close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share

నా వద్ద జీవన్ సరళ్ పాలసీ ఉంది, 2010 నుంచి రూ. 30,025  ప్రీమియం చెల్లించాను.  సరెండర్ చేస్తే ఎంత వస్తుంది?

Asked by K SOMANARSAIAH on
మీరు చెల్లించిన ప్రీమియం వార్షిక ప్రీమియం ఆ లేక పూర్తి ప్రీమియం ఆ అనేది తెలుపలేదు. సాధారణంగా, ఈ పాలసీ సరెండర్ చేసినట్టయితే గారంటీడ్ సరెండర్ వేల్యూ ప్రకారం మీరు చెల్లించిన ప్రీమియం లో (మొదటి ఏడాది ప్రీమియం మినహాయించి) 30 శాతం వరకు వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, స్పెషల్ సరెండర్ వేల్యూ ప్రకారం 5 ఏళ్ళ పైన ప్రీమియం చెల్లించినట్టైతే  మీ పాలసీ లో తెలిపిన మెచ్యూరిటీ సమ్ ఎషూర్డ్ లో 100 శాతం వరకు వెనక్కి పొందొచ్చు.  మరిన్ని వివరాల కోసం మీరు మీ పాలసీ లో తెలిపిన ఎల్ఐసి ఆఫీసు బ్రాంచీ ని సంప్రదించడం మంచిది.   మీరు ఈ పాలసీ సరెండర్ చేయడం మంచి నిర్ణయమే. అయితే, పాలసీ మెచ్యూరిటీ కాల పరిమితి దగ్గర పడినట్టయితే (1-3 ఏళ్ళ లోపు ఉన్నట్టయితే)  వేచి చూడవచ్చు.  ఇలాంటి పాలసీల లో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువగానే ఉంటాయి. బీమా హామీ కోసం ఒక మంచి ఆన్లైన్ టర్మ్ పాలసీ ఎంచుకోవడం మేలు. పెట్టుబడి కోసం మీ అవసరాన్ని బట్టి పధకం ఎంచుకోవచ్చు.

మరిన్ని

మీ ప్రశ్న