ఓలా విద్యుత్తు స్కూటర్ల విక్రయాలు నేటి నుంచి
close

Updated : 08/09/2021 09:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓలా విద్యుత్తు స్కూటర్ల విక్రయాలు నేటి నుంచి

దిల్లీ: ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయాలను బుధవారం ప్రారంభిస్తోంది. ప్రపంచ విద్యుత్తు వాహనాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఓలా ఎస్‌1 స్కూటర్ల’ ను వినియోగదార్లకు విక్రయించడం మొదలు పెడుతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ మొబైలిటీ వెల్లడించింది. ఓలా ఎస్‌1 స్కూటర్‌ను రూ.2,999 ఈఎంఐ, ఓలా ఎస్‌1 ప్రో స్కూటర్‌ను రూ.3,199 ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చంది. దీనికోసం ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా కేపిటల్‌ తదితర బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఓలా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫైనాన్స్‌ అవసరం లేకపోతే ఓలా ఎస్‌1కు రూ.20,000, ఓలా ఎస్‌1 ప్రో స్కూటర్‌కు రూ.25,000 అడ్వాన్సుగా చెల్లిస్తే వాహనాన్ని పంపుతారు. స్కూటర్‌ వచ్చిన తర్వాత మిగిలిన సొమ్ము చెల్లించాలి. వచ్చే నెల నుంచి వాహనాలు వినియోగదార్లకు చేరతాయని కంపెనీ పేర్కొంది. ఆసక్తికల వినియోగదార్లకు ‘టెస్ట్‌ డ్రైవ్‌’ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వివరించింది. వాహన బీమా కోసం ఐసీఐసీఐ లాంబార్డ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేసింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని