ఏప్రిల్‌లో అత్యధికంగా అమ్ముడైన కారేదో తెలుసా? - April top 10 car sales details
close

Published : 08/05/2021 20:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏప్రిల్‌లో అత్యధికంగా అమ్ముడైన కారేదో తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏప్రిల్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతీ సుజుకీకి చెందిన వేగనార్‌ అగ్రస్థానంలో నిలిచింది. తొలి పది కార్లలో మారుతీ సుజుకీకి చెందినవే అత్యధికంగా ఉండగా.. తరువాతి స్థానంలో హ్యుందాయ్‌ నిలిచింది. వాహన సంబంధిత విషయాలపై సమగ్ర విశ్లేషణ జరిపే జాటో డైనమిక్స్‌ ఇండియా వివరాల ప్రకారం.. ఏప్రిల్‌లో మారుతీ సుజుకీకి చెందిన వేగనార్‌ 18,656 యూనిట్లు, స్విఫ్ట్‌ 18,316 యూనిట్లు, ఆల్టో 800..  17,303, బాలెనో 16,384, డిజైర్‌ 14,073, ఈకో 11,469, విటారా బ్రెజా 11,220 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఇక హ్యుందాయ్‌కు చెందిన గ్రాండ్‌ ఐ10 నియోస్‌ 11,540 యూనిట్లు, వెన్యూ 11,245, క్రెటా 12,463 యూనిట్లను విక్రయించారు. ఏప్రిల్‌లో అమ్ముడైన ప్రయాణికుల వాహనాల్లో 50 శాతం వాటా ఈ పది కార్లదే కావడం విశేషం.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని