పోటీ పడుతున్న.... [news_tags_keywords] => raghuram Rajan,UK [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-13 00:50:10 [news_isactive] => 1 [news_status] => 2 ) )
యూకేలో కీలక పదవికి రాజన్‌ పోటీ! - Raghuram Rajan A Contender For Huge UK Position - EENADU
close

తాజావార్తలు

యూకేలో కీలక పదవికి రాజన్‌ పోటీ!

లండన్‌: రిజర్వ్‌బ్యాంక్‌ ఇండియా మాజీ గవర్నర్‌, ప్రముఖ ఆర్థిక వేత్త రఘురామ్‌ రాజన్‌ యూకేలో కీలక పదవికి పోటీ పడుతున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గవర్నర్‌ పదవికి పోటీ పడుతున్న టాప్‌ వ్యక్తుల్లో ఒకరిగా ఆయన ఉన్నారని బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది.

2013 నుంచి 2016 మధ్య ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ పనిచేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన చికాగోలోని ఓ యూనివర్సిటీలో అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్నారు. గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)లోనూ పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. బ్రెగ్జిట్‌ నేపథ్యంలో ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గవర్నర్‌గా ఉన్న మార్క్‌ కార్నే స్థానంలో కొత్త వ్యక్తిని నియమించనున్నారు. అక్టోబర్‌ 31లోపు ఈ నియామకం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ పదవికి పోటీ చేస్తున్న ముఖ్యమైన వ్యక్తుల్లో రాజన్‌ ఒక్కరే యూకే వెలుపలి వ్యక్తి అని పలువురు ఆర్థికవేత్తలు ఈ విషయాన్ని పేర్కొన్నారు. 

దీనిపై అటు రఘురాం రాజన్‌ గానీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గానీ స్పందించకపోవడం గమనార్హం. ముఖ్యంగా బ్రెగ్జి్‌ట్‌ ఓటింగ్‌ సమయంలో అయోమయంలో ఉన్న బ్రిటన్‌కు మద్దతుగా రాజన్‌ వ్యాఖ్యలు చేశారు. 2005లో ఐఎంఎఫ్‌లో ఉన్న సమయంలో ఆర్థిక మాంద్యం ముప్పును ముందే ఊహించారాయన. తొలి రోజుల్లో దీనిపై విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన మాటలు నిజమని తేలడానికి ఎంతోకాలం పట్టలేదు. 2008లో సంభవించిన ఆర్థికమాంద్యం వల్ల లీమన్‌ బ్రదర్స్‌ వంటి కంపెనీలే కుప్పకూలడం గమనార్హం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.