Toyota Yaris: భారత్‌లో టొయోటా యారిస్ కార్ల విక్రయాలు బంద్‌ - Toyota stop selling sedan Yaris in India
close

Published : 27/09/2021 21:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Toyota Yaris: భారత్‌లో టొయోటా యారిస్ కార్ల విక్రయాలు బంద్‌

దిల్లీ: తమ సంస్థ నుంచి వస్తున్న మిడ్‌ సైజ్‌ సెడాన్‌ విభాగంలోని యారిస్‌ మోడల్‌ కారు విక్రయాలను భారత్‌లో నిలిపివేస్తున్నట్లు టొయోటా కిర్లోస్కర్ మోటార్‌(టీకేఎం) ప్రకటించింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని మోడళ్లను తీసుకొచ్చే క్రమంలోనే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ కారు మే, 2018లో మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుంచి కేవలం 19,800 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. వినియోగదారులు ఈ కారు పట్ల పెద్దగా ఆసక్తి చూపని కారణంగానే విక్రయాలు నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకూ యారిస్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు విడిభాగాలు సహా ఇతరత్రా సేవలు కనీసం వచ్చే 10 ఏళ్ల పాటు అందుతాయని టొయోటా హామీ ఇచ్చింది. అలాగే కంపెనీ నుంచి వస్తున్న ఇతర కార్ల విక్రయాలను మాత్రం ఆపడం లేదని పేర్కొంది.

సెడాన్‌ విభాగంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు తెచ్చిన యారిస్ ఫీచర్లు ఇలా ఉన్నాయి... 1496 సీసీ ఇంజిన్‌, 107 హెచ్‌పీ శక్తి, 17.1 కిమీ/లీ. దీని ధర: రూ.8లక్షల 75 వేలు - రూ.14 లక్షలు మధ్య ఉండేది. ప్రస్తుతం టీకేఎం నుంచి హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా, కాంపాక్ట్‌ ఎస్‌యూవీ అర్బన్‌ క్రూజర్‌, మల్టీపర్పస్‌ వెహికల్‌ ఇన్నోవా క్రిస్టా, ప్రీమియం అండ్‌ ఎస్‌యూవీ ఫార్చునర్‌ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తుల్లో మరిన్ని కార్లను అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొస్తామని టీకేఎం ప్రకటించింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని