ఎన్ఆర్ఐలు భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, వారు సాధారణంగా విదేశీ పదవీ విరమణ ఖాతాలలో సంపాదించిన కార్పస్‌కు సంబంధించిన పన్ను సమస్యలను ఎదుర్కొంటారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. విదేశీ పదవీ విరమణ ఖాతాల్లో వచ్చే డబ్బుపై ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ) డబుల్ ట్యాక్సేషన్ నుంచి ఉపశమనం కల్పించాలని బడ్జెట్ 2021 ప్రతిపాదించింది.
ప్రస్తుతం భారత్‌కు, విదేశాలకు ఈ పన్ను చెల్లింపు సమయంతో పాటు, పన్ను వర్తించే విధానంలో వ్యత్యాసం కారణంగా ఈ సమస్య ఎదురవుతోంది. దీన్ని పరిష్కరించడానికి ఆ నిర్దిష్ట ఖాతా నుంచి పేర్కొన్న వ్యక్తి ఆదాయానికి కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా కొత్త సెక్షన్ 89A ప్రకారం పన్ను విధించే విధానాన్ని ప్రతిపాదించారు.
ఖాతాలు తెరిచిన సంవత్సరంలో / కాంట్రిబ్యూషన్ చేసే సంవత్సరంలో ఉద్యోగులు ప్రవాసులుగా ఉంటారు, మెచ్యూరిటీ సమయంలో / ఖాతా మూసివేసే సమయానికి తిరిగి వస్తారు. వారు అప్పటికే భారతదేశంలో పన్ను నివాసితులు అవుతారు. దీంతో పదవీ విరమణ ఆదాయంపై ఇక్కడ, విదేశాల్లో రెండు సార్లు పన్ను విధించడం ఎన్ఆర్ఐలకు పెద్ద సవాలుగా మారింది.
ఉదాహరణకు, అమెరికాలో మెచ్యూరిటీ లేదా ఉపసంహరణ సమయం వరకు వ్యక్తిగత విరమణ ఖాతా (ఐఆర్ఎ) లేదా 401 (k) ఖాతాపై పన్ను వర్తించదు. దీనికి విరుద్ధంగా, భారత్‌లో ఉద్యోగి అక్కడికి వెళ్లినప్పటినుంచి నివాస స్థితిని బట్టి ప్రతి సంవత్సరం ఐఆర్ఎకు అక్రూవల్ ప్రాతిపదికన పన్ను విధిస్తారు. కాబట్టి, రెండు దేశాలలో పన్నుల విదింపులో వ్యత్యాసం కారణంగా ఒకే ఆదాయంపై పలుమార్లు పన్ను చెల్లించాల్సి వస్తోంది.
ఎన్ఆర్ఐల విదేశీ విరమణ ఖాతాల నుంచి ఉపసంహరణలపై పన్నుకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం త్వరలో తెలియజేయనుంది. వారికి ఉపశమనం కలిగించడానికి, ప్రభుత్వం నిర్ధేశించిన రిటైరల్ ఖాతాల నుంచి డబ్బును స్వీకరించేందుకు ఎన్ఆర్ఐలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించనుంది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?