4.9 సెకన్లకు 100 కి.మీ వేగం
close

Updated : 09/06/2021 08:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

4.9 సెకన్లకు 100 కి.మీ వేగం

మెర్సిడెస్‌ మేబాచ్‌ జీఎల్‌ఎస్‌ 600  
ధర రూ.2.43 కోట్లు

దిల్లీ: జర్మనీ వాహన దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ అల్ట్రా లగ్జరీ ఎస్‌యూవీలో ‘మెర్సిడెస్‌-మేబాచ్‌ జీఎల్‌ఎస్‌ 600 4మేటిక్‌’ను భారత విపణిలో మంగళవారం విడుదల చేసింది. దీని ధర రూ.2.43 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌). అల్ట్రా లగ్జరీ ‘మెర్సిడెస్‌-మేబాచ్‌’ శ్రేణిలో తొలి ఎస్‌యూవీ ఇదేనని, భారత విపణిలో మెర్సిడెస్‌-మేబాచ్‌ ఎస్‌-క్లాస్‌ తరవాత విడుదలైన కారు ఇదేనని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా వెల్లడించింది. ‘విలాసవంత ఎస్‌యూవీ విభాగంలో వినియోగదార్ల అంచనాలకు తగ్గినట్లు ఉండేలా జీఎల్‌ఎస్‌ 600 4మేటిక్‌ను తీసుకొచ్చాం. విలాసంతో పాటు స్పోర్ట్స్‌ కార్‌ అనుభూతిని వినియోగదార్లు పొందుతార’ని మెర్సిడెస్‌-బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ మార్టిన్‌ ష్వెంక్‌ తెలిపారు. వి8 3,982 సీసీ పెట్రోల్‌ ఇంజిన్‌తో ఇది రూపొందింది. 4.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. గంటకు 250 కి.మీ గరిష్ఠ వేగంతో ఇందులో ప్రయాణం చేయవచ్చు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని