Automobile: టైర్లకు కొత్త ప్రమాణాలు - Govt to introduce new norms for tyre making
close

Published : 21/05/2021 19:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Automobile: టైర్లకు కొత్త ప్రమాణాలు

దిల్లీ: రోడ్డు భద్రతకు భారత ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఆ దిశగా కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా వాహనాల టైర్ల నాణ్యత, భద్రతను పెంచే దిశగా తయారీ సంస్థలకు కొత్త ప్రమాణాలను నిర్దేశించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 

కొత్త ప్రమాణాల్లో భాగంగా టైర్ల రోలింగ్‌ రెసిస్టెన్స్‌, రోలింగ్‌ సౌండ్‌ ఎమిషన్‌, వెట్‌ బ్రేకింగ్‌ వంటి ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశించనుంది. వాహనాన్ని స్టార్ట్‌ చేయగానే కదలడానికి ముందు టైర్లకు, రోడ్డుకు మధ్య ఏర్పడే రాపిడిని రోలింగ్‌ రెసిస్టెన్స్‌ అంటారు. ఈ రెసిస్టెన్స్‌ ఎక్కువగా ఉంటే ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. ఇక టైర్ రోలింగ్‌ సౌండ్‌ ఎమిషన్‌ అంటే వాహనం కదులుతున్న సమయంలో టైర్ల నుంచి వెలువడే శబ్దం. ఇది ఎక్కువగా ఉంటే శబ్ద కాలుష్యానికి దారితీస్తుంది. ఇక నీరు లేదా తడిగా ఉండే ప్రదేశాల్లో హైడ్రోప్లేనింగ్‌ను(టైర్‌కు, రోడ్డుకు మధ్య ఉండే రాపిడిని పూర్తిగా తగ్గించి జారిపోయేలా చేసే పరిస్థితి) తట్టుకునేందుకు అవరమయ్యే బ్రేకింగ్‌ ఫోర్స్‌ను వెట్‌ బ్రేకింగ్‌ అంటారు. ఈ మూడు ప్రమాణాల్ని మరింత మెరుగుపరిచి ప్రయాణికుల భద్రతను పెంచేందుకు కృషి చేయాలని టైర్ల తయారీ సంస్థలను ప్రభుత్వం ఆదేశించనుంది.

ఈ ప్రమాణాలను ఐరోపా దేశాలు ఇప్పటికే తప్పనిసరి చేశాయి. కొత్తగా ప్రవేశపెట్టనున్న టైర్ల మోడళ్లకు ఈ కొత్త ప్రమాణాలు అక్టోబర్‌ 2021 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే మనుగడలో ఉన్న మోడళ్లకు అక్టోబరు 2022 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించనుంది. ఈ కొత్త నిబంధనలతో టైర్ల నాణ్యత విషయంలో రేటింగ్‌ వ్యవస్థను తీసుకొచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీంతో వినియోగదారులకు కొనుగోలు విషయంలో వెసులుబాటు కలగనుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని