Toyota: హైడ్రోజన్‌ ఇంజిన్‌ వాహనాలు.. రేసింగ్‌ కారుతో టొయోటా ప్రయోగాలు! - Toyota testing hydrogen combustion engines in race cars
close

Published : 25/10/2021 21:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Toyota: హైడ్రోజన్‌ ఇంజిన్‌ వాహనాలు.. రేసింగ్‌ కారుతో టొయోటా ప్రయోగాలు!

టోక్యో: వాణిజ్య వాహనాల్లో హైడ్రోజన్‌ కంబషన్‌ ఇంజిన్ల సాంకేతికతను వినియోగించే యోచనలో ఉన్నట్లు జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ టొయోటా ప్రకటించింది. ఈ మేరకు తొలుత రేసింగ్‌ కార్లలో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు వెల్లడించింది. తద్వారా ఏమైనా సమస్యలు ఉంటే పరిశీలించి సవరించేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. ఇప్పటికే ఫోర్డ్‌ మోటార్‌ సహా మరికొన్ని కంపెనీలు హైడ్రోజన్‌ కంబషన్‌ ఇంజిన్లను అభివృద్ధి చేశాయి.

అయితే, ప్రస్తుతం ఈ సాంకేతికత అభివృద్ధి దశలోనే ఉందని.. దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాల్సి ఉందని టొయోటా పేర్కొంది. పైగా వాహనాలకు ఇంధనాన్ని సమకూర్చే వసతులు కూడా పెద్దగా అందుబాటులో లేవని తెలిపింది. ప్రస్తుతం యారిస్‌ అనే 1.6 లీటర్‌ ఇంజిన్‌ కారులో దీన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వెనుక సీట్ల భాగంగలో రెండు హైడ్రోజన్‌ ట్యాంకులను అమర్చారు. అయితే, వాణిజ్య వాహనాల్లో ఈ డిజైన్ మారే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎప్పటి వరకు ఈ సాంకేతికతతో కూడిన వాహనాలు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయన్నది మాత్రం టొయోటా కచ్చితంగా చెప్పలేదు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని