Bajaj Dominar 400: బజాజ్‌ కొత్త డామినార్‌ 400 - Bajaj Dominar 400 with factory-fitted accessories launched at Rs 2 lakh
close

Updated : 26/10/2021 10:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bajaj Dominar 400: బజాజ్‌ కొత్త డామినార్‌ 400

ధర రూ.2.16 లక్షలు

దిల్లీ: బజాజ్‌ ఆటో నవీకరించిన డామినార్‌ 400 బైకును విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.2.16 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. సుదూర ప్రయాణాలు చేసే చోదకుల కోసం ఈ బైకులో ఫ్యాక్టరీ- ఫిట్టెడ్‌ టూరింగ్‌ విడిభాగాలను అమర్చారు. ఇందులో అమర్చిన 373.3 సీసీ ఇంజిన్‌ 40 పీఎస్‌ శక్తిని అందిస్తుంది. ‘ప్రీమియం బైకులో డామినార్‌ 400 ప్రత్యేక స్థానం సృష్టించుకుంది. నగర చోదకులతో పాటు సుదూర ప్రయాణాలు చేసే వారికి మొదటి ఎంపికగా మారింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మరిన్ని మార్పులు చేసి కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చాం’ అని బజాజ్‌ ఆటో హెడ్‌ (మార్కెటింగ్‌) నారాయణన్‌ సుందరరామన్‌ పేర్కొన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని