టాటా మోటార్స్‌ ఎస్‌యూవీ పంచ్‌
close

Updated : 05/10/2021 08:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాటా మోటార్స్‌ ఎస్‌యూవీ పంచ్‌

దిల్లీ: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ సబ్‌-కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘పంచ్‌’ను సోమవారం ఆవిష్కరించింది. ఈ నెల 20న పంచ్‌ను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న విక్రయశాలలు, కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.21,000 చెల్లించి ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చని టాటా మోటార్స్‌ వెల్లడించింది. కంపెనీ కార్లలో నెక్సాన్‌ తర్వాతి స్థానంలో పంచ్‌ నిలవనుంది. 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ మోడల్‌ మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ల్లో లభిస్తుంది. టాల్‌ సీటింగ్‌, హై గ్రౌండ్‌ క్లియరెన్స్‌, 370ఎంఎం వాటార్‌ వేడింగ్‌ సామర్థ్యం, ట్రాక్షన్‌, 366 లీటర్ల బూట్‌ స్పేస్‌, హార్మన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వినియోగదారులు చిన్న ఎస్‌యూవీ, సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీల కోసం చూస్తున్నారని, అటువంటి వారికి పంచ్‌ మోడల్‌ నచ్చుతుందని టాటా మోటార్స్‌ ఉపాధ్యక్షుడు (అమ్మకాలు, మార్కెటింగ్‌) రాజన్‌ అంబ పేర్కొన్నారు. పంచ్‌ మోడల్‌ను కంపెనీ ఏజైల్‌ లైట్‌ ఫ్లెక్సిబుల్‌ అడ్వాన్స్‌డ్‌ (ఆల్ఫా) ఆకృతిపై రూపొందించారు. మార్కెట్‌లో గిరాకీని బట్టి.. విద్యుత్‌ వెర్షన్‌ను కూడా తీసుకొస్తామని రాజన్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని