7 నుంచి ఎక్స్‌యూవీ700 బుకింగ్‌లు ప్రారంభం: ఎంఅండ్‌ఎం
close

Updated : 01/10/2021 09:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

7 నుంచి ఎక్స్‌యూవీ700 బుకింగ్‌లు ప్రారంభం: ఎంఅండ్‌ఎం

ముంబయి: ప్రీమియం స్పోర్ట్స్‌ వినియోగ వాహనం ఎక్స్‌యూవీ 700 బుకింగ్‌లను ఈ నెల 7 నుంచి ప్రారంభిస్తున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) వెల్లడించింది. డీజిల్‌, గ్యాసోలైన్‌ మాన్యువల్‌, ఆటోమేటిక్‌ విభాగాల్లో 5, 7 సీట్ల సామర్థ్యంతో ఈ వాహనం లభ్యమవుతుందని పేర్కొంది. ఆల్‌-వీల్‌-డ్రైవ్‌ (ఏడబ్ల్యూడీ) కూడా అందుబాటులో ఉంటుంది. ఎంఎక్స్‌ సిరీస్‌ (ఎంటీ, పెట్రోల్‌, 5 సీటర్‌) వాహనం రూ.11.99 లక్షల నుంచి ప్రారంభం కానుండగా, ఏఎక్స్‌ సిరీస్‌ (ఎంటీ, పెట్రోల్‌, 5 సీటర్‌) వాహనాలు రూ.13.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. తొలి 25,000 బుకింగ్‌లకు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయని పేర్కొంది.


మారుతీ సుజుకీ ‘ఎస్‌-అసిస్ట్‌’ యాప్‌

దిల్లీ: దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) గురువారం తమ వినియోగదార్ల కోసం ‘ఎస్‌-అసిస్ట్‌’ అనే వర్చువల్‌ కార్‌ అసిస్టెంట్‌ యాప్‌ను విడుదల చేసింది. కృత్రిమ మేధ ఆధారంగా ఇది పని చేస్తుందని, కార్లు కొనుగోలు చేసిన తర్వాత వినియోగదార్లకు ఇది సాయం చేస్తుందని కంపెనీ తెలిపింది. నెక్సా విక్రయ కేంద్రాల్లో కారు కొనుగోలు చేసిన వినియోగదార్లకు ఈ సదుపాయం ఉచితంగా లభిస్తుందని పేర్కొంది. స్మార్ట్‌ఫోన్లలో డు-ఇట్‌-యువర్‌సెల్ఫ్‌ వీడియోస్‌, డిజిటల్‌ లిటరేచర్‌, వర్క్‌షాప్‌ అసిస్టెన్స్‌ వంటి మల్టీమీడియా కంటెంట్‌ను ఈ యాప్‌ అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 4,120 మారుతీ సుజుకీ వర్క్‌షాప్‌ యాక్సెస్‌ కూడా కార్ల యజమానులకు లభిస్తుంది. దీంతో వారికి అనువైన సమయంలో దగ్గర్లోని వర్క్‌షాప్‌కు కార్లను తీసుకొచ్చి సేవలు పొందే సదుపాయం ఉంటుంది. ‘ఎస్‌-అసిస్ట్‌ వినియోగదార్లు తమ వాహనాలకు సర్వీసుల్ని బుక్‌ చేసుకోవడం సహా ఇంటి వద్దకే వచ్చి వాహనాలు తీసుకెళ్లడం, డెలివరీ చేయడం వంటి సదుపాయాలు పొందవచ్చ’ని ఎంఎస్‌ఐ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సర్వీస్‌ పార్థో బెనర్జీ వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని