ఎంజీ ఆస్టర్‌ @ రూ.9.78-16.78లక్షలు
close

Updated : 12/10/2021 08:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంజీ ఆస్టర్‌ @ రూ.9.78-16.78లక్షలు

దిల్లీ: ఎంజీ మోటార్‌ ఇండియా మధ్యస్థాయి ఎస్‌యూవీ విభాగంలో ఆస్టర్‌ను విపణిలోకి సోమవారం విడుదల చేసింది. ఈ వాహన ధరలు రూ.9.78-16.78 లక్షలుగా (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ) నిర్ణయించింది.  ఇప్పటికే విపణిలో ఉన్న హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌, స్కోడా కుశాక్‌ వంటి మోడళ్లతో ఆస్టర్‌ పోటీ పడబోతోంది. వ్యక్తిగత కృత్రిమ మేధ సాయం, ఆటానమస్‌ (లెవెల్‌ 2) సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మోడల్‌ రూపొందింది. కంపెనీ అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌ జెడ్‌ఎస్‌పై ఈ వాహనాలు తయారయ్యాయి. 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌, 140 పీఎస్‌ పవర్‌, 220 టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో ఒక రకం, మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌, 8-స్పీడ్‌ సీవీటీ, 110 పీఎస్‌ పవర్‌, వీటీఐ టెక్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో మరో రకం  లభ్యమవుతున్నాయి. విక్రయ కేంద్రాలు, కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ నెల 21 నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయని ఎంజీ మోటార్‌ ఇండియా ప్రెసిడెంట్‌, ఎండీ రాజీవ్‌ ఛాబా వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని