విదేశీ ఎక్స్చేంజ్ నిర్వహణ చట్టం (ఎఫ్ఈఏంఏ), ఆదాయ పన్ను చట్టం (ఐటీ) ప్రకారం ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) హోదా భిన్నంగా ఉంటుందనే విషయాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఈఏంఏ చట్టం ప్రకారం, మీరు వృత్తిపరంగా లేదా నిరవధిక కాలానికి గాను విదేశాలకు వెళ్లాలని ప్రణాళిక రూపొందించుకున్న్నట్లైతే, అక్కడికి వెళ్ళే ముందు మీరు చేయవలసినవి కొన్ని పనులను కింద తెలియచేశాము.
బ్యాంక్ ఖాతాలు:
ప్రస్తుతం మీకున్న రెసిడెంట్ బ్యాంకు ఖాతాలను నాన్ - రెసిడెంట్ సాధారణ (ఎన్ఆర్ఓ) బ్యాంకు ఖాతాలుగా మార్చుకోవలసి ఉంటుంది. బహుశా మీరు ఇక్కడ అనేక రెసిడెంట్ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటారు. అన్ని ఖాతాలను ఎన్ఆర్ఓ కు మార్చకుండా, ఖాతాలన్నిటినీ ఏకీకృతం చేయడం మంచిది. మీరు విదేశాల్లో ఉన్నప్పుడు ఇక్కడి మీ ఖాతాలను నిర్వహించడం, పన్ను ప్రయోజనాల కోసం అన్నింటినీ సరిగ్గా నివేదించడం మీకు సవాలుగా మారచ్చు. ఇక్కడి మీ ఆస్తుల ద్వారా వచ్చే అద్దె, డివిడెండ్ వంటి ఆదాయం కోసం మీరు ఏ ఎన్ఆర్ఓ ఖాతాను ఉంచాలనుకుంటున్నారో నిర్ణయించుకోని మిగిలిన ఖాతాలను మూసివేయండి. మీ బ్యాంకు డిపాజిట్లలో కూడా ఇదే ప్రక్రియను అనుసరించండి. అదనంగా, ఒక నాన్ - రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ) ఖాతాను తెరిచి,
బ్యాంక్ లాకర్స్:
మీరు విలువైన వస్తువులను, పత్రాలను ఇక్కడే నిల్వ చేయాలనుకున్నప్పుడు మాత్రమే బ్యాంకు లాకర్ ను కొనసాగించడం మంచిది. ఒకవేళ ఉపయోగించకపోతే దానిని రద్దు చేయండి. ఎందుకంటే దీని వలన మీకు అదనపు వ్యయం అవుతుంది.
డీమ్యాట్ ఖాతాలు:
రెసిడెంట్ బ్యాంకు ఖాతాల మాదిరిగా, డీమ్యాట్ ఖాతాలను కూడా లింక్ చేయించుకోవాలి. మీరు వేరే దేశానికీ వెళ్లిపోతారు కావున మీ ఈక్విటీ పోర్ట్ ఫోలియోపై సమయాన్ని, దానికి సంబంధించిన సమాచారాన్ని పొందలేకపోవచ్చు. అందువలన ఒక మంచి నిపుణుడి సలహా కోరడమనేది మీకున్న ప్రత్యామ్నాయాల్లో ఒకటి. అలాగే మీరు ఒక పీఐఏస్ (పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్) ఖాతాను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. దీని ద్వారా మీరు ఎన్నారై అయిన తరువాత కూడా ఈక్విటీలను కొనసాగించవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్:
మీరు ఎన్ఆర్ఐ అయిన తరువాత మీ కొత్త నివాస స్థలం సరిగ్గా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా మీ కొత్త కేవైసీని రూపొందించడం కష్టతరం కావచ్చు. మీ ఫోలియోస్ను నాన్- రెసిడెంట్ కు మార్చండి. అలాగే అసమతుల్యతలను నివారించేందుకు మీ ఎన్ఆర్ఓ బ్యాంకు ఖాతాను ఫోలియో తో లింక్ చేయండి. మీరు వేరే దేశం నుంచి మీ పోర్ట్‌ఫోలియోలను సులభంగా నిర్వహించలేరు కావున, డైరెక్ట్ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో మాదిరిగా ఒక నిపునుడి సహాయం తీసుకోవడం మంచిది. ఒకవేళ మీరు అమెరికాకు వెళ్ళినట్లయితే, విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పన్నులను పరిగణనలోకి తీసుకోడానికి నిర్వహించగల అత్యంత ప్రభావవంతమైన సాధనం కాదు. వాటిని ఉపసంహరించుకోని, ఇతర ప్రత్యామ్నాయ ఆర్ధిక సాధనాలను వినియోగించండి.
రియల్ ఎస్టేట్:
రియల్ ఎస్టేట్ ను నిర్వహించడం కొంచం గందరగోళంగా ఉంటుంది, ఎందుకంటే అధిక నాణ్యత కలిగిన ఆస్తి నిర్వహణ సేవలు భారతదేశంలో అంతగా అభివృద్ధి చెందలేదు. మీ రియల్ ఎస్టేట్ ఆస్తులను తాత్కాలికంగా అద్దెకు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే సవాళ్లను నివారించడానికి నిర్వహణ బిల్లులు, వినియోగాలు, సమానమైన నెలసరి వాయిదా వంటి వాటిని అందించాల్సిన అవసరం ఉండవచ్చు. దీర్ఘకాలంలో రియల్ ఎస్టేట్ విషయంలో మీరు ఎలా వ్యవహరిస్తారనే దాని గురించి ఆలోచించండి, ప్రత్యేకించి ఒకవేళ మీరు మైగ్రేట్ అవ్వాలనుకుంటే లేదా దీర్ఘకాలం పాటు ఎన్ఆర్ఐగా ఉండాలనుకుంటే దాని గురించి ఆలోచన చేయండి.
జీవిత బీమా పాలసీలు:
జీవిత బీమా పాలసీల ప్రీమియంలను చెల్లించడానికి ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ ను ఎంచుకొండి. మీ టర్మ్ బీమాను కొనసాగిస్తున్నట్లైతే, మీకున్న పాలసీలలో ఏది ఉంచాలో లేదా ఏది సరెండర్ చేయాలో అంచనా వేయడం మంచిది. అలాగే, దేనిని పెయిడ్-అప్ కు కన్వర్ట్ చేయాలో నిర్ణయించుకొని, తాజా ప్రీమియంలను చెల్లించకుండా పాలసీని రద్దు చేయకుండా అలానే ఉంచండి. మీరు వెళ్ళే దేశంలో బీమా ప్రీమియంలు ఎక్కువగా ఉండవచ్చు, అలాగే మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే బీమాను పొందలేకపోవచ్చు, అందువలన ప్రస్తుతం ఉన్న పాలసీలను కొనసాగించడం మంచిది.
ఆరోగ్య బీమా పాలసీలు:
ఒకవేళ మీకు ఇక్కడ ఆరోగ్య బీమా పాలసీలు ఉన్నట్లయితే, వాటిని రద్దు చేయకుండా అలానే కొనసాగనివ్వండి. ఎందుకంటే వైద్య చికిత్స, ముందుగా ఉన్న అనారోగ్య సమస్యల వలన మీరు ఇక్కడికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ప్రీమియం చెల్లింపులు సమయానికల్లా పూర్తవుతున్నాయని నిర్ధారించడం చాలా కష్టం, ఎందుకంటే ఈ పాలసీల గడువు ముగిసిన తర్వాత వాటిని పునరుద్ధరించలేరు.
పన్ను :
ఎన్ఆర్ఐ పన్ను విషయాల్లో పన్నులను సరిగ్గా చెల్లించి, మీ పన్ను సలహాదారులకు ఎన్ఆర్ఐ పన్నులపై మంచి అవగాహన ఉందో, లేదో చూసుకోవాలి. కొన్ని దేశాలలో స్వదేశంలో ఉన్న పన్ను సలహాదారుతో కలిసి పనిచేయడానికి అవసరమైన మీరు నివసించేదేశంలో ఒక పన్ను సలహాదారు సహాయం మీకు అవసరం అవ్వొచ్చు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?