Yamaha Maxi Scooter: రూ.1.29 లక్షలతో యమహా కొత్త మ్యాక్సీ స్కూటర్‌ - Yamaha Aerox 155 Maxi Scooter YZF R15 V4 launched in India
close

Updated : 21/09/2021 22:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Yamaha Maxi Scooter: రూ.1.29 లక్షలతో యమహా కొత్త మ్యాక్సీ స్కూటర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ప్రముఖ వాహన తయారీ సంస్థ యమహా ఇండియా ఏరోక్స్‌ 155 అనే మరో కొత్త మ్యాక్సీ స్కూటర్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.29 లక్షలు(దిల్లీ, ఎక్స్‌షోరూం). ఈ నెలాఖరు కల్లా ఇవి షోరూంలకు చేరుకుంటాయి. రేసింగ్‌ బ్లూ, గ్రే వెర్మీలియన్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌లో 155 సీసీ, వేరియబుల్‌ వాల్వ్‌ యాక్చువేషన్‌ (వీవీఏ)తో కూడిన బ్లూ కోర్‌ ఇంజిన్‌ ఉంది. సీవీటీ ట్రాన్స్‌మిషన్‌, లిక్విడ్ కూల్డ్‌, 4 స్ట్రోక్ ఇంజిన్ ఫీచర్లు. 8000 ఆర్‌పీఎం వద్ద 15 పీఎస్‌ శక్తిని, 13.9 ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కంప్రెషన్‌ రేషియోను పెంచి కంబషన్‌ సామర్థ్యాన్ని పెంచేలా ఇంజిన్‌లో కొత్త సిలిండర్ హెడ్‌తో పాటు కాంపాక్ట్‌ కంబషన్‌ ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు. సింగిల్‌ ఛానల్‌ ఏబీఎస్‌, బ్లూటూత్‌ ఎనేబుల్డ్‌ యమహా మోటార్‌సైకిల్‌ కనెక్ట్‌ యాప్‌, 5.8 అంగుళాల ఎల్‌సీడీ క్లస్టర్‌, సీటు కింద 24.5 లీటర్‌ స్టోరేజీ సామర్థ్యం వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

సరికొత్త డిజైన్‌తో వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌15 వీ4.0 బైక్‌...

వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌15 వీ4.0 బైక్‌ను సరికొత్త డిజైన్‌తో యమహా ఈరోజు విడుదల చేసింది. దీంట్లో స్టాండర్డ్‌, ‘ఎం’ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరల శ్రేణి రూ.1,67,800- రూ.1,77,800 మధ్య ఉంది. మనుపటి వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌15తో పోలిస్తే ఈ కొత్త బైక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్ల డిజైన్ మారింది. స్టెప్‌ అప్ సీట్‌, ఎం ఆకారంలో ఎయిర్‌ డక్ట్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ వంటి కొత్త ఫీచర్లను పొందుపరిచారు. 155 సీసీ, సింగిల్‌ సిలిండర్‌, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. 18.3 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని