Ola: త్వరలో మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌? - Ola may launch its electric scooter soon
close

Updated : 25/06/2021 20:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ola: త్వరలో మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ త్వరలో మార్కెట్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సంస్థ సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ చేసిన ట్వీట్‌ అదే సంకేతం ఇస్తోంది. స్కూటర్‌ కోసం పెయింట్‌ ఆర్డర్‌ చేయాల్సిన సమయం వచ్చేసిందని.. ఎలాంటి కలర్‌ కోరుకుంటున్నారంటూ ట్విటర్‌ వేదికగా ఆయన ఔత్సాహికులను అడిగారు. దీంతో స్కూటర్‌ తయారీ పూర్తయిందని.. అందుకే పెయింట్‌ గురించి అడుగుతున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రానున్న కొన్ని వారాల్లో వీటి ధరల్ని సైతం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిమూవబుల్‌ లిథియం ఐయాన్‌ బ్యాటరీ, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌, క్లౌడ్‌ కనెక్టివిటీ, అలాయ్ వీల్స్‌, టెలిస్కోపిక్‌ సస్పెన్షన్‌ వంటి అధునాతన ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉండనున్నట్లు సమాచారం.

తమిళనాడులో ఇప్పటికే ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు రూ.2,400 కోట్లతో కొనసాగుతున్నాయి. రానున్న కొన్ని నెలల్లో ఇక్కడ విద్యుత్తు స్కూటర్ల తయారీ ప్రారంభం కానున్నట్లు ఇటీవలే సంస్థ ప్రకటించింది. ఏటా కోటి స్కూటర్లను తయారు చేసే వసతుల్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు సెకన్లకు ఒక స్కూటర్ తయారీ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణంతో పాటు హైపవర్‌ ఛార్జర్‌ నెట్‌వర్క్‌ని కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. హై-స్పీడ్‌ ఛార్జింగ్‌ ఆప్షన్లతో పాటు హోం ఛార్జర్లు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని