close

తాజావార్తలు

ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. ఆ ఛార్జీల ఎత్తివేత

ముంబయి: స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఐఎంపీఎస్‌ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌ వినియోగదారులు ఆగస్టు 1 నుంచి ఈ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 

రోజులో ఏ క్షణంలోనైనా డబ్బులు పంపేందుకు ఐఎంపీఎస్‌ ఉపయోగపడుతుది. ప్రస్తుతం రూ.వెయ్యి రూపాయల వరకు లావాదేవీలపై ఎస్‌బీఐ ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయడం లేదు. రూ.1000-10,000 వరకు 1+జీఎస్టీ, రూ.10,001-1,00,000 వరకు రూ.2+జీఎస్‌టీ, రూ.1,00,001-2,00,000 వరకు లావాదేవీలపై రూ.3+జీఎస్టీ వసూలు చేస్తోంది. ఇకపై ఈ ఛార్జీలను ఎస్‌బీఐ వసూలు చేయదు. గత నెల ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన నేపథ్యంలో జులై 1 నుంచి ఎస్‌బీఐ వాటిపై ఛార్జీలను ఎత్తివేసింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.