Ola scooters: విక్రయాల్లో దూసుకెళ్లిన ఓలా స్కూటర్లు! - Electric scooters sales crossed Rs 1100 cr in 2 days
close

Published : 17/09/2021 13:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ola scooters: విక్రయాల్లో దూసుకెళ్లిన ఓలా స్కూటర్లు!

రెండు రోజుల్లో రూ.1,100 కోట్లు విలువ చేసే అమ్మకాలు

దిల్లీ: విద్యుత్తు స్కూటర్ల అమ్మకాల్లో ఓలా సంస్థ రికార్డు సృష్టించింది. రెండు రోజుల్లో ఏకంగా రూ.1,100 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్ముడయ్యాయని సంస్థ సహ వ్యవస్థాపకుడు భావిశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. భారీ ఆర్డర్ల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నుంచి విక్రయాల ప్రక్రియను నిలిపివేశారు. దీపావళి పర్వదినం సందర్భంగా నవంబరు 1న విక్రయాలు పునఃప్రారంభమవనున్నాయి.

ఆన్‌లైన్‌లో బుధవారం ఉదయం ఓలా స్కూటర్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. తొలి 24 గంటల్లో సెకనుకు 4 స్కూటర్ల చొప్పున రూ.600 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్ముడయ్యాయి. రెండో రోజు నాటికి ఆ విక్రయాలు రూ.11,00 కోట్ల విలువకు చేరుకున్నాయి. వాహన రంగ చరిత్రలోనే ఇదో రికార్డని భావిష్‌ అభిప్రాయపడ్డారు. ఈ-కామర్స్‌లో ఒక ప్రోడక్ట్‌కు విలువపరంగా ఈ స్థాయి స్పందన రావడం కూడా చరిత్రేనని తెలిపారు.

ఎస్‌ 1 (ధర రూ.99,999), ఎస్‌ 1 ప్రో  (రూ.1,29,999)లను ఆగస్టు 15న ఆవిష్కరించిన ఓలా, జులై నుంచే రూ.499తో ముందస్తు బుకింగ్‌కు అవకాశం కల్పించింది. అప్పుడు 24 గంటల్లో లక్షకు పైగా బుకింగ్‌లు వచ్చాయని తెలిపింది. ఓలా యాప్‌ ద్వారా ఈనెల 15 నుంచి రూ.20,000 చెల్లించి, కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని డెలివరీ సమయంలో చెల్లిస్తే సరిపోతుంది. వచ్చే నెలలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు డబ్బులు చెల్లించిన వారికి, ఎప్పుడు సరఫరా చేసేదీ 72 గంటల్లోగా వెల్లడించనుంది. ఏడాదికి 10 లక్షల స్కూటర్లను తయారు చేసే సామర్థ్యంతో ప్లాంటును సంస్థ తమిళనాడులో నిర్మిస్తోంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని