Q1 results: టాటా మోటార్స్‌ నష్టాలు రూ.4,451 కోట్లు - Q1 results of tata motors stood at rs 4451 cr
close

Published : 26/07/2021 21:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Q1 results: టాటా మోటార్స్‌ నష్టాలు రూ.4,451 కోట్లు

ముంబయి: జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ నష్టాలు కాస్త తగ్గాయి. క్రితం సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.8,438 కోట్ల నష్టం రాగా.. ఈసారి అది రూ.4,451 కోట్లకు తగ్గింది. అలాగే క్రితం త్రైమాసికంలో వాటిల్లిన రూ.7,605 కోట్ల నష్టంతో పోల్చినా ఈసారి నష్టాలు తగ్గుముఖం పట్టాయి.

వార్షిక ప్రాతిపదికన ఆదాయం మాత్రం 107.6 శాతం పెరిగి రూ.66,406 కోట్లకు చేరింది. కంపెనీ ఖజానాకు కీలకంగా మారిన జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌రోవర్‌ ఆదాయం 73.7 శాతం పెరగడం విశేషం. ఫలితాలకు ముందు ఎన్‌ఎస్‌ఈలో టాటా మోటార్స్‌ షేరు ధర 0.95 శాతం కుంగి రూ.292.75 వద్ద స్థిరపడింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని