close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్‌, నా పేరు అమ‌ర్‌, నాకు హైద‌రాబాద్‌లో ఒక‌టి, బెంగుళూరులో మ‌రొక‌టి, మొత్తానికి రెండు ఇళ్ళు ఉన్న‌యి. మేము ప్ర‌స్తుతం బెంగుళూరులో ఉంటున్నాము. బ‌డ్జెట్ 2019-20 ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపు కోసం రెండు గృహ‌రుణాల‌ వ‌డ్డీని చూపించ‌వ‌చ్చా? ఒక‌వేళ అవును అయితే ఏ సెక్ష‌న్ కింద‌, ఏవిధంగా రెండ‌వ ఇంటిని చూపించాలి. నేను హైద‌రాబాద్‌లో ఉన్న ఇంటికి ( 8.25 శాతం వ‌డ్డీ రేటు చొప్పున‌) దాదాపు రూ.1 ల‌క్ష, బెంగుళూరులో ఉన్న ఇంటికి( 9.25 శాతం వ‌డ్డీ రేటు చొప్పున‌) దాదాపు 2.2 ల‌క్ష‌లు వ‌డ్డీ చెల్లిస్తున్నాను, హైద‌రాబాద్‌లో ఉన్న ఇంటిపై టాప్అప్‌లోన్ తీసుకుని, బెంగుళూరులో ఉన్న ఇంటిపై రుణం చెల్లించ‌డం మంచిదేనా? తెలుప‌గ‌ల‌రు.

Asked by Amar on
ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 24బీ ప్ర‌కారం రెండు గృహ రుణాల‌ వ‌డ్డీపై మిన‌హాయింపు ప‌రిధి రూ. 2 లక్షలు. 2018-19 ఆర్ధిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్ లో బెంగుళూరు ఇంటిని అద్దెకు ఇచ్చి (నోష‌న‌ల్ రెంట్‌ నెల‌కు రూ. 15 వేలు చూపించవచ్చు), హైద‌రాబాద్ ఇంటిలో మీరు ఉంటున్న‌ట్లు చూపిస్తే, సెక్ష‌న్ 24బీ ప్ర‌కారం దాదాపుగా రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను ఇటివ‌ల ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో ఆర్థిక మంత్రి రెండ‌వ ఇంటిపై వ‌చ్చే నోష‌న‌ల్ రెంట్‌(అద్దె అంచ‌నా) ఆదాయంపై ప‌న్ను మిన‌హాయింపును ప్ర‌తిపాదించారు. అంటే, వచ్చే ఏడాది నుంచి మీకు రెండు ఇళ్ళు ఉంటే, ఇప్పటి లాగా కాకుండా రెండిళ్ళ లోను నివసిస్తున్నట్టుగా చూపించవచ్చు. సెక్షన్ 24b ప్రకారం పన్ను మినహాయింపు లో మార్పు లేదు. టాప్అప్ లోను తీసుకోవ‌డం మంచిదికాదు. ప్ర‌స్తుతం ఉన్న రుణంపై టాప్‌లోను తీసుకుంటే, ప్ర‌స్తుతం మీరు చెల్లించే వ‌డ్డీరేటుకు 1-1.50 శాతం అధిక వ‌డ్డీ రేటును విధిస్తారు. వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్ ఫీజు అద‌నంగా ఉంటుంది. అలాగే, మీరు త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌తో గృహ రుణాన్ని అందిస్తున్న వేరే బ్యాంకుకు గృహ రుణాన్ని బ‌దిలీ చేసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజుల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవాలి.

మరిన్ని

మీ ప్రశ్న