Honda: వచ్చే ఏడాది విద్యుత్తు వాహన రంగంలోకి హోండా మోటార్‌సైకిల్స్‌ - Honda Motorcycle all set to foray into EV segment next fiscal
close

Updated : 24/10/2021 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Honda: వచ్చే ఏడాది విద్యుత్తు వాహన రంగంలోకి హోండా మోటార్‌సైకిల్స్‌

దిల్లీ: వచ్చే ఏడాది తమ సంస్థ నుంచి తొలి విద్యుత్తు వాహనాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) తెలిపింది. దీనిపై జపాన్‌లోని తమ మాతృసంస్థ సంస్థ హోండా మోటార్‌తో చర్చిస్తామని హెఎంఎస్‌ఐ ప్రెసిడెంట్‌ అట్సుషీ ఒగాటా తెలిపారు. దీనిపై ఇంకా పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాల్సి ఉందన్నారు. అయితే, విద్యుత్తు వాహనరంగంలోకి ప్రవేశించాలని మాత్రం నిర్ణయించినట్లు తెలిపారు. నగరాల్లో తక్కువ దూరాలకు ప్రయాణికులు విద్యుత్తు వాహనాలనే ఎంపిక చేసుకుంటున్నారన్నారు. అయితే, సుదీర్ఘ ప్రయాణాలకు మాత్రం ఇప్పటికీ సంప్రదాయ వాహనాలకే ఆదరణ ఉందన్నారు. ప్రస్తుతం తమ సంస్థ  నుంచి వస్తోన్న యాక్టివా, షైన్‌లను రాబోయే మూడేళ్ల వరకు విద్యుత్తు విభాగంలోకి మార్చబోమన్నారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని