close

తాజావార్తలు

భారత్‌లోకి కొత్త బెంజ్‌ విక్లాస్‌ ఇలైట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ సరికొత్త ఎంపీవీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ‘విక్లాస్‌ ఇలైట్‌’గా పిలిచే ఈ కారు ఎక్స్‌షోరూం  ధర రూ. 1.10 కోట్లుగా సంస్థ నిర్ణయించింది. భారత్‌లో ఎంపీవీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని బెంజ్ ఈ కారును తీసుకొచ్చింది. గతంలో విడుదల చేసిన విక్లాస్‌ మోడల్‌కి కొనసాగింపుగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కారు స్టైల్‌ పరంగా బంపర్‌, హెడ్‌ల్యాంప్‌, గ్రిల్‌, అలాయ్‌ వీల్స్‌ వంటి వాటితో ఆధునీకీకరించారు. స్టీల్‌ బ్లూ, సెలెనైట్‌ గ్రే, గ్రాఫైట్‌ గ్రే అనే మూడు రంగుల్లో ఈ కారు లభించనుంది. 

విక్లాస్‌ ఇలైట్‌లో 2.0లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 161బీహెచ్‌పీ శక్తిని 380ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 9జీ-ట్రానిక్‌ 9-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ని ఉంచారు. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 11 సెకన్లలో అందుకుంటుంది. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఇందులో మసాజ్‌, కూలింగ్‌, హీటింగ్ ఫంక్షన్‌ ఫీచర్స్‌తో లగ్జరీ సీట్లను అమర్చారు. ఇంకా ఈ కారు సెంట్రల్‌ కన్సోల్‌లో చిన్నపాటి రిఫ్రిజ్‌రేటర్‌ కూడా ఉంది. ఎలక్ట్రిక్‌ స్లైడింగ్‌ డోర్స్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, కమాండ్‌ ఆన్‌లైన్‌ ఇంటర్‌ఫేస్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, 18 అంగుళాల అలాయ్‌ వీల్స్‌  వంటి ఆధునిక ఫీచర్స్‌ ఈ కారులో ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులను ఇస్తున్నారు. వీటితో పాటు ఏబీఎస్‌, ఈబీడీ, అటెన్షన్‌ అసిస్ట్‌, 360-డిగ్రీ కెమెరా, పార్కింగ్‌ అసిస్ట్‌ వంటి అధునాతన ఫీచర్స్‌ ఉన్నాయి.  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.