close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నా పేరు కుమార్‌, మాది హైద‌రాబాద్‌, నేను రూ.10 ల‌క్ష‌ల రుణం తీసుకుని హైద‌రాబాద్‌లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేయాల‌నుకుంటున్నాను. రుణం తిరిగి చెల్లించేందుకు ఎంత కాల‌ప‌రిమితి ఉండాలి? 20 సంవ‌త్స‌రాల కాలవ్య‌వ‌ధి పెట్టుకోమ‌ని నా బ్ర‌ద‌ర్ సూచిస్తున్నారు. 20 సంవ‌త్స‌రాల‌కు వ‌డ్డీ స‌మానంగా విభ‌జిస్తార‌ని, ఒక‌వేళ రూ.5 ల‌క్ష‌లు ఒకేసారి చెల్లిస్తే భ‌విష్య‌త్తులో వ‌డ్డీ రాయితీ ఉంటుంద‌ని చెబుతున్నారు. అందువల్ల త‌క్కువ లేదా ఎక్కువ కాల‌ప‌రిమితుల‌లో ఏది మంచిది తెలుపగ‌ల‌రు.

Asked by A Kumar on
కాల‌ప‌రిమితి పెరిగితే, మీరు చెల్లించ‌వ‌ల‌సిన వ‌డ్డీ మొత్తం కూడా పెరుగుతుంది. ఉదాహ‌ర‌ణ‌కి: మీరు 15 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధితో రూ. 10 ల‌క్ష‌ల రుణం, 8.50 శాతం వ‌డ్డీతో తీసుకుంటే, చెల్లించ‌వ‌ల‌సిన ఈఎమ్ఐ నెల‌కు రూ.9,847. పూర్తి కాల‌ప‌రిమితికి చెల్లించే మొత్తం వ‌డ్డీ రూ.7.73 ల‌క్ష‌లు అదేవిధంగా కాల‌ప‌రిమితి 20 సంత్స‌రాలు అయితే ఈఎమ్ఐ రూ.8,680. మీరు చెల్లించే మొత్తం వ‌డ్డీ రూ.10.83 ల‌క్ష‌లు. ఒక‌వేళ మీరు ఎక్కువ మొత్తంలో తిరిగి చెల్లించినా, మీరు చెల్లించ‌వ‌ల‌సిన ఈఎమ్ఐలో మార్పు ఉండ‌దు. చెల్లించ‌వ‌ల‌సిన కాల‌వ్య‌వ‌ధిలో కొన్ని నెల‌లు త‌గ్గుతాయి. త‌ద్వారా వ‌డ్డీ భారం కొంత వ‌ర‌కు త‌గ్గుతుంది. ఒక వేళ మీరు 20 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి తీసుకుని, రెండు ఈఎమ్ఐల మ‌ధ్య వ్య‌త్యాసం రూ.1,167ను మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెడితే అద‌నంగా చెల్లించే వ‌డ్డీ మొత్తం రూ. 3.10 ల‌క్ష‌లు (రూ.10.83ల‌క్ష‌లు - రూ.7.73ల‌క్ష‌లు) 130నెల‌లు(11సంవ‌త్స‌రాల‌లో) తిరిగి పొంద‌వ‌చ్చు.

మరిన్ని

మీ ప్రశ్న