Ola Scooter: షాపింగ్‌ మాల్స్‌, కేఫ్‌లలోనూ ఓలా ఛార్జింగ్‌ పాయింట్లు! - Ola Electric launches its first Hypercharger
close

Updated : 27/10/2021 12:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ola Scooter: షాపింగ్‌ మాల్స్‌, కేఫ్‌లలోనూ ఓలా ఛార్జింగ్‌ పాయింట్లు!

స్కూటర్‌ విడుదలకు ముందే హైపర్‌ఛార్జర్‌ను విడుదల చేసిన సంస్థ

ఇంటర్నెట్‌ డెస్క్‌: `ఓలా` కంపెనీ త‌న విద్యుత్తు స్కూట‌ర్ల‌ను భార‌త్‌లో త్వ‌ర‌లో భారీగా అమ్మ‌కాలు సాగించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే.  భారీ స్థాయిలో ఆర్డర్లు కూడా వచ్చాయి. టెస్ట్‌ రైడ్ త‌ర్వాత త్వ‌ర‌లో స్కూట‌ర్‌ను హోమ్ డెలివ‌రీ చేయనున్నారు. అయితే ఇది పూర్తిగా బ్యాట‌రీతో న‌డిచే స్కూట‌ర్ కాబ‌ట్టి దీనికి సంబంధించి త్వ‌ర‌లో హైప‌ర్ ఛార్జ‌ర్‌ల‌ను కూడా విడుద‌ల చేయ‌డానికి ఓలా ఎల‌క్ట్రిక్ కంపెనీ స‌న్న‌ద్ధమవుతోంది.  `ఓలా` ఎల‌క్ట్రిక్ భార‌త‌దేశంలోని 400 న‌గ‌రాల్లో హైప‌ర్ ఛార్జ‌ర్ స‌ర్వీస్ కింద ల‌క్ష ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌ల‌ను అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ హైప‌ర్ ఛార్జ‌ర్‌ను `ఓలా` మీడియా ముందుంచింది. కంపెనీ `ఎస్ 1` `ఎస్ 1 ప్రో` ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ల డెలివ‌రీల‌కు ముందే ఫాస్ట్ ఛార్జర్లను ప్రారంభించారు. `ఓలా` ఎల‌క్ట్రిక్ ఇంత‌కు ముందు దాని హైప‌ర్ ఛార్జ‌ర్ కంపెనీ యొక్క ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ బ్యాట‌రీని కేవ‌లం 18 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేయ‌గ‌ల‌ద‌ని, ఇది 75 కిలోమీట‌ర్లు దూరం వ‌ర‌కు వెళ్ల‌డానికి స‌రిపోతుంద‌ని తెలిపింది. కంపెనీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ `ఎస్ 1 ప్రో` ఒక‌సారి పూర్తి ఛార్జింగ్‌పై 181 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు వెళుతుంద‌ని కంపెనీ తెలిపింది.

కంపెనీ `ఎస్‌1`, `ఎస్‌1 ప్రో` ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ల‌తో పోర్ట‌బుల్ 750 వాట్ ఛార్జ‌ర్‌ను కూడా అందిస్తుంది. ఈ ఛార్జ‌ర్‌తో వినియోగ‌దారులు త‌మ ఇళ్ల వ‌ద్దే స్కూట‌ర్‌ని న‌డ‌ప‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే బ్యాట‌రీని ఛార్జ్ చేసుకోవ‌చ్చు. ఇంట్లో `ఎస్‌1` కోసం బ్యాట‌రీ పూర్తి ఛార్జింగ్ 4.50 గంట‌ల కంటే ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. అయితే `ఎస్‌1 ప్రో` సాధార‌ణ ఛార్జ‌ర్ ద్వారా 6.50 గంట‌లు స‌మ‌యం బ్యాట‌రీ ఛార్జింగ్‌కు ప‌డుతుంది. `ఓలా` ఎల‌క్ట్రిక్ త‌న హైప‌ర్ ఛార్జ‌ర్ నెట్‌వ‌ర్క్ ప్ర‌పంచంలోనే అతిపెద్ద ద్విచ‌క్ర వాహ‌నాల `ఈవీ` ఛార్జింగ్ నెట్‌వ‌ర్క్ అని కంపెనీ ప్ర‌క‌టించింది. భార‌త్‌లో 400 న‌గ‌రాల్లో హైప‌ర్ ఛార్జ‌ర్ కింద ల‌క్ష ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌ల ఏర్పాటుకు కంపెనీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప్రధాన కూడళ్లు, వ్యాపార స‌ముదాయాలు, మాల్స్‌, ఐటీ పార్కులు, కేఫ్‌లు, మ‌రిన్నింటిలో హైప‌ర్ ఛార్జ‌ర్‌ల‌ను అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు కంపెనీ తెలిపింది. `ఓలా` ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల టెస్ట్ రైడ్‌లు ఈ న‌వంబ‌ర్ నెల‌లో ప్రారంభ‌మ‌వుతాయి. డెలివ‌రీలు కూడా న‌వంబ‌ర్‌లోనే ప్రారంభం కానున్నాయి. ఓలా `ఎస్‌1`, `ఎస్‌1 ప్రో` ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల ధ‌ర‌లు ప్ర‌స్తుతం వ‌రుస‌గా రూ.99,999, రూ.1,29,999గా ఉన్నాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని