టీవీఎస్‌ కొత్త అపాచీ.. ధర ఎంతంటే? - TVS Motor introduces 2021 TVS Apache RTR 160 4V
close

Updated : 10/03/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీవీఎస్‌ కొత్త అపాచీ.. ధర ఎంతంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ 2021 టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4V బైక్‌ను బుధవారం విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. డిస్క్‌ వేరియంట్‌ ధర రూ.1,10,320 (ఎక్స్‌షోరూం, దిల్లీ)కాగా.. డ్రమ్‌ వేరియంట్‌ ధర రూ.1,07,270గా నిర్ధరించారు. రేసింగ్‌ రెడ్‌, నైట్‌ బ్లాక్‌, మెటాలిక్‌ బ్లూ-మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఇక ఈ కొత్త బైక్‌లో 159.7 సీసీ సింగిల్‌ సిలిండర్‌, 4-వాల్వ్‌, ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ అమర్చారు. 9,250 ఆర్‌పీఎం వద్ద 17.38 హెచ్‌పీ శక్తిని, 7,250 ఆర్‌పీఎం వద్ద 14.73 ఎన్‌ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది. ఫైవ్‌ స్పీడ్‌ గేర్‌బాక్స్‌ కలిగిన ఈ బైక్‌ ఈ సెగ్మెంట్‌లో అత్యంత శక్తిమంతమైన రైడింగ్‌ అనుభూతిని ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, క్లా స్టైల్డ్‌ పొజిషన్‌ ల్యాంప్‌లు ప్రత్యేక ఆకర్షణ. పాత అపాచీల వెర్షన్‌లతో పోలిస్తే ఈ కొత్త బైక్‌ రెండు కిలోల బరువు తగ్గడం విశేషం.

ఇవీ చదవండి...

రెండు సెకన్లకు ఒక ఈ-స్కూటర్‌!

ఏబీఎస్‌ టెక్నాలజీతో కొత్త ప్లాటినా


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని