హీరో ధరలు రూ.3,000 వరకు పెంపు
close

Updated : 17/09/2021 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హీరో ధరలు రూ.3,000 వరకు పెంపు

దిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దేశీయ దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్‌ తమ అన్ని మోడళ్ల ధరలను రూ.3,000 వరకు పెంచనున్నట్లు గురువారం వెల్లడించింది. ఈ నెల 20 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని పేర్కొంది. ముడి పదార్థాలు, కమొడిటీ ధరలు పెరిగిన నేపథ్యంలోనే వాహనాల ధరలు పెంచాల్సి వస్తోందని తెలిపింది. అన్ని మోడళ్ల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై రూ.3,000 వరకు ధర పెంచుతామని ప్రకటించిన కంపెనీ, ఏ మోడల్‌కు ఎంత పెంచేదీ వెల్లడించలేదు. మోడల్‌, మార్కెట్‌ ఆధారంగా పెంపు ఉంటుందని తెలిపింది. గత జనవరిలో రూ.1,500 వరకు, ఏప్రిల్‌లో రూ.2,500 వరకు కంపెనీ వాహనాల ధరలు పెంచిన సంగతి తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని