సెకనుకు 4 విద్యుత్తు స్కూటర్లు
close

Updated : 17/09/2021 09:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెకనుకు 4 విద్యుత్తు స్కూటర్లు

24 గంటల్లో రూ.600 కోట్ల అమ్మకాలు
విక్రయాల నిలిపివేత: ఓలా

దిల్లీ: ఓలా సంస్థ విద్యుత్తు స్కూటర్ల అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. ఆన్‌లైన్‌లో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు, 24 గంటల వ్యవధిలోనే రూ.600 కోట్లకు పైగా విలువైన విద్యుత్తు స్కూటర్లను విక్రయించినట్లు తెలిపింది. విలువ పరంగా చూస్తే ఒక రోజులో ద్విచక్ర వాహన పరిశ్రమ మొత్తం విక్రయాల కంటే ఇది ఎక్కువని పేర్కొంది. గరిష్ఠంగా సెకనుకు 4 స్కూటర్ల చొప్పున అమ్మినట్లు వెల్లడించింది. ఇంత భారీగా ఆర్డర్లు రావడంతో, గురువారం అర్ధరాత్రి నుంచి విక్రయ ప్రక్రియ నిలిపి వేస్తున్నట్లు ఓలా సహ వ్యవస్థాపకుడు భావిశ్‌ అగర్వాల్‌ తెలిపారు. తమ అంచనాలకు మించి స్పందన లభించిందని, రానున్న నెలల్లో ఉత్పత్తి ప్రణాళికను నిర్దేశించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

ఎస్‌ 1 (ధర రూ.99,999), ఎస్‌ 1 ప్రో  (రూ.1,29,999)లను ఆగస్టు 15న ఆవిష్కరించిన ఓలా, జులై నుంచే రూ.499తో ముందస్తు బుకింగ్‌కు అవకాశం కల్పించింది. అప్పుడు 24 గంటల్లో లక్షకు పైగా బుకింగ్‌లు వచ్చాయని తెలిపింది. ఓలా యాప్‌ ద్వారా ఈనెల 15 నుంచి రూ.20,000 చెల్లించి, కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని డెలివరీ సమయంలో చెల్లిస్తే సరిపోతుంది. వచ్చే నెలలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు డబ్బులు చెల్లించిన వారికి, ఎప్పుడు సరఫరా చేసేదీ 72 గంటల్లోగా వెల్లడించనుంది. ఏడాదికి 10 లక్షల స్కూటర్లను తయారు చేసే సామర్థ్యంతో ప్లాంటును సంస్థ తమిళనాడులో నిర్మిస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని