ప్రీమియం మోటార్‌సైకిళ్లలోకి హీరో
close

Updated : 20/09/2021 08:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రీమియం మోటార్‌సైకిళ్లలోకి హీరో

రెట్రో-స్టైల్డ్‌ హార్లే డేవిడ్‌సన్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు

దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ ఎంతో లాభదాయకత ఉన్న ప్రీమియం మోటార్‌సైకిళ్ల విభాగంలోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. పాత తరం శైలి(రెట్రో స్టైలింగ్‌)తో హార్లే డేవిడ్‌సన్‌ మోడల్‌ను విపణిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. భారత్‌లో సుమారు దశాబ్ద కాలం పాటు ప్రీమియం బైక్‌లను విక్రయించిన అమెరికాకు చెందిన హార్లే డేవిడ్‌సన్‌, గత ఏడాది నుంచి దేశీయంగా తయారీ కార్యకలాపాలు, విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ సమయంలోనే (2020 అక్టోబరు) హీరో-హార్లే డేవిడ్‌సన్‌ మధ్య ఒప్పందం కుదిరింది. అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని