Auto Sales: వాహన విక్రయాలకు చిప్‌సెట్‌ చెక్‌ - september Month Auto sales
close

Updated : 02/10/2021 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Auto Sales: వాహన విక్రయాలకు చిప్‌సెట్‌ చెక్‌

సెప్టెంబరులో ఉత్పత్తి తగ్గించిన దిగ్గజ సంస్థలు

దిల్లీ: వాహన టోకు విక్రయాలు సెప్టెంబరులో నిరాశపరిచాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెమీ కండక్టర్ల (చిప్‌సెట్‌) కొరతతో ఎలక్ట్రానిక్‌ పరికరాల సరఫరాపై ప్రభావం పడటంతో దేశీయ దిగ్గజ వాహన సంస్థలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా తమ ఉత్పత్తిలో కోత విధించాయి. విక్రయాలు తగ్గినట్లు కియా ఇండియా, హోండా కార్స్‌ కూడా ప్రకటించాయి. టాటా మోటార్స్‌, టయోటా కిర్లోస్కర్‌, ఎంజీ మోటార్‌, స్కోడా, నిస్సాన్‌ సంస్థలు మాత్రం సరఫరాలు పెరిగినట్లు వెల్లడించాయి. పండుగ సమయంలో గిరాకీ అధికంగానే ఉన్నా, ఎలక్ట్రానిక్‌ విడిభాగాల సరఫరా సవాళ్లు ఇబ్బంది పెడుతున్నాయని టాటామోటార్స్‌ పేర్కొంది.

మారుతీ సుజుకీ ఇండియా మొత్తం విక్రయాలు సెప్టెంబరులో 46 శాతం క్షీణించాయి. 2020 సెప్టెంబరులో సంస్థ 1,60,442 వాహనాలను విక్రయించగా గత నెలలో 86,380 వాహనాలనే అమ్మగలిగింది. దేశీయ విక్రయాలు 1,52,608 నుంచి 54.9 శాతం క్షీణించి 68,815 వాహనాలకు పరిమితమయ్యాయి. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్‌-ప్రెసో విక్రయాలు 27,246 వాహనాల నుంచి 45.18 శాతం క్షీణించి 14,936కు పరిమితమయ్యాయి. కాంపాక్ట్‌ విభాగంలో స్విఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ల విక్రయాలు  84,213 నుంచి 75.19 శాతం క్షీణతతో 20,891కు చేరాయి. ద్విచక్ర వాహనాల్లో బజాజ్‌ ఆటో విక్రయాలు 16 శాతం, సుజుకీ మోటార్‌ అమ్మకాలు 5 శాతం మేర క్షీణించగా, టీవీఎస్‌ మోటార్‌ విక్రయాలు 6 శాతం పెరిగాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని