మహీంద్రా కొత్త ఎక్స్‌యూవీ700
close

Updated : 06/10/2021 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహీంద్రా కొత్త ఎక్స్‌యూవీ700

ముంబయి: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎస్‌యూవీ మోడల్‌ ఎక్స్‌యూవీ700లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. ఏడు సీట్లు కలిగిన కొత్త ఎక్స్‌యూవీ700 డీజిల్‌ ఇంజిన్‌తో మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ సదుపాయాల్లో లభించనుంది. ఏఎక్స్‌7 లగ్జరీ ఎంటీ ధర రూ.19.99 లక్షలు, ఏఎక్స్‌7 లగ్జరీ ఏటీ+ఏడబ్ల్యూడీ (ఆల్‌-వీల్‌ డ్రైవ్‌) ధర రూ.22.89 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈనెల 7 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని, ప్రారంభ ధర మొదటి 25,000 బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. డెలివరీలను ఎప్పటి నుంచి ప్రారంభిస్తుందో మహీంద్రా ప్రకటించలేదు. కంపెనీ ఎక్స్‌యూవీ700ను రెండు సిరీస్‌- ఎంఎక్స్‌, అడ్రినోఎక్స్‌ (ఏఎక్స్‌)ల్లో విక్రయిస్తోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని