Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009324
            [news_title_telugu_html] => 

ఐఫోన్ల ధరలు తగ్గాయ్‌!

[news_title_telugu] => ఐఫోన్ల ధరలు తగ్గాయ్‌! [news_title_english] => iPhone old model mobiles Prices decreased in India [news_short_description] => యాపిల్‌ సంస్థకు చెందిన పాత ఐఫోన్‌ మోడళ్ల ధరలు భారత్‌లో తగ్గాయి. మంగళవారం యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ 11 సిరీస్‌ ఫోన్లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రోమ్యాక్స్‌ ఫోన్లను పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో గతేడాది విడుదల చేసిన ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఎక్స్‌ఎస్‌ సహా ఇతర మోడళ్ల ధరలను యాపిల్‌ సంస్థ భారత్‌లో తగ్గించింది. [news_tags_keywords] => iPhone, iPhone 11, iPhone XR new Price, iPhone 7 Plus Price [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 00:16:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఐఫోన్ల ధరలు తగ్గాయ్‌! - iPhone old model mobiles Prices decreased in India - EENADU
close

తాజావార్తలు

ఐఫోన్ల ధరలు తగ్గాయ్‌!

పాత మోడళ్లపై భారీ తగ్గింపు

దిల్లీ: యాపిల్‌ సంస్థకు చెందిన పాత ఐఫోన్‌ మోడళ్ల ధరలు భారత్‌లో తగ్గాయి. మంగళవారం యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ 11 సిరీస్‌ ఫోన్లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రోమ్యాక్స్‌ ఫోన్లను పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో గతేడాది విడుదల చేసిన ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఎక్స్‌ఎస్‌ సహా ఇతర మోడళ్ల ధరలను యాపిల్‌ సంస్థ భారత్‌లో తగ్గించింది. ఓ జాతీయ టెక్‌ వార్తా సంస్థ వివరాల ప్రకారం వాటి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 
గతేడాది ఆవిష్కరణ సమయంలో ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ధర భారత్‌లో రూ.76,900 కాగా ఇప్పుడు రూ.49,900కు తగ్గించారు. ఇక ఎక్స్‌ఎస్‌ ధర రూ.89,900 నుంచి ప్రారంభం కానుంది. గతంలో దీని ప్రారంభ ధర రూ.99,900 గా ఉండేది. 
ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ 64జీబీ వేరియంట్‌ రూ.49,900.. 128 జీబీ ధర రూ.54,900గా మార్చారు. ఎక్స్‌ఎస్‌ 256 జీబీ ధర 1,03,900కు తగ్గించారు. తొలుత దీని ధర రూ.1,14,900గా ఉండేది.
ఐఫోన్‌ 8ప్లస్‌ 64 జీబీ రూ.49,900, ఐఫోన్‌ 8 64జీబీ మోడల్‌ ధర రూ.39,900కు పొందవచ్చు. మరింత పాత మోడల్‌ అయిన ఐఫోన్‌ 7 32జీబీ, 128 జీబీ ధరలు వరుసగా రూ.29,900.. రూ.34,900కు తగ్గించారు. 7ప్లస్‌ ధరలు 37,900 (32జీబీ) రూ.42,900 (128 జీబీ)గా ఉన్నాయి. అయితే ఐఫోన్‌ ఎక్స్‌, ఎక్స్‌ఎస్‌ మ్యాక్స్‌ ధరలను మాత్రం యథాతథంగానే ఉంచారు. అయితే ఈ తగ్గించిన ధరలు ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయనే విషయం తెలియాల్సి ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.