Piaggio superbikes: పియాజియో సూపర్‌ బైక్‌లు - Piaggio India launches new range of superbikes
close

Updated : 03/09/2021 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Piaggio superbikes: పియాజియో సూపర్‌ బైక్‌లు

ప్రారంభ ధర రూ.13.09 లక్షలు

దిల్లీ: పియాజియో ఇండియా గురువారం తమ కొత్త శ్రేణి సూపర్‌బైక్‌లను విపణిలోకి విడుదల చేసింది. వీటిలో ఏప్రిలియా ఆర్‌ఎస్‌ 660, టూనో 660, ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4, టూనో వీ4తో సహా ఐకానిక్‌ మోటో గజి వీ85టీటీ కూడా ఉంది. ఈ కొత్త సూపర్‌బైక్‌ల ధరల శ్రేణి రూ.13.09-23.69 లక్షలు. ఈ సూపర్‌బైక్‌లు దేశవ్యాప్తంగా తమ మోటోప్లెక్స్‌ విక్రయశాలల్లో లభ్యమవుతాయని పియాజియో ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దైగో గ్రాఫీ తెలిపారు. 660 సీసీ సరికొత్త ఏప్రిలియా ఆర్‌ఎస్‌ 660, టూనో 660 ధరలు వరుసగా రూ.13.39 లక్షలు, రూ.13.09 లక్షలు కాగా, 1078 సీసీ ఆర్‌ఎస్‌వీ4 ధర రూ.23.69 లక్షలుగా ఉంది. 1077 సీసీ టూనో వీ4 ధర రూ.20.66 లక్షలు, 850 సీసీ మోటోగజి వీ85టీటీ ధర రూ.15.40 లక్షలుగా ఉన్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని