close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share

డియర్ సిరీ! నేను ప్రస్తుతం క్రింద పేర్కొన్న ఫండ్స్ లో ప్రతినెలా 8000/- (ఒక్కో ఫండ్ లో రూ.1000/- చొప్పున) SIP చేస్తున్నాను. 1. Axis midcap fund 2. DSP world gold fund 3. Edelweiss Greater china equity offshore fund 4. ICICI Pru US bluechip equity fund 5. IDFC G-Sec fund constant maturity plan 6. IDFC Nifty fund 7. Mirae Asset emerging blue chip fund 8. Nippon india nifty smallcap 250 index fund ఈ పోర్ట్ ఫోలియో లో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే సూచించగలరు.

Asked by సరికొండ ప్రసన్నాంజనేయ రాజు on
 మీరు వివిధ రకాల క్యాటగిరి లో ని  8 ఫండ్స్ లో మదుపు చేస్తున్నారు. అధిక ఫండ్స్ లో మదుపు చేయడం వల్ల ప్రత్యేకమైన లాభం ఉండదు. పైగా, వాటిని ట్రాక్ చేయడం కూడా కాస్త కష్టమైన విషయమే. మీరు IDFC Nifty ఫండ్, Axis మిడ్క్యాప్ ఫండ్ లో కొనసాగవచ్చు. ఈ ఫండ్స్ లో రూ. 4000 చొప్పున సిప్ చేయవచ్చు. కనీసం 10 ఏళ్ళ పాటు సిప్ చేస్తేనే రిస్క్ తగ్గి, మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది.  నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న