దీపావళికి టాటా మినీ ఎస్‌యూవీ పంచ్‌
close

Updated : 24/08/2021 08:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపావళికి టాటా మినీ ఎస్‌యూవీ పంచ్‌

దిల్లీ: పండగ సీజన్‌కు మినీ ఎస్‌యూవీ (స్పోర్ట్స్‌ వినియోగ వాహనం) పంచ్‌ను ఆవిష్కరించనున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. 2020 వాహన ప్రదర్శనలో టాటా మోటార్స్‌ చూపిన హెచ్‌2ఎక్స్‌ భావనతో ఈ వాహనాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపింది. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ నెక్సాన్‌ కంటే తక్కువ పరిమాణంలో ఉండే పంచ్‌ను దీపావళికి విపణిలోకి విడుదల చేస్తామని పేర్కొంది. ఎక్కడికైనా ప్రయాణించగలిగేలా, శక్తిమంతంగా పంచ్‌ను తీర్చిదిద్దుతున్నట్లు టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహన వ్యాపారాధిపతి శైలేష్‌ చంద్ర తెలిపారు. ఎస్‌యూవీ ప్రమాణాలతో, నగరంలో ప్రయాణించేందుకు అనువైన చిన్న వాహనంగా అభివర్ణించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని