నమస్తే సర్, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. నెలసరి జీతం రూ. 12 వేలలో రూ. 7800 ఖర్చులు పోనీ మిగతా మొత్తని పొదుపు చేయాలనుకుంటున్నాను. సలహా ఇవ్వండి.
Asked by
on మరిన్ని
-
ఆరేళ్ల క్రితం ఒక యూనిట్ ఆధారిత బీమా పాలసీ (యులిప్) తీసుకున్నాను. ఏడాదికి రూ.80వేల ప్రీమియం చెల్లిస్తున్నాను. దీన్ని ఇప్పుడు రద్దు చేసుకోవచ్చా? దీనికి బదులుగా నెలనెలా ఏదైనా పెట్టుబడి పెట్టేందుకు ప్రత్యామ్నాయ పథకాలను సూచించండి?
సాధారణంగా యూనిట్ ఆధారిత బీమా పాలసీలకు అయిదేళ్ల లాకిన్ వ్యవధి ఉంటుంది. మీరు పాలసీ తీసుకొని, ఆరేళ్లు అయ్యింది కాబట్టి, ఎలాంటి రుసుములు లేకుండానే పాలసీని రద్దు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పెట్టుబడి కోసం ఈక్విటీ ఫండ్లను ఎంచుకుంటే.. ఇప్పుడు మార్కెట్ తక్కువగా ఉంది కాబట్టి, లాభం తక్కువగా ఉండొచ్చు. మార్కెట్ పూర్తిగా కోలుకునే దాకా వేచి చూడండి. ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. డబ్బుతో అవసరం లేకపోతే.. రెండుమూడేళ్లు ఆగి తీసుకోండి. ముందుగా తగినంత మొత్తానికి బీమా తీసుకోండి. పెట్టుబడి కోసం హైబ్రీడ్ ఈక్విటీ ఫండ్లను పరిశీలించండి.
-
నా వయసు 48. ప్రైవేటు ఉద్యోగిని. జీతం రూ.లక్ష. నెలకు సుమారు రూ.20 వేలు వివిధ పథకాల్లో మదుపు చేస్తున్నాను. దీనికి పీఎఫ్ అదనం. 58 ఏట నుంచి నెలకు రూ. లక్ష (పన్ను లేకుండా) రావాలంటే నా దగ్గర ఎంత మొత్తం ఉండాలి? దీనికోసం ఏం చేయాలి?
మీరు సుమారు 20 శాతం పన్ను శ్లాబులో ఉంటారని అనుకుందాం. అప్పుడు పన్ను తర్వాత మీకు నెలకు రూ.లక్ష అందాలంటే.. వార్షిక ఆదాయం రూ.15లక్షల వరకూ ఉండాలి. అప్పుడు రూ.3లక్షలు పన్ను పోను, నెలకు రూ.లక్ష చొప్పున అందుకోవచ్చు. మీ దగ్గర ఉన్న డబ్బు 6శాతం రాబడిని ఆర్జించేలా చూసుకుంటే.. పదేళ్ల తర్వాత రూ.2.5 కోట్ల నిధి ఉంటేనే ఇది సాధ్యం. 8 శాతం రాబడిచ్చే పథకాల్లో మదుపు చేస్తే రూ.1.87 కోట్లు అవసరం. ఇప్పటికే మీ దగ్గర ఎంత మొత్తం జమ అయ్యిందనే వివరాలు లేవు. ఇప్పటి నుంచి పదేళ్లలో రూ.2.5 కోట్లు జమ చేయాలంటే.. నెలకు రూ.125,000 మదుపు చేయాలి. రూ.1.87 కోట్లు కావాలంటే.. నెలకు రూ.93,500 కావాలి. ఈ పెట్టుబడిని 11 శాతం రాబడినిచ్చే పథకాలకు మళ్లించాలి. ఇప్పటికే మీ పీఎఫ్‌లో మంచి మొత్తం జమ అయి ఉంటుంది. పదవీ విరమణ నాటికి ఇది మరింత పెరుగుతుంది. కాబట్టి, ఇప్పుడు మీరు చేస్తున్న రూ.20 వేల పెట్టుబడిని మీ మిగులు మొత్తాన్ని బట్టి, పెంచుకునే ప్రయత్నం చేయండి. రిటైర్ అయ్యాక మొత్తం డబ్బును అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మదుపు చేసి, నెలనెలా రాబడిని అందుకునే ఏర్పాటు చేసుకోవచ్చు.
-
మా అబ్బాయి కి ఇప్పుడు 4 ఏళ్ళు. తన భవిష్యత్తు కోసం రూ. 5 వేలు మదుపు చేయడానికి మంచి పధకం సూచించండి.
దీర్ఘకాలం కోసం మదుపు చేస్తున్న వారు మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో కొంత రిస్క్ ఉంటుంది, దీర్ఘకాలం లో అది తగ్గుతూ ఉంటుంది. పూర్తిగా రిస్క్ లేని పధకం ఎంచుకోవాలంటే పీపీఎఫ్ మేలు.
-
ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.21వేలు వస్తున్నాయి. ఇందులో నుంచి కనీసం రూ.10వేల వరకూ పెట్టుబడి పెట్టేందుకు, నా ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది? రూ.25 లక్షల టర్మ్ పాలసీ తీసుకుంటే సరిపోతుందా?
వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల టర్మ్ పాలసీ తీసుకోవడం ఎప్పుడూ మంచిది. మీరు రూ.30లక్షల వరకూ విలువైన పాలసీని తీసుకోవచ్చు. అలాగే కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా ఉంచుకోండి. వ్యక్తిగతంగా ఆరోగ్య, ప్రమాద, డిజేబిలిటీ బీమా పాలసీలను తీసుకోవడం మర్చిపోవద్దు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.10వేలను డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేయండి. కనీసం అయిదారేళ్లకు మించి పెట్టుబడిని కొనసాగించండి.
-
నేను మ్యూచువల్ ఫండ్లలో నెలకు రూ.8వేలు మదుపు చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా మరో రూ.5వేలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఇప్పటికే ఫండ్లలో మదుపు చేస్తున్నా కాబట్టి, ఈ మొత్తాన్ని ఏదైనా సురక్షిత పథకంలో పెట్టుబడి పెట్టాలా?
పెట్టుబడులు ఎప్పుడూ మిశ్రమంగా ఉండాలి. నష్టభయం ఉన్నప్పటికీ అధిక రాబడిని ఆర్జించే వాటితో పాటు, సురక్షిత పథకాలనూ ఎంచుకోవాలి. అప్పుడే మీ పెట్టుబడి వృద్ధి చెందుతుంది. మీరు ఇప్పటికే మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తున్నారు కాబట్టి, రూ.5వేలను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో జమ చేయండి. ప్రస్తుతం ఇందులో 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. వచ్చిన రాబడిపై ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కోసం క్లెయిం చేసుకోవచ్చు.
-
హాయ్ సర్, యాన్నుయిటీ పధకాల గురించి తెలుపండి. నేను పొలం అమ్మి ఇందులో రూ. 50 లక్షలు మదుపు చేయాలనుకుంటున్నాను. నెలకి రూ. 25 వేలు చొప్పున పొందితే సిప్ చేయాలనే ఆలోచన ఉంది.
మీరు పేర్కొన్న యాన్నుయిటీ పథకాల్లో అధిక చార్జీలు ఉంటాయి. ప్రీమియం కూడా ఎక్కువ ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది. వీటి నుంచి దూరంగా ఉండడం మంచిది. పదవీ విరమణ తీసుకున్న వారు సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పధకం, ఎల్ఐసి వయ వందన యోజన లాంటి వాటిలో కొంత మొత్తాన్ని మదుపు చేయవచ్చు. మిగిలిన వారు ఫిక్సిడ్ డిపాజిట్ లో మదుపు చేసి నెల నెలా పెన్షన్ పొందొచ్చు.
-
మా అమ్మాయి కోసం బంగారం జమ చేయాలని అనుకుంటున్నాం. దీనికోసం నెలకు రూ.15వేల వరకూ కేటాయించాలని ఆలోచన. ఏ పథకాలను ఎంచుకోవాలి?
బంగారాన్ని జమ చేసేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి గోల్డ్ ఈటీఎఫ్.. ఇందులో ఒక యూనిట్ విలువ ఒక గ్రాము బంగారానికి దాదాపు సమానంగా ఉంటుంది. వీటిలో మదుపు చేసేందుకు డీమ్యాట్ ఖాతా అవసరం. మరో మార్గం.. గోల్డ్ ఫండ్లు. ఇందులో మీ వీలును బట్టి, పెట్టుబడి పెట్టొచ్చు. డీమ్యాట్ ఖాతాతో అవసరం లేదు. ఈ రెండింటిలో మీకు అనుకూలమైన పథకాలను ఎంచుకోండి. అవసరమైనప్పుడు పెట్టుబడిని వెనక్కి తీసుకొని బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఏడెనిమిదేళ్ల వ్యవధి ఉంటే.. ప్రత్యామ్నాయంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసే అంశాన్నీ పరిశీలించండి. దీనివల్ల కాస్త ఎక్కువ రాబడి వచ్చేందుకు అవకాశాలున్నాయి
-
మా నాన్న మరణించడంతో బీమా డబ్బు రూ.5లక్షలు వచ్చాయి. వీటిని మా అమ్మ పేరుమీద మదుపు చేసి, నెలనెలా ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. తన వయసు 53. కనీసం రూ.4 వేల వరకూ రావాలంటే ఎంత మొత్తం మదుపు చేయాల్సి ఉంటుంది?
ప్రస్తుతం పెట్టుబడులపై వడ్డీ రేట్లు అంత అధికంగా లేవు. కానీ, రానున్న ఆరు నెలల్లో ఇవి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీంను పరిశీలించవచ్చు. ఇందులో రూ.4.5లక్షల వరకూ జమ చేసుకునే వీలుంది. ప్రస్తుతం 6.6శాతం వడ్డీ లభిస్తోంది. కాబట్టి, నెలకు రూ.2,475 వరకూ వస్తాయి. మిగతా మొత్తం కోసం నాన్ క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్లలో రూ.2.75 లక్షల వరకూ జమ చేయాలి. ఆరు నెలల తరువాత ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయండి. అప్పుడు మీరనుకున్నట్లు రూ.4వేలు వస్తాయి.
-
ఒకే ఆర్ధిక సంవత్సరం లో రెండు కంపెనీల్లో ఉద్యోగం చేస్తే ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలి?
మీరు రెండు కంపెనీల నుంచి ఫారం 16 తీసుకుని వీటితో ఐటీఆర్ ఫైల్ చేసే వీలుంటుంది. ఈ రెండింటి ఆదాయాన్ని లెక్కించి వార్షిక ఆదాయంగా పరిగణిస్తారు. స్లాబు ని బట్టి మీ పూర్తి పన్ను లెక్కిస్తారు. మీరు మీ సంస్థలకి చెల్లించిన పన్ను తక్కువ ఉన్నట్టయితే అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు ఎక్కువ చెల్లించినట్టైతే, రిఫండ్ పొందొచ్చు.
-
మాకు ఇటీవలే పాప పుట్టింది. తన స్కూలు ఫీజుకు ఇబ్బంది లేకుండా.. ఇప్పటి నుంచే నెలకు రూ.10వేల వరకూ జమ చేయాలని అనుకుంటున్నాను. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?
ముందుగా మీ పాప భవిష్యత్ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. ఇందుకోసం మీ పేరుపై తగిన మొత్తానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ పాప మూడేళ్ల తరువాత స్కూలుకు వెళ్తుందనుకుందాం. అమ్మాయికి కనీసం ఏడేళ్లు వచ్చేదాకా పెట్టుబడిని కొనసాగించండి. చిన్న తరగతుల్లో ఉన్నప్పుడు మీ చేతిలో ఉన్న డబ్బులోంచే ఫీజు చెల్లించే ప్రయత్నం చేయండి. నెలకు రూ.10వేల చొప్పున ఏడేళ్లపాటు మదుపు చేస్తే.. సగటున 12 శాతం రాబడితో దాదాపు రూ.12,10,000 జమ అయ్యేందుకు వీలుంది. పెట్టుబడి కోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఏడేళ్ల అనంతరం ఈ మొత్తాన్ని నష్టభయం తక్కువగా ఉన్న పథకాల్లోకి మళ్లించొచ్చు. 8 శాతం రాబడితో.. ఏడాదికి రూ.96వేల వరకూ అందుతాయి. ఈ మొత్తాన్ని అమ్మాయి చదువుకు ఉపయోగించుకోవచ్చు.
-
సొంతిల్లు కొనేందుకు బ్యాంకు నుంచి ఇటీవలే రూ.30 లక్షల రుణం తీసుకున్నాను. వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని తొందరగా తీర్చేయాలని ఆలోచిస్తున్నాను. ఇది మంచి ఆలోచనేనా?
ఇప్పుడు వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో ఇవి ఇంకా పెరిగేందుకు ఆస్కారం ఉంది. సెక్షన్ 24 కింద గృహరుణంపై చెల్లించే వడ్డీకి రూ.2లక్షల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. మీ దగ్గర డబ్బు ఉంటే.. ప్రస్తుతం ఉన్న రుణంలో రూ.5 లక్షలు తీర్చేయండి. దీనివల్ల మీ గృహరుణం రూ.25 లక్షలు అవుతుంది. దీనిపై చెల్లించే వడ్డీకి దాదాపు పూర్తి మినహాయింపు వర్తిస్తుంది.
-
నా వయసు 80 ఏళ్ళు. నాకు రూ. 8 లక్షల వరకు పెన్షన్ వస్తుంది. ఈ మొత్తాన్ని నేను ఎఫ్డీ చేస్తే, ఫారం 15H అందించి టీడీఎస్ లేకుండా చేసుకోవచ్చా?
80 ఏళ్ళు పై బడిన వారికి రూ. 5 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను వర్తించదు. మీ పెన్షన్ మొత్తం అంతకు మించి ఉన్నందున బ్యాంకు మీ నుంచి ఫారం 15h స్వీకరించకపోవచ్చు. అయితే, ఏడాదికి మీ ఎఫ్డీ వడ్డీ మొత్తం రూ. 50 వేల వరకు ఉన్నట్టయితే, దానికి టీడీఎస్ ఉండదు. ఒకవేళ మీరు ఇతర మినహాయింపులు ఉన్నట్టయితే ఈ విషయాన్నీ ఐటీఆర్ ఫైలింగ్ లో తెలిపి మిగిలిన పన్ను మొత్తాన్ని రిఫండ్ పొందొచ్చు.
-
హాయ్, నేను 5 ఏళ్ళ పాటు నెల నెలా రూ. 15-20 వేలు మదుపు చేద్దామనుకుంటున్నాను. మంచి రాబడి అందించే పధకాలు తెలియజేయండి. నాకు రూ. 35 లక్షల ఇంటి రుణం ఉంది.
5 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి నెలా రూ. 25 వేలు మదుపు చేస్తే, 10 శాతం సగటు రాబడి ప్రకారం సుమారుగా రూ. 20 లక్షల వరకు సమకూర్చుకోవచ్చు. మీరు మీ ఇంటి రుణాన్ని కొనసాగించడం మంచిది. ఇందులో మీకు సెక్షన్ 80C, 24b ద్వారా పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. మీ వీలు ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలం పాటు మదుపు చేయండి. మీ ఇతర లక్ష్యాల కోసం ఈ నిధి ఉపయోగ పడుతుంది. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
ఆదాయపు పన్ను మినహాయింపు కోసం జీవిత బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏడాదికి రూ.50వేల వరకూ ప్రీమియం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుంది?
వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఉండాలి. దీనికోసం టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవచ్చు. దీనికి ప్రీమియం తక్కువగా ఉంటుంది. మీరు చెల్లించే ప్రీమియానికి ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. రూ.50వేలలో టర్మ్ పాలసీకి ప్రీమియం చెల్లించాక మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో (ఈఎల్ఎస్ఎస్) మదుపు చేయొచ్చు. ఈ పెట్టుబడులకూ సెక్షన్ 80సీ పరిమితి మేరకు మినహాయింపు పొందవచ్చు. వీటికి మూడేళ్ల లాకిన్ ఉంటుంది. నష్టభయం ఉన్నప్పటికీ.. కాస్త అధిక రాబడికి అవకాశముంది.
-
నెలకు రూ.10వేల వరకూ పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. మా అమ్మాయి వయసు 14. మరో 10 ఏళ్లకు ఈ డబ్బు తన అవసరాలకు ఉపయోగపడాలి. ఎలాంటి పెట్టుబడి పథకాలు ఎంచుకోవాలి?
ముందుగా మీ అమ్మాయి భవిష్యత్ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. ఇందుకోసం కుటుంబ పెద్ద పేరుమీద తగినంత జీవిత బీమా పాలసీ తీసుకోండి. నెలకు రూ.10వేల చొప్పున 10 ఏళ్లపాటు మదుపు చేస్తే.. సగటున 12 శాతం రాబడి అంచనాతో.. రూ.21,05,848 అయ్యేందుకు అవకాశం ఉంది. డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకొని, మదుపు కొనసాగించండి.
-
మరో రెండేళ్లలో పదవీ విరమణ చేస్తాను. ఆ తరువాత నుంచి నాకు నెలకు రూ.20వేలు పింఛను వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలనేది ఆలోచన. దీనికోసం నేను ఎంత మొత్తాన్ని కేటాయించాల్సి ఉంటుంది. నేను పనిచేస్తున్న సంస్థ ఆరోగ్య బీమాను అందిస్తోంది. సొంతంగా మరో పాలసీ తీసుకోవాలా?
నెలకు రూ.20వేలు పింఛను రూపంలో రావాలంటే.. ఈ రెండేళ్లలో మీరు రూ.34,30,000 వరకూ జమ చేయాలి. అప్పుడు కనీసం 7 శాతం రాబడి ఆర్జించే పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తే.. మీరనుకుంటున్న మొత్తం సులభంగా చేతికందుతుంది. పదవీ విరమణ చేసిన అనంతరం యాజమాన్యం ఇచ్చే ఆరోగ్య బీమా కొనసాగకపోవచ్చు. కాబట్టి, మీరు ఇప్పుడే సొంతంగా ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం మేలు. బీమా దరఖాస్తు పత్రంలో మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే తెలియజేయండి. అవసరమైతే వైద్య పరీక్షలూ చేయించుకోండి.
-
ఇల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నాం. గృహరుణం రూ.27 లక్షల వరకూ వస్తోంది. నాకు రూ.20 లక్షలు చాలు. మొత్తం రుణం తీసుకొని, మిగతా రూ.7 లక్షలను ఎక్కడైనా మదుపు చేస్తే లాభమేనా?
పెట్టుబడుల కోసం సొంత డబ్బును మాత్రమే వినియోగించాలి. అప్పు చేసి మదుపు చేయడం ప్రమాదకరం. ప్రస్తుతం మన దేశంలో గృహరుణాలు 6-7 శాతం మధ్య ఉన్నాయి. వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. మీ పెట్టుబడులు మీరు చెల్లించే వడ్డీకి మించి రాబడిని ఆర్జించాలి. అన్ని వేళలా ఇది సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి, ముందుగా మీరు రూ.20లక్షల రుణానికి ఎంత ఈఎంఐ చెల్లించాలో చూడండి. రూ.27 లక్షల రుణం తీసుకుంటే వాయిదా మొత్తం ఎంతో తెలుసుకోండి. రుణం రూ.20లక్షలు తీసుకోండి. రూ.27 లక్షలకు ఈఎంఐ చెల్లిస్తున్నట్లుగా భావించి, ఆ వ్యత్యాసాన్ని పెట్టుబడులకు మళ్లించండి.
-
ఇటీవలే వివాహం అయ్యింది. నా ఖర్చులు పోను రూ.15వేల వరకూ మిగులుతాయి. ఈ మొత్తాన్ని నాలుగైదేళ్ల వరకూ పొదుపు చేయాలని అనుకుంటున్నాను. మంచి రాబడి వచ్చేలా ఎక్కడ జమ చేయాలి?
ముందుగా మీరు మూడు నుంచి ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని సిద్ధం చేసుకోండి. పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని బ్యాలెన్స్డ్ అడ్వాంటేజీ ఫండ్లలో ఎస్ఐపీ ద్వారా మదుపు చేయండి. ఇందులో కాస్త నష్టభయం ఉండొచ్చు. అయిదేళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తే.. 8-9 శాతం వరకూ రాబడి వచ్చే అవకాశం ఉంది.
-
మూడేళ్ల నుంచి పీపీఎఫ్‌లో నెలకు రూ.5వేలు జమ చేస్తున్నాను. దీనికి బదులుగా అధిక వడ్డీ వచ్చేలా ఏవైనా ఇతర పథకాలను ఎంచుకోవచ్చా? మరో రూ.5,000 అదనంగా మదుపు చేస్తాను. 15 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం అయ్యేందుకు అవకాశం ఉంది?
ఇప్పుడున్న సురక్షిత పథకాల్లో అధిక రాబడినిచ్చేది ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్). దీనికి చెల్లించిన మొత్తానికి సెక్షన్ 80సీ మినహాయింపు వర్తిస్తుంది. వచ్చిన వడ్డీకి సైతం పన్ను ఉండదు. కాబట్టి, ఈ పెట్టుబడిని కొనసాగించండి. కొత్తగా మదుపు చేయాలనుకుంటున్న రూ.5వేలను డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయండి. నెలకు రూ.5వేల చొప్పున ఫండ్లలో 15 ఏళ్లపాటు కొనసాగిస్తే.. 12 శాతం రాబడి అంచనాతో.. రూ.22,36,782 అయ్యేందుకు వీలుంది. పీపీఎఫ్‌లో 15 ఏళ్లపాటు నెలకు రూ.5వేలు జమ చేస్తే.. 7.1శాతం వడ్డీ లెక్కన రూ.15,19,405 జమ అవుతాయి.
-
ఇటీవలే వివాహం అయ్యింది. నా ఖర్చులు పోను రూ.15వేల వరకూ మిగులుతాయి. ఈ మొత్తాన్ని నాలుగైదేళ్ల వరకూ పొదుపు చేయాలని అనుకుంటున్నాను. మంచి రాబడి వచ్చేలా ఎక్కడ జమ చేయాలి?
ముందుగా మీరు మూడు నుంచి ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని సిద్ధం చేసుకోండి. మీరు ఎంచుకున్న కాలానికి రిస్క్ లేని బ్యాంకు రికరింగ్ డిపాజిట్ లాంటి పథకాల్లో మదుపు చేయవచ్చు. 7-10 ఏళ్ళ పాటు మదుపు చేయాలనుకుంటే సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. ఇందులో కాస్త నష్టభయం ఉండొచ్చు. దీర్ఘకాలం లో రిస్క్ తగ్గుతుంది, మంచి రాబడి కూడా పొందొచ్చు.
-
హాయ్ సర్, నా వయసు 39. మా అబ్బాయి వయసు 3.5 ఏళ్ళు. తన కోసం నెలకి రూ. 10 వేలు పిల్లల పథకాల్లో మదుపు చేయాలనుకుంటున్నాను. టాటా కాపిటల్ గ్యారంటీ పధకం, హెచ్డీఎఫ్సీ లైఫ్ పధకాల గురించి చెప్పండి.
మీరు ఎంచుకున్న పథకాల్లో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. ఇందులో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇలాంటి ఎండోమెంట్, మనీ బ్యాక్, హోల్ లైఫ్ లాంటి వాటి నుంచి దూరంగా ఉండడం మంచిది. బీమా హామీ కోసం ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం రిస్క్ లేని పీపీఎఫ్ ఎంచుకోవచ్చు. ఇది 15 ఏళ్ళ పధకం, పూర్తిగా సురక్షితమైనది. కొంత రిస్క్ తీసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎంచుకోవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నా నెలసరి ఆదాయం రూ. 45 వేలు. నా వద్ద రూ. 50 లక్షల మాక్స్ లైఫ్ టర్మ్ ప్లాన్ ఉంది, మరో రూ. 50 లక్షల పాలసీ తీసుకోవడం మంచిదా? లేక ప్రీమియం మొత్తాన్ని సుకన్య సమృద్ధి యోజన లో మదుపు చేయవచ్చా? సలహా ఇవ్వండి.
మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. మీ వద్ద ఇప్పటికే రూ. 50 లక్ష టర్మ్ ప్లాన్ ఉంది కాబట్టి మరో రూ. 15-25 లక్షల బీమా హామీ తో పాలసీ తీసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన మంచి పధకం. ఇందులో మదుపు చేస్తూ ఉండండి.
-
మా అమ్మాయి పేరుమీద సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ.5వేలు జమ చేస్తున్నాం. మరో రూ.5వేలను పెట్టుబడి పెట్టేందుకు ఏ పథకం ఎంచుకోవాలి? యూనిట్ ఆధారిత బీమా పథకం (యులిప్) తీసుకోవడం లాభమేనా?
మీరు ఇప్పటికే ప్రభుత్వ హామీ ఉన్న సుకన్య సమృద్ధిలో జమ చేస్తున్నారు. కాబట్టి, అదనంగా మదుపు చేయాలనుకుంటున్న మొత్తాన్ని హైబ్రీడ్ ఈక్విటీ పథకాలకు కేటాయించండి. యులిప్‌లలో ఛార్జీలు కాస్త అధికంగా ఉంటాయి. అయిదేళ్ల లాకిన్ వ్యవధి ఉంటుంది. ఇక హైబ్రీడ్ ఫండ్లలో నెలకు రూ.5వేల చొప్పున 15 ఏళ్లపాటు జమ చేస్తే.. కనీసం 11 శాతం రాబడి అంచనాతో రూ.20,64,321 అయ్యేందుకు వీలుంటుంది.
-
నా వయసు 43. పదవీ విరమణ ప్రణాళికల కోసం నెలకు రూ.8వేల వరకూ కేటాయించాలనుకుంటున్నాను. బీమా సంస్థల్లో యాన్యుటీ పాలసీలు మంచివేనా? మ్యూచువల్ ఫండ్లలోనూ రిటైర్మెంట్ ఫండ్లు ఉన్నాయి కదా.. రెండింటిలో ఏవి మేలు?
బీమా సంస్థలు అందించే యాన్యుటీ పాలసీలు సురక్షితంగా ఉంటాయి. ఇవి రెండు రకాలు. ఒకేసారి కొంత మొత్తం మదుపు చేసినప్పుడు వెంటనే పింఛను ఇచ్చేవి ఇమ్మీడియట్ యాన్యుటీ పథకాలు. ఇలా కాకుండా ఏటా ప్రీమియం చెల్లిస్తూ.. నిర్ణీత వ్యవధి తర్వాత పింఛను అందించేవి డిఫర్డ్ యాన్యుటీ పాలసీలు. మీరు డిఫర్డ్ యాన్యుటీలను ఎంచుకోవచ్చు. సాధారణంగా యాన్యుటీ పథకాల్లో వచ్చే రాబడి ఫిక్స్డ్ డిపాజిట్లకు దరిదాపుల్లో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లలోనూ రిటైర్మెంట్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈక్విటీ ఆధారిత పథకాలు కాబట్టి, స్వల్పకాలంలో నష్టభయం ఉంటుంది. దీర్ఘకాలంలో మంచి రాబడిని ఆశించవచ్చు. యాన్యుటీలతో పోల్చి చూసినప్పుడు మ్యూచువల్ ఫండ్లతోనే అధిక రాబడి అందుకునే వీలుంటుంది.
-
హాయ్ సిరి, నా పేరు శంకర్. నేను మీ కధనాలు చదువుతుంటాను. నేను మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తున్నాను. ఈ ఫండ్స్ మదుపు చేసిన షేర్స్ లో డివిడెండ్స్ వస్తే ఆ మొత్తాన్ని ఫండ్ నిర్వహించే సంస్థలు తీసుకుంటాయా? లేదా ఫండ్ లో మదుపు చేసిన ఇన్వెస్టర్ల కి ఇస్తారా? తెలుపగరు.
మ్యూచువల్ ఫండ్స్ లో రెండు రకాల ఆప్షన్ లు ఉంటాయి - డివిడెండ్, గ్రోత్. ఇందులో డివిడెండ్ ఆప్షన్ ఎంచుకున్న వారికి సమయానుసారంగా కంపెనీ లు డివిడెండ్ ప్రకటించినప్పుడు ఆ మొత్తాన్ని మదుపరులకు అందిస్తారు. గ్రోత్ ఆప్షన్ అయితే ఆ మొత్తాన్ని ఫండ్ మేనేజర్ తీసుకుని తిరిగి పెట్టుబడి పెడతారు. అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతారు కాబట్టి గ్రోత్ ఆప్షన్ ఎంచుకోవడమే సరైనది. మీకు డివిడెండ్ అవసరం పడుతుంది అనిపిస్తే డివిడెండ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
-
నాకు 80 ఏళ్ళు దాటింది. మినహాయింపులు పోను నాకు ఏడాదికి రూ. 5,13,000 అందుతాయి. దీనిపై ఎంత పన్ను ఉంటుంది.
80 ఏళ్ళు దాటిన వారికి రూ. 5 లక్షల వరకు పెన్షన్ పై పన్ను చెల్లించే అవసరం ఉండదు. ఆ పై మొత్తానికి 20 శాతం పన్ను వర్తిస్తుంది. మీకు రూ.13,000 పై 20 శాతం, అంటే సుమారుగా రూ. 2600 వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రామాణిక మినహాయింపు, సెక్షన్ 80c లాంటి అన్ని పన్ను మినహాయింపులను ఉపయోగించారని భావిస్తున్నాము.
-
పన్ను ఆదా కోసం జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో మదుపు చేద్దామని అనుకుంటున్నాను. ఇందులో ఏడాదికి రూ.లక్ష వరకూ మదుపు చేసుకోవచ్చా?ఏం చేస్తే బాగుంటుంది?
జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) మంచి పథకమే. రుసుములూ చాలా తక్కువగానే ఉంటాయి. సెక్షన్ 80సీ కిందా దీనిద్వారా పన్ను ఆదా అవుతుంది. ఒకవేళ సెక్షన్ 80సీలో ఇప్పటికే రూ.1,50,000 పూర్తయితే.. సెక్షన్ 80సీసీడీ కింద రూ.50వేల వరకూ ఎన్పీఎస్ ద్వారా పన్ను మినహాయింపు లభిస్తుంది.
-
మా పాప పేరుమీద సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ.2వేలు జమ చేస్తున్నాను. మరో రూ.2 వేలను పీపీఎఫ్‌లో జమ చేద్దామని అనుకుంటున్నాను. నష్టభయం లేకుండా ఉండాలనేది నా ఆలోచన. దీనికోసం నేను ఎలాంటి పథకాలను ఎంచుకోవచ్చు?
సుకన్య సమృద్ధి యోజన ఎలాంటి నష్టభయం లేని పథకం. రాబడిపైనా పన్ను ఉండదు. ప్రస్తుతం ఇందులో 7.6శాతం వడ్డీ లభిస్తోంది. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) సైతం పూర్తిగా సురక్షితం. రాబడిపైనా పన్ను ఉండదు. వడ్డీ 7.1శాతం వస్తోంది. మీరు ఇప్పటికే సురక్షితమైన పథకం సుకన్య సమృద్ధిలో మదుపు చేస్తున్నారు కాబట్టి, కొత్తగా మదుపు చేయాలనుకుంటున్న రూ.2వేలను డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయండి. ఇందులో కాస్త నష్టభయం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మంచి రాబడికి అవకాశం ఉంది. ఇలా నెలకు రూ.4వేల పెట్టుబడిని కనీసం 15 ఏళ్లపాటు మదుపు చేస్తే.. సగటు రాబడి 10.5శాతం చొప్పున రూ.15,86,881 అయ్యేందుకు వీలుంది.
-
నమస్తే సర్, నా పేరు దివాకర్ గౌడ్. పిల్లల చదువు కోసం 20 సంవత్సరాల పాటు ప్రతి నెలా పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఎందులో పెట్టాలో తెలుపగలరు.
ఆడ పిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన ఎంచుకోవచ్చు. ఇది ప్రభుత్వ పధకం కాబట్టి పూర్తిగా సురక్షితం, మంచి వడ్డీ కూడా పొందొచ్చు. వారి ఉన్నత చదువు, పెళ్లి కోసం ఈ నిధి ని ఉపయోగించవచ్చు. మగ పిల్లల కోసం రిస్క్ లేని పీపీఎఫ్ ఎంచుకోవచ్చు. కొంత మొత్తం మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పెట్టుబడి పెట్టడం మంచిది. ఇది మంచి రాబడిని అందించగలదు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
మూడేళ్ల క్రితం ఆన్లైన్లో రూ.50లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకున్నాను. నా వయసు 43. ఇప్పుడు మరో రూ.50 లక్షల పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీని ఎంచుకోవచ్చా?
మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో 20శాతం వరకూ ఈటీఎఫ్‌లకు మళ్లించవచ్చు. మిగతా మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో కొనసాగించండి. ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే.. ఈటీఎఫ్‌లలో ఖర్చుల నిష్పత్తి కాస్త తక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో ఈటీఎఫ్‌ల పనితీరు బాగానే ఉంది. స్టాక్ మార్కెట్లో మదుపు చేసినప్పుడు నష్టభయం సహజమే. కనీసం అయిదేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించినప్పుడు, నష్టభయం తగ్గి, మంచి లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
-
స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్లకు బదులు ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయొచ్చా? దీనివల్ల నష్టమేమైనా ఉంటుందా? పెట్టుబడిని ఎంతకాలం కొనసాగించాలి?
బీమా పాలసీ తీసుకునేటప్పుడు మీ వార్షిక ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోవాలి. బీమా సంస్థలు పాలసీ ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. వార్షికాదాయానికి 10-15 రెట్ల వరకూ టర్మ్ పాలసీని ఇస్తాయి. మీకు ఇప్పటికే రూ.50లక్షల పాలసీ ఉందంటున్నారు. కాబట్టి, మీకు ఎంత మేరకు అర్హత ఉందో చూసుకోండి. కొత్త పాలసీని తీసుకునేటప్పుడు పాత పాలసీ వివరాలు తెలియజేయండి. మంచి క్లెయిం సెటిల్మెంట్ ఉన్న సంస్థను ఎంపిక చేసుకోండి. ప్రీమియం వెనక్కి వచ్చే పాలసీల్లో సాధారణ టర్మ్ పాలసీలతో పోలిస్తే ప్రీమియం అధికంగా ఉంటుంది. ఇలా వసూలు చేసిన అధిక ప్రీమియాన్ని బీమా సంస్థలు పెట్టుబడి పెట్టి, వ్యవధి తీరిన తర్వాత పాలసీదారులకు ఇస్తాయి. సాధారణ టర్మ్ బీమా, ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ పాలసీల మధ్య ఉన్న ప్రీమియం వ్యత్యాసాన్ని మీరు సొంతంగానూ మదుపు చేసుకోవచ్చు. దీనివల్ల ఇంకా అధిక మొత్తమే చేతికందే అవకాశం ఉంది.
-
పదేళ్ల మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.15వేల వరకూ మదుపు చేయాలనే ఆలోచన. ఈ మొత్తాన్నివీపీఎఫ్లో జమ చేయొచ్చా? లేకపోతే ఇతర పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలా? 15 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం జమ అయ్యే వీలుంది?
ప్రస్తుతం ఈపీఎఫ్, వీపీఎఫ్‌లో 8.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఇప్పటికే మీరు ఈపీఎఫ్‌లో జమ చేస్తున్నారు కాబట్టి, మరో సురక్షితమైన పథకంలో మదుపు చేయడం వల్ల అధిక రాబడిని అందుకోలేరు. దీనికి బదులు కాస్త నష్టభయం ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించే పథకాలను ఎంచుకోవచ్చు. దీనికోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను పరిశీలించండి. మీరు 15 ఏళ్లపాటు నెలకు రూ.15వేలు మదుపు చేస్తూ ఉంటే.. 12 శాతం రాబడి అంచనాతో.. దాదాపు రూ.67,10,348 అయ్యేందుకు అవకాశం ఉంది.
-
త్వరలో పదవీ విరమణ చేయబోతున్నాను. నెలకు కనీసం రూ.15వేల వరకూ వచ్చేలా ఏదైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. దీనికోసం ఎంత మొత్తం మదుపు చేయాలి? సురక్షితంగా ఉండే పథకాలను సూచించండి?
ప్రస్తుతం సురక్షితమైన పెట్టుబడులపై వడ్డీ రేట్లు తక్కువగానే ఉన్నాయి. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం, ప్రధానమంత్రి వయ వందన యోజన పథకాలు మంచి రాబడినే అందిస్తున్నాయి. వీటిల్లో 7.4శాతం వడ్డీ వస్తోంది. ఒక్కో పథకంలో గరిష్ఠంగా రూ.15లక్షల వరకూ మదుపు చేయొచ్చు. మీకు నెలకు రూ.15వేల వరకూ ఆదాయం రావాలంటే.. రెండు పథకాల్లో కలిపి రూ.24.5లక్షల వరకూ జమ చేయాల్సి వస్తుంది.
-
ప్రస్తుతం రూపాయి విలువ తగ్గుతూ వస్తోంది,షేర్ మార్కెట్ కూడా నష్టాల్లొ ఉంది. కాని, నేను ఇప్పుడు ఎల్ఐసి ఐపీఓ లొ షేర్స్ కొన్నాను. ఇప్పుడు షేర్స్ అమ్మాలా వద్దా అనేది చెప్పండి.
షేర్ మార్కెట్ అనేక రకాల పరిస్థితుల కారణంగా హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటుంది. ప్రస్తుతం యుద్ధ వాతావరణం, కోవిద్ పరిస్థితులు లాంటి కారణాల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా కుదేలవుతున్న కారణంగా మంచి షేర్లు కూడా దెబ్బ తినే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సమయాల్లో పెట్టుబడులు ఎలా సాగుతాయి అనేది తెలుపడం సాధ్యం కాదు. మీరు ఒక షేర్ మార్కెట్ నిపుణుడిని సంప్రదించి భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడం మేలు.
-
సుకన్య పధకం మొదలు పెట్టక ఆపేసాను. మల్లి మొదలు పెట్టవచ్చా?
ఈ పధకం లో ఏడాదికి కట్టాల్సిన కనీస మొత్తం రూ. 250 చెల్లించకపోతే నిరుపయోగ ఖాతా గా లెక్కిస్తారు. మీరు మళ్ళీ ఇందులో పెట్టుబడి పెట్టాలంటే మీ పెట్టుబడి తో పాటు చెల్లించని ఏడాదికి రూ. 50 చొప్పున పెనాల్టీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
-
సర్, నా పేరు లక్ష్మి. గత ఏడాది నాకు షేర్ మార్కెట్ నుంచి రూ. 80 వేలు వచ్చింది. ఎంత పన్ను చెల్లించాలి, ఏ ఐటీఆర్ వాడాలి?
మీరు ఇంట్రా డే, ఫ్యూచర్స్/ఆప్షన్స్ ట్రేడింగ్ చేసినట్టయితే ఇది వ్యాపార నిమిత్తం పొందిన ఆదాయం లాగా చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ సాధారణంగా షేర్ లు కొనుగోలు చేసి అమ్మినట్టయితే అది మూలధన ఆదాయంగా నిర్ణయిస్తారు. దీనిపై 15 శాతం పన్ను ఉంటుంది. షేర్స్ కొనుగోలు చేసిన కనీసం 1 ఏడాది తరవాత అమ్మినట్టయితే, రూ. 1 లక్ష వరకు ఈ ఆదాయానికి పన్ను వర్తించదు.
-
సర్, నేను 2014 లో రూ. 5 లక్షలకు ఒక ప్లాట్ తీసుకున్నాను. ఇప్పుడు దానికి రూ. 25 లక్షలు రావచ్చు. అమ్మితే పన్ను ఎంత పడుతుంది? మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చా?
మీకు ఈ ప్లాట్ అమ్మకం మీద సుమారుగా రూ. 3.50 లక్షల మేరకు పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఈ విషయమై పన్ను సలహాదారుడ్ని సంప్రదించడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్ లో ఒకే సారి పెట్టుబడి పెట్టడం మంచిది కాకపోవచ్చు. ఇందులో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఈ మొత్తాన్ని 6-12 నెలల్లో కొంత కొంత పెట్టుబడి పెట్టవచ్చు. ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. కొంత రిస్క్ తీసుకోగలిగితే హెచ్డీఎఫ్సీ మిడ్ కాప్ ఫండ్ కూడా ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
డియర్ సర్, నా పేరు ఆంజనేయులు. నిన్న మీ కథనం చదివాను. మ్యూచువల్ ఫండ్స్ లో రూ. 15 వేలు మదుపు చేయడానికి సలహా ఇవ్వండి.
సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. సిప్ తో పాటు మార్కెట్ దిగువ లో ఉన్నప్పుడు కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ ఉండడం మంచిది. మొదటి కొన్నేళ్లలో వీలైనంత మదుపు చేస్తే 10 ఏళ్లలో మంచి నిధి సమకూర్చుకోవచ్చు.
-
హాయ్, నా వార్షిక ఆదాయం రూ. 8.65 లక్షలు. నేను గత ఏడాదికి గాను పాత ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకున్నాను. పన్ను మొత్తాన్ని తిరిగి ఎలా పొందగలను?
మీరు ఎంచుకున్న పన్ను విధానం ప్రకారం ఉద్యోగ సంస్థ మీ జీతం నుంచి నెల నెలా కొంత పన్ను ని తీసివేసి ప్రభుత్వానికి జమ చేస్తుంది. ఒకవేళ మీరు మీ సంస్థకి ఏదైనా అదనపు పెట్టుబడులను లేదా పన్ను మినహాయింపులను చూపించడం మరచినట్టైతే ఆదాయ పన్ను ఫైలింగ్ సమయం లో చూపించవచ్చు. చెల్లించిన అదనపు పన్ను ని మీకు రీఫండ్ చేస్తారు.
-
నా పేరు లక్ష్మణ్. మా పాప కోసం మ్యూచువల్ ఫండ్స్ లో రూ. 1 లక్ష, 20 ఏళ్ళ కాలపరిమితి కోసం మదుపు చేయాలనుకుంటున్నాను. ఎందులో చేయవచ్చు?
మీరు ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. అలాగే, వీలయితే ఇదే ఫండ్ లో నెల నెలా సిప్ విధానంలో లో కూడా కొంత మదుపు చేయడం మంచిది. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
డియర్ సిరి, మీ సలహాలు, సమాధానాలు చాలా బాగుంటాయి. ఇంటి రుణం తీసుకున్న తరువాత పంపిణీ అయిన రుణానికి భవిష్యత్తులో వడ్డీ రేటు మారే అవకాశం ఉంటుందా?
బ్యాంకు అందించే రుణానికి సంబంధించిన వడ్డీ రేటు ఆర్బీఐ వడ్డీ రేటు సమీక్ష ఆధారంగా మారుతూ ఉంటాయి. కాబట్టి, బ్యాంకులు కూడా ఎప్పటికప్పుడు తమ ఇంటి రుణాల వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటాయి. పెరిగిన రేట్లు మీ రుణానికి వర్తిస్తాయి, తగ్గినప్పుడు మీరు బ్యాంకు ని రేట్లు తగ్గించమని కోరవలసి ఉంటుంది. దీనికి బ్యాంకు కొంత 'కన్వర్షన్ ఫీజు' కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి, వడ్డీ రేటు 0.75-1% మేరకు తగ్గినప్పుడు మాత్రమే మీరు బ్యాంకుని తగ్గింపు కోసం అడగడం మంచిది.
-
హాయ్ సిరి, స్థలం లేదా ఇల్లు కొనడానికి హోం లోన్ సౌకర్యం ఉంటుందా? వడ్డీ రేట్లలో ఏమైనా తేడా ఉంటుందా? వివరించండి.
స్థలం, ఇల్లు కొనడానికి రుణాలు అందుబాటు లో ఉన్నాయి. స్థలానికి అందించే రుణం కంటే ఇంటికోసం తీసుకునే రుణానికి వడ్డీ రేటు కాస్త తక్కువగా ఉంటుంది. మీరు ఎస్బీఐ, ఇండియన్ బ్యాంకు, కోటక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులను సంప్రదించవచ్చు.
-
సర్, నా వద్ద రూ. 3 లక్షలు ఉన్నాయి. ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తే ఇన్నేళ్లకి రెట్టింపు అవ్వచ్చు? బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ లో ఏది మంచిది?
బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఫిక్సిడ్ డిపాజిట్ రెండూ సురక్షితమే. వడ్డీ రేటు ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. బ్యాంకులో వడ్డీ రేటు కాస్త ఎక్కువగా పొందొచ్చు. యెస్ బ్యాంకు, ఆర్బీఎల్ లాంటి వాటిని పరిశీలించండి. 1-3 ఏళ్ళ వరకు డిపాజిట్ చేయవచ్చు. రూ. 1 లక్ష చొప్పున మూడు డిపాజిట్ లు చేయడం మేలు. డిపాజిట్ పూర్తి కాకముందే డబ్బు అవసరం అయినట్లయితే వీలుని బట్టి ఎన్ని డిపాజిట్ లు వెనక్కి తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు.
-
నేను 3 ఏళ్ళ పాటు నెల నెలా రూ. 3000 సిప్ చేద్దామనుకుంటున్నాను. సలహా ఇవ్వండి.
మీరు పేర్కొన్న కాలానికి మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం సరైన పధ్ధతి కాదు. కనీసం 7-10 ఏళ్ళ వరకు మదుపు చేసే ఉద్దేశం ఉంటేనే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవడం మేలు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నా పేరు ఆరిఫ్. నాకు 9 సంవత్సరాల కుమార్తె ఉంది. దయచేసి నా కూతురి కోసం డబ్బు ఎలా ఆదా చేయాలో చెప్పండి. నా దగ్గర కొంత డబ్బు ఉంది. ఎలా పెట్టుబడి పెట్టాలి మరియు ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఎలా?
మీ అమ్మాయికి పెళ్ళికి దీర్ఘకాల సమయం ఉంది. మీరు మీ పాప పేరు మీద సుకన్య సమ్రిద్ధి ఖాతా తెరవచ్చు. తన ఉన్నత చదువు, పెళ్లి కోసం ఇది ఉపయోగ పడుతుంది. ఏడాదికి రూ. 1.50 లక్షల వరకు మదుపు చేయవచ్చు. మీ వద్ద ఉన్న మొత్తం లో నుంచి ఇందులో కొంత వరకు మదుపు చేయవచ్చు. మిగిలిన మొత్తాన్ని 3-4 ఏళ్ళ కోసం ఫిక్సిడ్ డిపాజిట్ చేసి అందులో నుంచి ప్రతి ఏడాది మదుపు చేయవచ్చు.
-
మా బాబు వయస్సు 18 సంవత్సరాలు, గత మూడు నెలల క్రితం అక్యూట్ పాంక్రీటైటిస్ వ్యాధి వచింది. ఏదయినా మంచి హెల్త్ ఇన్సూరెన్ పాలసీ చెప్పండి.
చాలా వరకు ఆరోగ్య బీమా పాలసీలలో ముందస్తు వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇది 2-4 ఏళ్ళ వరకు ఉండొచ్చు. కాబట్టి, మీరు ఎంచుకునే పాలసీ లో అతి తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండేలా చూసుకోవాలి. స్టార్ హెల్త్, అపోలో మునిచ్, మాక్స్ బూపా లాంటి కంపెనీల పాలసీలు పరిశీలించండి. అధిక వ్యాధుల కవరేజీ, అధిక నెట్వర్క్ ఆసుపత్రులు, పరిమితులు లేని అద్దె గదులు లాంటివి గమనించడం ముఖ్యం. ఫ్యామిలీ ఫ్లోటర్/వ్యక్తిగత పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి.
-
నేను ఎస్బీఐలో పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేశాను. 2 సంవత్సరాలుగా ఖాతాను నిర్వహిస్తున్నాను. ఇప్పుడు ఆ పీపీఎఫ్ ఖాతాను వేరే బ్యాంకు (హెచ్డీఎఫ్సీ)కి బదిలీ చేసుకోవడం సాధ్యపడుతుందా? సాధ్యపడితే ఎలా బదిలీ చేసుకోవాలో తెలుపగలరు. ధన్యవాదాలు.
ముందుగా మీరు మీ పాస్ బుక్ తో ఎస్బీఐ కి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ తగిన ఫారం నింపి పాస్ బుక్ ఇచ్చేసి ఖాతా ని మూసివేస్తారు. కొన్ని పత్రాలని వారు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కి పంపాల్సి ఉంటుంది. ఆ తరవాత కొత్త బ్యాంకులో పీపీఎఫ్ ఖాతా తెరవబడుతుంది.
-
నా వయస్సు 28 సంవత్సరాలు. జులై - 2022 నుంచి ప్రతి నెలా రూ. 5000/- చొప్పున 20 సంవత్సరాల వ్యవధి కి మ్యూచువల్ ఫండ్ నందు పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నాను. సరైన మంచి ప్లాన్ తెలియజేయగలరు.
మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచన. అయితే, ఇందులో రిస్క్ కూడా ఉంటుందని గమనించాలి. ఒకోసారి నష్టాలూ రావచ్చు. అయితే, దీర్ఘకాలం లో రిస్క్ తగ్గుతూ ఉంటుంది. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్ సిరి, నా వయసు 41. మంచి టర్మ్ పాలసీ సూచించండి. చాలా వరకు వెబ్సైట్లలో ప్రీమియం అధికంగా ఉంటోంది.
టర్మ్ పాలసీ లో మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. వీడి క్లెయిమ్ సెటిల్మెంట్ చాలా బాగుంది. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. మీ వీలుని బట్టి ఇందులో ఒకటి ఎంచుకోవచ్చు.
-
సెన్సెక్స్, నిఫ్టీ లాగా రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 లోపు లైవ్ గా కొనగలమా సర్? దయచేసి చెప్పగలరు.
మీరు మ్యూచువల్ ఫండ్స్ గురించి అడుగుతున్నారని భావిస్తున్నాము. మధ్యాహ్నం 2 లోపు కొనుగోలు చేసినట్టయితే మీకు ఆ రోజు ఎన్ఏవీ వస్తుంది. మీరు ఈ ఎన్ఏవీ ని రాత్రి 9.30 తరవాత చూడవచ్చు. స్టాక్ మార్కెట్ లాగా మీకు ఎన్ఏవీ ఎప్పటికప్పుడు తెలియదు. అయితే, మ్యూచువల్ ఫండ్స్ లో రోజు వారీగా భారీగా హెచ్చుతగ్గులు ఉండకపోవచ్చు. కాబట్టి, దీర్ఘకాలం కోసం మదుపు చేసేటప్పుడు ఎంత తొందరగా మదుపు చేస్తే అంత మంచిది. మార్కెట్ బాగా పడినట్టయితే మరి కాస్త మదుపు చేస్తూ ఉండాలి.
-
సర్, నా వయసు 26. దీర్ఘకాలం కోసం నెలకి రూ. 3 వేలు మదుపు చేద్దాం అనుకుంటున్నాను. కుటుంబ రక్షణ కోసం సలహా ఇవ్వండి.
ముందుగా మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. పెట్టుబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. దీర్ఘకాలం కోసం సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్ సర్, నేను ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్ లో రూ. 2000, అలాగే ఎస్బీ హైబ్రిడ్ ఫండ్, ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్, టాటా పీఈ ఫండ్, ఐసీఐసీఐ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్ లో గత ఏడాదిగా రూ. 1000 చొప్పున మదుపు చేస్తున్నాను. 25 ఏళ్ళకి రూ. 2 కోట్లు సమకూర్చుకోగలనా? అధిక రిస్క్ తీసుకోగలను.
మీరు పేర్కొన్న దాని ప్రకారం, 25 ఏళ్ళకి సగటున 12 శాతం రాబడి అంచనా వేసినట్లయితే రూ. 1 కోటి, 15 శాతం రాబడి అంచనా వేసినట్లయితే రూ. 2 కోట్లు సమకూర్చుకోవచ్చు. సిప్ తో పాటు కొంత మొత్తాన్ని మార్కెట్ దిగువ లో ఉన్నప్పుడు కూడా మదుపు చేస్తూ ఉండడం మంచిది. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
సర్, నా వయసు 40. ఈ మధ్యనే ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికా వెళ్లాను. నా పీఎఫ్ ఖాతాలో రూ. 25 లక్షల రూపాయలు ఉన్నాయి. నేను ఆ మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో ఉంచాలా లేదా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలా సూచించండి.
రాజీనామా చేసి విదేశాలకి వెళ్లిన వారు వెంటనే పీఎఫ్ మొత్తాన్ని వెనక్కి తీసుకునే అర్హత ఉంటుంది. తీసుకున్న మొత్తాన్ని మీ ఆర్ధిక లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి పెట్టడం మంచిది. స్వల్ప కాల లక్ష్యాల కోసం ఫిక్సిడ్ డిపాజిట్ లు ఎంచుకోవచ్చు. దీర్ఘకాలం కోసం మ్యూచువల్ ఫండ్స్ మంచిది. ఒకేసారి పెట్టుబడి పెట్టకుండా 8-12 నెలల పాటు పెట్టడం మేలు. ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. ఒకవేళ మీరు స్వల్ప కాలం తరవాత తిరిగి వచ్చే ఉద్దేశం ఉంటే, పీఎఫ్ మొత్తాన్ని అలాగే ఉంచవచ్చు. కాంట్రిబ్యూషన్స్ లేని ఖాతాలకు 3 ఏళ్ళ వరకు వడ్డీ అందుతుంది.
-
సర్, నేను సుకన్య సమృద్ధి ఖాతా లో 3 నెలలకి ఒకసారి రూ. 4000 చొప్పున మదుపు చేస్తున్నాను. పన్ను ఆదా కోసం రసీదు ఎలా తీసుకోవాలి?
మీరు ఉద్యోగస్తులు అయితే మీ వార్షిక బ్యాంకు స్టేట్మెంట్ ని మీ సంస్థ కి అందించి పన్ను మినహాయింపు కోరవచ్చు. ఒకవేళ పన్ను రిటర్న్ ఫైల్ చేసే సమయం లో పన్ను మినహాయింపు పొందాలంటే, అక్కడ మినహాయింపు ని తెలిపితే సరిపోతుంది. తరవాత ఆదాయ పన్ను శాఖ కోరినట్టయితే, బ్యాంకు స్టేట్మెంట్ అందించవచ్చు.
-
మా నాన్న గారి దగ్గర ఆంధ్రా బ్యాంక్ షేర్స్ బాండ్ రూపం లో ఉన్నాయి, డీమ్యాట్ అకౌంట్ లేదు. ఇపుడు ఏమి చేయాలో సలహా చెప్ప గలరు.
ముందుగా మీ నాన్న గారు అయన పేరున ఉన్న షేర్స్ ని డీమ్యాట్ ఖాతాలోకి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. షేర్ ఖాన్, ఐసీఐసీఐ డైరెక్ట్, జెరోధా లాంటి బ్రోకరేజీల వార్షిక చార్జీలు, లావాదేవీల పై బ్రోకరేజీ లాంటివి పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చు. ఖాతా తెరిచిన తరవాత వారి వద్ద ఫోరమ్ నింపి, తగిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఖాతా లో షేర్స్ బదిలీ అయ్యాక మీరు వాటిని ఆన్లైన్ లో ఎప్పుడైనా అమ్మవచ్చు.
-
మా నాన్నగారి స్థలం, నా పేరున "గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్" చేసుకున్నాక, మరుసటి రోజునే నేను మరొకరి అమ్మవచ్చా లేక గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎన్ని రోజుల కాలవ్యవధి ఉండాలి? నేను ఏమైనా ఇన్కమ్ టాక్స్ కట్టాలా?
గిఫ్ట్ డీడ్ చేసాక స్థలం పై హక్కు మీదే అవుతుంది. కాబట్టి, మీ వీలు ని బట్టి దాన్ని ఎప్పుడైనా అమ్మే హక్కు మీకుంది. దీని అమ్మకం పై మూలధన ఆదాయ పన్ను వర్తిస్తుంది. మీ నాన్న గారు కొనుగోలు చేసిన ధర కి, మీరు అమ్మే ధర కి వ్యతాసం లెక్కిస్తారు. కొనుగోలు చేసి 3 ఏళ్ళు దాటితే, దాని పై 20 శాతం పన్ను (ఇండెక్స్ఏషన్ తో కలిపి) ఉంటుంది.
-
నా వయసు 62, పెన్షనర్ ని. 4 ఏళ్ళ క్రితం గుండె బైపాస్ ఆపరేషన్ జరిగింది. నాకు టర్మ్ పాలసీ వస్తుందా?
వయసు పెరిగే కొద్దీ టర్మ్ పాలసీ ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. 60 ఏళ్ళు దాటినా వారికి టర్మ్ పాలసీ ఇవ్వడానికి కంపెనీ లు ముందుకి రాకపోవచ్చు. రూ. 25 లక్షల బీమా హామీ కి ఏడాదికి రూ. 30 నుంచి 35 వేలు ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే పాలసీ మంజూరు చేయడం కూడా కాస్త కష్టమనే చెప్పాలి. మీరు బీమా కంపెనీలతో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో కూడా పరిశీలించవచ్చు.
-
హాయ్ సిరి, నా వయసు 38. మా పాప వయసు 14 పెళ్లి కోసం నేను ఎలా మదుపు చేస్తే మంచిది?
కనీసం 10 ఏళ్ళ పాటు నెల నెలా కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తే మంచి నిధి సమకూర్చుకోవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్ సిరి, నేను ఐసీఐసీఐ పృ సిగ్నేచర్ ప్లాన్ తీసుకున్నాను. కనీసం 5 ఏళ్ళ పాటు ఏడాదికి రూ. 2 లక్షలు చెల్లించాలి. ఇది మంచిదేనా?
చాలా వరకు పిల్లల పథకాల్లో ప్రత్యేకతలు ఉండవు. మీరు పేర్కొన్న పధకం ఒక యూలిప్. ఇందులో పాలసీ నిర్వహణ చార్జీలు, ఫండ్ నిర్వహణ చార్జీలు, బీమా చార్జీలు, ఇలా అనేక రకాల చార్జీలు ఉంటాయి. ఇలాంటి పధకాల నుంచి దూరంగా ఉండడం మంచిది. వీలయితే సరెండర్ చేయండి, కొంత నష్ట పోయినా మంచి పథకాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. బీమా కోసం టర్మ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. . మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పిల్లల భవిష్యత్తు కోసం సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. రిస్క్ లేని పెట్టుబడి కావాలనుకుంటే పీపీఎఫ్ ఎంచుకోవచ్చు.
-
నా వయసు 40 ఏళ్ళు. భవిష్యత్తు ఎలా ఉంటుందనేది అయోమయంగా ఉంది. పిల్లల చదువు, పెళ్లి, పదవీ విరమణ కోసం పధకాలు చెప్పండి.
ముందుగా మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. పిల్లల కోసం పీపీఎఫ్ ఖాతా తెరవడం మంచిది. ఇందులో ఏడాదికి మీ వీలు ని బట్టి మదుపు చేయవచ్చు. ఆడపిల్ల ఉన్నట్టయితే సుకన్య సమృద్ధి యోజన ఎంచుకోవచ్చు. పదవీ విరమణ కోసం ఎన్పీఎస్ లో నెల నెలా లేదా ఏడాదికి మీ వీలు ని బట్టి మదుపు చేయవచ్చు.
-
మా పాప 2020 లో పుట్టింది. తన పెళ్లి, చదువు కోసం ఏదైనా పధకం తెలుపండి.
ప్రభుత్వం ఆడ పిల్లల కోసం ప్రత్యేకంగా సుకన్య సమృద్ధి యోజన పధకం ప్రవేశ పెట్టింది. ఇది మీ పాప ఉన్నత చదువు, పెళ్లి కోసం ఉపయోగ పడుతుంది. ఇందులో మీరు మీ వీలు, అవసరాన్ని బట్టి నెల నెలా మదుపు చేయవచ్చు. ఖాతా తెరిచిన 21 ఏళ్ళ తరవాత అందులోని డబ్బు మీ పాప పేరున బదిలీ చేస్తారు. అయితే, పాప వయసు 18 ఏళ్ళు దాటితే , ఖాతా లో నుంచి 50 శాతం వరకు మొత్తాన్ని మీరు వెనక్కి తీసుకోవచ్చు.
-
60 ఏళ్ళ వయసు తరువాత మన పీఎఫ్ మొత్తం తప్పనిసరిగా విత్ డ్రా చేయాలా? పీఎఫ్ వారు చేయమంటున్నారు, సలహా ఇవ్వండి.
పదవీ విరమణ తరవాత 3 ఏళ్ళ వరకు పీఎఫ్ మొత్తం పై వడ్డీ వస్తుంది. కాబట్టి, మీరు కొనసాగించవచ్చు. ఆ తరవాత పీఎఫ్ ఖాతా పై వడ్డీ రాదు, కాబట్టి ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.
-
నేను రూ. 10 లక్షల కారు కొందామనుకుంటున్నాను. నగదు పెట్టి కొనడం మంచిదా లేక రుణం తీసుకోవడం మంచిదా? నా వద్ద ఉన్న రూ. 10 లక్షలను మదుపు చేస్తే మంచిదా?
కొత్త కారు రుణం వడ్డీ రేట్లు కాస్త తక్కువ అనే చెప్పాలి, సుమారుగా 7-8 శాతం వరకు ఉన్నాయి. కాబట్టి, మీరు 70-80 శాతం వరకు రుణం తీసుకుని, రూ. 2-3 లక్షలను డౌన్ పేమెంట్ కోసం వాడుకోవచ్చు. మీ వద్ద మిగిలి ఉన్న డబ్బు ని మీ ఆర్ధిక లక్ష్యాల ప్రకారం మదుపు చేసుకోవడం మంచిది. దీర్ఘకాలం కోసం అయితే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. సిప్ విధానంలో 12-15 నెలల పాటు ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు.
-
హాయ్ సిరి, మీ సూచనలు చాలా బాగుంటాయి. ఎస్టీపీ గురించి చెప్పండి. ఇది ఎందులో చేయచ్చు?
పెద్ద మొత్తం లో డబ్బు ఉన్నప్పుడు ఎస్టీపీ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ముందుగా ఒక డెట్ ఫండ్ ఎంచుకుని అందులో ఈ మొత్తాన్ని మదుపు చేసి అక్కడ నుంచి ఏదైనా ఈక్విటీ ఫండ్ లోకి 6-8 నెలల పాటు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. పూర్తి మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యే వరకు డెట్ ఫండ్ నుంచి కూడా మీకు కొంత రాబడి అందించడమే ఎస్టీపీ ఆప్షన్ లక్ష్యం. డెట్ ఫండ్ లో ఏదైనా ఒక లిక్విడ్ ఫండ్ ఎంచుకోవచ్చు. ఈక్విటీ ఫండ్ లో ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నమస్కారం, నా వయసు 52. ఇంకో 3 ఏళ్ళ తరువాత ఉద్యోగం మానేద్దాం అని ఆలోచిస్తున్నాను. నాకు నెలకు రూ. 60 వేలు పెన్షన్ అందేలా ఒక భద్రత తో కూడిన పధకం చెప్పగలరు.
మీరు పదవీ విరమణ తీసుకునే ముందు మీకు సరిపడా పదవీ విరమణ నిధి అందుతుందా లేదా అన్నది సరిచూసుకోవాలి. ఈపీఎఫ్ నుంచి ఎంత మొత్తం నిధి, పెన్షన్ వస్తుందనేది మీ ఉద్యోగ సంస్థ ద్వారా తెలుసుకోండి. ఎస్సిఎస్ఎస్(సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పధకం) , ఎల్ఐసి వయా వందన యోజన లాంటి పథకాల్లో మదుపు చేసి పెన్షన్ పొందాలంటే 60 ఏళ్ళ వయసు తప్పనిసరి. మీరు అప్పటి వరకు మీ వద్ద అందిన (పీఎఫ్ లాంటి వాటి ద్వారా) పెద్ద మొత్తాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ చేసి నెల నెలా కొంత మొత్తాన్ని పొందొచ్చు. ఆ తరవాత పైన తెలిపిన పథకాల్లో మదుపు చేయవచ్చు. మీరు మరో 3 ఏళ్ళ వరకు నెల నెలా కొంత మొత్తాన్ని రికరింగ్ డిపాజిట్ చేయవచ్చు.
-
మా పాప వయసు 4 ఏళ్ళు, తన చదువు కోసం నెలకి రూ. 8000 మదుపు చేద్దాం అనుకుంటున్నాను. మంచి సలహా ఇవ్వండి.
మీరు సుకన్య సమృద్ధి పధకం ఎంచుకోవచ్చు. ఇందులో 15 ఏళ్ళ పాటు మదుపు చేయాల్సి ఉంటుంది. ఏడాదికి కనీసం రూ. 250, గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు మదుపు చేయవచ్చు. ఖాతా మెచ్యూరిటీ తెరిచిన రోజు నుంచి 21 ఏళ్ళకి ఉంటుంది. అయితే, పాప వయసు 18 ఏళ్ళు దాటినా తరువాత ఖాతా నుంచి 50 శాతం మొత్తాన్ని చదువు, పెళ్లి కోసం ఉపయోగించవచ్చు.
-
నా వయసు 61. నాలుగు సంవత్సరాలలో రిటైర్ అవుతాను. రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల రూ. 20,000 వచ్చే పెన్షన్ ప్లాన్ లేదా ఆదాయ మార్గం సూచించగలరు.
మీ పదవీ విరమణ నిధి ని పెట్టుబడి పెట్టి నెల నెలా పెన్షన్ పొందాలంటే ఎల్ఐసి వయ వందన యోజన లేదా సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పధకం లో మదుపు చేయవచ్చు. మీరు రూ. 33 లక్షలు మదుపు చేస్తే 5 ఏళ్ళ పాటు నెల నెలా రూ. 20 వేలు పెన్షన్ పొందొచ్చు. పెన్షన్ పథకాల్లో చార్జీలు అధికంగా ఉంటాయి కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండడం మేలు. పైన తెలిపిన రెండు ప్రభుత్వ పథకాలే.
-
టర్మ్ పాలసీ గురించి తెల్పండి. ఇది ఎటువంటి మరణానికి వర్తిస్తుంది?
టర్మ్ పాలసీ ఎటువంటి మారానికైనా బీమా హామీ ని అందిస్తుంది. అయితే, చాలా వరకు పాలసీలు కొనుగోలు చేసిన తేదీ నుంచి 1 ఏడాది వరకు ఆత్మహత్య ని కవర్ చేయవు. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
హాయ్, నా భర్త, నేను ఉద్యోగస్తులము. మా వార్షిక ఆదాయం రూ. 14 లక్షలు. ఈఎంఐ కోసం రూ. 40 వేలు పోను మిగిలిన మొత్తాన్ని రెండేళ్ల తరవాత నా చెల్లి పెళ్లి కోసం సమకూర్చాలంటే ఎంత మదుపు చేయాలి?
మీరు పేర్కొన్న కాల పరిమితికి రిస్క్ లేని పధకాలు మాత్రమే ఎంచుకోవాలి. బ్యాంకు రికరింగ్ డిపాజిట్ లో మదుపు చేయవచ్చు. నెల నెలా రూ. 80 వేలు మదుపు చేస్తే, 6 శాతం వార్షిక రాబడి అంచనా ప్రకారం 2 ఏళ్ళ తరవాత సుమారుగా రూ. 20 లక్షల వరకు సమకూర్చుకోవచ్చు.
-
సర్, నేను ఎస్బీఐ శుభ్ నివేశ్ పాలసీ లో 2016 నుంచి ఏడాదికి రూ. 50 వేలు చెల్లిస్తున్నాను. సరెండర్ చేస్తే ఎంత వస్తుంది?
మీరు పేర్కొన్న పాలసీ ఒక ఎండోమెంట్ పధకం. 4-7 ఏళ్ళ మధ్యలో సరెండర్ చేస్తే మీరు చెల్లించిన ప్రీమియం లో 50 శాతం వెనక్కి పొందొచ్చు. అదే 8 ఏళ్ళ తరవాత అయితే మరి కాస్త వెనక్కి పొందొచ్చు. పూర్తి వివరాల కోసం ఎస్బీఐ ని సంప్రదించడం మంచిది. ఈ పాలసీ సరెండర్ చేయడం సరైన నిర్ణయమే. పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి, పెన్షన్), మ్యూచువల్ ఫండ్స్ లాంటి పథకాల్లో నుంచి ఎంచుకోవడం మేలు. బీమా హామీ కోసం ముందుగా మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
2012 లో నేను జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. ఏడాదికి రూ. 54 వేలు ప్రీమియం చెల్లిస్తున్నాను. 15 ఏళ్ళ తరవాత ఎంత వస్తుంది?
మీరు బీమా హామీ మొత్తం తెలుపలేది. మీరు పేర్కొన్న పధకం లో సగటు వార్షిక రాబడి సుమారుగా 4-5 శాతం వరకు ఉంటుంది. దీని ప్రకారం 15 ఏళ్ళ తరవాత (బోనస్ లు కూడా కలిపి) మీకు సుమారుగా రూ.11 నుంచి 12 లక్షల వరకు పొందే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ని సంప్రదించవచ్చు. ఇలాంటి పాలసీలలో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువ. వీలయితే పాలసీ సరెండర్ చేసి మంచి రాబడి అందించే పథకాలలో మదుపు చేయడం మేలు. బీమా హామీ కోసం ముందుగా మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి పధకాలను మీ రిస్క్, కాల పరిమితి ప్రకారం ఎంచుకోవచ్చు.
-
నా వార్షిక ఆదాయం రూ. 6 లక్షలు. రూ. 1 కోటి బీమా హామీ తో టర్మ్ ప్లాన్ సూచించండి.
మీకు 60 ఏళ్ళు వచ్చే దాక టర్మ్ పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
నా వార్షిక ఆదాయం రూ. 6 లక్షలు, రూ. 1 కోటి బీమా హామీ గల టర్మ్ ప్లాన్ సూచించండి.
టర్మ్ ప్లాన్ లో ప్రీమియం తో పాటు అతి ముఖ్యమైనది క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి. దీని పరంగా చుస్తే ఐసీఐసీఐ, మాక్స్ లైఫ్, ఎస్బీఐ ఆన్లైన్ టర్మ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. మీ ఆదాయం, వయసు ఆధారంగా ప్రీమియం మారుతుంది.
-
హాయ్, ఇటీవలే పుట్టిన మా బాబు చదువు, భవిష్యత్తు కోసం మంచి పెట్టుబడులు సూచించండి. నెలకి రూ. 10 వేలు మదుపు చేయగలను.
మీ బాబు పేరు మీద పీపీఎఫ్ ఖాతా తెరవండి. ఇది సురక్షితమైన 15 ఏళ్ళ ఖాతా, ప్రస్తుతం వడ్డీ రేటు 7.10 శాతం. ఇందులో నెల నెలా రూ. 5 వేలు మదుపు చేయండి. దీనితో పాటు ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ చేయడం మంచిది. దీర్ఘ కాలం లో మంచి రాబడి పొందగలరు. ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. పెట్టుబడి, బీమా హామీ కలిపి ఉన్న మనీ బ్యాక్, ఎండోమెంట్, హోల్ లైఫ్, యూలిప్ లాంటి పధకాల నుంచి దూరంగా ఉండడం మంచిది.
-
డియర్ సర్, బీమా పాలసీ లో సర్వైవర్ బెనిఫిట్ క్రింద పార్ట్ పేమెంట్ తీసుకొంటే, దానిమీద మనం ఇన్కమ్ టాక్స్ చెల్లించాలా? ఇది పాలసీ హోల్డర్ చెల్లించాలా లేదా పాలసీ అమౌంట్ పే చేసేవారు చెల్లించాలా?
జీవిత బీమా పాలసీ లో సర్వైవల్ బెనిఫిట్ పైన ఆదాయ పన్ను వర్తించదు. అయితే, మీ పాలసీ లో వార్షిక ప్రీమియం బీమా హామీ లో 10 శాతం వరకు మాత్రమే ఉండాలి. అంతకు మించితే, కంపెనీ 2 శాతం వరకు టీడీఎస్ తీసి వేస్తుంది. మీరు పొందే మొత్తం రూ. 1 లక్ష లోపు ఉంటే టీడీఎస్ వర్తించదు.
-
హాయ్ సర్, నా వయసు 27. 5 ఏళ్లలో రూ. 1 కోటి పొందాలంటే ఎంత మదుపు చేయాలి?నేను నెలకి రూ. 30 వేల వరకు మదుపు చేయగలను.
ప్రతి నెలా రూ. 30 వేలు మదుపు చేస్తే, 12 శాతం రాబడి అంచనా ప్రకారం 5 ఏళ్ళకి సుమారుగా రూ. 24 లక్షలు పొందొచ్చు. అదే 10 ఏళ్ళు చేస్తే సుమారుగా రూ. 70 లక్షల వరకు పొందొచ్చు, 12.5 ఏళ్ళు చేస్తే రూ. 1 కోటి వరకు పొందగలరు. మీరు ప్రతి ఏడాది మీ వీలుని బట్టి పెట్టుబడి పెంచుతూ ఉండవచ్చు, త్వరలో మీ లక్ష్యాన్ని చేరుకోగలరు. దీర్ఘకాలం కోసం మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నేను రూ. 3 లక్షల రూపాయల విలువ గల స్విఫ్ట్ కార్ కొనాలి అనుకుంటున్నాను. లోన్ వివరాలు తెలుపగలరు.
మీరు యూస్డ్ కార్ కొనాలనుకుంటున్నారని తెలుస్తోంది. కార్ విలువ లో 70 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. వడ్డీ రేటు 11 శాతం నుంచి 14 శాతం వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ, బ్యాంకు అఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్లు కాస్త తక్కువ ఉంటాయి. వీటిని పరిశీలించి నిర్ణయం తీసుకోండి.
-
నమస్తే, నేను ఒక ఎన్ఆర్ఐ ని. నేను ఇండియా లో బీమా పాలసీ కానీ ఫిక్స్ డ్ డిపాజిట్ కానీ చేయవచ్చా?
ఎన్ఆర్ఐ లు కూడా భారత దేశం లో బీమా పాలసీ కొనవచ్చు, వారి ఎన్ఆర్ఈ ఖాతా నుంచి ఫిక్సిడ్ డిపాజిట్ కూడా చేయవచ్చు. బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పాలసీ ల నుంచి దూరంగా ఉండడం మంచిది. మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
హాయ్, నా నెలసరి ఆదాయం రూ. 2.50 లక్షలు. ఖర్చులు, ఇంటి రుణం పోను రూ. 1.70 లక్షల వరకు మిగులుతుంది. నాకు టర్మ్ బీమా, ఆరోగ్య బీమా తో పాటు ఎన్పీఎస్ లో ఏడాదికి రూ. 50 వేల పెట్టుబడి, ఎల్ఐసి మనీ బ్యాక్ పధకాలు కూడా ఉన్నాయి. నెల నెలా బంగారం కొంటాను. ఇంకా ఎక్కడైనా మదుపు చేయవచ్చా?
మనీ బ్యాక్, ఎండోమెంట్, హోల్ లైఫ్ లాంటి పథకాల్లో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండండి. వీలయితే సరెండర్ చేయడం మంచిది. మీ పదవీ విరమణ నిధి కోసం ఎన్పీఎస్ లో మరి కొంత మదుపు చేయవచ్చు. ఏడాదికి ఎన్పీఎస్ లో 2 లక్షల వరకు మదుపు చేసే అవకాశం ఉంటుంది. దీర్ఘకాల లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. కాస్త రిస్క్ తీసుకోవాలంటే దీనితో పాటు హెచ్డీఎఫ్సి మిడ్ కాప్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
సర్, నేను ఫులర్టన్ లో రుణాన్ని తీర్చేసి 12 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు సిబిల్ స్కోర్ అప్డేట్ అవ్వలేదు. నేను ఏం చేయాలి?
సిబిల్ సంస్థకి నేరుగా మీ క్రెడిట్ స్కోర్ లో మార్పులు చేసే అర్హత ఉండదు. మీ రుణ సంస్థ నివేదికని పంపిన 1-2 నెలల్లోగా సిబిల్ వారు క్రెడిట్ రిపోర్ట్ లో మార్పులు చేస్తారు. ఒకవేళ ఇలా జరగకపోతే మీరు ఈ లింక్(https://www.cibil.com/consumer-dispute-resolution) ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. సిబిల్ మీ రుణ సంస్థ తో సంప్రదించి నేల రోజుల్లో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది జరగకపోతే మీరు నేరుగా ఈ విషయాన్ని ఫులర్టన్ తో సంప్రదించడం మేలు.
-
నేను రెండున్నర ఏళ్ల క్రితం ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ తీసుకున్నాను. మూడేళ్ల తర్వాత పాలసీ రద్దు చేసుకోవచ్చా? అలా చేస్తే నాకు ఎంత మొత్తం వస్తుంది. పాలసీని రద్దు చేసుకొని ఆ మొత్తాన్ని ఈక్విటీ, పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నాను. ఇది సరైనా నిర్ణయమేనా?
మీరు ఎంచుకున్న పాలసీ లో బీమా, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, అలాగే రాబడి కూడా తక్కువే. దీన్ని సరెండర్ చేయడం మంచిదే. 3 ఏళ్ళ తరవాత సరెండర్ చేస్తే మీరు చెల్లించిన ప్రీమియం లో 30 శాతం వరకు వెనక్కి వస్తుంది. పీ పీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి పధకాలను మీ రిస్క్ పరిమితి ప్రకారం ఎంచుకోవచ్చు. దీర్ఘకాలం కోసం అయితే సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
సర్, ఆదాయ పన్ను మినహాయింపు కోసం రూ. 1.25 లక్షల ప్రీమియం తో ఎల్ఐసి యూలిప్ తీసుకోవడం మంచిదేనా?
పన్ను మినహాయింపు కోసం బీమా పదహాకాలు ఎంచుకోవడం సరైన పధ్ధతి కాదు. యూలిప్, ఎండోమెంట్, హోల్ లైఫ్ లాంటి పథకాల్లో బీమా, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండడం మేలు. ముందుగా మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. దీర్ఘకాల పెట్టుబడి కోసం సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. పీపీఎఫ్, ఎన్పీఎస్(పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం) లాంటివి కూడా పరిశీలించండి.
-
సర్, నేను 4 సంస్థలలో పని చేసాను. మొదటి 2 సంస్థలు పీఎఫ్ తీసేస్తే స్కీం సర్టిఫికేట్ ఇచ్చారు. మిగతా 2 సంస్థల పీఎఫ్ ఆయా సంస్థలలో ఉంది. ఇవి ఒకే చోటికి రావాలంటే ఏమి చేయాలో తెలుపగలరు.
కంపెనీ మారినప్పుడు పీఎఫ్ మొత్తాన్ని కొత్త కంపెనీ కి బదిలీ చేసుకోవచ్చు. యూఏఎన్ ద్వారా అన్ని పీఎఫ్ ఖాతాలు ఒకే అకౌంట్ కిందకి ఉంటాయి. మీరు మీ సంస్థ తో మాట్లాడి పాత కంపెనీ ఖాతాలను ఈ కంపెనీ పీఎఫ్ ఖాతా తో అనుసంధానం చేసుకోవచ్చు.
-
సర్ మా అమ్మగారు పీఎఫ్ అకౌంట్ 10 ఏళ్ళు పూర్తి అయింది. ఇప్పుడు మేము విత్‌డ్రా పెట్టుకోవచ్చా లేకపోతే వుంచుకుంటే మంచిదా? మేము ఇళ్లు కట్టాలని అనుకుంటున్నాము, ఈ డబ్బు తీసుకొవచ్చా?
పీపీఎఫ్ మొత్తాన్ని పూర్తిగా విత్‌డ్రా చేసుకోవాలంటే పదవీ విరమణ తీసుకుని ఉండాలి లేదా ఉద్యోగం లేకుండా కనీసం 2 నెలలు ఉండాలి. అయితే, కొన్ని అవసరాల కోసం పాక్షికంగా డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. ఇంటి నిమిత్తం మీ నెలసరి బేసిక్+డీఏ లో 36 రేట్ల వరకు వెనక్కి తీసుకోవచ్చు.
-
హాయ్ సర్, నేను ఇటీవలే ఎస్బీఐ లైఫ్ శుభ్ నివేశ్ పధకం గురించి విన్నాను. ఇందులో రాబడి ఎలా ఉంటుంది? సలహా ఇవ్వండి.
మీరు పేర్కొన్న పధకం ఒక ఎండోమెంట్ పొదుపు పధకం. 35 ఏళ్ళ వయసు గల మనిషి ఇందులో రూ. 10 లక్షల జీవిత బీమా ఎంచుకుంటే వార్షిక ప్రీమియం సుమారుగా రూ. 49 వేల వరకు ఉంటుంది. 20 ఏళ్ళ తరవాత, 8 శాతం రాబడి అంచనా ప్రకారం సుమారుగా రూ. 19 లక్షల వరకు పొందగలరు. ఎండోమెంట్ పథకాల్లో సగటు రాబడి సాధారణంగా 6 శాతం వరకు ఉంటుంది. అదే వ్యక్తి ఆన్లైన్ టర్మ్ ప్లాన్ లో రూ. 50 లక్షల బీమా మొత్తాన్ని ఎంచుకుంటే వార్షిక ప్రీమియం సుమారుగా రూ. 7-8 వేలుగా ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ (10-12 శాతం రాబడి ప్రకారం) లో మదుపు చేస్తే 20 ఏళ్ళకి సుమారుగా రూ. 30-35 లక్షల వరకు సమకూర్చుకోవచ్చు. బీమా హామీ, రాబడి కలిపి ఉన్న పధకాల నుంచి దూరంగా ఉండడం మంచిది. టర్మ్ ప్లాన్ తో మీ వీలు ప్రకారం పీపీఎఫ్, ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి పధకాలను ఎంచుకోవచ్చు.
-
నేను ఇటీవలే షేర్స్ లో మదుపు చేశాను, లాభం ఇంకా రూ. 1 లక్ష దాటలేదు. ఈ ఏడాది నేను ఐటీ స్లాబ్ లో లేను. నేను ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాలా?
షేర్స్ లో పెట్టుబడి చేసాక అది అమ్మినప్పుడు మాత్రమే మూలధన ఆదాయాన్ని మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ లో చెప్పాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ ఉన్న వారు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి. పన్ను చెల్లించనప్పటికీ ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం మేలు. రుణాల కోసం దరఖాస్తు చేసినప్పుడు, ఇతర అవసరాల కోసం ఐటీఆర్ అడగవచ్చు.
-
డియర్ సిరి , నా పేరు పవన్. నేను సుందరం సర్వీసెస్ ఫండ్, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ లో నెలవారీగా 500 చొప్పున సిప్ చేస్తున్నాను. సిప్ చేసిన మొత్తం కంపెనీ తిరిగి ఇవ్వడములో జాప్యం జరుగుతుంది అని నా స్నేహితులు కొంతమంది అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం తెలుపగలరు.
సుందరం, నిప్పాన్ పేరు పొందిన మ్యూచువల్ ఫండ్ కంపెనీలు. పైగా, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అన్నీ సెబీ పర్యవేక్షణ లో ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సెబీ స్పందిస్తుంది. కాబట్టి, మీరు పెట్టుబడి విషయం లో భయపడాల్సిన పని లేదు. అయితే, ఫండ్ పరంగా రిస్క్ ఉంటుంది. ఒకోసారి నష్టాలూ రావచ్చు. ఈ మేరకు రిస్క్ తీసుకోగలిగితే మీరు సిప్ చేయవచ్చు. కనీసం 10 ఏళ్ళు మదుపు చేస్తే రిస్క్ తగ్గి మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నేను ఇంటిని అమ్మి రూ. 4.30 లక్షల మూలధన ఆదాయం పొందాను. వీటిని క్యాపిటల్ గేన్ బాండ్స్ లో మదుపు చేద్దాం అనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని చేయాలా లేక బేసిక్ ఆదాయ పన్ను లిమిట్ దాటిన మొత్తాన్ని మాత్రమే చేయాలా?
మీరు తెలిపినట్టు క్యాపిటల్ గేన్ బాండ్స్ లో దీర్ఘకాల మూలధన ఆదాయ పన్ను (ఇంటిని కనీసం 2 ఏళ్ళ తరవాత అమ్మినట్టయితే) ని మదుపు చేసి పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, ఇల్లు అమ్మిన 6 నెలల లోపు చేయాల్సి ఉంటుంది. మీరు రూ. 4.30 లక్షలను వీటిలో 5 ఏళ్ళ పాటు మదుపు చేయాల్సి ఉంటుంది.
-
డియర్ సిరి, నా పేరు భవాని, వయసు 55. ఎల్ఐసి పాలసీ నుంచి రూ. 6 లక్షలు అందాయి. ఇందులో రూ. 5 లక్షలు మా అబ్బాయి పేరు మీద తన భవిష్యత్తు కోసం మదుపు చేయాలనుకుంటున్నాను. నా వయసు 55, కాబట్టి నేను సిప్ చేయలేను. సలహా ఇవ్వగలరు.
మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడానికి రెండు విధానాలు ఉంటాయి. ఒకటి లంప్సమ్ , ఇంకొకటి సిప్. సిప్ అంటే క్రమంగా నెల నెలా మదుపు చేయడం, లంప్సమ్ అంటే ఒకేసారి మదుపు చేయడం. మార్కెట్ గమనం ఊహించలేము కాబట్టి సిప్ చేయడం వల్ల కొంత వరకు రిస్క్ తగ్గుతుంది. మీరు 20-24 నెలల పాటు సిప్ ద్వారా ఈ మొత్తాన్ని మదుపు చేయవచ్చు. ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
సర్, నా వయసు 57. మా అబ్బాయి చనిపోయాక నాకు రూ. 30 లక్షలు వచ్చాయి. నెలవారీ పెన్షన్ పొందే పధకాలు తెలుపండి.
ఎల్ఐసి వయా వంద యోజన, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం వంటి పెన్షన్ పథకాల్లో మంచి రాబడి ఆశించవచ్చు. ఇవి సురక్షితం కూడా. అయితే, వీటిలో చేరడానికి కనీస వయసు 60. మీరు 3 ఏళ్ళ పాటు ఈ డబ్బు ని ఫిక్సిడ్ డిపాజిట్ చేసి నెలసరి పెన్షన్ పొందవచ్చు. ఆ తరవాత ఈ డబ్బు ని పైన తెలిపిన పెన్షన్ పధకం లో పెట్టుబడి పెట్టవచ్చు.
-
హాయ్, సుకన్య సమృద్ధి పధకం లో ఒక ఏడాది రూ. 1 లక్ష కట్టి తరవాత 13 ఏళ్ళు మనకి కుదిరినంత కట్టుకోవచ్చా?
సుకన్య సమృద్ధి యోజన పధకం లో ఏడాదికి కనీసం రూ. 250 నుంచి రూ. 1.50 లక్షల వరకు మదుపు చేయవచ్చు. ప్రతి ఏడాది ఒకేలా మదుపు చేయక్కర్లేదు. మీ వీలు, అవసరాన్ని బట్టి పెట్టుబడి మార్చుకోవచ్చు. మొదటి కొన్నేళ్లలో వీలైనంత మదుపు చేస్తే దానికి సమయం ఉన్నందున మంచి రాబడి పొందవచ్చు.
-
హాయ్, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. మా ఉద్యోగ సంస్థ ద్వారా ఎన్పీఎస్ లో మదుపు చేసే అవకాశం లేదు. ఆదాయ పన్ను మినహాయింపు కోసం వారి ద్వారానే పెట్టుబడి పెట్టాలా?
ఎన్పీఎస్ లో సెక్షన్ 80C కాకుండా అదనంగా మరో రూ. 50 వేలు మదుపు చేసి పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఇందులో మీరు వ్యక్తిగతంగా కూడా మదుపు చేయవచ్చు. ఎన్పీఎస్ వెబ్సైటు (https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html) ద్వారా పెట్టుబడి పెట్టి మీ ఉద్యోగ సంస్థ కి తెలపండి లేదా ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేసే సమయం లో దీని పై మినహాయింపు పొందొచ్చు.
-
హయ్ సిరి, నేను ఎల్ఐసి జీవన్ అనంద్ పాలసి (2007 లో మొదలైంది -16 ఏళ్ళ కాలపరిమితి) లో ఏడాదికి రూ. 22 వేల చొప్పున 4 వాయిదాలు కట్టాను. నెను కట్టిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉందా?
మీరు పేర్కొన్న పాలసీ లో కనీసం రెండేళ్ల ప్రీమియం మొత్తం చెల్లించాక పాలసీ సరెండర్ చేసే అవకాశం ఉంటుంది. కొంత చార్జీలు పోను మిగిలిన మొత్తం వెనక్కి పొందొచ్చు. ఒకవేళ మీకు తక్కువ మొత్తం వెనక్కి వస్తున్నట్టయితే పాలసీ పేడ్ అప్ కూడా చేయవచ్చు. అప్పుడు పాలసీ కాలపరిమితి ముగిసాక మీరు చెల్లించిన ప్రీమియం డబ్బు మీకు వెనక్కి వస్తుంది.
-
హాయ్ సిరి, నేను ఎల్ఐసి జీవన్ ఉమంగ్, జీవన్ లాభ్ పాలసీలలో2019 నుంచి ఏడాదికి రూ. 1.24 లక్షల ప్రీమియం చెల్లిస్తున్నాను. ఇవి సరెండర్ చేయాలా లేక కొనసాగించాలా?
మీరు పేర్కొన్న పాలసీలలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇలాంటి పోలీసైలు వీలైనంత వరకు తీసుకోకపోవడం మేలు. అయితే, మీరు అధిక ప్రీమియం చెల్లిస్తున్నారు కాబట్టి 3-5 ఏళ్లలో లోపు సరెండర్ చేస్తే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. ఒకసారి ఎల్ఐసి బ్రాంచీ సందర్శించి వివరంగా వీటి సరెండర్ వేల్యూ తెలుసుకోవడం మేలు. దాన్ని బట్టి ఎప్పుడు సరెండర్ చేయాలో నిర్ణయించుకోవచ్చు. అలాగే, పేడ్ అప్ కూడా చేసే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీరు భవిష్యత్తు ప్రీమియంలు చెల్లించకుండా ఉండవచ్చు. పాలసీ మెచ్యూరిటీ సమయం లో మీరు చెల్లించిన ప్రీమియం వెనక్కి వస్తుంది. జీవిత బీమా కోసం మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్స్ ఇలా మీ రిస్క్ పరిమితి, అవసరాన్ని బట్టి పధకాన్ని ఎంచుకోవచ్చు.
-
హాయ్, నా పేరు వెంకటేశ్వరులు. ఆర్బీఐ బాండ్స్ వడ్డీ మీద టీడీఎస్ మినహాయింపు కోసం ఫారం 15G అందించవచ్చా?
మీరు పేర్కొన్న ఆర్బీఐ బాండ్స్ వడ్డీ మీద పూర్తి పన్ను వర్తిస్తుంది. అయితే, మీ వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షల లోపు ఉన్నట్టయితే ఫిక్సిడ్ డిపాజిట్ లాగా మీరు టీడీఎస్ మినహాయింపు కోసం ఇందులో ఫారం 15g/h అందించే వీలుంటుంది.
-
హాయ్, నా వయసు 50, నేనొక గృహిణిని. టర్మ్ ప్లాన్ తీసుకునే అర్హత నాకు ఉంటుందా?
సాధారణంగా, టర్మ్ ప్లాన్ అనేది కుటుంబం పెద్ద (అధిక సంపాదన) పేరు మీద తీసుకోవాల్సి ఉంటుంది. వారికి ఏదైనా జరిగితే ఈ ప్లాన్ ద్వారా కుటుంబానికి ఆర్ధికంగా భరోసా ఉంటుంది. చాలా వరకు కంపెనీలు గృహిణిలకి టర్మ్ ప్లాన్ అందించవు. మీ కుటుంబం ఎవరి మీద ఆర్ధికంగా ఆధారి పడుతుందో వారి పేరు మీద టర్మ్ ప్లాన్ తీసుకోవడం మేలు.
-
హాయ్ సిరి, నా వద్ద రూ. 1 కోటి బీమా హామీ గల ఐసీఐసీఐ టర్మ్ పాలసీ ఉంది. రూ. 1 కోటి బీమా హామీ తో మరో టర్మ్ పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాను. సలహా ఇవ్వండి.
టర్మ్ పాలసీ లో ప్రీమియం తో పాటు క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి చాలా ముఖ్యమైంది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సి, మాక్స్ లైఫ్, ఎస్బీఐ పాలసీల నిష్పత్తి చాలా బాగుంది. వీటిని పరిశీలించవచ్చు.
-
హాయ్ సిరి, నేను 2013 నుండి ఎల్ఐసి జీవన్ లక్ష్యలో సంవత్సరానికి రూ. 33 వేలు కడుతున్నాను. 2034 లో పాలసీ మెచ్యూరిటీ ఉంది. కొనసాగాలా, సరెండర్ చేయాలా?
మీరు ఎంచుకున్న పాలసీలో బీమా, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. వీలయితే ఈ పాలసీలని సరెండర్ చేయడం మంచిది. జీవిత బీమా కోసం ఆన్లైన్ టర్మ్ ప్లాన్ ఎంచుకోవచ్చు, ఇందులో అధిక బీమా మొత్తం తక్కువ ప్రీమియం తో పొందొచ్చు. మిగిలిన ప్రీమియం మొత్తంతో పెట్టుబడి పధకాలు ఎంచుకోవచ్చు. పీపీఎఫ్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి, పెన్షన్), మ్యూచువల్ ఫండ్స్ లాంటి పధకాలు మీ వీలు, అవసరం, రిస్క్ పరిమితి ని బట్టి ఎంచుకోవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేస్తే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.
-
సర్, నేను ఎల్ఐసి లో సుమారు రూ. 18000/- వరకు వివిధ పాలసిలలో ప్రీమియం లు కడుతున్నాను. అందులో మనీ బ్యాక్, జీవన్ ఆనంద్, జీవన్ మిత్ర, జీవన్ లాభ్, న్యూ భీమా గోల్డ్, న్యూ భీమా బచాత్ లు ఉన్నవి. ఇవి అన్నీ 2033, 2035 వరకు మేచ్యురిటి అవుతున్నవి. ఇంకా 5000 /- వరకు సేవింగ్స్ చేయాలనుకుటున్నాను. మీ సలహా చెప్పగలరు.
మీరు పాలసీలలో బీమా, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. వీలయితే ఈ పాలసీలని సరెండర్ చేయడం మంచిది. జీవిత బీమా కోసం ఆన్లైన్ టర్మ్ ప్లాన్ ఎంచుకోవచ్చు, ఇందులో అధిక బీమా మొత్తం తక్కువ ప్రీమియం తో పొందొచ్చు. మిగిలిన ప్రీమియం మొత్తంతో పెట్టుబడి పధకాలు ఎంచుకోవచ్చు. పీపీఎఫ్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి, పెన్షన్), మ్యూచువల్ ఫండ్స్ లాంటి పధకాలు మీ వీలు, అవసరం, రిస్క్ పరిమితి ని బట్టి ఎంచుకోవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేస్తే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.
-
నమస్తే సార్. నేను లక్ష రూపాయలు ఐదు సంవత్సరాల కోసం మదుపు చేయాలి. సురక్షితంగా ఉండే ఒక ప్లాన్ ని చెప్పండి.
మీరు ఎంచుకున్న కాలానికి రిస్క్ లేని పెట్టుబడులు ఎంచుకోవడం మేలు. 2-5 ఏళ్ళ వరకు బ్యాంకు ఫిక్సిడ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఆర్బీఎల్, యెస్ బ్యాంకు లాంటి వాటిల్లో కాస్త అధిక వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.
-
నమస్తే సర్, నా భార్య పేరున పీపీఎఫ్ ఖాతా తెరిచాను. ఇందులో పెట్టుబడి పెడితే నేను ఆదాయ పన్ను మినహాయింపు పొందగలనా?
పీపీఎఫ్ ఖాతా లో ఏడాదికి రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి సెక్షన్ 80C ద్వారా పన్ను మినహాయింపు పొందొచ్చు. మీరు మీ పీపీఎఫ్ ఖాతా తో పాటు మీ భార్య పీపీఎఫ్ ఖాతా లో పెట్టిన పెట్టుబడి కి కూడా మినహాయింపు పొందగలరు.
-
టర్మ్ పాలసీ ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? కొంచెం వివరంగా చెప్పండి.
టర్మ్ పాలసీ అనేది ఒక జీవిత బీమా పాలసీ. ఇందులో ఇతర పెట్టుబడులు ఉండవు కాబట్టి ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఈ పాలసీ తీసుకునేటప్పుడు మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు, పాలసీ కొనుగోలు కూడా చేయవచ్చు.
-
హాయ్ సిరి, నేను 2008 లో ఎల్ఐసి జీవన్ ఆనంద్ పాలసీ రూ. 5 లక్షల బీమాతో తీసుకున్నాను. సంవత్సరానికి రూ. 22,360 చెల్లిస్తున్నాను. 2032 లో మెచ్యూరిటీ అవుతుంది. దీనిని కొనసాగించాలా, లేదా? ఇంకా ఇతర ఏమైనా మార్గాలు తెలుపగలరు.
మీరు ఎంచుకున్న పాలసీ ఒక ఎండోమెంట్ పధకం. ఇందులో బీమా, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. వీలయితే ఈ పాలసీ ని సరెండర్ చేయడం మంచిది. జీవిత బీమా కోసం ఆన్లైన్ టర్మ్ ప్లాన్ ఎంచుకోవచ్చు, ఇందులో అధిక బీమా మొత్తం తక్కువ ప్రీమియం తో పొందొచ్చు. మిగిలిన ప్రీమియం మొత్తంతో పెట్టుబడి పధకాలు ఎంచుకోవచ్చు. పీపీఎఫ్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి, పెన్షన్), మ్యూచువల్ ఫండ్స్ లాంటి పధకాలు మీ వీలు, అవసరం, రిస్క్ పరిమితి ని బట్టి ఎంచుకోవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేస్తే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.
-
హాయ్ సిరి, నా నెలసరి ఆదాయం రూ. 1 లక్ష. నేను 15 ఏళ్లలో రూ. 2 కోట్లు సమకూర్చుకోవాలంటే ఎలా?
మీరు అనుకున్నట్టు 15 ఏళ్ళల్లో రూ. 2 కోట్లు సమకూర్చుకోవాలంటే, 12 శాతం రాబడి అంచనా ప్రకారం నెల నెలా సుమారుగా రూ. 40 వేలు మదుపు చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. ఒక ఇండెక్స్ ఫండ్, ఒక మిడ్ కాప్ ఫండ్ లో రూ. 20 వేలు చొప్పున సిప్ చేయడం మంచిది. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, హెచ్‌డీఫ్‌సి మిడ్ కాప్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
ప్రస్తుతం నేను నెలకు రూ. 21000 రూపాయలు సిప్ ద్వారా జమచేస్తున్నాను. గత నాలుగు సంవత్సరాలనుంచి పెడుతున్నాను. నాకు అధిక మొత్తంలో రావాలంటే ఎన్ని సంవత్సరాలు జమచేయవలెను? నేను సీనియర్ సిటిజెన్ ని. దీని ఫై ఆదాయపు పన్ను ఉంటుందా? దయవుంచి తెలుపగలరు.
మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఉంటుంది. మీరు మదుపు చేసిన ఫండ్స్ గురించి మాకు తెలుపలేదు కాబట్టి అందులో ఎంత వరకు రిస్క్ ఉందనేది తెలుపలేము. అయితే, కనీసం 10 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. పెట్టుబడి పెట్టిన 1 ఏడాది తరవాత మ్యూచువల్ ఫండ్స్ అమ్మినప్పుడు లాభం పై (రూ. 1 లక్ష పైన ఉన్న లాభం పై) 10 శాతం వరకు పన్ను ఉంటుంది.
-
డియర్ సిరి, నేను మ్యూచువల్ ఫండ్స్ లో నెలకి రూ. 6 వేలు మదుపు చేస్తున్నాను. ఇది ఆపేసి షేర్ మార్కెట్ లో మదుపు చేయవచ్చా?
మ్యూచువల్ ఫండ్స్ అనేక రకాల కంపెనీల షేర్స్ లో మదుపు చేస్తుంటాయి. దీని వల్ల రిస్క్ కొంత వరకు తగ్గే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత షేర్స్ లో మదుపు చేయడానికి కాస్త ఎక్కువ పెట్టుబడి అవసరం పడవచ్చు. అలాగే, ఇందులో రిస్క్ కూడా ఎక్కువే. సమయం, నైపుణ్యం ఉన్నట్టయితే మీరు నిపుణుల్ని సంప్రదించి షేర్స్ లో మదుపు చేయవచ్చు.
-
మూడు సంవత్సరాల కాలంలో 200 గ్రాముల బంగారం నా కూతురి వివాహం కోసం అవసరమయి ఉన్నది. నెలకు రూ. 15 నుంచి 20 వేల వరకు పెట్టుబడి పెట్టగలను. దానికి సంబంధించిన గోల్డ్ పెట్టుబడుల గురించి సమాచారం అందించగలరు.
మీరు డిజిటల్ గోల్డ్ రూపం లో ఇప్పుడున్న బంగారం ధర ఆధారంగా బంగారం కొనుగోలు చేయవచ్చు. దీన్ని గోల్డ్ బార్లు, కాయిన్ ల రూపం లో రిడీమ్ చేసుకోవచ్చు. లేదంటే, అప్పటి ధర ఆధారంగా, నగదు రూపం లో కూడా వెనక్కి తీసుకోవచ్చు. మీ వీలు ప్రకారం నెల నెలా కొంత బంగారాన్ని డిజిటల్ గోల్డ్ లో కొనుగోలు చేయవచ్చు. ఇది జీపే, పేటీఎం, గ్రో యాప్స్ లో అందుబాటు లో ఉంటాయి. పెట్టుబడి కోసం అయితే గోల్డ్ ఈటీఎఫ్ కూడా ఎంచుకోవచ్చు. దీనికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి.
-
నమస్తే సర్, నా పేరు నరేష్. మదుపు కోసం షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఏది మంచిది? తెలుపగలరు.
వ్యక్తిగత షేర్స్ లో రిస్క్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇందులో మదుపు చేయడానికి నైపుణ్యం, సమయం అవసరం. మంచి షేర్లు ఎంచుకోవడానికి పెట్టుబడి కూడా కాస్త ఎక్కువే కావాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ప్రతి ఫండ్ ఒక ఫండ్ మేనేజర్ ని నియమిస్తారు. వారు కొన్ని షేర్స్ ని ఎంచుకుని అందులో మదుపు చేస్తారు. ఇందులో నెల నెలా రూ. 500 నుంచి మొదలు పెట్టి సిప్ ద్వారా మదుపు చేయవచ్చు. మీ వీలు, రిస్క్ పరిమితి, పెట్టుబడి ఆధారంగా పెట్టుబడి పధకం ఎంచుకోవడం మేలు.
-
సర్, నా నెలసరి ఆదాయం రూ. 28 వేలు. ప్రతి నెలా ఖర్చులు పోను రూ. 10 నుంచి 12 వేలు మదుపు చేయగలను. సలహా ఇవ్వండి.
మీరు దీర్ఘకాలం కోసం సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి నెలా మదుపు చేయవచ్చు. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో కొంత వరకు రిస్క్ ఉంటుంది, దీర్ఘ్కాలం లో మంచి రాబడి పొందే అవకాశం కూడా ఉంటుంది. రిస్క్ లైన్ పధకాలు కావాలంటే పీపీఎఫ్ లాంటివి ఎంచుకోవచ్చు. ఎన్పీఎస్ లో మదుపు చేస్తే పదవీ విరమణ నిధి తో పాటు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.
-
నాకు జీతం తో పాటు ఈ ఏడాది ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ, మ్యూచువల్ ఫండ్ రాబడి అందాయి. ఐటీఆర్ 1, 2 లో ఏది ఫైల్ చేయాలి?
మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అమ్మకం ద్వారా మూలధన ఆదాయం పొందిన వారు ఐటీఆర్-2 ఫారం ద్వారా ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇందులోనే మీరు ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ కూడా తెలుపవచ్చు.
-
మా బాబు కోసం నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్స్ సూచించండి.
మీరు మీ అబ్బాయి ని నామినీగా ఉంచి మీ పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయవచ్చు. నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్స్ లో కొన్ని మిడ్ కాప్ షేర్ లు కూడా ఉంటాయి, కాబట్టి ఇందులో కాస్త రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రాబడి కూడా నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ కంటే కాస్త ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి.మీరు ఐసీఐసీఐ పృ నిఫ్టీ నెక్స్ట్ 50, యూటీఐ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్స్ పరిశీలించండి. డైరెక్ట్ ప్లాన్ లో మదుపు చేయడం మేలు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నేను ఎస్బిఐ టర్మ్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ లో తీసుకున్నాను. నా ఆరోగ్య అలవాట్లు అన్నీ ఆన్ లైన్ లో పూర్తిగా తెలియజేశాను. స్మోకర్ రేట్ మీద ప్రీమియం కూడా చెల్లించాను కానీ మెడికల్ టెస్ట్ చేసే సమయంలో కొన్ని ప్రశ్నల అప్ప్లికేషన్ మీద నా సంతకం తీసుకుని వారే నింపుకున్నారు. అందులో నా మధ్యపానం, ధూమపానం అలవాట్లు తప్పుగా రాశారు. నేను మాత్రం అన్నీ సరిగానే ఫిల్ చేశాను, ఈ విషయం వారికి నేను మెయిల్ ద్వారా తెలియజేశాను కానీ స్పందించలేదు. ఇప్పటికే ఒక సంవత్సరం గడిచినది. క్లెయిమ్ విషయం లో ఏమైనా సమస్య అవుతుందా? తెలియజేయగలరు.
ఆరోగ్య అలవాట్ల విషయం లో సమాచారం సరిగ్గా లేకపోతే క్లెయిమ్ సమయం లో మీ కుటుంబం ఇబ్బందులకు గురి కావచ్చు. మీరు మరో సారి ఎస్బీఐ కి ఈ విషయాన్నీ తెలియజేయండి. ఒకవేళ వారి నుంచి స్పందన లేకపోతే మీరు ఐఆర్డీఏ కి కూడా తెలియజేయవచ్చు. మీరు ప్లాన్ రెన్యువల్ చేసే సమయం లో కూడా కంపెనీ కి ఈ విషయాలని తెలియజేయవచ్చు. రెన్యువల్ సమయం లో మరో కంపెనీ నుంచి కూడా టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయవచ్చు.
-
షేర్ మార్కెట్ కోసం మంచి యాప్ సూచించండి.
షేర్లలో పెట్టుబడి చేసేందుకు డీమ్యాట్ ఖాతాను ఏదైనా బ్రోకింగ్ సంస్థ నుంచి తీసుకోవాలి. దీంట్లో ట్రేడింగ్ , డీమ్యాట్ ఖాతాలుంటాయి. ట్రేడింగ్ ఖాతా ద్వారా షేర్ల క్రయవిక్రయాలు చేయవచ్చు. డీమ్యాట్ ఖాతాలో మీరు కొనుగోలు చేసిన షేర్లు భద్రంగా ఉంటాయి. డిపాజిటరీ సంస్థలో మీరు కొనుగోలు చేసిన షేర్లు డీమెటిరీయలైజెడ్ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. షేర్లలో పెట్టుబడి నష్టభయం కలిగి ఉంటుంది . కాబట్టి మీ నష్టభయం అంచనా వేసుకుని నేరుగా షేర్లలో మదుపు చేయాలి. షేర్ల ఎంపికలోనిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది. మీరు వెబ్సైటు లేదా యాప్ ఎంచుకునే ముందు వాటి బ్రోకరేజీ చార్జీలు, వార్షిక చార్జీలు, సేవలు లాంటివి తెలుసుకోవడం మేలు. షేర్ ఖాన్, జెరోధా, ఐసీఐసీఐ డైరెక్ట్ లాంటి వాటిని పరిశీలించండి.
-
నా వయసు 32. నా పదవీ విరమణ కి 28 ఏళ్ళు ఉన్నాయి. సిప్ ద్వారా నెలకి రూ. 5000 మదుపు చేయాలి అనుకుంటున్నాను. ఎందులో పెట్టాలి, పెట్టుబడి ఎంత రావచ్చు?
పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం ఎన్పీఎస్ మంచి పెట్టుబడి. 60 ఏళ్ళ వయసు వరకు మదుపు చేయవచ్చు. ఆ తరవాత సమకూర్చుకున్న నిధి లో 60 శాతం వెనక్కి తీసుకోవచ్చు, మిగతా 40 శాతం మొత్తం తో పెన్షన్ పొందొచ్చు. ఎన్పీఎస్ తో పాటు మ్యూచువల్ ఫండ్స్ కూడా పరిశీలించండి. ఇండెక్స్ ఫండ్స్ లో నెల నెలా మదుపు చేయవచ్చు.
-
నేను మా బాబు కోసం 15 ఏళ్ల వరకు ఎక్కువ రాబడి వచ్చేలా రూ. 25000 పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నాను. మా బాబుకి 1 సంవత్సరం వయసు. నేను ఏ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలో చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ లో మన అసలు పెట్టుబడికి ఎటువంటి సమస్యలు వస్తాయి? మెచ్యూరిటీ సమయం లో ఏమైనా చార్జీలు వేస్తారా? నేను గూగుల్ లో చూస్తే రాబడి 95 శాతం అని, అధిక రిస్క్ అని చూపిస్తుంది. సలహా ఇవ్వండి.
మ్యూచువల్ ఫండ్స్ అనేక రకాల షేర్స్ లో మదుపు చేస్తాయి, కాబట్టి రిస్క్ ఉంటుంది. ఫండ్ ని బట్టి రిస్క్ మారుతుంది. స్మాల్ కాప్ ఫండ్స్ లో అత్యధిక రిస్క్ ఉంటుంది, లార్జ్ కాప్ ఫండ్స్ లో తక్కువగా ఉంటుంది. మీరు ఒకేసారి పెట్టుబడి పెట్టి, దానితో పాటు సిప్ కూడా చేయడం మంచిది. ఇందులో ఎంత రాబడి వస్తుందో కచ్చితంగా చెప్పలేము. కనీసం 10 ఏళ్ళు మదుపు చేస్తే నష్టభయం చాలా వరకు తగ్గుతుంది. సగటున వార్షిక రాబడి 10-12 శాతం వరకు ఆశించవచ్చు. బీమా పధకాల వలే మ్యూచువల్ ఫండ్స్‌కి మెచ్యూరిటీ ఉండదు. మీరు యూనిట్స్ వెనక్కి తీసుకున్నప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇండెక్స్ ఫండ్స్ ఎంచుకోవచ్చు, ఇందులో కాస్త రిస్క్ తక్కువ. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్ సిరి, ఎన్పీఎస్ పధకం, దాని ప్రయొజనాలు తెలపగలరు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) ఖాతా ద్వారా పెట్టుబడి చేస్తే పదవీవిరమణ అనంతరం జీవించేందుకు మంచి మొత్తం మీకు లభిస్తుంది. ఎన్పీఎస్ లో ఆటో ఛాయస్ ఆప్షన్ ద్వారా మీరు ఈక్విటీ, డెట్ రెండింటిలో కలిపి వయసు ఆధారంగా పెట్టుబడి చేసేందుకు అవకాశం ఉంటుంది. మీ వీలు ప్రకారం ఇందులో నెల నెలా లేదా ఏడాదికి ఒకసారి మదుపు చేయవచ్చు. ఏడాదికి గరిష్ట పరిమితి రూ. 1.50 లక్షలు. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. సెక్షన్ 80C కాకుండా అదనంగా మరో రూ. 50 వేలు మదుపు చేసి దానికి కూడా పన్ను మినహాయింపు పొందగలరు. 60 ఏళ్ళ వయసు తరవాత ఖాతా లో ఉన్న కార్పస్ ని కొన్నేళ్లు కొనసాగించవచ్చు. లేదంటే, కొంత మొత్తం వెనక్కి తీసుకుని మిగతా వాటితో పెన్షన్ పొందొచ్చు.
-
షేర్ మార్కెట్ అంటే ఏంటి? ఎలా పెట్టుబడి చేయాలి?
షేర్ మార్కెట్ గురించి అవగాహన ఏర్పరుచుకోవాలనే మీ ఆలోచన మంచిది. దీని గురించి తెలుసుకునేందుకు చాలా పుస్తకాలు,వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎన్ఎస్ఈ లో ఉన్న కంపెనీల గురించి అవి చేసే వ్యాపారాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఎన్ఎస్ఈ వెబ్సైటు లో చూడొచ్చు. షేర్లలో పెట్టుబడి చేసేందుకు డీమ్యాట్ ఖాతాను ఏదైనా బ్రోకింగ్ సంస్థ నుంచి తీసుకోవాలి. దీంట్లో ట్రేడింగ్ , డీమ్యాట్ ఖాతాలుంటాయి. ట్రేడింగ్ ఖాతా ద్వారా షేర్ల క్రయవిక్రయాలు చేయవచ్చు. డీమ్యాట్ ఖాతాలో మీరు కొనుగోలు చేసిన షేర్లు భద్రంగా ఉంటాయి. డిపాజిటరీ సంస్థలో మీరు కొనుగోలు చేసిన షేర్లు డీమెటిరీయలైజెడ్ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. షేర్లలో పెట్టుబడి నష్టభయం కలిగిఉంటుంది. కాబట్టి మీ నష్టభయం అంచనా వేసుకుని నేరుగా షేర్లలో మదుపు చేయాలి. షేర్ల ఎంపికలో నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది.
-
హాయ్ సిరి, పదవీ విరమణ కోసం ఎన్పీఎస్, ఎల్ఐసి జీవన్ ఉమంగ్ లో ఏది మంచిది?
జీవన్ ఉమంగ్ ఒక హోల్ లైఫ్ బీమా పధకం. ఇందులో బీమా, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. మీరు ఎన్పీఎస్ లో మదుపు చేయడం మంచిది. ఇందులో మంచి రాబడి పొందొచ్చు. పెన్షన్ కూడా పొందే వీలుంటుంది. జీవిత బీమా కోసం ఆన్లైన్ టర్మ్ ప్లాన్ ఎంచుకోవడం మేలు.
-
డియర్ సిరి, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని, వయసు 38, భార్య వయసు 32. నాకు 7 ఏళ్ళ వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంచి టర్మ్ ప్లాన్ సూచించండి.
మీరు ఎంచుకునే టర్మ్ ప్లాన్ లో మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. 25 ఏళ్ళ కాలపరిమితి తో పాలసీని ఎంచుకోవచ్చు. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను, నా వార్షిక ఆదాయం సుమారుగా 8 లక్షలు. ప్రస్తుతం నా వయస్సు 41 సంవత్సరాలు. నేను గత ఏడాది 2020 డిసెంబర్ లో మాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్రీమియం బ్యాక్ ఆప్షన్ తో కట్టాను. పాలసీ 2066 వరకు ఉన్నప్పటికీ 5 ఏళ్ళ లోనే ప్రీమియం చెల్లించే ఆప్షన్ ఎంచుకున్నాను. నేను ఈ పాలసీ కట్టడం మానేసి కొత్తగా టర్మ్ ప్లాన్ తీసుకుం దీర్ఘకాలం ప్రీమియం చెల్లించే ఆప్షన్ పెట్టుకోవడం మంచిదా? లేక ఇదే పాలసీ మిగతా 4 సంవత్సరాలు కట్టి కొనసాగడం మంచిదా? దయచేసి నాకు సలహా ఇవ్వగలరు.
ఇలా తక్కువ కాల పరిమితి తో ప్రీమియం చెల్లించే ఆప్షన్ కి దూరంగా ఉండడం మేలు. ద్రవ్యోల్బణాన్ని ద్రుష్టి లో ఉంచుకుని చుస్తే మీరు చెల్లించే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మీరు దీర్ఘకాలం ప్రీమియం చెల్లించే టర్మ్ ప్లాన్ ఎంచుకోవడం మంచిది. అలాగే, ప్రీమియం వెనక్కి అందించే టర్మ్ ప్లన్స్ లో అధిక ప్రీమియం వసూలు చేస్తారు. మీరు సాధారణ టర్మ్ ప్లాన్ ఎంచుకోవడం మేలు.
-
హాయ్, నా వయసు 48. నేను 25 ఏళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. నా పెట్టుబడులు ఇలా ఉన్నాయి - స్థిరాస్తి - 60 శాతం, ఈక్విటీ & మ్యూచువల్ ఫండ్స్ - 15 శాతం, బంగారం - 10 శాతం, ఈపీఎఫ్ & ఫిక్సిడ్ డిపాజిట్లు - 15 శాతం. స్థిరాస్తి నుంచి 10 శాతం మొత్తాన్ని ఈక్విటీ లో మార్చుకోవచ్చంటారా? అధిక రిస్క్ కూడా తీసుకోగలను.
వివిధ రకాల పథకాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిదే. స్థిరాస్తి అధిక ధరల వాళ్ళ అందులో కాస్త అధికంగా పెట్టుబడి ఉండడం కూడా సహజమే. మీ అవసరాన్ని బట్టి 10 శాతం మొత్తాన్ని ఈక్విటీ లో మార్చుకోవచ్చు. అయితే, ఒకేసారి కాకుండా 5-6 నెలలలో దశల వారీగా ఇది చేయడం మంచిది. రిస్క్ తీసుకోగలరు కాబట్టి ఒక మిడ్ కాప్ ఫండ్ ఎంచుకోవచ్చు. హెచ్డీఎఫ్సీ మిడ్ కాప్ లేదా ఎస్బీఐ స్మాల్ కాప్ ఎంచుకోవచ్చు. డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవడం వల్ల మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
సర్, నేను ఎల్ఐసి జీవన్ ఉమంగ్ పాలసీని 2019 మార్చ్ లో ప్రీమియం కట్టి తీసుకున్నాను కానీ పరిస్థితుల వల్ల 1 ఏడాది కట్టాక 2020 మరియు 2021 లో కరోనా పరిస్థితి వల్ల డబ్బు కట్టలేదు. ఇప్పుడు నా ప్రీమియం డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉందా? పిల్లల భవిషత్తు కు ఉపయోగ పడే పాలసీ చెప్పండి. నాకు మంచి సలహా ఇవ్వండి.
సాధారణంగా, కనీసం 3 ఏళ్ళ పాటు ప్రీమియం చెల్లిస్తే కానీ పాలసీ సరెండర్ చేసే వీలుండదు. ఆ తరవాత కూడా కొంత వరకే వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక పై ప్రీమియం లు చెల్లించకపోవడం మేలు. మీరు పాలసీ ని పెయిడ్ అప్ చేసినట్టయితే మెచ్యూరిటీ తరవాత ఈ ప్రీమియం మొత్తాన్ని మీరు తిరిగి పొందగలరు. మరిన్ని వివరాలకై ఎల్ఐసి ఆఫీసు ని సంప్రదించడం మంచిది. బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పాలసీల నుంచి దూరంగా ఉండడం మంచిది. పిల్లల కోసం పీపీఎఫ్ ఎంచుకోవచ్చు. కాస్త రిస్క్ తీసుకోగలిగితే దీర్ఘకాలం కోసం మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ ద్వారా మదుపు చేయవచ్చు. ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. ఆడపిల్లల కోసం అయితే సుకన్య సమృద్ధి యోజన ఎంచుకోవచ్చు.
-
నేను ప్రతి నెల రూ. 75000 జీతం వస్తుంది. మా పాపకి ఇపుడు 2 సంవత్సరాలు. వచ్చే 5 సంవత్సరాల్లో. రూ. 10 లక్షలు సంపాదించాలి అంటే ఎందులో జమ చెయ్యాలి?
మీరు తెలిపిన కాల వ్యవధికి రిస్క్ లేని పధకాలు ఎంచుకోవడం మేలు. 5 ఏళ్ళ పాటు మీరు బ్యాంకు రికరింగ్ డిపాజిట్ లో (6 శాతం సగటు రాబడి చొప్పున) నెల నెలా రూ. 15 వేలు మదుపు చేసి రూ. 10 లక్షలు సమకూర్చుకోవచ్చు. దీర్ఘకాలం కోసం మీ పాప పేరు మీద సుకన్య సమృద్ధి యోజన లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఇది బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసు లో అందుబాటులో ఉంటుంది.
-
సర్, నేను మాక్స్ లైఫ్ పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాను. రూ. 1 కోటి బీమా కి ఆన్లైన్ లో రూ. 34 వేలు ఉండగా ఏజెంట్ రూ. 36 వేలు చెప్తున్నాడు. దీని పై సలహా ఇవ్వండి.
ఆన్లైన్ టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. పాలసీ పరంగా ఆన్లైన్ కి ఏజెంట్ ద్వారా తీసుకున్న దానికి వ్యత్యాసం ఉండదు. క్లెయిమ్ సమయం లో మీ కుటుంబం నేరుగా కంపెనీ ని సంప్రదించవచ్చు. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో మీరు ప్రీమియం పరిశీలించవచ్చు.
-
నేను మరో 6 ఏళ్లలో పదవీ విరమణ తీసుకుంటాను. నా వద్ద ఇప్పుడు రూ. 7.50 లక్షలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్పీఎస్ లో నెలకి రూ. 15 వేలు మదుపు చేస్తున్నాను. నా వద్ద ఉన్న మొత్తాన్ని కూడా ఇందులో మదుపు చేయాలా లేక ఏదైనా పెన్షన్ పధకం ఎంచుకోవాలా?
చాలా వరకు పెన్షన్ పధకాలు పదవీ విరమణ తీసుకున్నాకే పెట్టుబడి కోరతారు. అప్పటి వరకు మీరు ఫిక్సిడ్ డిపాజిట్ లో ఈ పెట్టుబడి పెట్టడం మంచిది. ఆ తరవాత సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పధకం లేదా ఎల్ఐసి వయ వందన యోజన లో పెట్టుబడి పెట్టి పెన్షన్ పొందొచ్చు.
-
సర్, నేను ఆక్సిస్ బ్యాంకు నుంచి ఇంటి రుణం తీసుకున్నాను. దీని పై మంచి బీమా సూచించండి.
మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీ ఇంటి రుణ మొత్తం కూడా కలిపి బీమా తీసుకోవచ్చు. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
సర్, నా వార్షిక ఆదాయం రూ. 8 లక్షలు. రాబోయే 5 ఏళ్ళ వరకు ఇల్లు కొనదల్చుకోలేదు. నేను ఇప్పటికే సెక్షన్ 80C లో రూ. 1.50 లక్షలు, ఎన్పీఎస్ లో రూ. 50 వేలు, సెక్షన్ 80D లో రూ. 50 వేలు చొప్పున మినహాయింపు పొందుతున్నాను. మరేమైనా చేయవచ్చా?
రూ. 5 లక్షల వరకు ఉన్న ఆదాయం పై పన్ను వర్తించదు. మీరు కొత్త పన్ను విధానం బదులు పాత విధానం ఎంచుకోవడం మేలు. ఇందులో రూ. 50 వేల వరకు ప్రామాణిక తగ్గింపు పొందుతారు. అలాగే, పీఎఫ్ మినహాయింపు కూడా కలిపి మీ ఆదాయాన్ని రూ. 5 లక్షల కంటే తక్కువ లెక్కించవచ్చు. దీని పై ఒకవేళ మీ ఉద్యోగ సంస్థ పన్ను డిడక్ట్ చేస్తే మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసి రిఫండ్ పొందొచ్చు.
-
హాయ్ సిరి, నేను 30 శాతం పన్ను స్లాబు లో ఉన్నాను. దాదాపు రూ. 2 లక్షల వరకు నా భార్య ప్రసవం కోసం ఖర్చు చేశాను. దీనిపై పన్ను మినహాయింపు ఉంటుందా?
ప్రసవం కోసం చేసే ఖర్చులను పన్ను మినహాయింపు కోసం ఉపయోగించే వీలుండదు. అయితే, 60 ఏళ్ళు పైబడిన కుటుంబ సభ్యుల మీద చేసే వైద్య ఖర్చులకు ఏడాదికి రూ. 40 వేల వరకు మినహాయింపు పొందే వీలుంటుంది. ఆరోగ్య బీమా ఉన్నట్టయితే ఇది వర్తించదు. ఆరోగ్య బీమా ఉన్న వారు దాని ప్రీమియం మీద సెక్షన్ 80D ద్వారా మినహాయింపు పొందొచ్చు.
-
హాయ్ సర్, నా వయసు 20. నేను నిర్దేశించుకున్న సమయం కేవలం 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలలో 50 లక్షలు చేకూర్చుకోవాలి అనుకుంటున్నాను. నా నెలసరి ఆదాయం రూ. 25,000. ఇందుకుగాను నేను ఎలా పొదుపు చెయ్యాలో చెప్పండి.
మీరు తెలిపిన సమయం లో రిస్క్ తో కూడిన పథకాల్లో మదుపు చేయడం మంచిది కాదు. కాబట్టి, కాస్త తక్కువ రాబడి ఇచ్చే సురక్షితమైన పధకాలు ఎంచుకోవడం మేలు. 5 ఏళ్ళ కోసం రికరింగ్ డిపాజిట్ లో నెల నెలా మదుపు చేయవచ్చు. 6 శాతం వడ్డీ చొప్పున్న 5 ఏళ్ళ పాటు రూ. 15 వేలు మదుపు చేస్తే, సుమారుగా రూ. 10 లక్షలు సమకూర్చుకోవచ్చు. కనీసం 10 ఏళ్ళ కోసం అయితే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. సగటున 12 శాతం రాబడి చొప్పున రూ. 15 వేలు మదుపు చేస్తే సుమారుగా రూ. 35 లక్షల వరకు సమకూర్చుకోవచ్చు. అయితే, ప్రతి ఏడాది పెట్టుబడి మొత్తంన్ని 10-11 శాతం చొప్పున పెంచుతూ వెళితే మీ రూ. 50 లక్షల లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది.
-
నాకు 15 రోజుల క్రితం పాప పుట్టింది, నాలుగు సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. ఉన్నత చదువులకి, పెళ్లికి ఇప్పటి నుంచి నేను నెలకు ఎంత పొదుపు చేయాలి? ఏ పథకంలో ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగించాలి? గ్యారెంటీ ఉన్న పథకాలు ఉంటె తెలపగలరు.
ఆడపిల్లల కోసం ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పధకం ప్రవేశ పెట్టింది. ఇందులో 7.6 శాతం వడ్డీ పొందొచ్చు. 15 ఏళ్ళ పాటు మదుపు చేయాల్సి ఉంటుంది, మీ పాప ఉన్నత చదువు, పెళ్లి కోసం ఈ డబ్బు ఉపయోగ పడుతుంది. అలాగే, సురక్షితమైన పధకం కావాలంటే మీ అబ్బాయి కోసం పీపీఎఫ్ పధకం లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది 15 ఏళ్ళ పధకం. ఇందులో 7.1 శాతం వడ్డీ పొందొచ్చు.
-
హలో సర్, నా వయసు 34. నా వార్షిక ఆదాయం రూ. 20 లక్షలు. నా వద్ద ప్రస్తుతం రూ. 21 లక్షల (ప్రస్తుత విలువ) ఇంటి రుణం ఉంది. రూ. 80 లక్షలతో మరో ఫ్లాట్ కొందామనుకుంటున్నాను. పాత రుణం తీర్చాకే కొత్త దానికి దరఖాస్తు చేసుకోవాలా? నా వద్ద దానికి సరిపడా డబ్బు ఉంది. సలహా ఇవ్వండి.
బ్యాంకులు మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్, ఉద్యోగ సంస్థ లాంటి వాటి ఆధారంగా ఇంటి రుణాన్ని అందిస్తుంటాయి. మీ ఆదాయం ప్రకారం సుమారుగా రూ. 1.30 కోటి వరకు రుణం పొందే అర్హత ఉండవచ్చు. కాబట్టి, కొత్త రుణం కోసం పాత రుణం తీర్చాల్సిన అవసరం ఉండదు. కొంత మొత్తం వరకు పాత రుణానికి తిరిగి చెల్లిస్తే రుణం భారం తగ్గుతుంది. రుణ అర్హత కోసం మీ బ్యాంకు ని సంప్రదించండి.
-
సర్, నా పేరు బాపూజీ ప్రసాద్, వయసు 50. నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేను. పదవీ విరమణ కోసం ఎలా మదుపు చేయాలి? నెలసరి పెన్షన్ రూ. 30 వేలు రావడానికి ఎందులో చేయాలి?
పదవీ విరమణ కోసం మీరు ఎన్పీఎస్ ఎంచుకోవచ్చు. ఇందులో వయసు ఆధారంగా ఈక్విటీ, డెట్ లో మదుపు చేయవచ్చు. ఆటో ఛాయస్ ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పటి నుంచి 10 ఏళ్ళ పాటు ఇందులో నెల నెలా రూ. 20 వేలు మదుపు చేస్తే పదవీ విరమణ నిధి తో పాటు రూ. 8 వేలు పెన్షన్ పొందగలరు. పొందిన నిధి ని పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పధకం లో మదుపు చేస్తే మరో రూ. 9 వేలు పెన్షన్ పొందగలరు. ఎన్పీఎస్ లో 65 ఏళ్ళ వరకు మదుపు చేస్తే మరింత నిధి, పెన్షన్ పొందగలరు.
-
హాయ్ సర్, నా వయసు 30. నా వార్షిక ఆదాయం రూ. 10.50 లక్షలు. నెలకి రూ. 10 వేలు మదుపు చేయగలను. మంచి పధకం సూచించండి.
ముందుగా మీరు మీ ఆర్ధిక లక్ష్యాలను నిర్ణయించుకోవడం మంచిది. వాటి కాలపరిమితి, మీ పెట్టుబడి, రిస్క్ పరిమితి లాంటి వాటిని బట్టి పధకాన్ని ఎంచుకోవచ్చు. స్వల్పకాలానికి, అంటే 1-5 ఏళ్ళ కోసం బ్యాంకు రికరింగ్ డిపాజిట్ మేలు. దీర్ఘకాలం కోసం (కనీసం 7-10 ఏళ్ళు) మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ లో మదుపు చేస్తే కాస్త రిస్క్ తగ్గుతుంది. అలాగే, 15 ఏళ్ళ కోసం రిస్క్ లేని పధకాలు ఎంచుకోవాలంటే పీపీఎఫ్ ఎంచుకోవచ్చు. పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం ఎన్పీఎస్ మేలు.
-
నేను ఒక ఐసీఐసీఐ పాలసీ లో ఏడాదికి రూ. 20 వేలు మదుపు చేశాను. డిసెంబర్ 2021 లో మెచ్యూరిటీ మొత్తం రూ. 4 లక్షలు రానున్నాయి. ఇవి తీసుకోకుండా నెల నెలా పెన్షన్ తీసుకోవచ్చు లేదా కొంత మొత్తం తీసుకుని కొంత పెన్షన్ కూడా తీసుకోవచ్చు. సలహా ఇవ్వండి.
మీరు పెన్షన్ మొత్తం తెలుపలేదు కాబట్టి, రాబడి గురించి మేము మీకు తెలుపలేకపోతున్నాము. ప్రధాన మంత్రి వయ వందన యోజన లో 7.40 శాతం రాబడి చొప్పున రూ.4 లక్షల పెట్టుబడికి మీరు నెలసరి పెన్షన్ రూ. 2,667 పొందొచ్చు. ఇది 10 ఏళ్ళ పధకం. దీన్ని ఐసీఐసీఐ పాలసీ తో పోల్చుకుని మీరు సరైన నిర్ణయం తీసుకోవచ్చు.
-
సర్, మీ సమాధానాలు చాలా బాగుంటాయి. ఐసీఐసీఐ గారంటీడ్ వెల్త్ ప్రొటెక్టర్ లేదా ఎక్సైడ్ లైఫ్ గారంటీడ్ వెల్త్ ప్లస్ పధకాలలొ మదుపు చేయవచ్చా? తెలుపగలరు. ఇవి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ లొ చేయడం మంచిదా? తెలుపగలరు.
మీరు పేర్కొన్న పాలసీలు యూలిప్ పధకాలు. ఇందులో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. వీటి నుంచి దూరంగా ఉండడం మేలు. జీవిత బీమా కోసం ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. పీపీఎఫ్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం) లాంటి పధకాలు కూడా మీ వీలు, అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు.
-
సర్, నా వయసు 48, ఐటీ ఉద్యోగిని. నేను ఏగాన్ నుంచి రూ. 1 కోటి బీమా హామీ గల టర్మ్ ప్లాన్ తీసుకున్నాను. దీనితో పాటు పీపీఎఫ్, ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మదుపు చేశాను. పెన్షన్ కోసం జీవన్ శాంతి పాలసీ కూడా తీసుకోవడం మంచిదేనా?
మీ వార్షిక ఆదాయం లో కనీసం 10-12 రేట్లు బీమా హామీ తో టర్మ్ ప్లాన్ తీసుకున్నారని ఆశిస్తున్నాము. ఎన్పీఎస్ అనేది పదవీ విరమణ పధకం. 60 ఏళ్ళ తరవాత కూడా ఇందులో కొనసాగవచ్చు. కొంత మొత్తాన్ని ఒకేసారి తీసుకుని, మిగిలిన దాన్ని పెన్షన్ రూపం లో నెల నెలా పొందే వీలుంటుంది. ఇతర పెన్షన్ పధకాల బదులు ఎన్పీఎస్ లో పెట్టుబడి పెంచడం మేలు. రాబడి కూడా బాగుంటుంది.
-
హాయ్ సిరి, నేను రూ. 5 లక్షల అత్యవసర నిధి చేకూరుద్దాం అనుకుంటున్నాను. నెలకి రూ. 20 వేల వరకు మదుపు చేయగలను. దీనికోసం ఏదైనా పధకం తెలియజేయండి.
సాధారణంగా, ఒక వ్యక్తి 6 నెలలకు సరిపడా ఖర్చులను అత్యవసర నిధి రూపం లో ఉంచడం మంచిది. వీటిని బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ చేయడం మేలు. ఆ తరవాత మెచ్యూరిటీ మొత్తాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ చేయవచ్చు. యెస్ బ్యాంకు, ఆర్బీఎల్ లాంటి బ్యాంకులను పరిశీలించండి, కాస్త అధిక వడ్డీ పొందే వీలుంటుంది.
-
సర్, నేను ఇంటి రుణం తీసుకుని 2005 లో రూ. 7 లక్షలతో ఇల్లు కొన్నాను. ఇప్పుడు రూ. 70 లక్షల విలువ ఉంది. దాన్ని అమ్మేసి మరో ఇల్లు కొందామనుకుంటున్నాను. దీని పై పన్ను ఉంటుందా?
మీరు ఇల్లు అమ్మిన 2 ఏళ్ళ లోపు మరో ఇంటిని కొనుగోలు చేస్తే మూలధన ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందొచ్చు. అయితే, మీరు కొనుగోలు చేసిన విషయాన్ని మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ లో తెలపవలసి ఉంటుంది.
-
హాయ్, మా నాన్నగారి పేరున ఉన్న స్థలం అమ్మి, ఆ డబ్బులతో 2-3 నెలల లోపు నా పేరున ఫ్లాట్ కొనుక్కుంటే, ఆదాయ పన్ను రిటర్న్స్ ఎలా చూపించాలి? నాన్నగారు పన్ను కట్టాలా లేక నేనా? దానికి ఏమైనా సర్టిఫికెట్ కావాలా? అది ఎవరు, ఎక్కడ ఇస్తారు? తెలుపగలరు.
స్థలం అమ్మిన వ్యక్తి దానికి సంబంధించిన పన్ను చెల్లించవలసి ఉంటుంది. అయితే, అమ్మిన 2 ఏళ్లలో ఆ లాభం తో మరో స్థిరాస్తి కొనుగోలు చేసినట్టయితే పన్ను చెల్లించే అవసరం ఉండదు. ముందుగా మీరు స్థలాన్ని మీ పేరున గిఫ్ట్ డీడ్ చేయించుకుని ఆ తరవాత అది అమ్మి మరో స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు. గిఫ్ట్ డీడ్ కోసం స్థిరాస్తి ఏజెంట్ లేదా ఒక న్యాయవాదిని సంప్రదించవచ్చు.
-
సర్, మీ విలువైన సలహాలకు ధన్యవాదాలు. నేను 2011 లో జీవన్ సరళ్ పాలసీ తీసుకున్నాను. ఏడాదికి రూ. 24 వేలు ప్రీమియం చెల్లిస్తున్నాను. దీనిపై 80 శాతం రుణం తీసుకున్నాను. భవిష్యత్తు లో కొనసాగించవచ్చా? సలహా ఇవ్వండి.
మీరు పేర్కొన్న పాలసీ ఒక ఎండోమెంట్ పధకం. ఇందులో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఈ పాలసీ సరెండర్ చేయడం మేలు. మీరు చెల్లించిన ప్రీమియం లో కొంత వరకు వెనక్కి పొందొచ్చు. జీవిత బీమా కోసం ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం) లాంటి పధకాలు మీ వీలు, అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు.
-
హయ్ సిరి! ఇంటి రుణం తీసుకొని ఇంకా అది తీర్చడం పూర్తవ్వకుండానే మరొక రుణం పొందడం ఎలా?
బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్, ఉద్యోగ సంస్థ, నెలసరి ఆదాయం ఇలా అనేక విషయాలని ద్రుష్టిలో ఉంచుకుని రుణాలని మంజూరు చేస్తాయి. ఇంటి రుణం తీసుకున్నప్పటికీ మీకు మరింత రుణ అర్హత ఉన్నట్టయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ని నేరుగా సంప్రదించి తెలుసుకోవడం మేలు. ఇంటి కోసం అయితే తీసుకున్న రుణం పైన టాప్ అప్ కూడా తీసుకోవచ్చు. అత్యవసరం అయితే తప్ప వ్యక్తిగత రుణం తీసుకోకపోవడం మేలు.
-
హాయ్. నేను ఖమ్మం లో ఉన్న నా ఇల్లు అమ్మి, వచ్చిన మొత్తం సొమ్ము హైదరాబాద్ లో ఫ్లాట్ కొనటానికి వెచ్చించాను. వచ్చే సంవత్సరం ఆదాయపన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి నేను కాపిటల్ గైన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలా?
మీరు అమ్మిన ఇంటిని కనీసం 2 ఏళ్ళ క్రితం కొన్నట్టయితే దీర్ఘకాల మూలధన ఆదాయ పన్ను వర్తిస్తుంది. అయితే, అమ్మిన 2 ఏళ్ళ లోపు మరో ఇంటిని కొనుగోలు చేస్తే ఈ పన్ను నుంచి మినహాయింపు పొందొచ్చు. అయితే, మీరు కొనుగోలు చేసిన విషయాన్ని మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ లో తెలపవలసి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇంటిని కొన్న 2 ఏళ్ళ లోపు అమ్మినట్టయితే, స్వల్ప కాల మూలధన ఆదాయ పన్ను వర్తిస్తుంది. లాభాన్ని మీ ఆదాయానికి జత చేసి పన్ను లెక్కిస్తారు.
-
సర్, నేను ఒక పీఎస్‌యూ ఉద్యోగిని. నా వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు. నేను రూ. 1 లక్ష మదుపు చేసి, స్వల్ప కాలం లో రూ. 30 వేలు లాభం పొందాను. దీని పైన పన్ను ఎలా ఉంటుంది?
ఈక్విటీ షేర్స్ కొన్న 1 ఏడాది లోపు అమ్మినట్టయితే మూలధన లాభంపై 15 శాతం పన్ను ఉంటుంది. అదే 1 ఏడాది తరవాత అమ్మినట్టయితే రూ. 1 లక్ష వరకు లాభాన్ని మినహాయించి మిగతా లాభం పై 10 శాతం పన్ను ఉంటుంది.
-
సర్, నా వయసు 48. నా వద్ద ఉన్న రూ. 2 లక్షలు మదుపు చేయడానికి సలహా ఇవ్వండి.
స్వల్ప కాలం, అంటే 1-3 ఏళ్ళ వరకు మదుపు చేయాలనుకుంటే బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్లు ఎంచుకోవచ్చు. కాస్త అధిక వడ్డీ కోసం యెస్ బ్యాంకు, ఆర్బీఎల్ లాంటి బ్యాంకులను పరిశీలించవచ్చు. దీర్ఘకాలం, అంటే కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. ఒకే మొత్తం లో రూ. 2 లక్షలు మదుపు చేయకుండా 5-6 నెలల పాటు సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్ సిరి, నేను ఎల్ఐసి ఉమంగ్ పాలసీ(రూ. 25,00,000 బీమా హామీ) మొదటి సంవత్సరం 4 వాయిదాల ప్రీమియం లో 3 వాయిదాలు కట్టాను. ఈ పాలసీ కోనసాగించ వచ్చా? ఈ పాలసీ సరెండర్ చేసి ఆ మొత్తాని మ్యూచువల్ ఫండ్స్ లొ మదుపు చెయడం ఉత్తమమా? నా 3 వాయిదాల ప్రీమియం మొత్తం, పాలసీ సరెండర్ చేసిన తర్వత వచ్చె నష్టం కన్నా తక్కువే అనుకుంటున్నాను. దీని గురించి తెలుపగలరు.
మీరు పేర్కొన్న పాలసీ ఒక సంప్రదాయ పధకం. సరెండర్ చేయడానికి కనీసం 2-3 ఏళ్ళ ప్రీమియం లు చెల్లించడం తప్పనిసరి. ఆ తరవాత కొంత నష్టపోయినా మిగిలిన మొత్తం తిరిగి పొందే వీలుంటుంది. ఇప్పుడే ప్రీమియం చెల్లించడం మానేస్తే మీరు చెల్లించిన ప్రీమియం మొత్తం నష్టపోయే అవకాశం ఉంటుంది. పాలసీ పెయిడ్ అప్ చేయడం వల్ల ఈ ప్రీమియం నష్టపోకుండా పాలసీ మెచ్యూరిటీ పూర్తయ్యాక దీన్ని తిరిగి పొందొచ్చు. పూర్తి వివరాలకు మీరు పాలసీ తీసుకున్న ఎల్ఐసి బ్రాంచీ ని సంప్రదించడం మంచిది.
-
హాయ్ సిరి, నేను ఒక ఐటీ ఉద్యోగిని. నా జీతం రూ. 50,000. నా పేరు మీద 9 లక్షల రూపాయలు పర్సనల్ లోన్ ఉంది. నేను ప్రతి నెల 15,000 రూపాయలు కడుతున్నాను. ఎటువంటి పాలసీ లు లేవు. నాకు అసలు ఏ పాలసీల గురించి తెలియదు. మీరు ఏదైన మంచి పాలసీ గురించి తెలపగలరు.
వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఇతర రుణాల కంటే కాస్త ఎక్కువగా ఉంటాయి. అత్యవసరం అయితే తప్ప వీటి నుంచి దూరంగా ఉండడం మేలు. వీలయితే కొంత మొత్తం రుణాన్ని ముందస్తుగా చెల్లించండి. చార్జీలు ఉండవచ్చు, కానీ వడ్డీ భారం తగ్గుతుంది. బీమా, రాబడి కలిపి ఉన్న ఎండోమెంట్, హోల్ లైఫ్, యూలిప్ లాంటి బీమా కంపెనీల పాలసీలలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువ. ఇలాంటివి తీసుకోకపోవడం మేలు. జీవిత బీమా కోసం మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్(పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం), మ్యూచువల్ ఫండ్స్ లాంటి పధకాలను మీ వీలు, రిస్క్ పరిమితి లాంటి వాటి ఆధారంగా ఎంచుకోవచ్చు.
-
హాయ్ సిరి, నేను రూ. 65 లక్షల ఇల్లు కొందామనుకుంటున్నాను. నా వద్ద పూర్తి మొత్తం ఉంది. ఇది చెల్లించి కొనవచ్చా లేక 20 శాతం డౌన్ పేమెంట్ చేసి రుణం తీసుకోవడం మంచిదా? రుణం తీసుకోవడం వల్ల 12 శాతం రాబడి ఉన్న పథకాల్లో మదుపు చేయవచ్చు కదా? సలహా ఇవ్వండి.
రుణం తీసుకోవడం అనేది మీ ఆర్ధిక లక్ష్యాలు, నెలసరి ఆదాయం, ఖర్చులు లాంటి వాటిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొంత మొత్తం ఇతర లక్ష్యాల కోసం పక్కన ఉంచి మిగతా మొత్తం రుణం తీసుకోవడం మేలు. పైగా, ఇంటి రుణం అసలు, వడ్డీ పై పన్ను మినహాయింపులు ఉంటాయి. అధిక వడ్డీ అందించే పధకాలు ఉన్నప్పటికి వాటిల్లో రిస్క్ ఎక్కువ, కచ్చితంగా ఎంత రాబడి వస్తుందో చెప్పలేము. ఒకోసారి నష్టాలూ రావచ్చు. కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేయాలనుకుంటే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లన్స్ ఎంచుకోవచ్చు.
-
హాయ్ సిరి, నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని. మా అమ్మ గారి వయసు 50, ఎన్పీఎస్ లో రూ. 70 వేలు మదుపు చేయాలనుకుంటున్నాను. బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ లో చేయవచ్చా?
ఎన్పీఎస్ పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం ఉపయోగపడే మంచి పధకం. ఈ పధకాన్ని బ్యాంకుల్లో లేదా పోస్ట్ ఆఫీస్ లో కూడా ఆరంభించవచ్చు. ఆన్లైన్ లో ఎన్పీఎస్ వెబ్సైటు లో కూడా ఈ సౌకర్యం ఉంటుంది. ఆటో ఛాయస్ ఆప్షన్ ద్వారా కొంత మొత్తం ఈక్విటీ, కొంత మొత్తం డెట్ లో మదుపు చేసే వీలుంటుంది.
-
హాయ్ సర్, నేను ఎల్ఐసి ఉమంగ్ 945 పాలసీ లో (రూ. 25,00,000 బీమా హామీ) పాలసీ 3 ప్రీమియం లు చెల్లించాను (రూ. 1,50,000). ఇది సరెండర్ చెద్దాం అనుకుంటున్నాను. 2వ ఏడాది ప్రీమియం చెల్లించి ఆపడం మంచిదా లెదా ఇప్పుడే ప్రీమియం కట్టడం ఆపేయడం మంచిదా?
మీరు పేర్కొన్న పాలసీ సరెండర్ చేయడానికి కనీసం 3 ఏళ్ళ ప్రీమియం లు చెల్లించడం తప్పనిసరి. ఆ తరవాత కొంత నష్టపోయినా మిగిలిన మొత్తం తిరిగి పొందే వీలుంటుంది. ఇప్పుడే ప్రీమియం చెల్లించడం మానేస్తే మీరు చెల్లించిన రూ. 1.50 లక్షలు నష్టపోయే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలకు మీరు పాలసీ తీసుకున్న ఎల్ఐసి బ్రాంచీ ని సంప్రదించడం మంచిది.
-
హాయ్ సర్, నేను 3 ఏళ్ళ క్రితం రూ. 1 కోటి బీమా హామీ తో ఐసీఐసీఐ టర్మ్ ప్లాన్ తీసుకున్న్నాను. నా స్నేహితుడు సెటిల్మెంట్ సమస్య రాకుండా మరో బీమా కంపెనీ వద్ద అదనంగా రూ. 1 కోటి బీమా తో పాలసీ తీసుకోమంటున్నాడు.
మీ బీమా పాలసీలో వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీరు ఎంచుకున్న బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి బాగుంది. అదనపు బీమా హామీ కోసం మాక్స్ లైఫ్, ఎస్బీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ఒకవేళ అన్ని వివరాలు సరిగ్గా ఉన్నా క్లెయిమ్ తిరస్కరించబడితే మీ కుటుంబం ఐఆర్డీఏ లేదా బీమా ఓంబుడ్స్మన్ కి ఫిర్యాదు చేయవచ్చు.
-
హాయ్ సర్, నేను హెచ్డీఎఫ్సీ సూపర్ ఇన్కమ్ పధకం లో 2016 నుంచి ఏడాదికి రూ. 30 వేలు మదుపు చేస్తున్నాను. నేను పాలసీ డాక్యుమెంట్ సరిగ్గా చూడలేదు. 2035 లో మెచ్యూరిటీ అంటున్నారు. 9వ ఏడాది నుంచి రూ. 22 వేల చొప్పున అందిస్తాము అంటున్నారు. ఇది సరెండర్ చేస్తే రూ. 50 వేలు నష్టపోతాను. సలహా ఇవ్వండి.
ఈ పధకం లో బీమా హామీ తక్కువ ,రాబడి కూడా తక్కువ. ఇలాంటి పాలసీల నుంచి దూరంగా ఉండడం మేలు. మీరు సరెండర్ చేస్తే కొంత వరకు నష్టపోతారు. ఒకవేళ ఇది చేయకూడదు అనుకుంటే మీరు పాలసీ ని పేడ్ అప్ చేసే వీలుంటుంది. ఇక పై ప్రీమియం లు చెల్లించే అవసరం ఉండదు. మీరు చెల్లించిన ప్రీమియం ను పాలసీ మెచ్యూరిటీ పూర్తయ్యాక తిరిగి చెల్లిస్తారు. సరెండర్, పేడ్ అప్ లో మీ వీలు, అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు.
-
సర్, నేను ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో ఏడాదికి రూ. 25 వేలు మదుపు చేశాను. ఇవి నా భార్య డీమ్యాట్ ఖాతాలోకి మార్చవచ్చా?
మ్యూచువల్ ఫండ్స్ ఒకరి డీమ్యాట్ నుంచి మరొకరి డీమ్యాట్ కి మార్చే వీలుండదు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో ఉన్న 3 ఏళ్ళ లాక్ ఇన్ పూర్తయ్యాక మీరు ఈ యూనిట్స్ అమ్మి ఆ డబ్బుని మీ భార్య ఖాతాలోకి మార్చి ఆ బ్యాంకు ఖాతా నుంచి తిరిగి మీ ఆవిడ పేరు మీద యూనిట్స్ కొనుగోలు చేయవచ్చు. లేదా మీ డీమ్యాట్ ఖాతా కి మీ భార్య ని నామినీ చేయవచ్చు.
-
హాయ్ సిరి, నేను అత్యవసర నిధి కోసం ఐసీఐసీఐ మనీ ముల్టీప్లైర్ ప్లాన్ లో మదుపు చేస్తున్నాను. ఇది మంచిదేనా?
మీరు పేర్కొన్న పధకం పొదుపు ఖాతా లో మిగిలి ఉన్న మొత్తాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తుంది. కాబట్టి పొదుపు ఖాతా కంటే కాస్త అధిక రాబడి ని అందిస్తుంది. అలాగే, మీకు అవసరం ఉన్నప్పుడు అవసరం అయినా మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకోవచ్చు. అయితే, పొదుపు ఖాతా లో ఎక్కువ డబ్బు ఉన్నప్పుడే మీకు ఇది ఉపయోగకరం.
-
హాలో సిరి, మా మామగారు 2005 లో మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేశారు. అయితే, ఇంట్లో ఇది ఎవ్వరికీ తెలియదు. ఆయన 2015 లో మరణించారు.ఇప్పటికీ ఇంటికి డివిడెండ్ చెక్కులు వస్తున్నాయి. మేము ఎలా ఈ మొత్తాన్ని తెచ్చుకోవలో తెలుపగలరు.
మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కొనుగోలుదారుడు మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు కంపెనీ ని సంప్రదించడం మంచిది. మరణ ధృవీ కారణం పత్రం, వారసత్వ పత్రం లాంటి వాటి తో పట్టు మరి కొన్ని పత్రాల ద్వారా యూనిట్స్ అమ్మి డబ్బు వెనక్కి తీసుకోవచ్చు.
-
డియర్ సర్, మీ సూచనలు బాగుంటాయి. మా బ్యాంకు లో ఏజెంట్ ఐసీఐసీఐ పృ స్మార్ట్ లైఫ్ పాలసీ తీసుకోమంటున్నారు. ఇది పిల్లల చదువు, ఇతర అవసరాల కోసం బాగుంటుంది అంటున్నారు. పాలసీ దారుడు చనిపోయాక కూడా పాలసీ కొనసాగుతుందంటున్నారు. దీని గురించి తెలుపండి.
మీరు పేర్కొన్న పాలసీ ఒక యూలిప్. ఇందులో బీమా, పెట్టుబడి కలిపి ఉంటాయి. ఇలా కలిపి ఉన్న పాలసీలలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. పాలసీ దారుడు మరణించాక కూడా పాలసీ కొనసాగినప్పటికీ బీమా హామీ సరిపోదు. వీటి నుంచి దూరంగా ఉండడం మేలు. జీవిత బీమా కోసం మీ పేరు మీద ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్(పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం), మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. మీ వీలు, అవసరం, రిస్క్ పరిమితి, ఆర్ధిక లక్ష్యాన్ని బట్టి పధకం ఎంచుకోవచ్చు.
-
హలో సిరి, నేను ఐటీ ఉద్యోగిని, వయస్సు 36, ప్రతి సంవత్సరం హెచ్డీఎఫ్సి లైఫ్ సూపర్ ఇన్కోమ్ ప్రణాళిక లో రూ. 1,00,000 ప్రీమియం చెల్లిస్తున్నాను, ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తయ్యాయి, 6 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు పాలసీని సరెండర్ చేసి అదే డబ్బును ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నాను. నా ఆలోచన సరైనదేనా?
మీరు పేర్కొన్న పాలసీ ఒక మనీ బ్యాక్ పధకం. ఇందులో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇలాంటి పాలసీల నుంచి దూరంగా ఉండడం మేలు. మీరు ఈ పాలసీ సరెండర్ చేయడం సరైన నిర్ణయమే. కనీసం రెండేళ్లు ప్రీమియం చెల్లించక సరెండర్ చేసే వీలుంటుంది. చెల్లించిన ప్రీమియం తో పాటు కొంత బోనస్ రూపం లో కూడా పొందే వీలుంటుంది. పూర్తి వివరాల కోసం మీరు బీమా కంపెనీ ని సంప్రదించడం మంచిది.
-
హలో సిరి, నా పేరు సాయి. నేను మ్యూచువల్ ఫండ్స్ లో రూ. 2 కోట్లు మదుపు చేయాలనుకుంటున్నాను. ఈ పెట్టుబడిని 20 ఏళ్ళ పాటు చేద్దామని ఆలోచన. ఒకే మొత్తం లో చేయచ్చా లేక 3-3.5 ఏళ్ళ పాటు సిప్ చేయాలా? లార్జ్ కాప్ లో 60 శాతం, ఫ్లెక్సీ కాప్ లో 20 శాతం, స్మాల్ కాప్ లో 20 శాతం చేయాలనుకుంటున్నాను. ఇందులో రిస్క్ తెలుపగలరు.
ఒకే సారి పెద్ద మొత్తం లో మదుపు చేయడం సరైన ఆలోచన కాకపోవచ్చు. మార్కెట్ దిగువలోకి వెళ్లినట్టయితే నష్టాలు రావచ్చు కాబట్టి సిప్ ద్వారా మదుపు చేయవచ్చు. పైగా, ఫ్లెక్సీక్యాప్, స్మాల్ లో కాప్ లో రిస్క్ ఎక్కువ. మీరు 75 శాతం లార్జ్ కాప్ లో, మిగిలిన మొత్తాన్ని స్మాల్ కాప్ లో మదుపు చేయడం మేలు. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్. నా పేరు చంద్రశేఖర్. నేను ఈ మధ్యనే ఫండ్స్ లో పొదుపు మొదలు పెట్టాను. పీపీఎఫ్ లో కూడా మదుపు చేద్దాం అని ఆలోచన. ఈ ఖాతా లో ఒక నెల 3000/, మరో నెల 5000/, మన దగ్గర డబ్బులు లేని సందర్భం లో రూ. 1000, ఇలా ఎంతైనా మదుపు చేయవచ్చా? లేదా ప్రతి నెల నిర్దిష్టమైన మొత్తం ఖచ్చితంగా వేయాలా?
పీపీఎఫ్ లో ఏడాదికి కనీసం మొత్తం రూ. 500, గరిష్ట మొత్తం రూ. 1.50 లక్షలు మదుపు చేయవచ్చు. ఇది మీ వీలు ప్రకారం నెల నెలా, 3 నెలలు, 6 నెలలు లేదా ఒకేసారి కూడా మదుపు చేయవచ్చు. అయితే, మొదటి కొద్దీ ఏళ్ళ పెట్టుబడి లో వీలైనంత ఎక్కువ మదుపు చేస్తే, రాబడి కోసం ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి అధిక రాబడి పొందే వీలుంటుంది.
-
పోర్ట్‌ఫోలియో మ్యానేజ్మెంట్ స్కీం (పీఎంఎస్) గురించి తెలుపగలరు.
పీఎంఎస్ పధకం మ్యూచువల్ ఫండ్స్ లాంటిదే. ఇందులో ఒక పోర్ట్‌ఫోలియో మేనేజర్ ని కంపెనీ నియమిస్తుంది. వారు షేర్స్ తో పాటు వివిధ రకాల పథకాల్లో మదుపు చేస్తుంటారు. ఎంత రాబడి వస్తుందనేది కచ్చితంగా చెప్పలేము. ఇందులో రిస్క్ కాస్త ఎక్కువ. కనీస పెట్టుబడి రూ. 50 లక్షల నుంచి మొదలవుతుంది.
-
హయ్ సిరి, నా పేరు పావని. నా వయసు 31. నేను గృహిణిని. నాపేరు మీద రూ. 5,00,000 ఫిక్సిడ్ డిపాజిట్ వుంది. మేము మరో రూ. 4,50,000 డిపాజిట్ చేయాలి అనుకుంటున్నాము. అది చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలా? చేయకపోతే ఏం అవుతుంది?
వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షలు మించితే బ్యాంకు వారు డిపాజిట్ పై టీడీఎస్ విధిస్తారు. ఒకవేళ మీ పూర్తి వార్షిక ఆదాయం (డిపాజిట్ వడ్డీ తో కలిపి) ఈ పరిమితి మించకపోతే మీరు బ్యాంకుకి ఫారం 15 జి అందించవచ్చు. ఒకవేళ మించినట్టైతే ఈ వడ్డీ ని మీ ఆదాయానికి జత చేసి పన్ను లెక్కిస్తారు. ఇది టీడీఎస్ ని మించితే మీరు ఆ పన్ను ని రిటర్న్స్ తో పాటు చెల్లించవచ్చు. వడ్డీ వివరాలు ఆదాయ పన్ను రిటర్న్స్ లో తెలుపడం తప్పనిసరి.
-
హాయ్ సిరి, నా పేరు మణి, వయసు 36. ఆక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ లో రూ. 5000 సిప్ ద్వారా మదుపు చేశాను. 10-15 ఏళ్ళ కోసం మరో రూ. 5000 మదుపు చేయడానికి సలహా ఇవ్వండి. రూ. 1 కోటి సమకూర్చుకోడానికి ఏవి ఎంచుకోవాలి?
మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత రాబడి వస్తుందో ముందే ఊహించలేము. సాధారణంగా, దీర్ఘకాలం లో సగటున 10 నుంచి 12 శాతం వరకు రాబడి ఆశించవచ్చు. మీరు ఈఎల్ఎస్ఎస్ ఫండ్ లో సిప్ చేస్తున్నారు. ప్రతి సిప్ కి 3 ఏళ్ళ లాక్ ఇన్ ఉంటుందని గమనించండి. కాబట్టి, ఈ ఫండ్స్ లో సిప్ చేయడం కంటే లంప్సమ్ చేయడం మేలు. వీటి బదులు ఇతర పన్ను ఆదా మార్గాలు ఉంటే ఎంచుకోవచ్చు. 10 శాతం రాబడి అంచనా ప్రకారం 15 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్స్ లో నెలకి రూ. 25 వేలు మదుపు చేస్తే రూ. 1 కోటి సమకూర్చుకోవచ్చు. మీరు సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ తో పాటు పీపీఎఫ్, ఎన్పీఎస్(పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం) లాంటి పధకాలను మీ వీలు, రిస్క్ పరిమితి ప్రకారం ఎంచుకోవచ్చు.
-
టర్మ్ ప్లాన్ తీసుకోవాలంటే ఆదాయం కి సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా చూపించాలా? కనీసం మొత్తం ఎంత నుంచి తీసుకోవచ్చు?
టర్మ్ ప్లాన్ కోసం ఆదాయ పత్రాలు తప్పనిసరి. మీరు వ్యాపారస్తులు అయితే గత రెండేళ్ల ఆదాయ పన్ను రిటర్న్స్ చూపించవచ్చు. బీమా కంపెనీ లు కనీస నెలసరి ఆదాయం రూ. 20 వేల నుంచి టర్మ్ ప్లాన్ అందిస్తూ ఉంటారు. మీరు నేరుగా వారిని సంప్రదించవచ్చు. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
ఆరోగ్య బీమా ప్రీమియం తక్కువ, ఉపయోగాలు బాగా వుండే పోలసీ గురించి తెలపండి.
ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. పాలసీ తీసుకూంబ్ సమయం లో ప్రీమియం మాత్రమే చూడడం సరైన పధ్ధతి కాదు. దీనితో పాటు నెట్వర్క్ ఆసుపత్రులు, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి, కవరేజీ లో లేని వ్యాధులు, కాష్ లెస్ సౌకర్యం, వెయిటింగ్ పీరియడ్, నో క్లెయిమ్ బోనస్ లేదా డిస్కౌంట్ లాంటి అనేక విషయాలు గమనించాలి. బీమా మొత్తం మీ అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు. రూ. 2-3 లక్షల కనీసం బీమా హామీ ఎంచుకోవడం మేలు. రూ. 5-10 లక్షల టాప్ అప్ ఎంచుకోవచ్చు. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి.
-
నేను ఒక ఎల్ఐసి పాలసీ లో 3 ఏళ్ళ పాటు ప్రీమియం చెల్లించాను. ఆ తరవాత కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆపేసాను. కట్టిన డబ్బు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందా?
సాధారణంగా 3 ఏళ్ళు ప్రీమియం చెల్లించిన తరవాత పాలసీ సరెండర్ చేస్తే మొదటి ఏడాది ప్రీమియం మినహాయించి మీ ప్రీమియం లో 30 శాతం వరకు వెనక్కి చెల్లిస్తారు. లేదంటే పాలసీ పేడ్ అప్ చేయడం ద్వారా మీరు 70 శాతం ప్రీమియం కోల్పోకుండా పాలసీ కాల పరిమితి ముగిసాక ఈ డబ్బు వెనక్కి తీసుకునే సౌకర్యం ఉంటుంది.
-
డీ మ్యాట్ ఖాతా ఎలా తెరవాలి?
షేర్లలో పెట్టుబడి చేసేందుకు డీమ్యాట్ ఖాతాను ఏదైనా బ్రోకింగ్ సంస్థ నుంచి తీసుకోవాలి. దీంట్లో ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలుంటాయి. ట్రేడింగ్ ఖాతా ద్వారా షేర్ల క్రయవిక్రయాలు చేయవచ్చు. డీమ్యాట్ ఖాతాలో మీరు కొనుగోలు చేసిన షేర్లు భద్రంగా ఉంటాయి. డిపాజిటరీ సంస్థలో మీరు కొనుగోలు చేసిన షేర్లు డీమెటిరీయలైజెడ్ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా తెరవడానికి షేర్ ఖాన్, ఐసీఐసీఐ డైరెక్ట్, జీరోధా లాంటి సంస్థలను సంప్రదించవచ్చు. షేర్లలో పెట్టుబడి నష్టభయం కలిగిఉంటుంది. కాబట్టి మీ నష్టభయం అంచనా వేసుకుని నేరుగా షేర్లలో మదుపు చేయాలి. షేర్ల ఎంపికలో నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది.
-
స్టాక్ ఆప్షన్స్ ద్వారా నెలకి 5 శాతం రాబడి పొందే మార్గాలు ఉన్నాయా?
స్టాక్ ఆప్షన్స్ లో అత్యంత రిస్క్ ఉంటుంది. రాబడి ఎంత ఉంటుందనేది ఊహించలేము. ఒకోసారి పెట్టుబడిలో నష్టాలు రావచ్చు. మీరు ముందుగా షేర్స్ గురించి అవగాహన తెచ్చుకున్నాక ట్రేడింగ్ చేయడం మేలు. లేదా ఏదైనా స్టాక్ మార్కెట్ నిపుణుడిని సంప్రదించవచ్చు.
-
నేను హెచ్డీఎఫ్సీ సంచయ్ ప్లస్ పధకం లో మదుపు చేశాను. 5 ఏళ్ళ పాటు రూ. 1 లక్ష చొప్పున ప్రీమియం చెల్లిస్తే 7వ ఏడాది నుంచి 30 ఏళ్ళ పాటు రూ. 33 వేలు తిరిగి పొందొచ్చు అని అన్నారు. ఇది మంచిదేనా?
మీరు పేర్కొన్న పధకం ఒక సంప్రదాయ బీమా పాలసీ. ఇందులో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. కాబట్టి, వీలయితే ఈ పాలసీ క్యాన్సిల్ చేసుకోవడం మేలు. పాలసీ తీసుకున్న 30 రోజుల లోపు ఈ అవకాశం ఉంటుంది. దీని కోసం మీరు పాలసీ కొన్న వెబ్సైటు లేదా ఏజెంట్ ని సంప్రదించవచ్చు. పాలసీ ని సరెండర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కొంత నష్టపోయినా మంచి పథకాల్లో మదుపు చేయడం మేలు. పాలసీ పెయిడ్ అప్ చేసినట్టయితే మీరు ప్రీమియం నష్టపోరు, పాలసీ మెచ్యూరిటీ తరవాత మీ డబ్బు మీకు అందుతుంది. మీరు జీవిత బీమా కోసం ఆన్లైన్ టర్మ్ పాలసీ ఎంచుకోవచ్చు. పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం), మ్యూచువల్ ఫండ్స్ లాంటి పధకాలు మీ వీలు, అవసరం ప్రకారం ఎంచుకోవచ్చు.
-
హాయ్ సర్, నేనొక సాఫ్ట్వేర్ ఉద్యోగిని, వయసు 30. ఏడాదికి రూ. 60 వేలు ప్రీమియం తో జీవన్ ఉమంగ్ పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాను. దీని గురించి తెలుపగలరు.
మీరు పేర్కొన్న పధకం ఎండోమెంట్ తో పాటు ఒక హోల్ లైఫ్ పధకం. ఇందులో కొంత జీవిత బీమా ఉంటుంది, పెట్టుబడి కూడా ఉంటుంది. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇలాంటి పాలసీల నుంచి దూరంగా ఉండడం మేలు. జీవిత బీమా కావాలనుకునేవారు టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్(పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం), మ్యూచువల్ ఫండ్స్ లాంటి పధకాలను మీ వీలు, అవసరం ఆధారంగా ఎంచుకోవచ్చు.
-
హాయ్ సర్, నా పేరు బాలాజీ. నేను ప్రైవేట్ ఉద్యోగిని. నేను షేర్స్ నుంచి కొంత డబ్బు సంపాదిస్తాను. ఆదాయ పన్ను రిటర్న్స్ సమయం లో టీడీఎస్ లో ఇది కనపడలేదు. ఎలా తెలపాలి?
ఈక్విటీ షేర్స్ పై టీడీఎస్ వర్తించదు. అందులోని మీ ఆదాయాన్ని దీర్ఘ లేదా స్వల్ప కాల మూలధన ఆదాయం ప్రకారం మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ లో తెలుపాల్సి ఉంటుంది. తగిన పన్ను కూడా అక్కడే చెల్లించవచ్చు. షేర్స్ కొన్న 1 ఏడాది కి ముందే అమ్మినట్టయితే లాభం పై 15 శాతం స్వల్ప కాల మూలధన ఆదాయ పన్ను వర్తిస్తుంది. 1 ఏడాది తరవాత అమ్మినట్టయితే రూ. 1 లక్ష వరకు పన్ను వర్తించదు. ఆ పైన లాభం మీద 10 శాతం పన్ను ఉంటుంది.
-
నమస్తే సర్, నేను నా వద్ద ఉన్న రూ. 1,00,000 ఫిక్సిడ్ డిపాజిట్ చేద్దామనుకుంటున్నాను. నాకు నెలవారీ ఆదాయం అవసరం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, మహీంద్రా ఫైనాన్స్ వాటిలో డిపాజిట్ చేయవచ్చా? దయచేసి తెలుపగలరు.
మీరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేయవచ్చు. ఫైనాన్స్ సంస్థల్లో డిపాజిట్ చేసే ముందు వాటి రేటింగ్ చూసుకోవడం మేలు. AAA రేటింగ్స్ ఉన్న వాటిని మాత్రమే పరిశీలించండి. రేటింగ్స్ తగ్గినప్పుడు రిస్క్ అధికంగా ఉంటుంది. బ్యాంకుల్లో డిపాజిట్ లు అత్యంత సురక్షితం. ఇందులో రూ. 5 లక్షల వరకు పెట్టుబడులకు బీమా కూడా ఉంటుంది.
-
నాకు ఎస్బీఐ లో రూ. 40 లక్షల ఇంటి రుణం ఉంది, వడ్డీ రేటు 6.90 శాతం. నా వద్ద ఉన్న రూ. 5 లక్షలు రుణం చెల్లించడానికి కట్టవచ్చ లేక నష్ట భయం లేకుండా మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ డబ్బు వస్తుందా?
మ్యూచువల్ ఫండ్స్ లో కొంత వరకు రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలం లో రిస్క్ తగ్గుతూ ఉంటుంది. మీరు కొంత వరకు ఇండెక్స్ ఫండ్స్ లో మదుపు చేయవచ్చు. మీ వీలు ప్రకారం కొంత మొత్తం తో ఇంటి రుణం తీర్చడం మేలు. రిస్క్ లేని పధకాల కోసం మీరు పీపీఎఫ్ ఎంచుకోవచ్చు.
-
ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే వారు అటల్ పెన్షన్ యోజన లో చేరవచ్చా?
పన్ను రిటర్న్స్ దాఖలు చేసిన వారు అటల్ పెన్షన్ యోజన లో చేరవచ్చు. ఇందులో పెట్టిన పెట్టుబడి కి సెక్షన్ 80C కింద ఆదాయ పన్ను మినహాయింపులు కూడా పొందొచ్చు. అలాగే సెక్షన్ 80CCD (1) కింద అదనంగా రూ. 50 వేల వరకు కూడా మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.
-
నేను లార్జ్ కాప్ ఫండ్ లో నెలకి రూ. 40 వేలు సిప్ చేస్తున్నాను. మరో రూ. 15 వేలు సిప్ చేయడానికి లార్జ్ కాప్ ఫండ్ ఎంచుకోవాలా లేక మిడ్/స్మాల్ కాప్ ఫండ్ ఎంచుకోమంటారా? ఫండ్ కూడా సూచించండి.
మీరు పెట్టుబడి పెట్టిన ఫండ్ పేరు తెలుపలేదు. కాబట్టి, దాని పని తీరు గురించి మేము చెప్పలేకపోతున్నాము. దీని పని తీరు బాగుందని ఆశిస్తున్నాము. లార్జ్ కాప్ ఫండ్స్ లో కొంత వరకు రిస్క్ తక్కువగా ఉంటుంది. మీరు అదనంగా పెట్టుబడి పెట్టాలంటే అదే ఫండ్ ఎంచుకోవచ్చు. కొంత రిస్క్ తీసుకోగలిగితే స్మాల్ కాప్ ఫండ్ ఎంచుకోవచ్చు. ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్ పని తీరు బాగుంది. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నమస్తే సిరి. మా నాన్నగారు మరణించిన తర్వాత నాకు వారసత్వంగా షేర్లు సంక్రమించాయి. వీటిని అమ్ముకుంటే నేను టాక్స్ కట్టవలసి వస్తుందా? దయచేసి తెలుపలగలరు.
వారసత్వంగా లభించిన షేర్స్ అమ్మినప్పుడు పొందే దీర్ఘకాల మూలధన ఆదాయం మీద పన్ను వర్తించదు. అయితే, మీరు అమ్మిన ఆర్ధిక సంవత్సరం లో ఈ విషయాన్ని ఆదాయ పన్ను రిటర్న్స్ లో తెలుపాల్సి ఉంటుంది.
-
అటల్ పెన్షన్ యోజన పధకంలో చేరితే నాకు ప్రభుత్వ పెన్షన్ వస్తుందా? రెండు పెన్షన్ ల కు నేను అర్హుడునా?
ప్రభుత్వ ఉద్యోగులు కూడా అటల్ పెన్షన్ యోజన లో చేరవచ్చు. అయితే, ఈ పధకం అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో గరిష్టంగా రూ. 5 వేల వరకు మాత్రమే పెన్షన్ పొందే అవకాశం ఉంది. మీరు ఎన్పీఎస్ ని ఎంచుకోవచ్చు. ఇందులో మీరు మీ వీలు ప్రకారం మదుపు చేయవచ్చు, పదవీ విరమణ నిధి తో పాటు పెన్షన్ కూడా పొందొచ్చు.
-
నేను ప్రతి నెలా రూ. 25 వేలు చొప్పున యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, యూటీఐ నిఫ్టీ నెక్స్ట్ 50 ఫండ్ లో మదుపు చేస్తున్నాను. అదనంగా, మరో రూ. 25 వేలు మదుపు చేయడానికి మిడ్ కాప్ ఫండ్ సూచించండి. నేను ఆక్సిస్ లేదా యూటీఐ మిడ్ కాప్ ఫండ్ అనుకుంటున్నాను.
మిడ్ కాప్ ఫండ్ లో రిస్క్ ఉంటుందని గమనించండి. ఒకోసారి ఫండ్ లో నష్టాలూ రావచ్చు. మిడ్ కాప్ ఫండ్ ఎంచుకోవాలనుకుంటే ఆక్సిస్ మిడ్ కాప్ ఫండ్ ఎంచుకోవచ్చు. దీని పని తీరు బాగుంది. దీర్ఘకాలం కోసం ఇందులో సిప్ ద్వారా మదుపు చేయవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
సర్, నమస్కారం. నేను ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ లొ ప్రతి నెల రూ. 5000 సిప్ చేస్తున్నాను. దీని పైనా వచ్చే రాబడికి టాక్స్ పడుతుందా? అలాగే 20 ఏళ్ళ వరకు ఎంత రాబడి వస్తుందో ఉదాహరణగా చెప్పగలరు.
ఈక్విటీ ఫండ్స్ లో రాబడి పై పన్ను ఉంటుంది. ఫండ్స్ కొన్న 1 ఏడాది తరవాత అమ్మినట్టయితే రాబడి పై 10 శాతం వరకు పన్ను ఉంటుంది. అయితే, రూ. 1 లక్ష వరకు రాబడి పై మినహాయింపు ఉంటుంది. ఆ తరవాత మాత్రమే పన్ను వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లో రాబడి ని ఊహించడం సాధ్యం కాకపోవచ్చు. మార్కెట్ లోని ఒడిదుడుకుల ఆధారంగా రాబడి కూడా మారుతుంది. సాధారణంగా, 10 ఏళ్ళ కాలం లో సగటుగా 10 నుంచి 12 శాతం వరకు రాబడి ఆశించవచ్చు.
-
మా నాన్న గారు ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్ లో 5 ఏళ్ళ పైన సిప్ చేసి ఆపేసారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంత పన్ను పడుతుంది?
ఈక్విటీ ఫండ్స్ లో 1 ఏడాది వరకు యూనిట్స్ ఉంచి ఆ తరవాత అమ్మినట్టయితే దాని మీద దీర్ఘకాల మూలధన ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రాబడి రూ. 1 లక్ష వరకు ఉన్నట్టయితే పన్ను వర్తించదు. ఆ పైన వచ్చిన రాబడి మీద మాత్రం 10 శాతం పన్ను ఉంటుంది. ఉదాహరణకి, మీ 5 ఏళ్ళ సిప్ పెట్టుబడి మొత్తం రూ. 3 లక్షలు అనుకుందాం. ఇప్పుడు మీ ఫండ్స్ విలువ రూ. 5 లక్షలు అనుకుందాం. అంటే, మీ రాబడి రూ. 2 లక్షలు. ఇందులో రూ. 1 లక్ష వరకు పన్ను ఉండదు, మిగిలిన రూ. 1 లక్ష మీద 10 శాతం, అంటే రూ. 10 వేల వరకు పన్ను చెల్లించాలి. టీడీఎస్ ఉండదు, మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసి పన్ను చెల్లించవచ్చు.
-
హాయ్ సిరి, నేను 2010 నుంచి ఎల్ఐసి జీవన్ సరళ్ ప్లాన్ లో 3 నెలలకి ఒకసారి రూ. 3062 ప్రీమియం చెల్లిస్తున్నాను. పాలసీ 2025 లో ముగిస్తుంది. ఇందులో మంచి రాబడి లేదు. కొనసాగమంటారా? సరెండర్ చేస్తే ఎంత వస్తుంది?
ఈ పాలసీ సరెండర్ చేయడం అనేది సరైన నిర్ణయమే. కనీసం 3 ఏళ్ళ ప్రీమియం చెల్లించారు కాబట్టి సరెండర్ చేసే అవకాశం ఉంది. గారంటీడ్ సరెండర్ ప్రకారం మీరు చెల్లించిన పూర్తి ప్రీమియం (మొదటి ఏడాది మినహాయించి) లో 30 శాతం వరకు వెనక్కి పొందొచ్చు. లేదా గారంటీడ్ సరెండర్ ప్రకారం మీ పాలసీ బీమా హామీ లో 100 శాతం వరకు పొందొచ్చు. వివరాలకు మీరు పాలసీ తీసుకున్న బ్రాంచీ ని సంప్రదించడం మేలు. బీమా హామీ కోసం మీరు టర్మ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి పధకాలను మీ వీలు, అవసరం ప్రకారం ఎంచుకోవచ్చు.
-
హాయ్ సిరి, నా పేరు వెంకటేష్. నేను 3 సంవత్సరాల నుంచి LIC జీవన్ ఆనంద్ పోలసీ లో ప్రీమియం కడుతున్నాను. నేను అదే కోనసగించాలా లేక వేరే దేంట్లో అయినా పెట్టుబడి చేయాలా? ఒకవేళ పోలసీ ఆపివేస్తే నేను కట్టిన మొత్తం నాకు తిరిగి వస్తుందా?
మీరు ఎంచుకున్న పాలసీ ఒక ఎండోమెంట్ పధకం. ఇందులో బీమా హామీ, రాబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇలాంటి పాలసీల నుంచి దూరంగా ఉండడం మంచిది. 3 ఏళ్ళ తరవాత సరెండర్ చేసినట్టయితే మీరు చెల్లించిన ప్రీమియం లో 30 శాతం వరకు వెనక్కి పొందొచ్చు. మంచి పథకాల్లో మదుపు చేసి ఈ నష్టాన్ని మీరు పూడ్చే అవకాశం ఉంటుంది.
-
సర్, నా వయసు 62 సంవత్సరలు. 2020-21 ఆర్ధిక సంవత్సరం లో నా ఆదాయం సుమారు 11 లక్షలు. దానిలో టాక్స్ కట్టడానికి అర్హమైన ఆదాయం, మినహాంపులు మధించి నేను కట్టవలసిన టాక్స్ రూ. 49,300. అని లెక్కవేశారు. ఇది ఎప్పటి లోపుగా కట్టాలి. రిటర్న ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 దాకా గడువు ఉన్నందున టాక్స్ మొత్తం అప్పుడు కట్టవచ్చా? లేదా ఆలస్యం అయితే ఏమైనా పెనాల్టీ పడుతుందా దయచేసి చెప్పండి.
మీ ఆదాయం ఎటువంటిది అనేది తెలుపలేదు. మీరు పెన్షన్ నుంచి ఆదాయం పొందినట్టయితే ఆదాయ పన్ను రిటర్న్స్ కి చివరి తేదీ డిసెంబర్ 31, 2021. ఫైల్ చేసే సమయం లోనే మీ వివరాల ప్రకారం ఆదాయ పన్ను వెబ్సైటు పన్ను మొత్తాన్ని మీకు తెలియజేస్తుంది. మీరు అందులో పన్ను చెల్లించవచ్చు. ఈ గడువు దాటిన తరవాత పన్ను చెల్లించినట్టైతే పెనాల్టీ ఉంటుంది. మీరు వ్యాపార ఆదాయం పొందినట్టయితే 3 నెలలకి ఒకసారి అడ్వాన్స్డ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు ఒక పన్ను నిపుణుడిని (ఛార్టర్డ్ అకౌంటెంట్ లాంటి) సంప్రదించడం మేలు. వారు మీకు సహాయ పడగలరు.
-
హాయ్ సర్, స్వల్పకాలానికి నెలకి రూ. 5000 మదుపు చేయడానికి మంచి పధకాలు తెలుపండి. సురక్షితమైన పధకాలు తెలుపగలరు.
స్వల్పకాలానికి సురక్షితమైన పథకాల్లో ఒకటి బ్యాంకు రికరింగ్ డిపాజిట్. మీ డబ్బు కి పూర్తి రక్షణ ఉంటుంది, 5 నుంచి 6 శాతం వరకు రాబడి పొందొచ్చు. యెస్ బ్యాంకు, ఆర్బీఎల్ లాంటి వాటిల్లో కాస్త వడ్డీ ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది.
-
సర్, నేను ప్రతి సవత్సరం 2015 నుంచి టాక్స్ ఫైల్ చేస్తున్నాను. మధ్యలొ 2020-21 లో నాకు ఉద్యోగం లేదు. 2021 మార్చ్ చివరిలొ కొత్త ఉయోగంలోచేరాను. నా జీతం మే 1 కి క్రెడిట్ అయ్యింది. నాకు మార్చ్ 2020- 21 ఆర్దిక సవత్సరం లో ఏ ఆదాయం లేదు. నేను ఇప్పుడు టాక్స్ ఫైల్ చెయ్యాలా? చేస్తె మంచిదని అంటున్నరు.
ఆదాయ పన్ను లేనప్పుడు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి కాదు. అయితే, ఫైల్ చేయడం మంచిదే. మీకు భవిష్యత్తు లో రుణాలు అవసరం పడవచ్చు లేదా ఇతర ప్రూఫ్స్ కోసం కూడా ఐటీఆర్ ఉపయోగపడవచ్చు. మీరు వారి వెబ్సైటు లో లాగిన్ అయ్యి సునాయాసంగా రిటర్న్స్ దాఖలు చేయవచ్చు, వెరిఫై కూడా చేసుకోవచ్చు.
-
టర్మ్ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు వికలాంగుడు అయితే అతను టర్మ్ పాలసీ ద్వారా ఏమైనా ప్రయోజనాలు పొందగలడా?
టర్మ్ పాలసీ అనేది పాలసీ దారుడి మరణానికి మాత్రమే బీమా హామీ ఇస్తుంది. ఇందులో ఇతర పెట్టుబడులు లాంటివి కూడా ఉండవు. కాబట్టి, దాని ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. మీరు టర్మ్ పాలసీ తో పాటు అంగవైకల్వ బీమా హామీ లేదా ఆదాయం లాంటి రైడర్స్ ని జోడించవచ్చు. ఇందులో ఒకేసారి హామీ మొత్తం పొందొచ్చు లేదా వారం/నెలసరిగా కూడా పొందే ఆప్షన్ ఉంటుంది.
-
హాయ్ సర్, ఇటీవలే మేము రూ. 16 లక్షల విలువగల వ్యవసాయ భూమి అమ్మాము. దీని పై పన్ను ఉంటుందా? దీన్ని ఫిక్సిడ్ డిపాజిట్ చేయవచ్చా?
వ్యవసాయ భూమి అమ్మకం మీద ఆదాయ పన్ను వర్తించదు. ఈ విషయాన్ని మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ లో తెలుపాల్సి ఉంటుంది. స్వల్పకాలం కోసం ఈ డబ్బు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఫిక్సిడ్ డిపాజిట్ మేలు. యెస్ బ్యాంకు, ఆర్బీఎల్ లాంటి బ్యాంకుల వడ్డీ రేట్లు పరిశీలించండి.
-
ప్రతి ఏడాది ఐటీఆర్-1 ఫైల్ చేసే ఆడిటర్ గత ఏడాదికి గాను ఐటీఆర్ 3 ఫైల్ చేశారు. నేను వ్యాపారి ని కాదు, ఉద్యోగిని. ఆదాయ శాఖ వాళ్ళ నుంచి నోటీసు వొచింది. ఎప్పుడు హెచ్ఆర్ఏ గా చూపించే మొత్తాన్ని ఐటీఆర్ 3 లో గ్రాట్యుటీ, పదవీ విరమణ నిధి లా చూపించారు. ఆదాయ శాఖ వారు అది రూ. 20 లక్షలని నోటీసు ఇచ్చారు. ఇపుడు ఏం చేయాలి? ఆడిటర్ నాకు సమాధానం ఇవ్వట్లేదు.
మీరు ఈ విషయాన్ని ఆదాయ శాఖ వారికి సమాధానంగా తెలుపవచ్చు. ఆదాయ శాఖ వెబ్సైటు లో లాగిన్ అయ్యి సులభంగా 'రివైస్డ్ రిటర్న్స్' ఆప్షన్ ద్వారా మీరు మీ రిటర్న్స్ ని సరిచేసుకోవచ్చు. మీ సంస్థ ఇచ్చిన ఫారం 16 లోని వివరాల ప్రకారం రిటర్న్స్ ఫైల్/సరి చేసుకోవచ్చు.
-
నేను నా కూతురు పేరు మీద సుకన్య సమ్రిద్ధి యోజన పథకం లో ఏడాదికి రూ. 12 వేలు కడుతున్నాను. ప్రతి ఏడాది 12 వేలు కట్టాలా? లేక ఎక్కువ కూడా కట్టవచ్చా?
మీరు ఎంచుకున్న పధకం లో ఏడాదికి కనిష్టంగా రూ. 250, గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు మదుపు చేయవచ్చు. కాబట్టి, మీ వీలు ప్రకారం ఈ పరిమితుల మేరకు మదుపు చేయండి.
-
సర్, ఇన్కమ్ టాక్స్ ఫారం 16 రాలేదు. ఈ-ఫైలింగ్ చేయలేదు, రిఫండ్ రూ. 25000 రావాలి. ఎలా రిఫండ్ పొందాలి?
చాలా వరకు కంపెనీ లు ఇప్పటికే వారి ఉద్యోగస్తులకు ఫారం 16 అందించాయి. ఒకవేళ మీకు అందకపోతే మీరు ఫారం 26 AS ఆధారంగా కూడా ఫైలింగ్ చేసుకోవచ్చు. ఇన్కమ్ టాక్స్ వెబ్సైటు (https://www.incometax.gov.in/) లో లాగిన్ చేసి మీ ఫారం 26 AS పొందగలరు. దాని ప్రకారం ఫైలింగ్ సమయం లో మీకు రావాల్సిన రీఫండ్ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ 30 తేదీ లోపు ఫైలింగ్ చేయకపోతే రీఫండ్ పొందే అర్హత కోల్పోతారు.
-
హాయ్ సర్, నేను ఈ ఫండ్స్ లో రూ. 2000 సిప్ చేస్తున్నాను - ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్, ఆక్సిస్ బ్లూచిప్ ఫండ్, ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్, ఆక్సిస్ స్మాల్ కాప్ ఫండ్. అలాగే, ఇటీవలే హెచ్డీఎఫ్సీ బ్యాలన్సుడ్ అడ్వాంటేజ్ ఫండ్ లో రూ. 1.50 లక్షలు లంప్సమ్ చేశాను. మరి కాస్త మదుపు చేయడానికి ఏ ఫండ్ మంచిది.
మీరు రెండు రకాల లార్జ్ కాప్, రెండు రకాల స్మాల్ కాప్, ఒక బ్యాలన్సుడ్ ఫండ్ లో మదుపు చేస్తున్నారు. అధిక ఫండ్స్ లో మదుపు చేయడం వల్ల ప్రత్యేక లాభాలు ఉండవు. పైగా, ట్రాకింగ్ కూడా కష్టతరం అవుతుంది. మీరు ఆక్సిస్ బ్లూ చిప్, ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్స్ లో కొనసాగవచ్చు, ఇందులో మీ వీలు ప్రకారం లంప్సమ్ కూడా చేయవచ్చు.
-
మా నాన్న గారు ఇటీవలే కోవిడ్ కారణం చేత మృతి చెందారు. అమ్మ వయసు 58, నాన్న గారి పదవీ విరమణ నిధి మొత్తం రూ. 30 లక్షలు మదుపు చేయడానికి పన్ను లేని పధకాలు తెలుపగలరు.
మీ అమ్మ గారు పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పధకం లో మదుపు చేయడం మేలు. సెక్షన్ 80C కింద మదుపు చేసిన మొత్తానికి ఆదాయ పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. అయితే, ఇందులో మదుపు చేయడానికి కనీస వయసు 60 ఏళ్ళు. కాబట్టి, 2 ఏళ్ళ పాటు మీరు ఈ మొత్తాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ లో మదుపు చేయవచ్చు. ఇందులో మీ అవసరాన్ని బట్టి నెలవారీ లేదా 3/6 నెలలకు కూడా వడ్డీ తీసుకోవచ్చు. రూ. 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నట్టయితే పన్ను వర్తించదు. మీరు బ్యాంకు లో డిపాజిట్ చేసిన సమయం లో ఫారం 15 జి అందించి టీడీఎస్ లేకుండా చూసుకోవచ్చు. ఒకవేళ టీడీఎస్ తీసి వేసినట్టయితే మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసి పన్ను రిఫండ్ పొందొచ్చు.
-
5 సంవత్సరాల లోపు పిల్లలకు మంచి నెలవారీ పధకాలు వివరించండి.
పిల్లల పేరున పెద్దగా ప్రత్యేక పధకాలు లేవు. కొన్ని పాలసీలు ఉన్నప్పటికి వాటిలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఆడపిల్లల కోసం అయితే ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన ప్రవేశ పెట్టింది. ఇందులో వారి ఉన్నత చదువు, పెళ్లి కోసం పొదుపు చేయవచ్చు. అలాగే, పిల్లల పేరు మీద పీపీఎఫ్ ఖాతా కూడా తెరవచ్చు. కాస్త రిస్క్ తీసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయవచ్చు.
-
సర్, నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ కాపిటల్ గారంటీ సొల్యూషన్ పధకం తీసుకుందాం అనుకుంటున్నాను. 2 ఏళ్ళ వయసు గల పిల్లల కోసం ఇది మంచిదేనా?
మీరు పేర్కొన్న పధకం ఒక యూలిప్. ఇందులో పెట్టుబడి, బీమా కలిపి ఉంటాయి. కొంత వరకు ఈక్విటీ లో కొంత డెట్ లో మదుపు చేస్తుంటారు. అయితే, వీటిలో చార్జీలు కూడా ఎక్కువే. బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పధకాల నుంచి దూరంగా ఉండడం మేలు. జీవిత బీమా కోసం ముందుగా మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్(పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం), మ్యూచువల్ ఫండ్స్ లాంటి పధకాలను మీ వీలు, అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు.
-
డియర్ సిరి, నేను 2 సంవత్సరాల కాలపరిమితి కి నెలకు రూ. 10,000/ వరకు పొదుపు చేయాలని అనుకొంటున్నాను. సలహా ఇవ్వగలరు.
మీరు తెలిపిన కాల పరిమితి కోసం బ్యాంకు రికరింగ్ డిపాజిట్ సరైన పధకం. ఇందులో రిస్క్ తక్కువ, కచ్చితమైన రాబడి కూడా పొందొచ్చు. యెస్ బ్యాంకు, ఆర్బీఎల్ లాంటి బ్యాంకులను పరిశీలించండి. వీటిలో వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉండవచ్చు. మీరు నెల నెలా రూ. 10 వేలు మదుపు చేస్తే, 6 శాతం వడ్డీ అంచనాతో, 2 ఏళ్ళ తరవాత సుమారుగా మీరు రూ. 2.55 లక్షల వరకు పొందగలరు.
-
నాకు నెలకి రూ. 10000 వస్తాయి, రూ. 5000 మిగులుతాయి. వాటిని ఏ విధంగా పొదుపు చేయాలి? భవిష్యత్తులో లాభం వచ్చే విధానం ఏంటి? 5 సంవత్సరాల తరువాత ఇంటికి ఉపయోగ పడేలా ఉండాలి.
మీరు తెలిపిన కాల పరిమితి కోసం రిస్క్ లేని పథకాల్ని ఎంచుకోవడం మేలు. ఏదైనా బ్యాంకు లో రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరిచి అందులో ప్రతి నెలా రూ. 5 వేలు మదుపు చేయవచ్చు. 6 శాతం వడ్డీ అంచనా తో 5 ఏళ్ళ తరువాత మీరు సుమారుగా రూ. 3.50 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది.
-
నేను ఒక ప్రయివేట్ కంపెనీ లో గత పది సంవత్సరాలు గా ఉద్యోగం చేస్తూ కరోనా సమయంలో ఒక ఆరునెలు ఖాళీ గా ఉండి, మళ్లీ మూడు నెలలు గా వేరే ఉద్యోగం చేస్తున్నాను. నాకు హౌసింగ్ లోన్ అర్హత ఉందా?
ఇంటి రుణం అందించే ముందు బ్యాంకులు రుణం గ్రస్తుడి ఆదాయం, ఉద్యోగం చేసే కంపెనీ స్థితిగతులు, క్రెడిట్ స్కోర్ లాంటి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుంటాయి. మీ 3 నెలల పే స్లిప్స్, 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్, ఆదాయ పన్ను రిటర్న్స్ లాంటి వివరాలతో బ్యాంకులను సంప్రదించవచ్చు. వారు మీ వివరాలను బట్టి మీకు రుణం గురించి తెలుపగలరు.
-
డియర్ సిరి, ఇంతకు ముందు ప్రశ్నకు నిపుణుల సలహా ఇచ్చినందుకు ముందుగా నా ధన్యవాదములు. నా ప్రశ్న ఏమిటంటే దీర్ఘకాలిక పెట్టుబడి కోసం (7సం) అత్యుత్తమ స్మాల్ క్యాప్ ఫండ్స్ (2) సూచించగలరు. నష్టభయం ఎంతైనా భరించగలను.
స్మాల్ కాప్ ఫండ్స్ లో ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్, ఆక్సిస్ స్మాల్ కాప్ ఫండ్, హెచ్డీఎఫ్సీ స్మాల్ కాప్ ఫండ్ ల పని తీరు బాగున్నాయి. మీరు వీటిలో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. కనీసం 10 ఏళ్ళ పాటు ఇందులో మదుపు చేయడం మేలు.
-
నేను బజాజ్ ఫైనాన్స్ రూ. 1400000 తీసుకున్నాను. మళ్ళీ టాప్ అప్ రుణం అడిగేతే సిబిల్ తగ్గిందని చెపుతున్నారు. దీనికి మేము ఏమి చేయాలి?
రుణం మంజూరు చేసే సమయం లో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు రుణం తీసుకునే వ్యక్తి క్రెడిట్ స్కోర్, ఉద్యోగ స్థితిగతులు లాంటి అనేక వివరాలని బట్టి రుణం మంజూరు చేస్తాయి. సమయానికి రుణం చెల్లించకపోయినా, ఎప్పుడైనా ఈఎంఐ కట్టలేకపోయిన, ఇలా అనేక కారణాల చేత క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంది. క్రెడిట్ స్కోర్ తగ్గినప్పుడు రుణం పొందే పరిమితి కూడా తగ్గుతుంది. ఒకోసారి రుణం మంజూరు కూడా కాకపోవచ్చు. కాబట్టి, మీరు సమయానికి ఈఎంఐ లు చెల్లిస్తూ ఉంటె మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు.
-
నా సంపాదన నెలకి రూ. 25 వేలు. సంవత్సరం వయస్సున్న పాప పేరు మీద సేవింగ్స్ చేద్దామనుకుంటున్నాను. సుకన్యా సమృద్ధి యోజన ఇప్పటికే కడుతూ ఉన్నాను. 15 సంవత్సరాల్లో ముగిసే ఇంకేదైనా ప్లాన్ ఉంటే చెప్పగలరు.
మీరు దీనితో పాటు పీపీఎఫ్ లో కూడా మదుపు చేయవచ్చు. ఇది 15 ఏళ్ళ పధకం. వడ్డీ సుమారుగా 7 శాతం వరకు ఉంటుంది. ఏదైనా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో ఖాతా తెరవచ్చు. దీర్ఘకాలం కోసం కొంత రిస్క్ తీసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మదుపు చేయవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.
-
డియర్ సిరి, నేను రూ. 12 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నాను, కాల పరిమితి 5 ఏళ్ళు. నా వద్ద ఇప్పుడు రూ. 5 లక్షల నగదు ఉంది. రుణం కొంత వరకు తీర్చాలా లేక ఎక్కడైనా మదుపు చేయాలా?
వ్యక్తిగత రుణం వడ్డీ రేటు ఇంటి రుణం వద్దే రేటు కంటే ఎక్కువే ఉంటుంది. పెట్టుబడి చేసి ఇంతకంటే ఎక్కువ రాబడి రావడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి, మీరు ఆ మొత్తాన్ని మీ రుణంకై ముందస్తు చెల్లింపు చేయడం మేలు. దీనికి వారు కొంత వరకు చార్జీలు వసూలు చేయవచ్చు.
-
నా వద్ద డివిడెండ్ 3 ఫండ్స్ ఉన్నాయి - కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్, ఎస్బీఐ ఫ్లెక్సీ కాప్ ఫండ్, ఆక్సిస్ ఫ్లెక్సీ కాప్ ఫండ్. వీటి పని తీరు ఎలా ఉంది? మూడింటిలో ఒక ఫండ్ లో నుంచి డబ్బు వెనక్కి తీసుకోవాలి అంటే దేనిని ఎంచుకోవచ్చు?
మీ వద్ద ఉన్న ఫండ్స్ లో ఒకటి మిడ్ కాప్, రెండు ఫ్లెక్సీ కాప్ ఫండ్స్. వీటిలో ఎస్బీఐ ఫ్లెక్సీ కాప్ ఫండ్ పని తీరు అంతగా బాలేదు. మీరు ఇందులో పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. మిడ్ కాప్, ఫ్లెక్సీ కాప్ లో అధిక రాబడి వచ్చే అవకాశాలతో పాటు అధిక రిస్క్ కూడా ఉంటుందని గమనించండి. ఒకోసారి మార్కెట్ ని బట్టి నష్టాలు కూడా రావచ్చు. డివిడెండ్ ఫండ్స్ బదులు గ్రోత్ ఫండ్స్ లో మదుపు చేయడం మేలు. ఒకవేళ మీకు అప్పుడప్పుడు డబ్బు అవసరం పడితే ఇందులో మదుపు చేయవచ్చు.
-
నేను ఎల్ఐసి జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. రెండు ప్రీమియం లు కట్టాను. దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చా? డబ్బులు వెనక్కి వస్తాయా?
పాలసీ సరెండర్ చేయాలి అనే మీ నిర్ణయం సరైనదే. అయితే కనీసం 3 ప్రీమియం లు చెల్లించనిదే మీ డబ్బు వెనక్కి అందించారు. మూడవ ప్రీమియం తరవాత కూడా 30 శాతం మాత్రమే వెనక్కి వస్తుంది. కాబట్టి, సరెండర్ చేయాలనుకుంటే ఇప్పుడే చేసి ప్రీమియం లు కట్టడం ఆపేయడం మంచిది. కొంత నష్టపోయినా మంచి పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. బీమా, పెట్టుబడి కలిపి ఉన్న వాటి నుంచి దూరంగా ఉండడం మేలు. జీవిత బీమా కోసం ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం) మ్యూచువల్ ఫండ్స్ లాంటి పధకాలను మీ వీలు, అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు.
-
నా పేరు కృష్ణ. నేను ఇటీవలే టర్మ్ పాలసీ తీసుకున్నాను. నా వద్ద ఉన్న జీవన్ ఆనంద్ పాలసీ సరెండర్ చేసి ఆ ప్రీమియం మొత్తాన్ని ఈక్విటీ ఫండ్ లో 11 ఏళ్ళ పాటు మదుపు చేయాలనుకుంటున్నాను. ఇది మంచిదేనా?
మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే. పెట్టుబడి కోసం బీమా పాలసీలు సరైనవాని కావు. మీరు ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలం పాటు మదుపు చేయవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
సర్, "వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు తిరస్కరించిన క్లెయిమ్ లలో 90 శాతం ఆన్లైన్ టర్మ్ పాలసీలు. ఇది నేను ఆన్లైన్ లో సేకరించిన సమాచారం. కాబట్టి ఓ రూపాయి ఎక్కువైనా పర్వాలేదు కానీ ఆఫ్ లైన్ లో టర్మ్ పాలసీ తీసుకుంటే మంచిది" అని మా సహోపాధ్యాయుడు ఒకరు చెప్పారు. ఇది సరికాదని నేను చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. ఆయన అభిప్రాయం నిజమేనా? ఇది విన్న ఉపాధ్యాయులు ఒకరు ఆన్లైన్ టర్మ్ పాలసీ తీసుకుంటే ఇబ్బందని జంకుతున్నారు. దయచేసి సరైన సమాచారం ఇవ్వగలరని నా విన్నపం.
ఐఅర్డీఏ కంపెనీ పరంగా మాత్రమే క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి అందిస్తూ ఉంటుంది. ఇందులో ఆన్లైన్, ఆఫ్ లైన్ కి ఆంతర్యం ఉండదు. కాబట్టి, ఆన్లైన్ లో పాలసీలు ఎక్కువగా తిరస్కరిస్తారు అన్నది నిజం కాదు. మీరు అందించిన వివరాలు సరిగ్గా ఉన్నట్టయితే కంపెనీకి క్లెయిమ్ తిరస్కరించే హక్కు ఉండదు. ఒకవేళ అలా చేసినట్టయితే మీరు నేరుగా ఐఅర్డీఏ కి ఫిర్యాదు చేయవచ్చు. లేదా బీమా ఓంబుడ్స్మన్ కి కూడా ఫిర్యాదు చేయవచ్చు.
-
నా భార్య పేరు మీద ఉన్న సాధారణ బీమా పాలసీ ల కాలపరిమితి ముగిసింది. ఇపుడు మంచి పాలసీని తీసుకోవాలి. హెల్త్ లాభాలు, కుటుంబ అందరికీ ఉండేటట్టుగా ఉండాలి. సలహా ఇవ్వగలరు.
మీరు కుటంబానికి సరిపడా ఆరోగ్య బీమా కోసం చూస్తున్నారని తెలుస్తోంది. ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. బీమా హామీ ఎంత తీసుకోవాలి అన్నది మీ అవసరాన్ని బట్టి ఆధార పది ఉంటుంది. సాధారణంగా కనీసం రూ. 3-5 లక్షల వరకు బీమా హామీ గల పాలసీ తీసుకుని దానికి ఒక రూ. 5-10 లక్షల సూపర్ టాప్ అప్ ఎంచుకోవడం మేలు.
-
సాంప్రదాయ పాలసీల కంటే టర్మ్ పాలసీ మంచిదని తెలుసుకున్నాను. నా వద్ద కొన్ని పాలసీలు ఇప్పటికే ఉన్నాయి. వాటిని ఏం చేయవచ్చు? నేను కొంత వరకు రిస్క్ తీసుకోగలను.
ఎండోమెంట్, హోల్ లైఫ్ లాంటి పధకాలను మీరు సరెండర్ లేదా పేడ్ అప్ చేసుకోవచ్చు. సరెండర్ చేసినట్టయితే కొంత వరకు ప్రీమియం వెనక్కి వస్తుంది. పేడ్ అప్ చేసుకున్నట్లయితే పాలసీ మెచ్యూరిటీ పూర్తి అయిన తరవాత మీ ప్రీమియం డబ్బు (రాబడి ఉంటె కలిపి) వెనక్కి ఇస్తారు. మీరు పేడ్ అప్ చేసాక తరువాయి ప్రీమియం లు చెల్లించే అవసరం ఉండదు. పాలసీ లో మిగిలిన ఉన్న సమయాన్ని బట్టి, మీరు బీమా కంపెనీ తో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు.
-
హాయ్ సిరి, నెనొక ఐటీ కంపెనిలొ పని చేస్తున్నాను. నా జీతం నెలకు తొంబై వెలు. నా వయసు 33 సంవత్సరాలు. మరో ఇరవై సంవత్సరాల కోసం నెను ఇప్పట్టీ నుండీ ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. దయ చేసి మంచి సలహా ఇవ్వగలరు.
దీర్ఘకాలం కోసం ఇప్పటి నుంచే మదుపు చేయాలి అనుకోవడం మంచి ఆలోచన. ముందుగా మీ లక్ష్యాలు, వాటి కాల పరిమితి, పొందాలనుకునే మొత్తం, మీ రిస్క్ పరిమితి లాంటివి తెలుసుకుని వాటి అనుసారంగా పధకాన్ని ఎంచుకుని మదుపు చేయడం మంచిది. పీపీఎఫ్ లాంటి పథకాల్లో రిస్క్ ఉండదు, 7 శాతం వరకురాబడి పొందొచ్చు. పదవీ విరమణ నిధి కోసం ఎన్పీఎస్ ఎంచుకోవచ్చు. కాస్త రిస్క్ తీసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయవచ్చు.
-
నేను ఎల్ఐసి జీవన్ ఆనంద్ పాలసీ లో 3 ప్రీమియంలు చెల్లించాను. ఇప్పుడు అది సరెండర్ చేస్తే 30 శాతం మాత్రమే వెనక్కి ఇస్తారు అంటున్నారు. ఈ డబ్బు ని మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం మంచి ఆలోచనేనా?
ఈ పాలసీ సరెండర్ చేయాలనే మీ ఆలోచన సరైనదే. ఇందులో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. మంచి పథకాలలో మదుపు చేస్తే దీర్ఘకాలం లో మంచి రాబడి పొందొచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. అలాగే, జీవిత బీమా కోసం ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
నా పేరు రాజా. మీ సలహాలు చాలా బాగుంటాయి. నేను 10-15 ఏళ్ళ పాటు నెలకి రూ. 1 లక్ష మదుపు చేయాలనుకుంటున్నాను. కొంత రిస్క్ తీసుకోగలను. నేను రూ. 25 వేలు చొప్పున యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో, పీపీఎఫ్ లో, బ్లూ చిప్ ఫండ్ లో, ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్ లో మదుపు చేయాలనుకుంటున్నాను. ఇది మంచిదేనా?
మీరు ఎంచుకున్న పధ్ధతి మంచిదే. అయితే, బ్లూ చిప్ ఫండ్ కూడా ఒక రకమైన ఇండెక్స్ ఫండ్. కాబట్టి, మీరు ఇండెక్స్ ఫండ్ లో రూ. 50 వేలు మదుపు చేయడం మేలు. మిగతా మొత్తాన్ని పీపీఎఫ్, స్మాల్ కాప్ ఫండ్ లో మదుపు చేయవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
సర్, నా పేరు కుమార్. నా వద్ద రూ. 1.50 కోటి బీమా హామీ గల టర్మ్ పాలసీ ఉంది, రూ. 10 లక్షల బీమా హామీ తో ఆరోగ్య బీమా కూడా ఉంది. దీనితో పాటు రూ. 6 వేలు సిప్ చేస్తున్నాను. నా వద్ద రూ.5 లక్షలు బ్యాంకులో ఉన్నాయి. నేను రూ. 10 లక్షల కారు కొనడానికి ఎంత మదుపు చేయాలి?
మీరు కారు కొనడానికి ఎంత కాలం ఉందనేది తెలుపలేదు. మరో 5 ఏళ్లలో కొనాలనుకుంటున్నారని భావిస్తున్నాము. మీ వద్ద ఉన్న రూ. 5 లక్షల రూపాయలు బ్యాంకు లో 5 ఏళ్ళ పాటు ఫిక్సిడ్ డిపాజిట్ చేయవచ్చు. దీనితో పాటు 5 ఏళ్ళ వరకు ప్రతి నెలా రూ. 5 వేలు బ్యాంకు లో రికరింగ్ డిపాజిట్ ద్వారా మదుపు చేస్తే సుమారుగా రూ. 10 లక్షలు సమకూర్చుకోవచ్చు.
-
హాయ్ సర్, నేను హెచ్చడీఎఫ్సి లో ఒక పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాను. 10 ఏళ్ళ పాటు రూ. 10 లక్షలు చెల్లిస్తే, 12 వ ఏడాది నుంచి 25 వ ఏడాది వరకు ప్రతి ఏడాది రూ. 97,500 తిరిగి ఇస్తారు. చివర్లో మరో రూ. 35 లక్షలు ఇస్తారు. ఇది మంచిదేనా?
మీరు పాలసీ పేరు తెలుపలేదు. మీరు అందించిన వివరాలని బట్టి ఇదొక మనీ బ్యాక్ పధకం అని అర్ధం అవుతోంది. ఇలాంటి పాలసీలలో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. వీటి నుంచి దూరంగా ఉండడం మంచిది. ముందుగా మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. దీర్ఘకాల పెట్టుబడి కోసం పీపీఎఫ్ లాంటి సురక్షితమైన ప్రభుత్వ పధకాలు ఎంచుకోవచ్చు. పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం ఎన్పీఎస్ ఎంచుకోవచ్చు. కాస్త రిస్క్ తీసుకోగలిగితే కనీసం 10 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు.
-
సర్, నా పేరు మహేంద్ర. నా జీతం రూ. 13000. నా వయస్సు 30. నేను జీవిత బీమా తీసుకోవాలని అనుకుంటున్నాను. మా స్నేహితుడు ఎల్ఐసి జీవన్ లాబ్ గురించి చెప్పాడు. బీమా మొత్తం రూ. 400000, 16 ఏళ్ళ పాలసీ, మెచ్యూరిటీ మొత్తం 25 ఏళ్ళకి రూ. 1016000. దయచేసి సలహా ఇవ్వండి.
మీరు పేర్కొన్న పాలసీ బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉన్న ఎండోమెంట్ పధకం. అయితే, వీటిలో బీమా హామీ తక్కువగా ఉంటుంది, రాబడి కూడా తక్కువే(సగటుగా 3-4 శాతం). వీటి నుంచి దూరంగా ఉండడం మేలు. జీవిత బీమా కోసం మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి పథకాల్ని మీ అవసరం, రిస్క్ పరిమితి ని బట్టి ఎంచుకోవచ్చు.
-
నా పెరు వినొద్, వయసు 32. నా పిల్లల వయసు 4 ఏళ్ళు, 6 నెలలు. వాళ్ళ చదువు, భవిష్యత్తు కోసం పధకాలు సూచించండి. నేను నెలకి రూ. 25 వేలు మదుపు చేయగలను.
పిల్లల కోసం ప్రత్యేక పధకాలు పెద్దగా లేవు. కొన్ని బీమా పాలసీలు ఉన్నప్పటికీ వాటిలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. మీకు ఆడ పిల్ల ఉన్నట్టయితే తన పేరున సుకన్య సమృద్ధి ఖాతా తెరవచ్చు. ఏడాదికి రూ. 1.50 లక్షల వరకు ఇందులో మదుపు చేయవచ్చు. మగ పిల్లల కోసం అయితే పీపీఎఫ్ ఖాతా తెరవచ్చు. ఇది 15 ఏళ్ళ ఖాతా, ప్రభుత్వ పధకం కాబట్టి మీ డబ్బు సురక్షితం కూడా. కొంత రిస్క్ తీసుకోగలిగితే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
ఆన్లైన్ లో టర్మ్ పాలసీ తీసుకుంటే ఒక వేళ ఏదైనా జరిగితే క్లెయిమ్ ఎక్కడ, ఎలా చేసుకోవాలి? అసలు ఆన్లైన్ లో పాలసీ తీసుకోవడం మంచిదేనా?
టర్మ్ పాలసీ అనేది ఒక జీవిత బీమా పాలసీ. మీరు ఈ పాలసీ ని ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ఏదైనా విధంగా కొనుగోలు చేసుకోవచ్చు. క్లెయిమ్ చేయాల్సి వస్తే నేరుగా కంపెనీ ని ఈ-మెయిల్, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. పాలసీడ్ దారుడి మరణం గురించి తెలిపి మీ వివరాలు అందించినట్టైతే వారు మీకు సహాయ పడతారు. ఒక వేళా అన్ని సరిగ్గా ఉన్నప్పటికీ క్లెయిమ్ తిరస్కరించబడితే మీరు ఐఅర్డీఏ లేదా ఓంబుడ్స్మన్ వద్ద ఫిర్యాదు చేయవచ్చు. కాబట్టి ఆన్లైన్ లో పాలసీ తీసుకోవడం సురక్షితమే.
-
గృహిణి లు టర్మ్ పాలసీ లో మదుపు చేయవచ్చా?
టర్మ్ పాలసీ అనేది ఒక జీవిత బీమా పాలసీ. కుటుంబం లో సంపాదన కలిగిన వారి పేరు మీద జీవిత బీమా తీసుకున్నట్లయితే వారు ఆ కారణం చేత అయినా మరణిస్తే కుటుంబానికి ఎంచుకున్న బీమా హామీ అందుతుంది. వారికి ఆర్ధిక ఇబ్బందులు రాకుండా ఇది ఉపయోగ పడుతుంది. కాబట్టి, మీ భర్త పేరు మీద టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
నమస్కారం సర్. నా పేరు గణేష్, నేను గల్ఫ్ లో పని చేస్తున్నాను. ఖర్చులన్ని పోను రూ. 50000 వరకు మిగులుతాయి. ప్రతి నెలా రూ. 10000 పిల్లల చదువులకు, తరువాత మా అవసరాల కోసం మ్యూచుల్ ఫండ్స్ లో కానీ, సిప్ లో కానీ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నను. నా నిర్ణయం సరైనదేనా? వివరించండి.
పిల్లల కోసం పెద్దగా ప్రత్యేక పధకాలు లేవు. ఆడపిల్లల కోసం అయితే ప్రభుత్వ పధకం సుకన్య సమృద్ధి యోజన ఉంది. ఇందులో మీరు ప్రతి నెలా మదుపు చేయవచ్చు. మెగా పిల్లల కోసం పీపీఎఫ్ ఎంచుకోవచ్చు. ఇందులో 7 శాతం వరకు రాబడి పొందే వీలుంటుంది. మీ ఇతర దీర్ఘకాల లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవచ్చు. ఇందులో రెండు రకాలుగా మదుపు చేయవచ్చు, లంప్సమ్ (ఒకేసారి పెద్ద మొత్తం లో మీ వీలు ప్రకారం), సిప్(నెల నెలా కొంత నిర్ణీత మొత్తం). సిప్ ద్వారా మదుపు చేసినట్టయితే కొంత వరకు మార్కెట్ లో ఉన్న రిస్క్ తగ్గించుకున్నవారు అంటారు. కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేస్తే మంచిది. విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు.
-
సర్, నా పేరు గణేష్, వయసు 28. నేను ఒక ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగిని. నా జీతం రూ. 14,000. మంచి దీర్ఘకాల పాలసీ సూచించండి.
బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పాలసీల నుంచి దూరంగా ఉండండి. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ. ముందుగా మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం మీ రిస్క్ పరిమితి, వీలు ఆధారంగా పధకం ఎంచుకోవచ్చు. పీపీఎఫ్ లాంటి పధకం సురక్షితంగా ఉంటుంది. ఇది 15 ఏళ్ళ పధకం, 7 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. కాస్త రిస్క్ తీసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. ఒక ఇండెక్స్ ఫండ్ లో సిప్ ద్వారా మదుపు చేయవచ్చు. ఇందులో 10 నుంచి 12 శాతం వరకు సగటు రాబడి పొందగలరు.
-
సార్, నా జీతం నెలకి పదివేలు. ప్రతి నెలా రెండు వేలు మదుపు చేయాలి అనుకుంటున్నాను. నా వయసు 30 ఏళ్ళు. నాకు ఏదైనా మంచి సలహా ఇవ్వగలరా?
మీరు దీర్ఘకాలం కోసం మదుపు చేయాలనుకుంటున్నారని భావిస్తున్నాము. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్ సిరి. ఎస్బిఐ వెల్త్ బిల్డర్ లో 7 సంవత్సరాలు, సంవత్సరానికి లక్ష చూప్పున పెట్టు బడి పెడితే మంచిదేనా? లాంగ్ టర్మ్ ప్లాన్ మరియు రిస్క్ కవర్ ఉంది. 60% మ్యూచువల్ ఫండ్స్, 40 % బాండ్ గా చెయ్యవచ్చునా? తెలుపగలరు.
మీరు పేర్కొన్న పాలసీ ఒక యూలిప్. ఎండోమెంట్, యూలిప్, హోల్ లైఫ్ లాంటి పథకాల్లో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే ఉంటుంది. వీటి నుంచి దూరంగా ఉండడం మంచిది. బీమా హామీ కోసం మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. దీర్ఘకాల పెట్టుబడి కోసం మీ రిస్క్ పరిమితి ప్రకారం పధకాన్ని ఎంచుకోవచ్చు. పీపీఎఫ్ లాంటి పధకాలు సురక్షితంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ లో కాస్త అధిక రాబడి పొందే అవకాశం ఉంటుంది, అయితే కాస్త రిస్క్ ఉంటుంది. కాబట్టి, వీటిలో మీ వీలు, అవసరం ప్రకారం మదుపు చేయండి. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు.
-
సర్, నేను కువేరా పోర్టల్ లో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతున్నాను. దీర్ఘకాలానికి వీటిని నమ్మవచ్చా? వీటికి ఏమైనా గారంటీ ఉంటుందా?
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడికి మీకు వీలు గా ఉన్న వెబ్సైటు లేదా యాప్ ని ఎంచుకోవచ్చు. మీ డబ్బు నేరుగా ఎంచుకున్న ఫండ్ నిర్వహించే కంపెనీ వద్దకు చేరుతుంది. భవిష్యత్తు లో ఈ వెబ్సైటు లేదా యాప్ లో ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ మీరు మ్యూచువల్ ఫండ్ కంపెనీ లేదా సెబీ ని సంప్రదించి మీ యూనిట్స్ అమ్ముకునే అవకాశం ఉంటుంది.
-
సిరికి వందనాలు. నేను 2005 లో ఇల్లు కొని 2021 ఆగస్ట్ లో అమ్మేసాను. మరొక ఇంటిని 2021 ఎప్రిల్ లో కొన్నాను. ఇప్పుడు నేను దీర్ఘకాల మూలధన ఆదాయ పన్ను కట్టాలా?
మీరు ఇంటి అమ్మకం నిమిత్తం పొందిన మూలధన ఆదాయ పన్ను మొత్తం మరొక ఇల్లు కొనుగోలు మీద మదుపు చేసినట్టయితే దీర్ఘకాల మూలధన ఆదాయ పన్ను కట్టే అవసరం ఉండదు. అయితే, ఈ విషయాన్ని మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ లో తెలుపాల్సి ఉంటుంది.
-
మా అమ్మాయి పేరు మీద ఇరవై ఐదు లక్షలు ఎక్కడ డిపాజిట్టు చేస్తే బాగుంటుంది? రిస్క్ లేకుండ త్వరగా తీసుకునే విధంగా కావాలి.
మీరు స్వల్ప కాలం (2-5 ఏళ్ళు) కోసం డిపాజిట్ చేయాలనుకుంటే బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ మేలు. ఇది మీకు సురక్షితంగా ఉంటుంది. వార్షికంగా 5-6 శాతం వరకు వడ్డీ పొందగలరు. 2-3 బ్యాంకుల్లో ఈ మొత్తాన్ని మీరు డిపాజిట్ చేయవచ్చు. దీర్ఘకాలం కోసం పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన లాంటి పధకాలు ఎంచుకోవచ్చు. కొంత రిస్క్ తీసుకోగలిగితే కనీసం 10 ఏళ్ళ పైన పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎంచుకోవచ్చు.
-
దీర్ఘకాలానికి మంచి మ్యూచువల్ ఫండ్ సూచించండి.
దీర్ఘకాలానికి ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. మీరు సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
బీమా పాలసీ దారుడు మరణిస్తే డబ్బు ఎవరికి ఇస్తారు? అలాగే ఈపీఎఫ్ సంగతి ఏంటి?
బీమా పాలసీ తీసుకునే సమయం లో పాలసీ దారుడు మరణిస్తే ఆ డబ్బు ఎవరికి చెందుతుందో, అంటే నామినీ పేరు తెలుపాల్సి ఉంటుంది. అలాంటి సంఘటన జరిగితే ఆ నామినీ సంబంధిత మరణ ధృవీ కరణ పత్రాలు లాంటివి సమర్పించి బీమా మొత్తం పొందొచ్చు. అదే విధంగా ఈపీఎఫ్ లో కూడా నామినీ కి పీఎఫ్ మొత్తం, పెన్షన్ అందుతుంది. పూర్తి వివరాలకు పీఎఫ్ ఆఫీసు ని సంప్రదించవచ్చు.
-
సర్, నేను 11 ఏళ్లలో పదవీ విరమణ తీసుకుంటాను. ఎన్పీఎస్ లో ఫండ్ మేనేజర్ ఎంచుకోడానికి సలహా ఇవ్వండి. ఏ కంపెనీ బాగుంటుంది?
గత 5 ఏళ్ళ రాబడి పరంగా హెచ్డీఎఫ్సీ పెన్షన్ ఫండ్ రాబడి మిగతా వాటి కంటే కాస్త ఎక్కువగా ఉంది. దీని తరువాత యూటీఐ రాబడి ఉంది. టయర్ 1 కోసం ఎంచుకొవాలంటే మీరు ఈ రెండింట్లో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. నెల నెలా లేదా ప్రతి ఏడాదికి ఒకేసారి కూడా వీటిలో మదుపు చేయవచ్చు.
-
నా పేరు క్రాంతి. 15 ఏళ్ళ కోసం సిప్ చేయడానికి మంచి స్మాల్ కాప్ ఫండ్ సూచించండి.
స్మాల్ కాప్ ఫండ్ లో అధిక రిస్క్ ఉంటుంది. ఈ మేరకు మీరు రిస్క్ తీసుకోగలిగితే ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్ లేదా డీఎస్పీ స్మాల్ కాప్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
ఒక కంపెనీ ఆర్ధిక లాభాలు ప్రకటించినప్పుడు ఒకోసారి దాని షేర్ ధర భారీగా పడిపోతుంటుంది, ఎందుకు?
షేర్స్ లో ఒడిదుడుకులకు అనేక కారణాలు ఉంటాయి. ఒకోసారి లాభం ఓచినప్పటికీ అనుకున్నంత స్థాయి లో రాకపోవడం వల్ల షేర్ ధర పడిపోవచ్చు. ఒకోసారి నష్టాలు వచ్చినా కూడా ఈ ధర లో కొంటే లాభాలు రావచ్చు అని అనేక మదుపరులు భావించి ఆ షేర్ లో మదుపు చేయడం వల్ల షేర్ ధర పెరగవచ్చు. ఇవే కాకుండా షేర్ ధర వెనక అంతర్జాతీయ మార్కెట్ లు, రాజకీయ పరిస్థితులు, సెక్టార్ సంబంధిత విషయాలు లాంటి అనేక కారణాలు ఉంటాయి. వీటి మీద నైపుణ్యం ఉన్నప్పుడు మాత్రమే షేర్స్ లో మదుపు చేయడం మంచిది. లేదంటే షేర్ మార్కెట్ నిపుణుల్ని సంప్రదించి చేయవచ్చు.
-
నేను ఎల్ఐసి లో గత రెండేళ్లుగా ప్రీమియం చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు మా ఏజెంట్ మాకు ఎటువంటి డాక్యుమెంట్ అందించలేదు. దీని గురించి ఏం చేయాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి?
మీరు మీ దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్ ని సందర్శించి మీ పాలసీ వివరాలు, సంబంధించిన బ్రాంచీ వివరాలు తెలుసుకోవచ్చు. పాలసీ తీసుకున్న బ్రాంచీ లో పాలసీ డాక్యుమెంట్ పొందవచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ కింది లింక్ ద్వారా ఎల్ఐసి కస్టమర్ కేర్ ని సంప్రదించవచ్చు: https://licindia.in/Customer-Services/Phone-Help-Line
-
సర్, నా పేరు చంద్ర శేఖర్. మీ సలహాలు, సూచనలకు ధన్యవాదాలు. నేను గత 3 ఏళ్లుగా హెచ్డీఎఫ్సీ మిడ్ కాప్ ఫండ్, ఆదిత్య బిర్లా ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ లో మదుపు చేస్తున్నాను. ఇటీవలే ఎస్బీ స్మాల్ కాప్ ఫండ్ లో రూ. 2000 సిప్ మొదలు పెట్టాను. మరో రూ. 5000 పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ కాప్ ఫండ్ లో మదుపు చేయడానికి సలహా ఇవ్వండి.
మీరు లార్జ్ కాప్, మిడ్ కాప్, స్మాల్ కాప్ ఫండ్ లలో మదుపు చేస్తున్నారు. మరో ఫండ్ ఎంచుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అధిక ఫండ్స్ లో మదుపు చేస్తే అధిక రాబడి వస్తుంది అన్నది అపోహ మాత్రమే. పైగా, వాటిని ట్రాక్ చేయడం కష్టతరం అవుతుంది. మీరు మదుపు చేస్తున్న ఫండ్స్ లో నే మరో సిప్ మొదలు పెట్టవచ్చు. లేదా మీ వీలుని బట్టి కొంత మొత్తాన్ని లంప్సమ్ రూపం లో మదుపు చేస్తూ ఉండవచ్చు.
-
సర్, నా నెలసరి జీతం 14,000.00 నా వయసు 42, ఎల్ఐసి పాలసీ గురించి తెలపండి. ఎక్కువగా ఖర్చు చేయలేము.
జీవిత బీమా కంపెనీ లు అనేక పాలసీలు అందిస్తుంటాయి. ఇందులో ఎండోమెంట్, మనీ బ్యాక్, హోల్ లైఫ్ లాంటి పథకాలలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండడం మంచిది. జీవిత బీమా కోసం మీరు ఒక టర్మ్ పాలసీ ఎంచుకోవడం మేలు. ఆన్లైన్ టర్మ్ పాలసీ లో రూ. 25 లక్షల బీమా కి మీరు ఏడాదికి రూ. 7-8 వేలు చెల్లించాల్సి రావచ్చు. పెట్టుబడి కోసం మీ అవసరం, రిస్క్ పరిమితి ని బట్టి ఏదైనా ఒక పధకం ఎంచుకోవచ్చు. పీపీఎఫ్ లాంటి సురక్షిత పధకం లో 15 ఏళ్ళ పాటు మదుపు చేయవచ్చు. పదవీ విరమణ నిధి కోసం ఎన్పీఎస్ మేలు. కాస్త రిస్క్ తీసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎంచుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్ లో సిప్ చేయడం మంచిది.
-
నా వయసు 37, నేను రూ. 50 లక్షల తో టర్మ్ పాలసీ తీసుకోవాలి అనుకుంటున్నాను. కంపెనీ సూచించండి.
మీరు తీసుకునే టర్మ్ పాలసీ లో మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ పరంగా మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
సర్, నా వయసు 29. ఏదైనా మ్యూచువల్ ఫండ్ లో రూ. 10 వేలు మదుపు చేయాలనుకుంటున్నాను. మంచి ఫండ్ సూచించండి. ఎన్నేళ్లు మదుపు చేస్తే రూ. 1 కోటి అవుతుంది?
మ్యూచువల్ ఫండ్ లో కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేస్తే సగటు రాబడి 10 నుంచి 12 శాతం వరకు ఆశించవచ్చు. దీని ప్రకారం మీరు 20 ఏళ్ళ పాటు ప్రతి నెలా రూ. 10 వేలు మదుపు చేస్తే రూ. 1 కోటి సమకూర్చుకోవచ్చు. ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నా నెలసరి ఆదాయం రూ. 13 వేలు. నేను రెండు ఎల్ఐసి పాలసీలలో మదుపు చేస్తున్నాను. నెల నెలా రూ. 10 వేలతో సిప్ చేయాలనుకుంటున్నాను.సలహా ఇవ్వండి.
మీరు సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. రిస్క్ తీసుకోగలిగితే దీనితో పాటు ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్ కూడా ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. సాధారణంగా, బీమా కంపెనీ లు అందించే పాలసీలలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే ఉంటుంది. వీలయితే సరెండర్ చేయడం మంచిది. కొంత వరకు నష్టపోయినా మంచి పెట్టుబడి పథకాలలో మదుపు చేయడం మేలు. బీమా కోసం ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
సర్, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. నా ప్రోవిడెంట్ ఫండ్ లో రూ. 10 లక్షలు ఉన్నాయి. మరో 11 ఏళ్ళకి పదవీ విరమణ తీసుకుంటాను. ఇందులో నుంచి డబ్బు తీసి నిఫ్టీ ఇండెక్స్ లేదా ఎస్బీఐ స్మాల్ కాప్ మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయవచ్చా?
మ్యూచువల్ ఫండ్స్ లో అధిక రాబడి రావచ్చు. అయితే, అందులో రిస్క్ కూడా ఉంటుంది. ఒకోసారి పోర్ట్‌ఫోలియో లో నష్టాలూ రావచ్చు. పదవీ విరమణ నిధి చాలా ముఖ్యమైనది కాబట్టి, పీఎఫ్ నుంచి తీసి ఇందులో మదుపు చేయడం సరైన పధ్ధతి కాదు. మీ వీలుని బట్టి ఈ ఫండ్స్ లో నెల నెలా కొంత మొత్తాన్ని సిప్ చేయవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
సర్, నా నెలసరి ఆదాయం రూ. 20 వేలు. నేను రెండేళ్ల క్రితం రూ. 8 లక్షలు ఇంటి రుణం తీసుకున్నాను. ఇప్పుడు నా వద్ద రూ. 3 లక్షలు ఉన్నాయి, కట్టేయాలా లేక మదుపు చేయాలా? సలహా ఇవ్వండి.
ఇంటి రుణం కొంత వరకు తీర్చడం మంచి ఆలోచన. అయితే, మీ ఇతర ఆర్ధిక లక్ష్యాల కోసం మీరు మదుపు చేయడం కూడా ముఖ్యం. ముందుగా మీరు మీ స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాలను తెలుసుకోండి. మీ లక్ష్యాల్ని బట్టి ఎంత రుణం తీర్చాలి అన్నది నిర్ణయం తీసుకోవచ్చు.
-
సర్, నా వద్ద రూ. 2 లక్షలు ఉన్నాయి. 10 ఏళ్ళ కోసం ఎక్కడ మదుపు చేయాలి, రాబడి 10 శాతం కంటే ఎక్కువ ఉండాలి.
దీర్ఘకాలం పాటు మదుపు చేయడం మంచి ఆలోచన. 10 శాతం కంటే అధిక రాబడి అందించే పధకాలు తక్కువ. మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. అయితే, ఇందులో కొంత వరకు రిస్క్ ఉంటుంది. ఆ మేరకు రిస్క్ మీరు తీసుకోగలిగితే సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
మీ సలహాలు చాలా బాగుంటాయి. నా పేరు రవీంద్రనాథ్, ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. NPS lo పొదుపు చేయాలి అనుకుంటున్నాను. ప్రతి నెలా చేయడం లేదా లంప్సమ్ లో చేయడం, ఎది మంచిది?
ఎన్పీఎస్ లో మీ వీలు ప్రకారం నెల నెలా లేదా ఒకేమొత్తం లో మదుపు చేస్తూ ఉండవచ్చు. నెల నెలా చేయడం వల్ల మార్కెట్ లోని ఒడిదుడుకుల నుంచి మీకు కొంత వరకు రిస్క్ తగ్గుతుంది. మార్కెట్ దిగువలో ఉన్నప్పుడు మీరు లంప్సమ్ లో కూడా మదుపు చేయవచ్చు.
-
డియర్ సిరి, నేను ఎక్క్సైడ్ కంపెనీ నుంచి ఒక టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్న. దాని పేరు గారంటీడ్ వెల్త్ ప్లస్. ప్రీమియం రూ. 5 లక్షలు, 6 ఏళ్ళ పాటు చెల్లించాలి. 8వ ఏడాది నుంచి 85 ఏళ్ళ వరకు రూ. 2.20 లక్షల చొప్పున వెనక్కి పొందొచ్చు. ఆ తరవాత రూ. 30 లక్షల అసలు మొత్తాన్ని వెనక్కి ఇష్టం అంటున్నారు. ఇది మంచిదేనా?
మీరు పేర్కొన్న పాలసీ టర్మ్ ప్లాన్ కాదు. ఇదొక సాంప్రదాయ బీమా పధకం. ఇందులో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. ద్రవ్యోల్బణం ప్రకారం 25-30 ఏళ్ళ తరవాత ఇప్పటి రూ. 30 లక్షల విలువ చాలా తక్కువగా ఉంటుంది.మీరు తెలిపిన వివరాల ప్రకారం సగటు వార్షిక రాబడి 5.50-6 శాతం మాత్రమే ఉంటుంది. దీర్ఘకాలం లో ఇది చాలా తక్కువ. ఇలాంటి పాలసీల నుంచి దూరంగా ఉండడం మంచిది. మీరు బీమా హామీ కోసం ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. రిస్క్ లేని పధకాలు కావాలంటే పీపీఎఫ్ ఎంచుకోవచ్చు.
-
నేను ఇటీవలకాలం లో అన్ని ఐపీఓ లకు దరఖాస్తు చేసుకున్నాను. కానీ ఒక్క దాంట్లో కూడా అల్లాట్మెంట్ రాలేదు. ఎందుకో తెలుపగలరు.
ఐపీఐ లో దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా అల్లాట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలం లో చాలా వరకు ఐపీఓ లు 2-3 రేట్లు సబ్స్క్రయిబ్ అవ్వడం చూసాము. ఇలాంటి పరిస్థితుల్లో లాటరీ ఆధారంగా అల్లాట్మెంట్ ఇస్తుంటారు. కాబట్టి ప్రతి 100 లో సుమారుగా 30-35 మందికి మాత్రమే షేర్స్ అందే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అవకాశాలు పెంచుకోవాలంటే మీ కుటుంబ సభ్యుల డీమ్యాట్ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-
నమస్తే ఈనాడు. నా పేరు శరత్, వయస్సు 34. నేను రూ. 1 లక్ష వరకు సంపాదిస్తున్నాను. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నేను NPS తీసుకోవాలి అనుకుంటున్నాను. దీనికి సలహాలు ఇవ్వగలరు.
ఉద్యోగస్తులు పీఎఫ్ తో పాటు ఎన్పీఎస్ లో కూడా మదుపు చేయడం మేలు. ఇది పదవీ విరమణ నిధి తో పాటు పెన్షన్ కూడా అందించగలదు. మీ వీలు, అవసరాన్ని బట్టి ప్రతి నెల కొంత మొత్తాన్ని ఇందులో మదుపు చేయవచ్చు. పన్ను మినహాయింపు కూడా పొందగలరు.
-
నేను ఇటీవలే పుట్టిన నా మేనకోడలి కోసం రూ. 10 వేల తో, 15-20 ఏళ్ళ కాల పరిమితి తో ఫిక్సిడ్ డిపాజిట్ చేద్దామనుకుంటున్నాను. ఇది మంచిదేనా? ఇంకేదైనా ఉంటే సలహా చెప్పండి.
ఫిక్సిడ్ డిపాజిట్ సాధారణంగా 5 ఏళ్ళ వరకు చేయడం మంచిది. దీర్ఘకాలం కోసం ఇది సరైనది కాదు. 5 ఏళ్ళ తరవాత మీరు తిరిగి అప్పటి వడ్డీ రేటు ప్రకారం డిపాజిట్ చేయవచ్చు. దీర్ఘకాలం కోసం సుకన్య సమృద్ధి యోజన లో మదుపు చేయవచ్చు. ప్రతి ఏడాదికి కొంత మొత్తాన్ని మదుపు చేస్తే ఉంటే పాప ఉన్నత చదువు, పెళ్లి కి ఉపయోగపడవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మదుపు చేయవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నా వయసు 59. వచ్చే ఏడాది పదవీ విరమణ తీసుకోబోతున్నాను. నేను 5 రకాల ఎస్బీఐ ఫండ్స్ (ఫోకస్డ్ ఈక్విటీ, హైబ్రిడ్, మాగ్నమ్ మిడ్‌క్యాప్, ఫ్లెక్సీక్యాప్, బ్లూచిప్) లో 3 ఏళ్లుగా మదుపు చేస్తున్నాను. అలాగే, ఎల్ఐసి యాన్విటీ పథకాల్లో రూ. 20 లక్షల వరకు మదుపు చేశాను. మరో రూ. 10 లక్షలు మదుపు చేయడానికి నెలసరి పెన్షన్ ఇచ్చే పధకాలు సలహా ఇవ్వండి.
మీరు పదవీ విరమణ తీసుకున్నాక ఎల్ఐసి వయా వందన, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పథకాలలో కొంచం మొత్తం చొప్పున మదుపు చేయవచ్చు. మీరు అధిక ఫండ్స్ లో మదుపు చేస్తున్నారు. ఫండ్స్ పని తీరు కూడా అంతగా బాలేదని చెప్పాలి. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
సర్, నా వయసు 33. ఈ మధ్య టర్మ్ పాలసీ గురించి ఎక్కువగా వింటున్నాను. నేను కూడా టర్మ్ పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాను. దయచేసి టర్మ్ పాలసీ గురించి తెలియ జేయగలరు. అంటే, పాలసీ దారుడు మరణించాక కుటుంబ సభ్యులకి బీమా హామీ అందజేస్తారని విన్నాను, అలా కాకుండా 60 ఏళ్ళ తర్వాత అతను జీవించి ఉంటే అతను ఆ సొమ్ము పొందగలడా? ఒక వేళ పొందితే, ఎంత మొత్తం పొందగలడు?
టర్మ్ పాలసీ అనేది ఒక జీవిత బీమా పాలసీ. పాలసీదారుడు మరణించాక బీమా మొత్తాన్ని కంపెనీ కుటుంబానికి అందిస్తారు. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. కాబట్టి, పాలసీదారుడు బతికి ఉంటే ప్రీమియం మొత్తం వెనక్కి పొందే వీలుండదు. కొన్ని టర్మ్ పాలసీలలో ప్రీమియం వెనక్కి పొందే వీలుంటుంది. అయితే, వీటిలో ప్రీమియం అధికంగా ఉంటుంది కాబట్టి వీటి బదులు సాధారణ టర్మ్ పాలసీ తీసుకోవడం మేలు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. అదే బీమా మొత్తానికి ఇతర పాలసీలతో పోలిస్తే టర్మ్ పాలసీ లో ప్రీమియం చాలా తక్కువ. కాబట్టి, మిగులు మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, ఎన్పీఎస్ లాంటి పధకాలను మీ రిస్క్ ప్రకారంగా ఎంచుకోవచ్చు.
-
నా వయసు 33. నేను 35 ఏళ్ళ కాల పరిమితి తో టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. సలహా ఇవ్వండి.
టర్మ్ పాలసీ లో మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. మీకు తగినంత పదవీ విరమణ నిధి లేకపోతె 65 లేదు 70 ఏళ్ళ వరకు పాలసీ కొనసాగించవచ్చు. పాలసీ లో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. క్లెయిమ్ సెటిల్మెంట్ పరంగా మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
నా వయసు 63. నేను మా భార్య అనారోగ్యం కారణంగా తన మీద నెలకి రూ. 10 వేలు ఖర్చు చేస్తున్నాను. సెక్షన్ 80 DB లో పన్ను మినహాయింపు పొందొచ్చా?
ఈ సెక్షన్ లో కొన్ని ప్రత్యేకమైన అనారోగ్యాలకు పెట్టే ఖర్చుల మీద ఏడాదికి రూ. 40 వేల వరకు పన్ను మినహాయింపు పొందే వీలుంటుంది. దీనికోసం మీరు మీ డాక్టర్ వద్ద సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను రిటర్న్స్ సమయం లో ఈ మినహాయింపు ని పొందొచ్చు. ఒకవేళ ఆదాయ పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ సర్టిఫికెట్ ఉపయోగకరంగా ఉంటుంది.
-
సర్, నా పేరు చెన్నయ్య. నేను ఎస్బీఐ లో సిప్ చేస్తున్నాను. ఇంకా నెలకు రూ. 2000, 20 ఏళ్ళ పాటు మదుపు చేయాలి అనుకుంటున్నాను. సలహా ఇవ్వండి.
మీరు సిప్ చేస్తున్న ఫండ్ పేరు తెలుపలేదు కాబట్టి మేము దాని గురించి చెప్పలేకపోతున్నాము. అదనపు పెట్టుబడి కోసం ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నా వయసు 28. నేను ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్ లో మదుపు చేస్తున్నాను. అలాగే పన్ను మినహాయింపు కోసం ఎన్పీఎస్ లో కూడా మదుపు చేస్తున్నాను. నా 3 నెలల పాప కోసం మ్యూచువల్ ఫండ్స్ లేదా జీవన్ తరుణ్ తీసుకోవచ్చా?
మీరు పేర్కొన్న పాలసీ లో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండడం మంచిది. ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పధకం మంచిది. మీరు మీ పాప ఉన్నత చదువు, పెళ్లి కోసం ఇందులో మదుపు చేయవచ్చు. మీ ఇతర లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు.
-
సర్, నా వయసు 34. నా యొక్క వార్షిక ఆదాయం 3.5 లక్షలు. నేను 26 ఏళ్ళ కాల పరిమితి తో 50 లక్షల ఐసీఐసీఐ టర్మ్ ప్లాన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. అయితే దీనిని 26 ఏళ్ళు కట్టే కంటే, 7 ఏళ్లలో కట్టేస్తే 40% సేవ్ చెయ్యొచ్చు అని అంటున్నారు. దీన్ని 7 ఏళ్లలో కట్టేసే ప్రీమియం ను ఎంచుకోవచ్చా? ఏమైనా మార్పు ఉంటుందా?
ప్రీమియం ని త్వరగా చెల్లించడం వల్ల ప్రత్యేక లాభం ఉండదు. ద్రవ్యోల్బణాన్ని ద్రుష్టిలో ఉంచి మీరు చెల్లించిన ప్రీమియం విలువ భవిష్యత్తులో వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు వార్షిక ప్రీమియంనే ఎంచుకోవడం మేలు. మరొక విషయం ఏంటంటే టర్మ్ పాలసీ లో పాలసీ దారుడు చనిపోయాక ప్రీమియం చెల్లించే అవసరం ఉండదు. ముందుగానే ప్రీమియం చెల్లించడం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు.
-
నా కుమార్తెల వయస్సు 11 మరియు 5 సంవత్సరాలు. నా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగా ఉంది, కాబట్టి పొదుపు కి ఒక సలాహా కావాలి.
ప్రభుత్వం ఆడ పిల్లల ఉన్నత చదువు, పెళ్లి కోసం సుకన్య సమృద్ధి యోజన అందిస్తోంది. ఇది సురక్షితమైనది. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసు లో ఈ ఖాతా తెరిచి పెట్టుబడి చేయవచ్చు. అయితే, 10 ఏళ్ళ లోపు పిల్లలకి మాత్రమే అర్హత ఉంటుంది. కాబట్టి, మీ రెండవ అమ్మాయి పేరు మీద ఖాతా తెరవచ్చు. దీర్ఘకాలం కోసం పీపీఎఫ్ కూడా ఎంచుకోవచ్చు. కాస్త రిస్క్ తీసుకోగలిగితే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
షేర్ మార్కెట్ లో మదుపు చేయడానికి సలహా ఇవ్వగలరు.
షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ముందు వాటి గురించి అవగాహన తెచ్చుకోవడం మంచిది. దీని గురించి తెలుసుకునేందుకు చాలా పుస్తకాలు,వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎన్ఎస్ఈ లో ఉన్న కంపెనీల గురించి అవి చేసే వ్యాపారాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఎన్ఎస్ఈ వెబ్సైటు లో చూడొచ్చు. షేర్లలో పెట్టుబడి చేసేందుకు డీమ్యాట్ ఖాతాను ఏదైనా బ్రోకింగ్ సంస్థ నుంచి తీసుకోవాలి. దీంట్లో ట్రేడింగ్ , డీమ్యాట్ ఖాతాలుంటాయి. ట్రేడింగ్ ఖాతా ద్వారా షేర్ల క్రయవిక్రయాలు చేయవచ్చు. డీమ్యాట్ ఖాతాలో మీరు కొనుగోలు చేసిన షేర్లు భద్రంగా ఉంటాయి. డిపాజిటరీ సంస్థలో మీరు కొనుగోలు చేసిన షేర్లు డీమెటిరీయలైజెడ్ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. షేర్లలో పెట్టుబడి నష్టభయం కలిగిఉంటుంది . కాబట్టి మీ నష్టభయం అంచనా వేసుకుని నేరుగా షేర్లలో మదుపు చేయాలి. షేర్ల ఎంపికలో నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది. దీని బదులు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మదుపు చేయవచ్చు. ఇవి పరోక్షంగా షేర్స్ లో మదుపు చేస్తాయి. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు.
-
నా రెండేళ్ల పిల్లవాడికోసం ఎల్ఐసి జీవన్ తరుణ్ పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాను. సలహా ఇవ్వగలరు.
సాధారణంగా, పిల్లల పేరు మీద ఉండే ప్రత్యేక పథకాలకు పెద్దగా ప్రత్యేకతలు ఉండవు. మీరు పేర్కొన్న పధకం ఒక మనీ బ్యాక్ ప్లాన్. ఇందులో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇలాంటి పథకాలకు దూరంగా ఉండడం మేలు. జీవిత బీమా కోసం మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం పీపీఎఫ్ ఎంచుకోవచ్చు. ఇది సురక్షితమైన పధకం. దీనితో పాటు మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
సర్, నా వయసు 33. నేను 17 ఏళ్ళ కాల పరిమితి తో ఐసీఐసీఐ టర్మ్ ప్లాన్ తీసుకున్నాను. దీన్ని మరో 20 ఏళ్ళు కొనసాగించవచ్చా?
సాధారణంగా, టర్మ్ పాలసీ లో మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించడం మంచిది. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి పాలసీ ముగిసేటప్పుడు మరో పాలసీ తీసుకోవచ్చు. లేదా ఇప్పుడే కొంత బీమా హామీ తో మరో పాలసీ తీసుకుని మీకు 60 ఏళ్ళ వయసు వరకు కొనసాగించవచ్చు.
-
ఒకేసారి రూ. 2 లక్షలు పెట్టడానికి మంచి ఫండ్ సూచించండి.
మీరు ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. అదే ఫండ్ లో సిప్ విధానంలో కూడా కొంత మొత్తాన్ని మదుపు చేయడం మంచిది.
-
హాయ్, నా వయసు 32. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఇటీవలే నాకు పుట్టిన బాబు పేరున పెట్టుబడులకు సలహా ఇవ్వండి.
ముందుగా మీరు మీ అబ్బాయి ఉన్నత చదువు తో పాటు మీ ఇతర ఆర్ధిక లక్ష్యాలను గుర్తించడం ముఖ్యం. వాటి కాల పరిమితి, మీ రిస్క్ పరిమితి ఆధారంగా పెట్టుబడులను ఎంచుకోవచ్చు. దీర్ఘకాలం కోసం సురక్షితమైన పధకం ఎంచుకున్నట్టయితే పీపీఎఫ్ మేలు. ఇది 15 ఏళ్ళ పధకం. ఏడాదికి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 5 ఏళ్ళ తరువాత నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి కూడా తీసుకోవచ్చు. కొంత రిస్క్ తీసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయవచ్చు. మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
సర్, నమస్కారం. నా పేరు భాను ప్రకాశ్. నా వయసు 30 సంవత్సరాలు. నేను IT కంపెనీలో నెలకు రూ. 90000 జీతంతో పనిచేస్తున్నాను. ఇప్పటివరకు ఒక LIC పాలసీ రూ. 65000 ప్రీమియంతో చేశాను. ఇంకా పొదుపు మొదలు పెట్టలేదు. దయచేసి స్వల్పకాల, దీర్గకాల పెట్టుబడులకు సూచనలు ఇవ్వగలరు. ధన్యవాదములు.
మీరు తీసుకున్న పాలసీ పేరు తెలుపలేదు. అయితే, చాలా వరకు ఎండోమెంట్, హోల్ లైఫ్, యూలిప్ లాంటి పెట్టుబడి తో కూడిన బీమా పథకాలలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. వీటి నుంచి దూరంగా ఉండడం మేలు. వీటి బదులు బీమా హామీ కోసం ఒక టర్మ్ ప్లాన్ తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం మీ రిస్క్ పరిమితి, లక్ష్యాల ఆధారంగా పీపీఎఫ్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి, పెన్షన్), మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఎంచుకోవచ్చు. కనీసం 10 ఏళ్ళ కోసం అయితే ఇండెక్స్ ఫండ్స్ మేలు.
-
సర్, నేను ఎస్బీఐ, ఎల్ఐసి ఇంటి రుణం చెల్లిస్తున్నాను. వీటి పై నాకు బీమా లేదు. బీమా తీసుకునే వీలుంటుందా?
ఇంటి రుణానికి కూడా బీమా తీసుకునే సౌకర్యం ఉంటుంది. సాధారణంగా, రుణం తీసుకునే సమయం లో బ్యాంకు ద్వారా మీరు ఇది తీసుకోవచ్చు. చాలా వరకు బ్యాంకులు ప్రీమియం మొత్తాన్ని ముందస్తుగా ఒకేసారి చెల్లించమని కోరతారు. మీరు ఇప్పుడు వేరే బీమా కంపెనీల ద్వారా కూడా ఈ బీమా ని తీసుకోవచ్చు. రుణ మొత్తం, మీ వయసు, రుణం కాల పరిమితి ఆధారంగా ప్రీమియం ఉంటుంది. దీని బదులు మీరు టర్మ్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. జీవిత బీమా లో భాగంగా రుణ మొత్తాన్ని కూడా జొధించినట్టైతే మీకు ఏదైనా జరిగినప్పుడు అధిక బీమా పొందొచ్చు . టర్మ్ ప్లాన్ లో మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
10 ఏళ్ళ తరవాత ఇల్లు కట్టుకోవడానికి రూ. 50 లక్షలు కావాలంటే ఇప్పటి నుంచి ఎంత మదుపు చేయాలి?
10 శాతం రాబడి అంచనా ప్రకారం 10 ఏళ్ళకి రూ. 50 లక్షలు పొందాలంటే నెల నెలా సుమారుగా రూ. 25 వేలు మదుపు చేయాల్సి ఉంటుంది. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నా కూతురు కు 9 ఏళ్ళ వయసు నుంచి (9 జనవరి, 2019) ఏడాదికి రూ. 24000 సుకన్య సమృద్ధి యోజన లో కడుతున్నాను. ఇంకా ఎన్ని సంవత్సరాలు కట్టాలి? దాని గురించి చెప్పండి.
సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచినా రోజు నుంచి 21 ఏళ్ళు. అయితే, ఇందులో 15 ఏళ్ళ వరకు మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మీ పాప ఉన్నత చదువు లేదా పెళ్లి కోసం ముందస్తుగా కూడా 50 శాతం వరకు ఖాతా (వడ్డీ తో కలిపి) లోని డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. ఖాతా లో ఏడాదికి రూ. 250 కనిష్టంగా మదుపు చేస్తూ ఉండడం తప్పనిసరి. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు మదుపు చేసే వీలుంటుంది.
-
సర్, షేర్ మార్కెట్ లో పెట్టుబడి కోసం మంచి సెక్టార్ సూచించండి.
షేర్ మార్కెట్ లో కచ్చితంగా ఒకే సెక్టార్ బాగుంటుంది అని చెప్పలేము. మార్కెట్ సైకిల్ లో ఒకోసారి కొన్ని కొన్ని సెక్టార్ లు బాగుండచ్చు, కొన్ని బాగోకపోవచ్చు. ఉదాహరణకి, కోవిడ్ సమయం లో ఫార్మా రంగం షేర్ లు చాలా వరకు లాభాలు గణించాయి. ఒకే సెక్టార్ లేదా కంపెనీ మీద ఆధార పడటం రిస్క్ తో కూడుకున్న పని. దీని కోసం మీరు బ్రోకరేజ్ లు లేదా షేర్ మార్కెట్ నిపుణుల్ని సలహా అడగవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పరోక్షంగా కూడా షేర్ మార్కెట్ లో మదుపు చేయవచ్చు. ఒక ఫండ్ అనేక సెక్టార్స్ లోని అనేక షేర్స్ లో మదుపు చేస్తుంటుంది. కాబట్టి, ఇందులో రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నేను LIC లో ఒక పాలసీ చేశాను, ఏడాది ప్రీమియం రూ. 18800 కట్టాలి. ఇది మూడు లక్షల పాలసీ.15 ఏళ్ళు కడితే 21 ఏళ్ళకి రూ. 6 లక్షలు వస్తుంది అన్నారు. కానీ కరోనా వలన నేను 3 ఏళ్ళు కట్టి వదిలేసాను .ఇప్పుడు నాకు డబ్బు అవసరం చాలానే ఉంది. నేను కట్టిన అసలు మొత్తం అయినా నాకు వస్తుందా? వస్తే ఎప్పుడు తీసుకోవచ్చు? వడ్డీ ఏమైనా ఇస్తారా?
మీరు పాలసీ పేరు తెలుపలేదు కాబట్టి మేము సరైన వివరాలు అందించలేకపోవచ్చు. సాధారణంగా, వీటిలో కనీసం 3 ఏళ్ళ పాటు ప్రీమియం చెల్లిస్తే మొదటి ఏడాది ప్రీమియం మినహాయించి మిగతా రెండింట్లో 30 శాతం వరకు వెనక్కి తీసుకునే వీలుంటుంది. మీరు పాలసీ తీసుకున్న ఎల్ఐసి బ్రాంచీ ని సంప్రదించి సరైన వివరాలు తెలుసుకోవచ్చు. కొంత నష్టపోయినా సరెండర్ చేయడం మేలు. వీలు కాకపోతే పేడ్ అప్ (ప్రీమియం కట్టకుండా పాలసీ చివరి వరకు ఉంచడం) కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఎండోమెంట్, హోల్ లైఫ్ పాలసీ లలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువగానే ఉంటుంది. వీటి నుంచి దూరంగా ఉండడం మేలు. జీవిత బీమా కోసం టర్మ్ ప్లాన్ తీసుకుని పెట్టుబడి కోసం మీ రిస్క్ పరిమితి ఆధారంగా పీపీఎఫ్, ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఎంచుకోవచ్చు.
-
హాయ్, నేను ఇటీవలే రూ. 68 లక్షల ఇంటి రుణం తీసుకున్నాను, వడ్డీ 6.95 శాతం, కాల పరిమితి 30 ఏళ్ళు. ఇందులో రూ. 15 లక్షల వరకు రుణం ముందస్తుగానే తీర్చయడం మేలా లేక 10 ఏళ్ళ కోసం మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం మేలా? పన్ను మినహాయింపు, పెట్టుబడి కోణం లో కూడా తెలుపండి.
ఇంటి రుణం లో మొదటి కొన్నేళ్లలో వడ్డీ మొత్తం ఎక్కువ ఉంటుంది. కొన్నేళ్ళకి వడ్డీ తగ్గి, అసలు మొత్తం పెరుగుతుంది. కాబట్టి మొదట్లో మీరు కొంత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే వడ్డీ భారం తగ్గే అవకాశం ఉంటుంది. కొందరు నిపుణులు ఇదే మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయమని సలహా ఇస్తుంటారు. మీకు మ్యూచువల్ ఫండ్స్ మీద అవగాహన ఉంది, కొంత రిస్క్ తీసుకోగలిగితే దీర్ఘకాలం పాటు మదుపు చేస్తే రాబడి తో కూడా రుణం చెల్లించవచ్చు. అయితే, ఇందులో ఒకోసారి నష్టాలూ రావచ్చు. కాబట్టి, మీ రిస్క్ పరిమితి ని బట్టి నిర్ణయం తీసుకోవడం మేలు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయవచ్చు. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. పన్ను పరంగా ఇంటి రుణం చాల ఉపయోగకరంగా ఉంటుంది. సెక్షన్ 24 కింద రూ. 2 లక్షల వరకు వడ్డీ పై మినహాయింపు ఉంటుంది. కాబట్టి, మీరు ఎంత వరకు ఇంటి రుణం కట్టాలన్నది పన్ను మినహాయింపు, రిస్క్ పరిమితి ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు.
-
హాయ్ సర్, నా పేరు ప్రమోద్, వయసు 31. నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. జీతం తో పాటు బీమా హామీ పెరిగే టర్మ్ ప్లాన్ మంచిదా? లేక అదనపు బీమా అవసరం ఉన్నప్పుడు భవిష్యత్తు లో మరో పాలసీ తీసుకోవడం మంచిదా? అలాగే, తీవ్ర అనారోగ్యానికి కూడా పాలసీ తీసుకోవచ్చా?
బీమా హామీ పెరుగుతూ ఉండే పాలసీ లు మార్కెట్ లో అందుబాటు లో ఉన్నాయి. ఏడాదికి 5-10 శాతం వరకు పెంచుకునే వీలుంటుంది. అయితే, కొన్ని కంపెనీ లు మాత్రమే ఇలాంటి పాలసీలు అందిస్తున్నాయి. వీటి ప్రీమియం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. వీటి బదులు మీకు ఎప్పుడైతే అధిక బీమా అవసరం ఉంటుందో అప్పుడు మరి పాలసీ తీసుకోవచ్చు. పాలసీ ఎంచుకునేటప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ చూడడం మేలు. వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ పరంగా మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
నా పేరు సూర్య. కోటి రూపాయల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను.మంచి ప్లాన్ సూచించగలరు.
మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
హాయ్, నేను రూ. 1 లక్ష ఒకేసారి క్వాంటమ్, మీరే, డీఎస్పీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో మదుపు చేశాను. దీర్ఘకాలం కోసం వేరే ఏదైనా ఫండ్స్ తెలుపగలరు.
ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో ప్రత్యేక పెట్టుబడి వ్యూహం ఉండదు. వీటి పని తీరు గత కొద్ది ఏళ్లుగా అంతగా బాలేదు. మీరు ఎంచుకున్న ఫండ్స్ లోని మూడింట్లో మిరే అసెట్ ఫండ్ పని తీరు బానే ఉంది. పన్ను మినహాయింపు కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్ లాంటి పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో మదుపు చేయాలనుకుంటే మీరే ఫండ్ లో కొనసాగవచ్చు. దీనితో పాటు దీర్ఘకాలం కోసం ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. అధిక ఫండ్స్ లో మదుపు చేయడం వల్ల మీకు ట్రాక్ చేయడం కూడా కష్టతరం అవుతుంది. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నా పేరు ప్రతాప్, నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. అమ్మ వయసు 51, నాన్న వయసు 56. వారికి జీవిత బీమా లేదు. మంచి పాలసీ సూచించండి.
జీవిత బీమా అనేది కుటుంబం లో పెద్ద (అధిక సంపాదన) పేరు మీద తీసుకోవడం మేలు. వారు మరణిస్తే కుటుంబానికి పెద్ద మొత్తం లో సొమ్ము అంది ఆర్ధికంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే దీని లక్ష్యం. వారి మీద ఆధార పడిన వారు లేకపోతే జీవిత బీమా అవసరం ఉండకపోవచ్చు. చిన్న వయసు లో నే జీవిత బీమా తీసుకోవడం మేలు. పైగా, వయసు ని బట్టి ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది.
-
నా పేరు నాగేశ్వరరావు.మీరు ఇచ్చే జవాబులు చాలా బాగుంటాయి. నా ప్రశ్న ఏమనగా, నేను మ్యూచువల్ ఫండ్స్ లో రూ. 4000 సిప్ ద్వారా మదుపు చేస్తున్నాను. దాదాపు 3 ఏళ్ళు అయిపోయాయి. నా పోర్ట్‌ఫోలియో లో 1.DSP Midcap Fund-Reg(G),2.ICICI Pru Bluechip Fund(G),3.Kotak Flexicap Fund(G) ఉన్నాయి. వీటి పనితీరు ఎలా ఉన్నాయి? దయచేసి తెలుపగలరు. ధన్యవాదాలు.
మీరు ఎంచుకున్న ఫండ్స్ లో ఒకటి లార్జ్ కాప్, ఒకటి మిడ్ కాప్, ఒకటి ఫ్లెక్సీ కాప్ ఫండ్. డీఎస్పీ మిడ్ కాప్ ఫండ్, ఐసీఐసీఐ పృ బ్లూ చిప్ ఫండ్ పని తీరు పరవాలేదు. కోటక్ ఫ్లెక్సీ కాప్ ఫండ్ పని తీరు అంతగా బాలేదు. అధిక ఫండ్స్ లో మదుపు చేయడం వల్ల అధిక రాబడి వస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే. పైగా, మిడ్ కాప్, ఫ్లెక్సీ కాప్ ఫండ్స్ లో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఐసీఐసీఐ ఫండ్ లో కొనసాగవచ్చు. మిగతా ఫండ్స్ లో సిప్ ఆపేసి అందులోని మొత్తాన్ని ఐసీఐసీఐ ఫండ్ లో మదుపు చేయవచ్చు. కొన్నాళ్ళకి మీరు మరి కాస్త రిస్క్ తీసుకోవాలనుకుంటే ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నా పేరు కిశొర్. నాకు నెలకు రూ.ఒక లక్ష జీతం. నేను ఒక కొటి రూపాయల టర్మ్ పాలసీ తీసుకున్నాను, 3 లక్షల బీమా కూడా తీసుకున్నాను. మా అబ్బాయి కొసం 2 లక్షల చైల్డ్ పాలసీ తీసుకున్నాను. PPF లో రూ. 1.5 లక్షలు కడుతున్నాను. ఇంటి రుణం ఇంకా రూ. 5 లక్షలు కట్టాలి. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఇంకా ఎమైనా పొదుపు చేయాలా?
టర్మ్ పాలసీ కూడా జీవిత బీమా పాలసీ. ఇందులో పెట్టుబడులు ఉండవు, ప్రీమియం తక్కువాగా ఉంటుంది. పెట్టుబడి, బీమా కలిపి ఉన్న ఇతర బీమా పాలసీ లు సరెండర్ చేయడం మేలు. పిల్లల కోసం ప్రత్యేక పాలసీలు లేవు, మార్కెట్ లో ఉన్నవి మనీ బ్యాక్, ఎండోమెంట్ పథకాలే. ఏదైనా ఉన్నా, పేరు లో తప్ప వాటిలో వేరే ప్రత్యేకల ఉండవు. వీటి బదులు మీరు మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం మేలు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్, నా పేరు వేధంష్. బయసు 38. 5 ఏళ్ళ కోసం ఆక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ పృ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లిక్విడ్, నిప్పాన్ ఇండియా లార్జ్ కాప్ ఫండ్స్ లో సిప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మంచిదేనా?
మీరు మదుపు చేసిన ఫండ్స్ లో ఆక్సిస్, ఐసీఐసీఐ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. ఇందులో లాక్ ఇన్ ఉంటుంది, ప్రతి సిప్ కి 3 ఏళ్ళ లాక్ ఇన్ వర్తిస్తుంది. కాబట్టి మీ పూర్తి డబ్బులు వెనక్కి తీసుకోడానికి 6 ఏళ్ళు పడుతుంది. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ పని తీరు అంతగా బాలేదు. పన్ను మినహాయింపుల కోసం మీరు పీపీఎఫ్, ఎన్పీస్ లాంటివి ఎంచుకోవచ్చు. లిక్విడ్ ఫండ్స్ అనేవి పెద్ద మొత్తం డబ్బు ఒకేసారి మదుపు చేయడానికి ఉపయోగ పడతాయి. దీని బదులు 2-3 ఏళ్ళ కోసం మీరు బ్యాంకు రికరింగ్/ఫిక్సిడ్ డిపాజిట్ కూడా ఎంచుకోవచ్చు. నిప్పాన్ ఇండియా లార్జ్ కాప్ ఫండ్ లో పెట్టుబడి కొనసాగించవచ్చు. ఇతర ఫండ్స్ లో మొత్తాన్ని ఇందులో మదుపు చేయండి, లాక్ ఇన్ పూర్తయ్యాక సిప్ ఆపేయవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
ఎల్ఐసి జీవన్ సరళ్ పాలసీ లో లాయల్టీ అడ్డిషున్ ఎలా లెక్కిస్తారు?
ఎల్ఐసి కొన్ని పాలసీలలో 'లాయల్టీ అడ్డిషున్' అందిస్తుంది. తన లాభాల్లో కొంత భాగాన్ని పాలసీ దారులకి అందించడమే ఈ లక్ష్యం. అయితే, ఇది మెచ్యూరిటీ లేదా డెత్ బెనిఫిట్ తో పాటు అందిస్తారు. ఉదాహరణకి, ఇది బీమా హామీ లో ప్రతి రూ. 1000 కి 400- 600 ఆలా ఉండచ్చు. పాలసీ కాల పరిమితి ని బట్టి కూడా మారుతుంది. మీ పాలసీ కి సంబంధించి వివరాలను ఎల్ఐసి నుంచి తెలుసుకోవచ్చు.
-
నమస్తే సర్. నేను రూ. 20,000/- డిపాజిట్ కట్టి నెలవారీ EMI కింద 110cc లేక 125cc బైక్ తీసుకుందామనుకుంటున్నాను. ప్రస్తుతం వాటిపై వడ్డీ ఏవిధంగా ఉంది? ఎన్ని నెలలు EMI పెట్టుకుంటే మంచిది?
బైక్ రుణం మీద వడ్డీ రేట్ లు సుమారుగా 10 శాతం నుంచి 12 శాతం వరకు ఉన్నాయి. రూ. 500 నుంచి రూ. 1000 వరకు ప్రాసెసింగ్ చార్జీలు కూడా ఉండొచ్చు. మీ వీలు ని బట్టి రుణం కాలపరిమితి 3 నుంచి 4 ఏళ్ళ వరకు తీసుకోవచ్చు.
-
హాయ్, నా పేరు దినేష్. నేను ఆక్సిస్ బ్లూ చిప్ తో పాటు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ ఫండ్స్ లో నెల నెలా రూ. 1000 నుంచి 2000 వరకు మదుపు చేస్తున్నాను. అలాగే, పీపీఎఫ్ లో నెలకి రూ. 12500 మదుపు చేస్తున్నాను.
పీపీఎఫ్ లో దీర్ఘకాలం పాటు మదుపు చేస్తే మంచి నిధి సమకూర్చుకోవచ్చు. ఇది సురక్షితం, పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. అధిక మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం వల్ల అధిక రాబడి ఉంటుందన్నది అపోహ మాత్రమే. మీరు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ లో ఫండ్స్ పేర్లు తెలుపలేదు కాబట్టి వాటి గురించి మేము చెప్పలేకపోతున్నాము. ఆక్సిస్ బ్లూ చిప్ ఫండ్ పని తీరు బాగుంది, ఇందులో కొనసాగవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
టాప్ అప్ ఇంటి రుణానికి పన్ను మినహాయింపు ఉంటుందా?
సాధారణంగా, ఇంటి రుణం తీసుకున్న వారు రుణం తీరుస్తుండంగా ఇంటి మరమ్మతుల కోసం లేదా అదే ఇంట్లో ఏదైనా అదనపు గదులు లాంటివి నిర్మించడానికి టాప్ అప్ రుణం తీసుకుంటారు. దీనికి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, ఇంటి రుణం లో లాగా రూ. 2 లక్షల వరకు వడ్డీ మినహాయింపు ఉండదు. టాప్ అప్ రుణం వడ్డీ పై రూ. 30 వేల వరకు మినహాయింపు ఉంటుంది. అయితే, ఇది కూడా రూ. 2 లక్షల్లో భాగమే. ఉదాహరణకి, మీరు మరమ్మతులకు సంబంధించి రూ. 10 లక్షలు రుణం తీసుకున్నారనుకుందాం. దీనికై ఏడాదికి రూ. 1 లక్ష వడ్డీ చెల్లిస్తే, దాని పై రూ. 30 వేల వరకు మాత్రమే మినహాయింపు పొందొచ్చు. మిగతా 1.70 లక్షలు (రూ. 2 లక్షలు - రూ. 30,000) ఇంటి రుణం పై వడ్డీ మినహాయింపు పొందొచ్చు. అద్దె ఇంటికి సంబంధించినట్టైతే, రూ. 30 వేల పరిమితి వర్తించదు.
-
నేను నా 18 నెలల పిల్లవాడి కోసం ట్రేడింగ్ ఖాతా తెరిచి సిప్/మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేద్దామనుకుంటున్నాను. ఇది మంచిదేనా?
మైనర్ పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయవచ్చు. దీనికి షేర్స్ లో లాగా ట్రేడింగ్ ఖాతా అవసరం లేదు. అయితే, మైనర్ నుంచి మేజర్ అయ్యాక, అంటే 18 ఏళ్ళు నిండాక, కీవైసీ పూర్తి చేసాక మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ పై పూర్తి హక్కు వారికే ఉంటుంది. మరో విధానంగా మీరు మీ పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేసి మీ పిల్లల పేర్లు నామినీగా చేర్చవచ్చు. కాబట్టి, యూనిట్స్ మీద హక్కు మీదే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ లేదా లంప్సమ్(ఒకేసారి పెట్టుబడి) చేయవచ్చు. మార్కెట్ దిగువ లో ఉన్నప్పుడు కూడా మీరు లంప్సమ్ గా ఆ ఫండ్ లో కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ ఉండవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు.
-
హాయ్, నా పేరు హనుమంత రావు. నేను దీర్ఘకాలం కోసం సిప్ లో ఒకే సరే మదుపు చేయాలనుకుంటున్నాను. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ లో ఎందులో రాబడి ఎక్కువగా వస్తుంది? సలహా ఇవ్వండి.
మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేసే విధానాలు రెండు - ఒకటి సిప్, మరొకటి లంప్సమ్. సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) లో నెల నెలా నిర్ణీత మొత్తం మీ బ్యాంకు ఖాతా నుంచి తీసి ఫండ్ లో మదుపు చేస్తుంటారు. దానికి తగ్గ యూనిట్స్ మీ వద్ద చేరుతాయి. మార్కెట్ హెచ్చుతగ్గులను ఎదురుకోవడానికి ఇది మంచి పధ్ధతి. మీ వద్ద పెద్ద మొత్తం లో డబ్బు ఉన్నట్టయితే 6 నెలల పాటు ఈ మొత్తాన్ని ఫండ్ లో మదుపు చేయవచ్చు. మీ వీలు ని బట్టి పై వాటిలో ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకోవచ్చు. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో రిస్క్ కాస్త తక్కువ ఉంటుంది. ఈ ఫండ్ లో మీరు దీర్ఘకాలం లో మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్, నా పేరు సన్యాసిరావు. జీవిత బీమా పాలసీలలో ఏది ఉత్తమ మైనదో దయచేసి వయస్సుల వారిగా తెలియజేయగలరు. నమస్తే.
వీలైనంత చిన్న వయసు లో జీవిత బీమా పాలసీ తీసుకోవడం మంచిది. దీని వల్ల పాలసీ దారుడికి ఏదైనా జరిగితే కుటుంబానికి ఒకేసారి బీమా హామీ మొత్తాన్ని అందిస్తారు. పెట్టుబడి కోసం బీమా పాలసీలు తీసుకోవడం మంచిది కాదు. బీమా పాలసీలలో అనేక రకాలు ఉంటాయి. ఉదాహరణకి, ఎండోమెంట్, మనీ బ్యాక్, హోల్ లైఫ్, టర్మ్ ఇలా చాల రకాల పాలసీ లు అందుబాటులో ఉన్నాయి. జీవిత బీమా కోసం టర్మ్ పాలసీ మాత్రమే మేలు. ఇందులో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. ఇతర పాలసీలలో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువ. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
హాయ్ నా పేరు సునీల్. మా అబ్బాయి చదువు కోసం జీవన్ తరుణ్ పాలసీ తీసుకోవడం మంచిదేనా?
బీమా కంపెనీ లు పిల్లల పేరు తో అనేక పధకాలు అందిస్తుంటారు. అయితే, వీటిలో పేరు తప్ప వేరే ప్రత్యేకతలు ఉండవు. మీరు తెలిపిన పాలసీ ఒక మనీ బ్యాక్ ప్లాన్. ఇలాంటి పాలసీలలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువ. వీటి నుంచి దూరంగా ఉండడం మేలు. జీవిత బీమా కోసం ముందు మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం పీపీఎఫ్ ఎంచుకోవచ్చు. కొంత రిస్క్ తీసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎంచుకోవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్ సిరి, నేను ప్రస్తుతం పరాగ్ పారిఖ్ టాక్స్ సేవర్ ఫండ్ లో రూ. 2500 తో పాటు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫండ్ లో రూ. 1500 సిప్ చేస్తున్నాను, అవి కాకుండా ఆక్సిస్ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్, ఇంకా యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ లో మదుపు చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫండ్స్ పని తీరు ఎలా ఉంది?
పన్ను మినహాయింపు (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్ లో సిప్ చేయడం సరైన పధ్ధతి కాదు. ఇందులో ప్రతి సిప్ కి 3 ఏళ్ళ లాక్ ఇన్ ఉంటుంది కాబట్టి మీరు మీ డబ్బులు వెనక్కి తీసుకోవడం కష్టతరం అవుతుంది. ఒకే మొత్తం లో మదుపు చేయడమే మేలు. పన్ను మినహాయింపు కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్ లాంటివి కూడా ఎంచుకోవచ్చు. అధిక ఫండ్స్ లో మదుపు చేయడం వల్ల అధిక రాబడి వస్తుందనేది అపోహ మాత్రమే. పైగా, ఫండ్స్ పని తీరు ట్రాక్ చేయడం కూడా కష్టమే. మీరు సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ఎంచుకోవచ్చు. ఇతర ఫండ్స్ లో సిప్ ఆపేసి అందులో ఉన్న మొత్తాన్ని వెనక్కి తీసుకుని ఈ ఫండ్ లో మదుపు చేయవచ్చు.
-
ఆదాయం లేని గృహిణి కోసం టర్మ్ ప్లాన్ ఉందా?
టర్మ్ ప్లాన్ అనేది జీవిత బీమా. కుటుంబం లో ఆదాయం కలిగిన వారి పేరు మీద తీసుకున్నట్లయితే, వారు మరణించినప్పుడు కుటుంబానికి బీమా హామీ అందిస్తారు. కాబట్టి, ఆదాయం లేని వారి పేరు మీద జీవిత బీమా తీసుకోవడం సరైన పధ్ధతి కాదు.
-
సర్, నా దగ్గర రూ. 10 లక్షలు ఉన్నాయి. ఎందులో పెట్టుబడి పెడితే ఏడాదికి 15-20 శాతం లాభం వస్తుంది? చెప్పగలరు.
మీరు పెట్టుబడి కాల పరిమితి తెలుపలేదు. స్వల్ప కాలం కోసం అయితే, సురక్షితమైన పెట్టుబడి మార్గాలు ఎంచుకోవడం మేలు. బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ ఎంచుకోవచ్చు. ఇందులో మీరు 5-6 శాతం వరకు రాబడి పొందగలరు. దీర్ఘకాలం కోసం, అంటే కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేయగలిగితే, కొంత రిస్క్ తో ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయవచ్చు. ఇందులో మీకు సగటుగా 10 నుంచి 12 శాతం వరకు రాబడి పొందే అవకాశం ఉంటుంది. అధిక రాబడి కోసం మరింత రిస్క్ తీసుకోవచ్చు. దీనికోసం ఒక మిడ్/స్మాల్ కాప్ ఫండ్ మేలు. ఇండెక్స్ ఫండ్ లో యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. మిడ్/స్మాల్ కాప్ కోసం ఎస్బీఐ స్మాల్ కాప్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నేను ఒక ఎన్ఆర్ఐ. నేను జీ-సెక్, ట్రెసరీ బిల్స్ లో మదుపు చేయాలనుకుంటున్నాను. ఎలా చేయవచ్చు?
ప్రభుత్వం గత ఏడాది 'ఎఫ్ఏఆర్' పధ్ధతి ద్వారా బాండ్స్ లో మదుపు చేసే అవకాశం కల్పించింది. స్టాక్ బ్రోకర్ లేదా మీ ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ ఖాతా ఉన్న బ్యాంకు ద్వారా మీరు ఈ బాండ్స్ లో మదుపు చేయగలరు.
-
హాయ్, నా పేరు జీఎస్ఆర్. నా వద్ద రూ. 50 లక్షల జీవిత బీమా ఉంది, రూ. 27 లక్షల ఇంటి రుణం ఉంది. అయినా కూడా ఇంటి రుణం తో పాటు బీమా తీసుకోవాలా? సలహా ఇవ్వండి.
మీకు సరిపడా జీవిత బీమా ఉన్నప్పుడు అదనంగా ఇంటి రుణం తో పాటు జీవిత బీమా తీసుకునే అవసరం లేదు. ఒకవేళ బ్యాంకు తప్పనిసరి అన్నట్టయితే ఈ విషయాన్నిమీరు వారికి తెలియజేయవచ్చు.
-
హాయ్ సిరి, నా వయసు 32. నేను ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాను, పీఎఫ్ అకౌంట్ వుంది, APY గురించి తెలుసుకున్నాను. ఇందులో నేను చేరడం మంచిదేనా? పీఎఫ్ అకౌంట్ ఉంది కాబట్టి భవిష్యత్తు లో పెన్షన్ సమయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా?
అటల్ పెన్షన్ యోజన లో ఎవరైనా చేరవచ్చు. పీఎఫ్ తో దీనికి సంబంధం ఉండదు. అయితే, ఇందులో గరిష్ట పెన్షన్ పరిమితి రూ. 5000 మాత్రమే. మీరు పదవీ విరమణ తీసుకున్నాక ఇది మీకు సరిపోకవచ్చు. ద్రవ్యోల్బణం కూడా ద్రుష్టిలో ఉంచుకుని చుస్తే దీని విలువ పెద్దగా ఉండదు. ఈ పధకం అసంఘటిత రంగం కోసం ప్రవేశ పెట్టారు. వారికి ఉద్యోగం తరవాత పెన్షన్ ఉండదు కాబట్టి ఈ మొత్తం వారికి ఉపయోగ పడుతుంది. మీరు పీఎఫ్ తో పాటు ఎన్పీఎస్ లో చేరవచ్చు. ఇందులో మీ వీలు ప్రకారం పెట్టుబడి పెట్టె అవకాశం ఉంటుంది, పదవీ విరమణ నిధి తో పాటు మంచి పెన్షన్ కూడా పొందొచ్చు.
-
హాయ్ సిరి, నా పేరు మల్లిక్. నాకు 80c లో రూ. 1.50 లక్షల పరిమితి దాటింది. అది కాకుండా అదనంగా పన్ను ఆదా కోసం NPS లో మదుపు చేద్దాం అనుకుంటున్నా. కానీ, NPS లో ఖాతా తెరిచే ముందు ఆక్టివ్ ఛాయస్/ఆటో ఛాయస్ లో ఏది ఎంచుకోవాలి? పన్ను ఆదా కోసం NPS లో మదుపు చేయడం మంచిదేనా? ఒకసారి ఎంచుకున్నాక మళ్ళీ మార్చుకునే అవకాశం ఉంటుందా?
అదనపు పన్ను మినహాయింపు కోసం ఎన్పీఎస్ లో మదుపు చేయడం మంచిదే. ఇందులో మీ ఫండ్ నిర్వహణ విషయం లో రెండు ఆప్షన్స్ ఉంటాయి - ఆటో ఛాయస్, ఆక్టివ్ ఛాయస్. ఆటో ఛాయస్ ఎంచుకున్నట్టయితే మీ వయసు ఆధారంగా ఈక్విటీ, డెట్ లో మదుపు చేస్తారు. వయసు పెరిగే కొద్దీ ఇది మారుతూ ఉంటుంది. ఆక్టివ్ ఛాయస్ లో మీరే ఈక్విటీ, డెట్ లో ఎంత మొత్తం మదుపు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు. మీరు ముందుగా ఆటో ఛాయస్ ఎంచుకోవడం మంచిది. కొన్నాళ్ల తరవాత మీకు అవగాహనా వస్తుంది. అప్పుడు మీ వీలు ని బట్టి మార్చుకోవచ్చు.
-
హాయ్, నా పేరు హరి కృష్ణ. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నెలసరి జీతం రూ. 90 వేలు. ఇందులో ఏడాదికి రూ. 50 వేలు పీఎఫ్ కోసం చెల్లిస్తున్నాను. మంచి పన్ను ఆదా మార్గాలు, భవిష్యత్తు కోసం పెట్టుబడులు సూచించండి.
ఎన్పీఎస్ లో పెట్టుబడులు చేయడం వల్ల ఏడాదికి సెక్షన్ 80సి ద్వారా రూ. 1.50 లక్షలతో పాటు అదనంగా మరో రూ. 50 వేల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఎన్పీఎస్ లో పన్ను మినహాయింపు తో పాటు మంచి పదవీ విరమణ నిధి కూడా పొందొచ్చు. కనీసం 10 ఏళ్ళు పెట్టుబడి పెట్టాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. ఇందులో కొంత రిస్క్ ఉంటుంది, మంచి రాబడి పొందే అవకాశం కూడా ఉంది. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్, నేను మా పాప కోసం రూ. 1.50 లక్షలు ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్ మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేశాను. ఇది 3 ఏళ్ళు పూర్తయింది. దీన్ని కొనసాగించాలా వద్దా? మ్యూచువల్ ఫండ్స్ గురించి నాకు అవగాహనా లేదు.
ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్ ఒక యూలిప్. బీమా పాలసీలలో ఇదొక రకం. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇందులో పాలసీ సరెండర్ చేయడానికి 5 ఏళ్ళ పాటు పాలసీ ప్రీమియం కట్టి ఉండాలి. ఒకవేళ ఈ లోపు సరెండర్ చేయాలనుకుంటే వారు పాలసీ ని క్లోజ్ చేసి 5 ఏళ్ళ కాలపరిమితి పూర్తయ్యే వరకు ఇప్పటి వరకు మీరు చేసిన పెట్టుబడి మీద 4 శాతం చొప్పున వడ్డీ అందిస్తారు. మరిన్ని వివరాల కోసం మీ ఏజెంట్ లేదా ఎస్బీఐ బ్రాంచీ ని సంప్రదించండి. జీవిత బీమా కోసం మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్(పదవీ విరమణ నిధి కోసం) లాంటి పధకాలు ఎంచుకోవచ్చు. దీర్ఘకాలం కోసం కొంత రిస్క్ తీసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం మంచిది. కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేయాలనుకుంటే సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ డైరెక్ట్ ఫండ్ ఎంచుకోవచ్చు.
-
హాయ్ సిరి, నా పేరు మల్లిక్. నా దగ్గర రూ. 1 లక్ష ఉన్నాయి, వాటిని ఎక్కడ మదుపు చేయాలి, ఒక రూ. 50000 మ్యూచువల్ ఫండ్స్ లో లంప్సమ్ మరియు ఇంకో రూ. 50000 పోస్ట్ ఆఫీస్ పధకం లో పెట్టడం మంచిదేనా? మంచిది అయితే లంప్సమ్ కోసం మంచి ఫండ్ తెలియచేయగలరు.
మ్యూచువల్ ఫండ్, పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ లో మదుపు చేయడం మంచి ఆలోచనే. అయితే, మ్యూచువల్ ఫండ్ లో ఒకేసారి మదుపు చేసే బదులు 6 నెలల పాటు నెలకి రూ. 8 వేల చొప్పున మదుపు చేయడం మంచిది. దీనితో పాటు నెల నెలా సిప్ కూడా చేయండి. సిప్ లేదా లంప్సమ్ కోసం ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్, నా పేరు హార్దిక్ కృష్ణ. దీర్ఘకాలం కోసం రూ. 1.50 లక్షలు మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేద్దాం అనుకుంటున్నాను. ఎందులో చేస్తే మంచిది? ఎంత కాలం చేయాలి, ఎలా చేయాలి?
కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచన. అయితే, ఒకేసారి కాకుండా మీరు 6 నెలల పాటు ఈ మొత్తాన్ని కొంత కొంతగా మదుపు చేయడం మంచిది. ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్ సిరి , నేను ఇటీవలే పాలసీ బజార్ నుంచి TATA AIA ఆన్లైన్ పాలసీ తీసుకున్నాను . నెలసరి ప్రీమియం రూ. 10000. 7 ఏళ్ళు చెల్లించాలి. పాలసీ 15 ఏళ్ళకి పూర్తవుతుంది. ఏజెంట్ ప్రకారం 15 ఏళ్ళకి రూ. 40 లక్షలు వస్తాయి. నిజంగా 40 లక్షలు వస్తాయా? నేను పాలసీ బజార్ వెబ్సైటు లో పాలసీ తీసుకోవడం మంచిదేనా . దయచేసి చెప్పగలరు.
పాలసీ బజార్ వెబ్సైటు లో పాలసీ తీసుకోవడం మంచిదే. అయితే, మీరు పాలసీ పూర్తి పేరు తెలుపలేదు. ప్రతి కంపెనీ లో అనేక బీమా పాలసీ లు ఉంటాయి. సాధారణంగా, ఎండోమెంట్, మనీ బ్యాక్ లాంటి పాలసీలలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. మీరు తెలిపిన వివరాల ప్రకారం మీరు ఏడాదికి రూ.1.20 లక్షలు, అంటే 7 ఏళ్ళకి సుమారుగా రూ. 8.40 లక్షల వరకు ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇలాంటి పాలసీలలో 4-5 శాతం వరకు రాబడి ఉండే అవకాశం ఉంది. కాబట్టి, 6 శాతం ప్రకారం రాబడి అంచనా వేసుకున్నట్టయితే 15 ఏళ్ళ తరవాత మీరు సుమారుగా రూ. 15 లక్షల వరకు పొందే అవకాశం ఉంది. జీవిత బీమా కోసం అయితే మీరు టర్మ్ పాలసీ ఎంచుకోవచ్చు. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి కోసం), మ్యూచువల్ ఫండ్స్ లాంటి పధకాలు ఎంచుకోవచ్చు.
-
హయ్ సిరి, నేను హెచ్డీఎఫ్సీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా పాలసీ కోసం నెలకి రూ. 20 వేల ప్రీమియం చెల్లిస్తున్నాను. ఇప్పుడు నా ఉద్యోగ సంస్థ నుంచి ప్రీమియం చెల్లించకుండా రూ. 2.50 లక్షల బీమా పొందుతున్నాను. హెచ్డీఎఫ్సీ పాలసీ ఆపేయవచ్చా?
సొంతంగా ఆరోగ్య బీమా ఉండడం చాలా మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబానికి కనీసం రూ.5 నుంచి రూ. 10 లక్షల బీమా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, మీ కంపెనీ పాలసీ తో పాటు అదనంగా బీమా ఉండడం మేలు. మీరు మీ హెచ్డీఎఫ్సీ పాలసీ బదులు రూ. 5-10 లక్షల బీమా హామీ తో ఒక టాప్ అప్ పాలసీ తీసుకోవచ్చు. దీనితో మీకు ప్రీమియం కూడా మిగుల్తుంది, బీమా కూడా ఉంటుంది. మాక్స్ బూపా, హెచ్డీఎఫ్సీ ఎర్గో, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి.
-
సర్, నా పేరు శ్రీనివాస్, మస్కట్ లో ఉంటాను. నా 5 నెలల పాప కోసం చిట్ ఫండ్ లో రూ. 1 లక్ష మదుపు చేస్తే 5 ఏళ్ళకి రెట్టింపు అవుతుందన్నారు. ఇది మంచిదేనా?
చిట్ ఫండ్ లో రిస్క్ ఉంటుంది. రుణం రూపంగా అత్యవసరంగా ఉన్నప్పుడే చిట్ ఫండ్ ఎంచుకోవడం మేలు. ఆడపిల్లల ఉన్నత చదువు, పెళ్లి కోసం ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన ప్రవేశ పెట్టింది. ఇందులో మీరు మీ వీలు ప్రకారం నెల నెలా లేదా ఏడాదికి ఒకసారి మదుపు చేయవచ్చు. అలాగే, కొంత మొత్తాన్ని దీర్ఘకాలం పాటు, అంటే కనీసం 10 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం మంచిది. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ డైరెక్ట్ ఫండ్ ఎంచుకోవచ్చు.
-
హాయ్ సర్,నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, వాలంటరీ ఈపిఫ్ కింద నెలకు 5000 జమ చేద్దామని అనుకుంటున్నాను, ఎలా చేయాలి? ఒకవేళ ఉద్యోగం నుండి నిష్క్రమించినా, దానిని కొనసాగించవచ్చా? తదుపరి విషయాలు తెలియజేయగలరు.
వీపీఎఫ్ కింద మీ జీతం లో బేసిక్ లో 100 శాతం వరకు మదుపు చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఈపీఎఫ లో లాగా మీ ఉద్యోగ సంస్థ వాటా మాత్రం 12 శాతం మాత్రమే ఉంటుంది. మీరు ఉద్యోగం నుంచి నిష్క్రమించినా పీఎఫ్ ఖాతా కొనసాగించవచ్చు లేక వేరే ఉద్యోగం లో చేరినా పీఎఫ్ ఖాతా బదిలీ చేసుకోవచ్చు. దాని మీద 3 ఏళ్ళ వరకు వడ్డీ వస్తూ ఉంటుంది. అయితే, 3 ఏళ్ళ లోపు మీరు ఉద్యోగం లో చేరకపోతే పీఎఫ్ మొత్తం వెనక్కి తీసుకోవడం మేలు.
-
సిరికి నమస్కారములు. నా పేరు రవికుమార్. సిప్ ద్వారా ఆక్సిస్ బ్లూ చిప్ లో రూ. 1000, UTI NIFTY INDEX FUND లో 1000, SBI SMALL CAP FUND లో 500 INVEST చేస్తున్నాను. PPF లో 1000 మరియు RD లో 1000 మదుపు చేస్తున్నా. నాకు టర్మ్ పాలసీ, ఆరోగ్య బీమా ఉన్నాయి. దీర్ఘకాలం కోసం స్టాక్స్ లో 2000 రూ మదుపు చేద్దాం అనుకొంటున్న. ఇది మంచి నిర్ణయమేనా?
మీరు అధిక ఫండ్స్ లో మదుపు చేస్తున్నారు. మిగతా ఫండ్స్ లో మొత్తాన్ని వెనక్కి తీసుకుని సిప్ ఆపేయడం మేలు. ఆ మొత్తాన్ని యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయడం మంచిది, అలాగే అదే ఫండ్ లో సిప్ మొత్తాన్ని పెంచండి. ఒకవేళ రిస్క్ తీసుకోవాలనుకుంటే ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్ కూడా కొనసాగించవచ్చు. కొన్నాళ్ళు కొనసాగించాక మీ రిస్క్ పరిమితి ని బట్టి సిప్ మొత్తాన్ని పెంచుకోవచ్చు. స్వల్ప కాలం కోసం రికరింగ్ డిపాజిట్ ఎంచుకోవచ్చు. షేర్స్ లో అధిక రిస్క్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ పరోక్షంగా షేర్స్ లో మదుపు చేస్తాయి కాబట్టి, ఇందులోనే మదుపు చేయడం మంచిది.
-
సర్, నేను ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా, ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ డైరెక్ట్ ఫండ్స్ లో రూ. 10 వేలు చొప్పున మదుపు చేస్తున్నాను. ఇవి మంచివేనా? మరో రూ. 5000 మదుపు చేయడానికి సలహా ఇవ్వండి.
ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఒక మిడ్ కాప్ ఫండ్, ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఒక ఫ్లెక్సీ కాప్ ఫండ్. ఈ రెండు ఫండ్స్ పని తీరు గత కొద్దేళ్లుగా అంతగా బాలేదు. పైగా, వీటిలో అధిక రిస్క్ కూడా ఉంటుంది. దీని బదులు మీరు ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. రిస్క్ తీసుకోవాలంటే కొంత మొత్తాన్ని ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్ లో మదుపు చేయవచ్చు.
-
హాయ్ సర్, నేను 2016 లో న్యూ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. బీమా హామీ రూ. 3 లక్షలు, ప్రీమియం రూ. 18 వేలు. ఈ పాలసీ సరెండర్ చేసి పీఎన్బీ మెట్ లైఫ్ టర్మ్ పాలసీ తీసుకోవడం మేలా?
మీరు పేర్కొన్న పాలసీ ఒక ఎండోమెంట్ పాలసీ. వీటిలో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. కానీ, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇది సరెండర్ చేయడం మేలు. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో ఎక్కువ బీమా హామీ పొందే అవకాశం ఉంటుంది. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ పరంగా మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
సర్, నా పేరు శ్రీనివాస్. నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు 8వ తరగతి, ఇంకొకరి 5వ తరగతి. వారి కోసం ఏదైనా ప్రత్యేక పాలసీ ఉంటే తెలుపండి. నా నెలసరి జీతం రూ. 60 వేలు.
పిల్లల కోసం ఉండే ప్రత్యేక బీమా పాలసీ లలో పెద్దగా ప్రత్యేకతలు ఉండవు. కొన్ని బీమా కంపెనీ లు ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీ లను పిల్లల ప్రత్యేక పాలసీ పేరు తో అమ్ముతుంటారు. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. జీవిత బీమా పాలసీ అనేది మీ పేరు మీద తీసుకున్నట్లయితే మీకు ఏదైనా జరిగితే పెద్ద మొత్తం లో బీమా హామీ అందడం వల్ల కుటుంబానికి అండగా ఉంటుంది. ముందుగా మీరు మీ పేరు మీద ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పిల్లల చదువు కోసం అనేక పెట్టుబడులు ఉన్నాయి. ఆడపిల్ల కోసం సుకన్య సమృద్ధి యోజన ప్రత్యేకంగా ఉంది. మెగా పిల్లల కోసం అయితే పీపీఎఫ్ ఎంచుకోవచ్చు. వీటితో పాటు కొంత వరకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలం లో మీరు మంచి నిధి సమకూర్చుకోవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
సర్, నా పేరు సుధాకర్ నేను మ్యూచువల్ ఫండ్స్ లో నెలకు రూ. 5000 మదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ, ఆన్లైన్ లో ఎలా చేయాలి? ఎలాంటి వెబ్సైట్ లో మంచిది?
మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులుంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా ఆఫ్‌లైన్ పద్ధతి(లేదా వారి ఆన్లైన్ వెబ్సైటు ద్వారా అయినా)లో మ్యూచువల్ ఫండ్డ్ సలహాదారుని ద్వారా పెట్టుబడి చేయవచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో పంపిణీదారులు కొంత కమీషన్ తీసుకుంటారు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. మీరు సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.
-
సర్, నా కూతురుకి 5 ఏళ్ళు. పొదుపు కోసం సుకన్య సమృద్ధి యోజన మంచిదేనా?
ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన ఒక ప్రత్యేక పధకం. ఈ పధకం వారి ఉన్నత విద్య లేదా పెళ్లి కోసం పెద్ద మొత్తాన్ని సమకూర్చుకునే అవకాశం కల్పిస్తుంది. మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో ఈ పధకం లో మదుపు చేయవచ్చు. దీనితో పాటు మీరు మీ పేరు మీద ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
నేను మా పెద్ద అబ్బాయి కోసం కోమల్ జీవన్ పాలసీ లో రూ. 5 లక్షల బీమా హామీ కోసం రూ. 37 వేలు ప్రీమియం చెల్లిస్తున్నాను. అలాగే, చిన్నబ్బాయి కోసం జీవన్ తరుణ్ పాలసీ లో రూ. 5 లక్షల బీమా హామీ కోసం రూ. 23 వేలు చెల్లిస్తున్నాను. ఇందులో ఏది బాగుంది? ఒకటి తీసేసి వేరే పాలసీ తీసుకోమంటారా?
పిల్లల కోసం ఉండే ప్రత్యేక బీమా పాలసీ లలో పెద్దగా ప్రత్యేకతలు ఉండవు. మీరు పేర్కొన్న పాలసీ లు మనీ బ్యాక్ పాలసీలు. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. జీవిత బీమా పాలసీ అనేది మీ పేరు మీద తీసుకున్నట్లయితే మీకు ఏదైనా జరిగితే పెద్ద మొత్తం లో బీమా హామీ అందడం వల్ల కుటుంబానికి అండగా ఉంటుంది. ముందుగా మీరు మీ పేరు మీద ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పిల్లల చదువు కోసం అనేక పెట్టుబడులు ఉన్నాయి. ఆడపిల్ల కోసం సుకన్య సమృద్ధి యోజన ప్రత్యేకంగా ఉంది. లేదంటే పీపీఎఫ్ కూడా ఎంచుకోవచ్చు. వీటితో పాటు కొంత వరకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలం లో మీరు మంచి నిధి సమకూర్చుకోవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
సర్, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని, 4 ఏళ్ళ క్రితం ఉద్యోగం లో చేరాను. దీర్ఘకాలం కోసం పీపీఎఫ్ లో ఎంత మదుపు చేస్తే ఎక్కువ లాభం ఉంటుంది?
పెట్టుబడులు అనేవి దీర్ఘ, స్వల్ప కాల లక్ష్యాల ఆధారంగా చేసుకోవడం మంచిది. ముందుగా మీరు జీవిత బీమా తీసుకోండి, ఆరోగ్య బీమా కూడా ఉండడం మంచిది. తరువాత మీ లక్ష్యాలను ఎంచుకుని వాటి కోసం ఎంత మదుపు చేయాలో నిర్ణయించుకోవచ్చు. పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ లో కొంత మొత్తాన్ని మదుపు చేయవచ్చు. మీరు పీపీఎఫ్ లో 15 ఏళ్ళ పాటు నెల కి రూ. 10 వేలు మదుపు చేస్తే సుమారుగా రూ. 32 లక్షల వరకు పొందే వీలుంటుంది. అదే మొత్తం మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తే రూ. 50 లక్షల వరకు పొందగలరు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
సర్, నేను ఒక ఎన్ఆర్ఐ, నా భార్యకి సింగపూర్ పౌరసత్వం ఉంది. నేను రూ. 3 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాను. వడ్డీ రేటు ఎంత, పన్ను ఉంటుందా?
ఎన్ఆర్ఐ లు తమ తమ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ లేదా ఎఫ్సీఎన్ఆర్ ఖాతా నుంచి ఫిక్సిడ్ డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. బ్యాంకు ను బట్టి వడ్డీ రేటు మారుతుంది. 2 ఏళ్ళ డిపాజిట్ కి 5-6 శాతం మధ్యలో ఉండవచ్చు. ఎన్ఆర్ఓ డిపాజిట్ వడ్డీ పై 30 శాతం వరకు పన్ను వర్తిస్తుంది. అయితే, ఎన్ఆర్ఈ డిపాజిట్ ల పై పన్ను ఉండదు. కాబట్టి, మీరు ఈ డిపాజిట్ ఎంచుకోవచ్చు.
-
షేర్ మార్కెట్ గురించి నాకు సరైన అవగాహన లేదు. కొంచెం వివరించగలరు. నెను నెలకు రూ. 10,000 వరకు ఆదా చేయగలను. అధిక ఆదాయం వచ్చే సురక్షిత మార్గాలను సుచించండి.
షేర్ మార్కెట్ లో అధిక రిస్క్ ఉంటుంది. దీనికి సమయం, నైపుణ్యం ఎంతో అవసరం. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పరోక్షంగా కాస్త తక్కువ రిస్క్ తో నెల నెలా పెట్టుబడి పెట్టగలరు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. రిస్క్ లేని పధకాల కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి కోసం) లాంటి వాటిని ఎంచుకోవచ్చు. ఇవి దీర్ఘకాలం లో మంచి రాబడి అందిస్తాయి.
-
సీనియర్ సిటిజన్స్ కి ఆదాయ పన్ను మినహాయింపు కోసం మ్యూచువల్ ఫండ్ సూచించండి.
మ్యూచువల్ ఫండ్స్ లో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కి మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, వీటిలో ప్రతి సిప్ కి 3 ఏళ్ళ లాక్ ఇన్ ఉంటుంది. పైగా, వీటిల్లో రిస్క్ కూడా ఎక్కువే. మీ వద్ద పెద్ద మొత్తం లో డబ్బు ఉంటె 5 ఏళ్ళ బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పధకం, ఎన్ఎస్సి, ప్రధాన మంత్రి వయ వంద యోజన లాంటి పథకాల్లో మదుపు చేసి పన్ను మినహాయింపులు పొందే వీలుంటుంది.
-
సర్, నా వద్ద రూ. 30 లక్షలు ఉన్నాయి, మరో 7 ఏళ్లలో నేను పదవీ విరమణ తీసుకుంటాను. మరో రూ. 30-40 లక్షల వరకు పొందగలను. నాకు ఫామిలీ పెన్షన్ లేదు. కొంత వరకు ఈ డబ్బుతో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాను. మరి కొంత మొత్తాన్ని మదుపు చేసి నెల నెలా కొంత మొత్తం పెన్షన్ పొందేలా పెట్టుబడి చేయడానికి సలహా ఇవ్వండి. నేను మ్యూచువల్ ఫండ్స్ లో రూ. 7000 వరకు మదుపు చేస్తున్నాను.
పదవీ విరమణ నిధి మదుపు చేసి నెల నెలా పెన్షన్ పొనడానికి సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పధకం లేదా ప్రధాన మంత్రి వయ వందన యోజన లాంటివి ఎంచుకోవచ్చు. వీటిలో మంచి రాబడి పొందొచ్చు, రిస్క్ కూడా ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ మరి కొన్నేళ్లు కొనసాగించవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ లో మదుపు చేస్తే కొంత వరకు రిస్క్ తగ్గుతుంది. డైరెక్ట్ ప్లన్స్ ఎంచుకోండి, కమిషన్ చెల్లించే అవసరం ఉండదు.
-
నేను నెలకు రూ. 10000 మదుపు చేయగలను, ఎందులో పెడితే 15 ఏళ్ళకి రూ. 5 కోట్లు వస్తాయి?
అధిక రాబడి కావాలంటే రిస్క్ ఉన్న పధకాలు ఎంచుకోవాలి. నెల నెలా రూ. 10 వేలు మదుపు చేస్తే, 15 ఏళ్ళకి సుమారుగా 12 శాతం వార్షిక రాబడి అంచనా తో మీరు రూ. 50 లక్షల వరకు సమకూర్చుకోవచ్చు. అదే 15 శాతం రాబడి అంచనా తో సుమారుగా రూ. ౬౭ లక్షల వరకు సమకూర్చుకోవచ్చు. 15 ఏళ్ళకి 12 శాతం రాబడి తో రూ. 5 కోట్లు పొందాలంటే నెల నెలా రూ. 1 లక్ష వరకు మదుపు చేయాల్సి ఉంటుంది. కొన్ని పథకాల్లో ఇంతకంటే ఎక్కువ రాబడి పొందగలరు అని మీరు వినుండవచ్చు, అయితే వాటిల్లో మీరు పెట్టుబడి పోగొట్టుకునే రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది. మీ ఆర్ధిక లక్ష్యాల్ని దృష్టిలో ఉంచుకుని సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు.
-
హాయ్, నా పేరు ఖాదర్ బాషా. నేను హెచ్‌సీఎల్ లో 1.50 ఏళ్ళు ఉద్యోగం చేశాను. ఆ సమయం లో నా జీతం లో నుంచి రూ. 13,400 వరకు టాక్స్ రూపం లో వారు కట్ చేసారు. నాకు ఫారం 16 అందలేదు. పాన్ నెంబర్ తో ఆదాయ పన్ను వెబ్సైటు లో చూస్తుంటే 'ఇన్వాలిడ్ డీటెయిల్స్ ' అని చూపిస్తోంది. దీనికి పరిష్కారం తెలుపండి.
ఉద్యోగ సంస్థ ప్రతి నెలా ఉద్యోగస్తుల జీతం నుంచి పన్ను తీసి వేసి ఆదాయ పన్ను శాఖ వారి వద్ద జమ చేస్తుంది. ఈ విషయాన్నీ మీరు ఆదాయ పన్ను వెబ్సైటు లో లాగిన్ చేసాక ఫారం 26as ద్వారా సరి చూసుకోవచ్చు. ఒకవేళ మీ డబ్బు ఆదాయ శాఖ వారికి అందకపోతే మీరు నేరుగా వారికి ఫిర్యాదు కూడా చేయవచ్చు. మీరు ఏదైనా ఆదాయ పన్ను మినహాయింపులకి సంబంధించి పత్రాలు అందించేలకపోతే ఈ మినహాయింపులని ఆదాయ పన్ను రిటర్న్స్ సమయం లో తెలిపి ఆ మేరకు మొత్తాన్ని రీఫండ్ కూడా పొందే అవకాశం ఉంది.
-
హాయ్, నేను నా 24వ ఏట నుంచి జీవన్ సరళ్ పాలసీ లో 10 ఏళ్లుగా రూ. 30 వేల వార్షిక ప్రీమియం చెల్లిస్తున్నాను. ఇప్పుడు పాలసీ సరెండర్ చేసి కొన్ని అప్పులు తీర్చాలనుకుంటున్నాను. ఇది మంచిదేనా?
మీరు పేర్కొన్న పాలసీ ఒక ఎండోమెంట్ పధకం. ఇందులో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇలాంటి పాలసీల నుంచి దూరంగా ఉండడం మంచిది. మీరు ఎల్ఐసి ని సంప్రదించి పాలసీ సరెండర్ చేయడం మేలు. జీవిత బీమా కావాలంటే ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్(పదవీ విరమణ నిధి కోసం) లాంటి పధకాలు ఎంచుకోవచ్చు. దీర్ఘకాలం లో కొంత రిస్క్ తీసుకోగలిగితే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మదుపు చేయవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ డైరెక్ట్ ఫండ్ ఎంచుకోవచ్చు.
-
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మల్టీ కాప్ ఫండ్ గురించి చెప్పండి. దీర్ఘకాలం కోసం ఇది తీసుకోవచ్చా?
మీరు పేర్కొన్న ఫండ్ ఎన్ఎఫ్ఓ ద్వారా గత నెల మార్కెట్ లోకి ప్రవేశ పెట్టారు. కనీసం 3-5 ఏళ్ళు గడిస్తే తప్ప ఫండ్ పని తీరు ని అంచనా వేయడం సాధ్యం కాదు. మీరు మార్కెట్ లో ఇప్పటికీ ఉన్న ఫండ్స్ లో మదుపు చేయడం మేలు. మల్టీ కాప్ ఫండ్స్ లో అధిక రిస్క్ ఉంటుంది. దీని బదులు ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. సిప్ ద్వారా నెల నెలా ఇందులో మదుపు చేయండి, మార్కెట్ దిగువ లో ఉన్నప్పుడు కూడా కొంత మదుపు చేస్తూ ఉండడం మంచిది. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నేను ఒక ప్రైవేటు కంపెనీ లో పని చేస్తున్నాను. ఒక పర్సనల్ లోన్ @11.75%, క్రెడిట్ కార్డు ఉన్నాయి. పీఎఫ్ రూ. 4 లక్షల వరకు ఉంటుంది. పీఎఫ్ తీసుకుని రుణం తీర్చవచ్చా?
పీఎఫ్ పధకం పదవీ విరమణ నిధిగా ఉపయోగపడుతుంది. ప్రత్యేక పరిస్థితుల కోసం ఇందులో కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అయితే, వ్యక్తిగత రుణం తీర్చడం కోసం తీసుకోవడం సరైన పధ్ధతి కాదు. వీలయితే మీరు రుణం ఈఎంఐ కడుతూ ఉండండి. మీ జీతం లో కొంత మొత్తాన్ని పొదుపు చేయండి, ఏడాది లో పొదుపు చేసినంత మొత్తాన్ని రుణం తీర్చడానికి వాడండి. రుణ కాల పరిమితి తగ్గుతుంది, మిగతా ఈఎంఐ లు చెల్లించవచ్చు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాల లాంటి అధిక వడ్డీ రేటు గల వాటి నుంచి దూరంగా ఉండండి.
-
నేను మా అబ్బాయి పేరు మీద ఎల్ఐసి జీవన్ ఉమంగ్ పాలసీ తీసుకున్నాను, 20 ఏళ్ళ కాల పరిమితి, రూ. 20 లక్షల బీమా హామీ, రూ.90 వేల వార్షిక ప్రీమియం. దీనితో పాటు హెచ్డీఎఫ్సీ టాప్ 50 ఫండ్ లో 2 ఏళ్లుగా నెలకి రూ. 3500 మదుపు చేస్తున్నాను. మరో రూ. 5000 మదుపు చేయడానికి సలహా ఇవ్వండి.
మీరు పేర్కొన్న జీవన్ ఉమంగ్ పాలసీ ఒక ఎండోమెంట్ పధకం. ఇందులో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువ. ఇలాంటి పధకాల నుంచి దూరంగా ఉండడం మంచిది. వీలయితే ఎల్ఐసి ని సంప్రదించి పాలసీ సరెండర్ చేయండి. జీవిత బీమా అనేది కుటుంబ పెద్ద (అధికంగా సంపాదించే వ్యక్తి) పేరు మీద తీసుకోవడం మంచిది, వారికి ఏదైనా జరిగితే కుటుంబానికి ఆదాయాన్ని భర్తీ చేస్తుంది. మీరు తెలిపిన ఫండ్ పేరు ని బట్టి హెచ్డీఎఫ్సీ ఇండెక్స్ నిఫ్టీ 50 ఫండ్ లో మదుపు చేస్తున్నారని భావిస్తున్నాము. ఇందులో మీరు సిప్ కొనసాగించవచ్చు, అదనపు సిప్ మొత్తానికి కూడా ఇందులో మదుపు చేయవచ్చు. అయితే, నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నెను LIC జీవన్ ఉమంగ్ పధకం లొ సంవత్సరానికి రూ. 1 లక్ష ప్రీమియం 2 సంవత్సరాల నుంచి చెల్లిస్తున్నాను. ఇది మంచి పధకమా కాదా?
మీరు పేర్కొన్న పధకం హోల్ లైఫ్ ఎండోమెంట్ పధకం. ఇందులో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, ఇలాంటి ఎండోమెంట్ పథకాల్లో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. మీరు కనీసం 3 ప్రీమియం లు చెల్లించాక ఈ పాలసీ ని సరెండర్ చేసి కొంత వరకు డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. ఈ విషయమై ఎల్ఐసి ఆఫీస్ ని సంప్రదించండి. జీవితం బీమా కోసం ఒక టర్మ్ పాలసీ ఎంచుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం మీ ఆర్ధిక లక్ష్యాల ఆధారణగా పీపీఎఫ్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి కోసం) లాంటి సురక్షితమైన పధకాలు ఎంచుకోవచ్చు. కొంత రిస్క్ తీసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలం పాటు మదుపు చేసి మంచి రాబడి పొందొచ్చు. నెల నెలా కాబట్టి సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్, నా పేరు చంద్రశేఖర్. నేను కొన్ని షేర్స్ కొన్నాను. ఇవి ఇంకా అమ్మలేదు. దీనికి నేను ఐటీఆర్ ఫైల్ చేయాలా? నాకు ఇతర ఆదాయం లేదు.
షేర్ లు అమ్మిన ఏడాది మాత్రమే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి తెలుపాల్సి ఉంటుంది. మీకు ఇతర ఆదాయం లేకపోతే ఆదాయ పన్ను రిటర్న్స్ తప్పనిసరి కాదు. అయితే, మీ వివరాలతో పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడం మంచిదే. మీరు భవిష్యత్తు లో రుణం తీసుకోవాలన్న, ఒకోసారి ఇతర కొనుగోళ్ల కోసం కూడా ఐటీఆర్ అడగవచ్చు. కాబట్టి, మీరు ప్రతి ఏడాది ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తూ ఉండండి.
-
హాయ్ సర్, నా పేరు అశోక్. నాకు 31 సంవత్సరాలు. నాకు మరియు నా భార్యకు టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ రెండింటినీ కలిగి ఉన్న పాలసీని మీరు సూచించగలరా? మరియు మెటర్నిటీని కలిగి ఉన్న ఏదైనా పాలసీ ఉందా?
మీరు, మీ భార్య ఇద్దరు ఉద్యోగస్తులు అయితే ఇద్దరు టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. లేదంటే మీ ఒక్కరే తీసుకోవచ్చు. టర్మ్ పాలసీ లో కొంత వరకు మాత్రమే ఆరోగ్య బీమా ఉంటుంది. టర్మ్ పాలసీ లో రైడర్స్ రూపం లో ప్రమాద బీమా లాంటివి తీసుకోవచ్చు. అయితే, ఆరోగ్య బీమా విడిగా తీసుకోవడం మంచిది. అందులో మీకు పూర్తీ రక్షణ ఉంటుంది. టర్మ్ పాలసీ కోసం మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. ఆరోగ్య బీమా కోసం ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుని దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. కొన్ని పాలసీ లు మాత్రమే ప్రసూతి ఖర్చులు కవర్ చేస్తాయి, ప్రీమియం కొంత ఎక్కువగా ఉండవచ్చు. వాటిలో కూడా 2 నుంచి 4 ఏళ్ళ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పైన తెలిపిన కంపెనీ ల పాలసీ లు పరిశీలించండి.
-
సర్. నా పేరు సత్యనారాయణ. నేను ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగిని. షేర్ మార్కెట్ లో ఆప్షన్ ట్రేడింగ్ లో 120000 వరకు నష్ట పోయాను. దీనిని నేను IT రిటర్న్స్ లో చూపించాలా, వద్దా?
ఒప్షన్స్ లో నష్టాలని ఆదాయ పన్ను రిటర్న్స్ లో ఐటీఆర్ 4 లో చూపించవచ్చు. దీన్ని వ్యాపార నిమిత్తం పొందిన ఆదాయంగా ఆదాయ పన్ను శాఖ వారు లెక్కిస్తారు. ఈ నష్టాన్ని లాభాలతో అడ్జస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఇలాంటి నష్టాలు తెలిపినప్పుడు ఆడిట్ కూడా చేయించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయడం లో కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. కాబట్టి, మీరు ఛార్టర్డ్ అకౌంటెంట్ లాంటి ఒక పన్ను సలహాదారుడ్ని సంప్రదించడం మంచిది. వారు మీకు వివరంగా తెలుపగలరు.
-
డియిర్ సిరి, నమస్తే. నా పెరు రాజెశ్. నెను ప్రయివెట్ ఉధ్యొగిని. నాకు ఒక పాప. నేను సుకన్య సమృద్ధి యోజన లో పెట్టుబడి పెట్టాలా లేక పిపిఫ్ లొ పెట్టుబడి పెట్టాలా? ఏది మంచిది?
మీరు పేర్కొన్న రెండు పధకాలు సురక్షితమైన పోస్ట్ ఆఫీసు పధకాలు. వీటిలో బ్యాంకులో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పధకం వడ్డీ రేటు 7.6 శాతం, 21 ఏళ్ళ తరువాత మీరు ఇందులో నుంచి డబ్బు తీసుకోవచ్చు. పాప వయసు 18 ఏళ్ళు దాటితే, తన పెళ్లి లేదా ఉన్నత చదువుల కోసం మీ డబ్బు వెనక్కి తీసుకునే సౌకర్యం ఉంటుంది. పీపీఎఫ్ పధకం వద్దే రేటు 7.10 శాతం. ఇది 15 ఏళ్ళ పధకం. అయితే, ఖాతా తెరిచినా 5 ఏళ్ళ నుంచి కొంత వరకు డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. మీరు సుకన్య సమృద్ధి పధకం ఎంచుకోవచ్చు, పీపీఎఫ్ కంటే వడ్డీ కూడా కాస్త ఎక్కువ.
-
సర్, నా పేరు లక్ష్మి. నేను ఫిబ్రవరి 2021 నుంచి షేర్ మార్కెట్ లో రూ. 2.50 లక్షలు మదుపు చేసి ఉన్నాను. మార్చ్ 31 లోపు పెట్టుబడి నష్టాల్లో ఉండింది.దీనికి కచ్చితంగా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలా?
ఆదాయ పన్ను పరంగా షేర్స్ అమ్మినప్పుడు మాత్రమే దాన్ని నష్టంగా భావిస్తారు. అమ్మిన ఏడాది వచ్చిన నష్టాలని ఐటీఅర్ ఫారం 2 ద్వారా తెలుపవచ్చు. ఇలా తెలుపడం వల్ల మీరు వీటిని 'క్యారీ ఫార్వర్డ్' చేసుకోవచ్చు. రాబోయే 8 ఏళ్ళల్లో మీకు మూలధన లాభాలు చేకూరితే ఈ నష్టాల ద్వారా మీరు 'సెట్ ఆఫ్' (లాభాలు ని నష్టాలతో సరిచేయడం) చేసుకునే వీలుంటుంది. కాబట్టి, మీరు ఈ వివరాలతో ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం మంచిది.
-
నేను మ్యూచువల్ ఫండ్స్ లో 10 ఏళ్ళ పాటు నెలకి రూ. 5000 మదుపు చేయాలనుకుంటున్నాను. మంచి ఫండ్స్ సూచించండి. నా స్నేహితుడు ఆక్సిస్ బ్ల్యూచిప్ ఫండ్ సూచించాడు. ఇది మంచిదేనా?
మీరు పేర్కొన్న ఫండ్ పని తీరు బాగుంది. మీరు ఇందులో మదుపు చేయవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. మార్కెట్ దిగువలో ఉన్నప్పుడు అదే ఫండ్ లో కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ ఉండడం మంచిది. దీని వల్ల తక్కువ ధర కి ఎక్కువ యూనిట్స్ పొందొచ్చు. మొదటి కొన్నేళ్లలో వీలైనన్ని యూనిట్స్ కొనగలిగితే ఆ తరువాత వాటి పై మంచి రాబడి పొందే వీలుంటుంది.
-
డియర్ సిరి నాకు 2 పాలసీలు వున్నాయి, ఎల్ఐసి జీవన్ ఉమంగ్ , ప్రీమియం రూ. 1,75000. ఇది 15 ఏళ్ళ టర్మ్ పాలసీ. మరొక పాలసీ మాక్స్ లైఫ్, అది కూడా 15 ఏళ్ళ టర్మ్ పాలసీ. ప్రీమియం రూ. 1 లక్ష . నాకు 42 ఏళ్ళు, ఈ రెండు సరిపోతాయా? లేక ఇంకా మదుపు చేయాలా?
టర్మ్ పాలసీ లో బీమా మొత్తం అనేది వార్షిక ఆదాయాన్ని బట్టి తీసుకోవాలి. వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకి, వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు ఉన్న వారు సుమారుగా రూ. 1 కోటి నుంచి 1.50 కోటి వరకు బీమా హామీ ఎంచుకోవడం మేలు. 60 ఏళ్ళ వయసు వరకు పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మీరు పేర్కొన్నట్టుగా ఎల్ఐసి జీవన్ ఉమంగ్ ఒక టర్మ్ పాలసీ కాదు, అది హోల్ లైఫ్ ఎండోమెంట్ పధకం. ఇందులో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి, కానీ బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ. దేన్నీ సరెండర్ చేయడం మేలు. ఎల్ఐసి వారిని సంప్రదించి మీ వీలు ప్రకారం సరెండర్ చేయండి.మాక్స్ లైఫ్ టర్మ్ పాలసీ లో అదనంగా బీమా ఎంచుకోవచ్చు, లేదా రెన్యువల్ సమయం లో ఒకేసారి వార్షిక ఆదాయాన్ని బట్టి మరో మాక్స్ లైఫ్ టర్మ్ ప్లాన్ ఎంచుకోవచ్చు.
-
నేను ఒక ఎన్అర్ఐ, మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయాలనుకుంటున్నాను. ఎస్బీఐ, ఐసీఐసీఐ ఇలా ఏది బాగుంటుంది? ఎంత వరకు మదుపు చేయవచ్చు?
చాలా వరకు మ్యూచువల్ ఫండ్ కంపెనీ లు ఎన్ఆర్ఐ లకు కూడా మదుపు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. యూటీఐ, ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఆక్సిస్ లాంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీల ఫండ్స్ లో మీరు మదుపు చేయవచ్చు. ఎంత మదుపు చేయాలనడ్డి మీ ఆర్ధిక లక్ష్యాలను బట్టి ఉంటుంది. ముందుగా మీరు రూ. 10 వేల తో సిప్ మొదలు పెట్టవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. మార్కెట్ దిగువలో వెళ్లినట్టయితే కొంత అదనపు మొత్తాన్ని మదుపు చేస్తూ ఉండొచ్చు.
-
10 ఏళ్ళ కోసం మదుపు చేయడానికి మంచి లార్జ్ కాప్ ఫండ్ సూచించండి.
మీరు ఒక ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. దీర్ఘకాలం లో ఇందులో రిస్క్ తక్కువ, మంచి రాబడి కూడా పొందొచ్చు. సిప్ విధానంలో మదుపు చేయండి, యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నా వయసు 47, భార్య వయసు 46, పిల్లలు 21, 14. న్యూ ఇండియా అస్సురన్సు కంపెనీ లో రూ. 3 లక్షల బీమా కి రూ. 21 వేలు ప్రీమియం కడుతున్నాను. ఇది సరైనదేనా? మా ఇద్దరి వయసు ఒకటే అయినప్పటికీ ప్రీమియం లో ఏమైనా తేడా ఉంటుందా?
మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా తీసుకున్నారని భావిస్తున్నాము. వీటిలో కుటుంబ పెద్ద వయసు ఆధారంగా మాత్రమే ప్రీమియం నిర్ణయిస్తారు. కంపెనీ, పాలసీ ని బట్టి ప్రీమియం మారుతుంది. వయసు, నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యా, రూమ్ అద్దె పరిమితులు ఇలా అనేక రకాల విషయాలని బట్టి ప్రీమియం నిర్ణయిస్తారు. మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. వీటిలో నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య బాగుంటుంది.
-
నా వయస్సు 45 సంవత్శరాలు. నాకు ఒక మంచి ఆరొగ్య బీమా పాలసి తెలుపగలరు.
ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. మీ అవసరాన్ని బట్టి 2-4 వ్యక్తులు ఉన్న కుటుంబానికి రూ.5 నుంచి 10 లక్షల బీమా హామీ ఎంచుకోవడం మేలు. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.
-
డియర్ సిరి, నేను ఈ మ్యూచువల్ ఫండ్స్ లో 5 ఏళ్లుగా సిప్ చేస్తున్నాను - 1. Axis long term equity fund 2.Franklin build india fund 3. Hdfc small cap fund 5.Sbi blue chip fund 5. Icici balanced advantage fund/Icici Next 50 index fund. మరో 5 ఏళ్ళ కోసం ఇవి మంచివేనా?
మీరు ఎంచుకున్న ఫండ్స్ లో ఈఎల్ఎస్ఎస్, స్మాల్ కాప్, లార్జ్ కాప్, బ్యాలన్సుడ్ ఇలా చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి. అధిక ఫండ్స్ లో మదుపు చేయడం వల్ల మీకు అధిక రాబడి వస్తుందనేది అపోహ మాత్రమే. చాలా వరకు ఫండ్స్ అవే షేర్స్ లో మదుపు చేస్తుంటాయి, కొన్ని షేర్స్ మాత్రమే వేరుగా ఉంటాయి. మీరు ఒకటి లేదా రెండు ఫండ్స్ లో మాత్రమే మదుపు చేయండి. ఈఎల్ఎస్ఎస్ లో సిప్ చేయడం సరైన పధ్ధతి కాదు, ప్రతి సిప్ కి 3 ఏళ్ళ లాక్ ఇన్ ఉంటుంది. కాబట్టి, మీరు డబ్బులు వెనక్కి తీసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఐసీఐసీఐ నిఫ్టీ నెక్స్ట్ 50 లో మదుపు కొనసాగించవచ్చు. రిస్క్ తీసుకోగలిగితే హెచ్డీఎఫ్సీ స్మాల్ కాప్ ఫండ్ బదులు ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్ ఎంచుకోండి. మిగతా ఫండ్స్ లో మొత్తాన్ని కూడా ఈ ఫండ్స్ లో బదిలీ చేసుకోవడం మంచిది.
-
నా వయసు 55, నా భార్య కూడా అదే వయసు. ప్రస్తుతం నేను ఎస్బీఐ ఆరోగ్య బీమా పాలసీ వాడుతున్నాను. క్లెయిమ్ కూడా లేదు. మరో మంచి పాలసీ సూచించండి.
మీరు సొంతంగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. మీకు క్లెయిమ్ లేదు కాబట్టి పోర్టింగ్ చేసుకున్నట్లయితే మీరు పూర్తి చేసిన వెయిటింగ్ పీరియడ్ కూడా ఇందులో భాగం అవుతుంది. కొత్త పాలసీ సమయం లో మీ పాత పాలసీ గురించి తెలిపి పోర్టింగ్ గురించి అడగండి.
-
సర్, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. దీర్ఘకాలం కోసం పీపీఎఫ్, ఫిక్సిడ్ డిపాజిట్ లో ఏది మంచిది?
ఫిక్సిడ్ డిపాజిట్ స్వల్పకాల పెట్టుబడి పధకం. 1-2 ఏళ్ళ కోసం ఇది సరైనది. రిస్క్ లేని పెట్టుబడి పధకం కావాలంటే మీరు పీపీఎఫ్ ఎంచుకోవచ్చు. కాస్త రిస్క్ టీయూకోగలిగితే మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేయగలిగితే మంచి రాబడి పొందొచ్చు.
-
నా వయసు 28 , నాకు రూ.25000 జీతం. నెల నెలా మ్యూచువల్ ఫండ్స్ లో రూ. 2500 మదుపు చేస్తున్నాను. నెను టర్మ్ ప్లాన్ తీసుకోడానికి సూచనలు ఇవ్వండి.
మీరు ఎంచుకునే టర్మ్ ప్లాన్ లో మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. అలాగే, ఇండెక్స్ ఫండ్స్ లో మదుపు చేయండి, దీని వల్ల కాస్త రిస్క్ తగ్గుతుంది.
-
సర్, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. ఇటీవలే ఇల్లు అమ్మితే నాకు రూ. 6 లక్షలు అందాయి. దీన్ని బ్యాంకు లో ఫిక్సిడ్ డిపాజిట్ చేయడం మంచిదా లేక పోస్ట్ ఆఫీస్ లో వేయచ్చ?
బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసు లో మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. రూ. 3 లక్షల చొప్పున మీరు 2 బ్యాంకుల్లో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. యెస్ బ్యాంకు, ఆర్బీఎల్ లాంటి బ్యాంకులను ఎంచుకోవచ్చు. వీటిలో వడ్డీ కాస్త ఎక్కువ ఉండవచ్చు.
-
సర్, నేను ఐటీ ఉద్యోగిని, వయసు 28, నాకు రూ. 80 వేల జీతం. ఇప్పటి వరకు పొదుపు లేదు. ఖర్చులు పోను ఎలా పొదుపు చేయాలో తెలుపగలరు.
మీరు మీ స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాలను దృష్టిలో ఉంచి మదుపు చేయడం మొదలు పెట్టండి. 10 ఏళ్ళ పైన ఉన్న లక్ష్యాల కోసం సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. అలాగే, మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి.
-
మా నాన్న గారి వయసు 75, ఆయనకి రూ. 40 వేలు పింఛను వస్తుంది. వారికి రూ. 1 కోటి లేదా రూ. 50 లక్షల బీమా హామీ తో టర్మ్ పాలసీ తీసుకోవచ్చా? అలాగే, రూ. 5-10 లక్షల ఆరోగ్య బీమా తీసుకోవచ్చా? మా అమ్మ గారు నాన్న గారి మీద ఆధారపడి ఉన్నారు.
సాధారణంగా, 70 ఏళ్ళ పై బడిన వారికి టర్మ్ ప్లాన్ దొరకడం కష్టతరం అవుతుంది. చాలా వరకు కంపెనీ లు 60 ఏళ్ళ లోపు వయసు ఉన్న వారికి మాత్రమే టర్మ్ ప్లాన్ అందిస్తుంటారు. ప్రీమియం కూడా వయసు తో పెరుగుతూ వస్తుంది. మీరు మాక్స్ లైఫ్, ఐసీఐసీఐ లాంటి కంపెనీ లను సంప్రదించవచ్చు. టర్మ్ ప్లాన్ బదులు కొంత మొత్తాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ లేదా సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పధకం లో మదుపు చేసి, ఏదైనా నెలసరి మిగులు ఉన్నట్టయితే రికరింగ్ డిపాజిట్ చేయవచ్చు. నామినీ కి ఈ మొత్తం ఉపయోగపడుతుంది. ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. వయసు పరంగా ప్రీమియం కూడా కాస్త ఎక్కువగా ఉండవచ్చు.
-
సర్, నేను 25 ఏళ్ళ క్రితం రూ. 90 వేల మొత్తం తో ఇల్లు కొన్నాను. ఇటీవలే దీన్ని రూ. 38 లక్షలకు అమ్మేసాను. ఎంత పన్ను వర్తిస్తుంది.
ఇంటి అమ్మకాల విషయం లో దీర్ఘకాల మూలధన లాభం పై సుమారుగా 20 శాతం వరకు పన్ను వర్తిస్తుంది. అయితే, ద్రవ్యోల్బణం ప్రకారం మీ కొనుగోలు ధర ఇప్పటి విలువ లో సుమురగా రూ. 2.70 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి, పన్ను పరంగా మీ లాభం సుమారుగా రూ. 35.29 లక్షలు. దీని పై 20 శాతం పన్ను అంటే సుమారుగా రూ. 7 లక్షల వరకు పన్ను వర్తిస్తుంది.
-
నా వయస్సు 40 ఇయర్స్. నాకు ఏవిధమైన లోన్స్ లేవు. నాకు నెలకు 32000 జీతం వస్తుంది. ఏ బాంక్ లో ఎంత లోన్ వస్తుందో తెలుపగలరు.
మీరు సుమారుగా రూ. 20 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. బ్యాంకు ని బట్టి ఇది మారుతుంది. ఎస్బీఐ లో వడ్డీ రేటు కాస్త తక్కువ. మిగతా బ్యాంకులని కూడా సంప్రదించడం మంచిది. మీ నెలసరి జీతం లో ఈఎంఐ 30 శాతానికి మించకుండా చూసుకోండి. ఇతర లక్ష్యాల కోసం కూడా కొంత మొత్తాన్ని పీపీఎఫ్, ఎన్పీఎస్ లేదా ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం మంచిది.
-
నేను 3 ఏళ్ళ క్రితం ఇంటి రుణం తీసుకున్నాను, ప్రస్తుతానికి రూ. 46 లక్షల వరకు ఉంది. నేను ఇంటిని రూ. 80 లక్షలకు అమ్మేద్దాం అనుకుంటున్నాను. పన్ను చెల్లించాల్సి ఉంటుందా?
మీరు దీర్ఘకాల మూలధన లాభం పై ఇండెక్స్ఏషన్ తో 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు కొనుగోలు చేసిన ధరకి, అమ్మిన ధరకి మధ్య వ్యత్యాసమే దీర్ఘకాల మూలధన ఆదాయం.
-
నా పెరు క్రిష్ణ, నా వయసు 27. నెను 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల రూ. 7000 ELSS (axis long term equity direct, Aditya Birla sunlife tax relif 96 direct, mirae asset tax tax fund saver) లొ మదుపు చేస్తున్నాను. ఇప్పుడు రూ. 9000 కి పెంచి పొదుపు చేద్దాం అనుకుంటున్నాను. ఉన్నవాటిని కొనసాగించల లేదంటే వెరే వేరేది ఎంచుకోవాలా?
పన్ను ఆదా ఫండ్స్ లో సిప్ చేయడం మంచి పధ్ధతి కాదు. ప్రతి సిప్ కి 3 ఏళ్ళ లాక్ ఇన్ ఉంటుంది. కాబట్టి, మీరు డబ్బులు తీసుకోవడం కాస్త తరం అవుతుంది. పన్ను ఆదా కోసం మీరు పీపీఎఫ్, ఎన్పీఎస్ లాంటివి కూడా ఎంచుకోవచ్చు. దీర్ఘకాలం మదుపు కోసం సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నా వయసు 69. నేను రూ. 1 కోటి బీమా హామీ తో జీవిత బీమా తీసుకోవాలి అనుకుంటున్నాను. సలహా ఇవ్వండి.
జీవిత బీమా అనేది కుటుంబం లో అధిక సంపాదన కలిగిన వారి పేరు మీద తీసుకోవాల్సి ఉంటుంది. వారికి ఏదైనా జరిగితే కుటుంబానికి (నామినీ కి) ఒకే సారి బీమా మొత్తం అందిస్తారు. మీరు ఉద్యోగస్తులు కాకపోతే జీవిత బీమా అవసరం లేదు. మీ కుటుంబం లో ఎవరైనా మీ మీద ఆధార పడితే తీసుకోవచ్చు. లేదా మీ కుటుంబం లో అధిక సంపాదన కలిగిన వారు టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. వారు మిమ్మల్ని నామినీ పెట్టడం వల్ల మీకు రక్షణ ఉంటుంది. టర్మ్ పాలసీ లో వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
నేను ఎల్ఐసి లేదా ఏదైనా బీమా కంపెనీ నుంచి టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇందులో కోవిడ్, ప్రమాద మరణం, అనారోగ్యాలతో మరణం ఇలా అన్నిటికీ బీమా హామీ వస్తుందా? మైనర్ ని నామినీ చేయవచ్చా?
టర్మ్ పాలసీ కోవిడ్, ప్రమాద మరణం, అనారోగ్యాలతో మరణం ఇలా అన్ని రకాల మరణాలను కవర్ చేస్తుంది. అయితే, పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ముఖ్యంగా, అనారోగాలను కచ్చితంగా తెలపాలి. టర్మ్ పాలసీ లో మైనర్ ని నామినీగా చేర్చవచ్చు. అయితే, 18 ఏళ్ళ నిండే వరకు వారికి బీమా హామీ అందదు. కాబట్టి, మీరు ఒక 'అప్పోయింటీ' ని నియమించాల్సి ఉంటుంది. నామినీ వయసు 18 ఏళ్ళ లోపు పాలసీదారుడు మరణిస్తే, బీమా హామీ మొత్తాన్ని అప్పోయింటీ తీసుకుని 18 ఏళ్ళ తరవాత నామినీ కి అందిస్తారు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
సర్, నా వద్ద రూ. 20 వేలు ఉన్నాయి. 2 ఏళ్ళ కోసం ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తే నాకు ఎంత వడ్డీ వస్తుంది?
2 ఏళ్ళ ఫిక్సిడ్ డిపాజిట్ లో ఏడాదికి 5-6 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. మీరు యెస్ బ్యాంకు, ఆర్బీఎల్ లాంటి బ్యాంకులను పరిశీలించవచ్చు. వీటి వడ్డీ కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
-
నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. నా నెలసరి జీతం రూ. 12 వేలు. సిటీ కి దగ్గరలో ఇల్లు కొనాలనుకుంటున్నాను, ఇంటి రుణం పొందొచ్చా? ఎంత వరకు వస్తుంది, వడ్డీ ఎంత?
మీరు ఇంటి రుణం పొందొచ్చు. దీని కోసం మీరు ఎస్బీఐ లేదా ఏదైనా దగ్గర లో ఉన్న బ్యాంకు ని సంప్రదించవచ్చు. సాధారణంగా, మీ ఉద్యోగ సంస్థ అందించిన పే స్లిప్స్, 6 నెలలా బ్యాంకు స్టేట్మెంట్, ఆదాయ పన్ను రిటర్న్స్ (అవసరం పడితే) లాంటివి అడగవచ్చు. మీ నెలసరి జీతాన్ని బట్టి రూ. 6 నుంచి రూ. 10 లక్షల వరకు రుణం పొందే వీలుంటుంది. ఇది బ్యాంకు ని బట్టి మారవచ్చు. వడ్డీ రేటు సుమారుగా 7 శాతం లోపు ఉండే అవకాశం ఉంటుంది.
-
నేను రూ. 1000 చొప్పున ఆక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ టాక్స్ రిలీఫ్ 96 ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో మదుపు చేశాను. వీటి లాక్ ఇన్ జూన్ లో పూర్తవనుంది. వీటిని మరో 3 ఏళ్ళ కోసం పొడిగించవచ్చా లేదా డబ్బు వెనక్కి తీసుకోవాలా?
ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో సిప్ చేయడం మంచి ఆలోచన కాదు. ప్రతి సిప్ కి 3 ఏళ్ళ లాక్ ఇన్ ఉంటుంది. కాబట్టి, మీరు ఇప్పుడు మీ పెట్టుబడి మొత్తం వెనక్కి తీసుకునే వీలుండదు. మొదటి సిప్ మాత్రమే తీసుకోగలరు. రెండవ సిప్ మొత్తం జులై అలా 3 ఏళ్ళ తరవాత మాత్రమే మీ పెట్టుబడి వెనక్కి తీసుకోవచ్చు. మీరు ఈఎల్ఎస్ఎస్ బదులు ఇండెక్స్ ఫండ్స్ లో మదుపు చేయండి, దీర్ఘకాలం లో మంచి రాబడి పొందవచ్చు. పన్ను మినహాయింపు కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్ లాంటివి ఎంచుకోవచ్చు.
-
సార్, నేను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి హౌస్ లోన్ ను గడువు కన్నా ముందుగానే క్లోజ్ చేద్దామనుకుంటున్నాను. పెనాల్టీలు ఏమైనా ఉంటాయా ? తెలపగలరు.
మీరు మీ సొంత డబ్బు తో ఇంటి రుణం తీర్చుతున్నట్టయితే దానికి ఎటువంటి చార్జీలు విధించారు. అయితే, ఒకవేళ మీరు మరో బ్యాంకు కి రుణాన్ని బదిలీ చేస్తున్నా లేక ఇల్లు అమ్మకం కారణంగా మరోకరి పేరు మీద రుణాన్ని మారుస్తున్నట్టయితే కొంత వరకు చార్జీలు ఉండవచ్చు.
-
నేను దివ్యంగుడిని, జీవన్ ఉమంగ్ పాలసీ తీసుకున్నాను, అయితే పాలసీ లో నేను ఈ సమాచారం పొందు పరచలేదు. దీని వల్ల క్లెయిమ్ సమయంలో ఎమైన ఇబ్బంది ఉంటుందా? నేను ప్రతి నాలుగు నెలకు 6990 కడ్తున్న, ఇంకా ఈ పాలసీ ప్రయోజనాలు తెలుపగలరు.
బీమా పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మీరు వెంటనే కంపెనీ కి ఈ విషయాన్నీ తెలుపడం మంచిది. మీరు ఎంచుకున్న పాలసీ లో బీమా, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, అలాగే రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ. ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండడం మంచిది. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
హాయ్, సిరి, నేను ఓ టర్మ్ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. నా వయసు 43. వార్షిక ఆదాయం రూ. 6 లక్షలు. (డివ్యాన్గుడిని). పాలసీ వివరాలు తెలియచేయండి.
బీమా కంపెనీలు దివ్యంగులకు కూడా టర్మ్ పాలసీ అందిస్తుంటారు. మీరు కంపెనీ తో నేరుగా ఈ విషయం తెలిపి టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ లో మేము కలిపి రూ. 9,00,000/ పొదుపు చేస్తే, వచ్చే వడ్డీ ఆదాయం పై ఇద్దరూ పన్ను చెల్లించాలా ? తెలియచేయగలరు.
పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ పై వచ్చే వడ్డీ ఆదాయం మీద పన్ను మినహాయింపులు ఉండవు. దీని మీద టీడీఎస్ లేకపోయినా మీరు మీ ఆదాయ పన్ను రిటర్న్స్ లో ఈ వడ్డీ తెలుపాల్సి ఉంటుంది. స్లాబ్‌కి తగ్గట్టు పన్ను విధిస్తారు.
-
నేను అటల్ పెన్షన్ యోజన లో మదుపు చేస్తున్నాను, ఎన్పీఎస్ లో కూడా మదుపు చేయవచ్చా?
మీ వద్ద ఉన్న ప్రాన్ తో మీరు ఈ రెండు పథకాల్లో మదుపు చేయవచ్చు. అసంఘటిత రంగం లో వారి కోసం అటల్ పెన్షన్ యోజన ప్రవేశ పెట్టారు. ఇందులో పెన్షన్ మొత్తం తక్కువే. కాబట్టి, దీని బదులు మీరు ఎన్పీఎస్ లో దీర్ఘకాలం పాటు మదుపు చేయడం మంచిది.
-
నేను అమెరికా లో స్థిరపడ్డాను. నాకు భారత దేశం లో పీపీఎఫ్ ఖాతా ఉంది. నేను దీన్ని కొనసాగించవచ్చా?
ప్రవాస భారతీయులు గతం లో తెరిచినా పీపీఎఫ్ ఖాతా ని మెచ్యూరిటీ వరకు కొనసాగించవచ్చు. అయితే, అందులో అదనపు పెట్టుబడులు పెట్టే వీలుండదు. కాబట్టి, ఈ ఖాతా మెచ్యూరిటీ ముగిసాక మీ డబ్బు మీరు తీసుకోవచ్చు.
-
డియర్ సిరి, నా వయసు 29. నా నెలసరి జీతం రూ. 65 వేలు, ఖర్చులు రూ. 25 వేలు. పొదుపు, బీమా కోసం సలహాలు ఇవ్వండి. నేను పెట్టుబడులు చేయదల్చుకోలేదు.
ముందుగా మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. మీరు మీ ఆర్ధిక లక్ష్యాల ప్రకారం పొదుపు చేయడం మంచిది. పొదుపు చేసిన మొత్తాన్ని బ్యాంకుల్లో ఉంచడం వల్ల ద్రవ్యోల్బణం కంటే తక్కువ రాబడి వస్తుంది. మీకు సురక్షితమైన పెట్టుబడి కావాలనుకుంటే బ్యాంకు రికరింగ్ డిపాజిట్ లేదా పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ ఖాతా ఎంచుకోవచ్చు.
-
నా వయసు 29. నెల నెలా మ్యూచువల్ ఫండ్స్ లో రూ. 2000 మదుపు చేయడానికి సూచనలు ఇవ్వండి. అలాగే, రూ. 5 లక్షల మొత్తానికి ఆరోగ్య బీమా సూచించండి.
మీరు సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేస్తే మంచి రాబడి పొందగలరు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి.
-
నా వయసు 48 సంవత్సరాలు. నేను టర్మ్ పాలసీ ఆన్లైన్ లో తీసుకోవాలానుకొంటున్నాను. ఐసీసీఐ పరిశీలించగా ఇన్కమ్ కాలమ్ లో శాలరీ, సెల్ఫ్ ఎంప్లాయి ఆప్షన్ ఉంది. నేను ఒక ప్రైవేట్ విద్యా సంస్థ లో పని చేసి నెలకు 30000 మరియు స్వంతం గా అకౌంట్స్ కన్సుల్టేన్సీ ద్వారా సుమారుగా సంవత్సరానికి 200000 సంపాదిస్తాను. నేను ఎలా చూపించాలి?
మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీకు అందిన పే స్లిప్స్ తో పాటు మీ బ్యాంకు స్టేట్మెంట్ కూడా బీమా కంపెనీ కి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సొంతంగా సంపాదించినా డబ్బులకు సంబంధించి కూడా ఏదైనా ఆధారాలు ఉంటే వారికి ఇవ్వచ్చు. కంపెనీ దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. మీరు వారి తో వివరంగా మాట్లాడడం మేలు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
-
పిపిఎఫ్ అకౌంట్ కలిగిన బ్యాంక్ దివాలా తీస్తే అందులో ఉన్న మన డబ్బుకు ఎలాంటి భద్రత ఉంటుంది?
పీపీఎఫ్ ఖాతా బ్యాంకులు అందిస్తున్నప్పటికీ ఈ పధకం మాత్రం పోస్ట్ ఆఫీసు వారిదే. మీ డబ్బు బ్యాంకులు వారి వద్ద ఉంచారు. వీటిని పోస్ట్ ఆఫీసు కి బదిలీ చేస్తారు. కాబట్టి, బ్యాంకులకు ఏదైనా జరిగినప్పటికీ పోస్ట్ ఆఫీస్ వద్ద మీ డబ్బు సురక్షితమే.
-
నేను పదవీ విరమణ తీసుకున్నాను పీపీఎఫ్ ఖాతా లో ఏడాదికి రూ. 1.50 లక్షల వరకు మదుపు చేస్తున్నాను. వడ్డీ పై పన్ను ఉంటుందా?
పీపీఎఫ్ ఖాతా పెట్టుబడి పై సెక్షన్ 80C ద్వారా పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే, వడ్డీ పై పన్ను వర్తించదు. అలాగే, మెచ్యూరిటీ పై కూడా పన్ను ఉండదు. మీరు పీపీఎఫ్ ఖాతా కాల పరిమితి ముగిసాక కూడా 5 ఏళ్ళ చొప్పున ఖాతా ని కొనసాగిస్తూ రావచ్చు.
-
నా వయసు 67, రిస్క్ కవేరజ్ అందించే మంచి బీమా పాలసీల గురించి చెప్పండి.
మీరు జీవిత బీమా గురించి అడుగుతున్నారని భావిస్తున్నాము. ఇందులో పాలసీదారుడికి ఏదైనా జరిగితే కుటుంబానికి ఒకేసారి బీమా మొత్తాన్ని అందిస్తారు. యుక్త వయసు నుంచి ఉన్నట్టయితే కుటుంబానికి భరోసా అందించవచ్చు. ఇదే కారణం చేత బీమా కంపెనీ లు ఉద్యోగస్తులకు జీవిత బీమా పాలసీ అందిస్తుంటాయి. మీరు పదవీ విరమణ చెంది ఉంటారని అనుకుంటున్నాము. కాబట్టి, మీ ఇంట్లో అధిక సంపాదన కలిగిన వారి పేరు మీద జీవిత బీమా తీసుకోవడం మేలు. తన సంపాదన మీద ఆధార పడిన వారు ఉన్నప్పుడు మాత్రమే ఒకరు జీవిత బీమా తీసుకోవాలి.
-
రిటైర్ అయినతరువాత EPF మొతం మీద టాక్స్ కట్టవలసి వస్తుందా? లేదా? దయచేసి తెలియజేయండి.
పదవీ విరమణకు ముందు సేకరించిన నిధిపై వచ్చిన వడ్డీకి(పదవీ విరమణ తరువాత విత్‌డ్రా చేసుకున్నా, చేసుకోకపోయినా) ఎటువంటి పన్ను వర్తించదు. అయితే ఒకవేళ పదవీవిరమణ తరువాత కూడా నిధులను ఉపసంహరించుకోకపోతే ఆ మొత్తంపై వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సిందే.
-
నేను రెండు క్రెడిట్ కార్డులు వాడుతున్నాను. వాటికి చాలా తక్కువ క్రెడిట్ ఉంది. అయితే, నేను వాటి పై ఉన్న బిల్లులో కనీసం మొత్తం మాత్రమే కడుతున్నాను. వడ్డీ ఎంత వరకు పడుతుంది?
క్రెడిట్ కార్డు పై అధిక వడ్డీ ఉంటుంది. కార్డుని బట్టి వార్షిక వడ్డీ 36 నుంచి 40 శాతం వరకు ఉండే అవకాశం కూడా ఉంది. కనీసం మొత్తం కడుగు ఉండడం వల్ల ఈ మేరకు మీరు వడ్డీ చెల్లిస్తూ ఉంటారు. వీలైనంత త్వరగా క్రెడిట్ కార్డు పై పూర్తి బిల్లును మీరు తీర్చేయడం మేలు.
-
నేను బజాజ్ పర్సనల్ లోన్ రూ. 2.20 లక్షలు, 36 నెలలు కాల పరిమితి, EMI 8517/- తో తీసుకున్నాను. వడ్డీ రేటు 13.12%. ఈ రుణం ముందే క్లోజ్ చేసుకొవచ్చా? లేక EMI కట్టుకొ మంటారా? ప్రీ క్లోజ్ చేయడం వల్ల నష్ట పొతామా? తెలియచేయగలరు.
వ్యక్తిగత రుణాన్ని ముందే తీర్చడం వల్ల బ్యాంకులు 3-4 శాతం వరకు చార్జీలు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీ రుణ మొత్తం ప్రకారం రూ. 8 వేల వరకు మీరు చార్జీలు చెల్లించాల్సి రావచ్చు. ఈ మేరకు మీరు సిద్ధమైతే రుణం తీర్చవచ్చు, వడ్డీ భారం తప్పుతుంది. వక్తిగత, క్రెడిర్ కార్డు రుణాల నుంచి దూరంగా ఉండడం మంచిది. వీటి పై వడ్డీ అధికంగా ఉంటుంది.
-
మ్యూచువల్ ఫండ్స్ గురించి వివరించండి.
నేరుగా షేర్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల అధిక రిస్క్ ఉంటుంది. కాబట్టి, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పరోక్షంగా వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో అనుభవం కలిగిన ఫండ్ మ్యానేజర్స్ ఉంటారు కాబట్టి రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులుంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా ఆఫ్‌లైన్ పద్ధతి(లేదా వారి ఆన్లైన్ వెబ్సైటు ద్వారా అయినా)లో మ్యూచువల్ ఫండ్డ్ సలహాదారుని ద్వారా పెట్టుబడి చేయవచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో పంపిణీదారులు కొంత కమీషన్ తీసుకుంటారు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ పథకాలు వందల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్తగా పెట్టుబడి ప్రారంభించాలనుకుంటున్నారు కాబట్టి సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.
-
వ్యక్తిగత రుణాల మీద పన్ను మినహాయింపులు ఉంటాయా?
గృహ, వైద్య రుణాల్లో మాత్రమే పన్ను ప్రయిజనాలు ఉంటాయి. వ్యక్తిగత రుణానికి పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉండదు. వీలైనంత వరకు ఇలాంటి రుణాలు తీసుకోకుండా ఉండడం మంచిది. అధిక వడ్డీ వల్ల మీ పై భారం పడుతుంది. పైగా, మీ ఇతర లక్ష్యాల కోసం పెట్టుబడి చేయడం కూడా కష్టతరం అవుతుంది.
-
నమస్తే ఈనాడు, నేను ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాను. నా నెలసరి జీతం రూ. 26,000. నా దగ్గర రెండు క్రెడిట్ కార్డులు ఉండేవి, నేను పని చేసే కంపనీ లో సరైన సమయానికి సాలరి పడక నా క్రెడిట్ కార్డ్ బిల్లు సరయన సమయానికి చెల్లించలేక పోవడం తో సిబిల్ స్కోర్ పడిపోయింది. ఇప్పుడు మొత్తం క్లియర్ చేసేసాను, ఎలాంటి లోన్స్ లేవు ఇప్పుడు. ఇప్పుడు మల్లీ సిబిల్ స్కోర్ పెరగడం ఎలా. త్వరలో ఇంటి లోన్ తీసుకుందాము అనుకుంటున్నాను.
ఇంటి రుణం కోసం మంచి క్రెడిట్ స్కోర్ తప్పనిసరి. క్రెడిట్ స్కోర్‌ను మరింతగా మెరుగుపరుచుకోవడం ఎలాగో తెలుసుకుందాం. దరఖాస్తుచేయగానే రుణం రావడం అంత సులభం కాదు. రుణ దరఖాస్తును బ్యాంకులు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ప్రస్తుతం క్రెడిట్బ్యూరోల వద్ద అందరి రుణ చరిత్ర ఉంటోంది. అందులో ఇంతకుముందు ఆ వ్యక్తి చేసిన రుణ దరఖాస్తులు, రుణ చెల్లింపుల్లో తప్పులు వంటివి ఉంటాయి. దాని ఆధారంగానే బ్యాంకులు ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తాయి. ఒక్కోసారి తెలియకుండానే రుణ చరిత్ర మీద ఊహించని చెడు ప్రభావం ఉంటుంది. అప్పుడు ఒక క్రమ పద్ధతిలో రుణ చరిత్ర నివేదికను మార్చుకోవడం, క్రెడిట్ స్కోర్‌ను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఒక్కోసారి రుణ సంస్థలు అప్పు మొత్తం తీర్చేసిన తర్వాత కూడా దాని గురించి క్రెడిట్ బ్యూరోకు సమాచారం అందించి ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని రుణ చరిత్ర నివేదికలను చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు ఆ విషయాన్ని రుణ సంస్థ ద్వారా క్రెడిట్ బ్యూరోకు చెప్పించి అప్డేట్ చేయించాలి. ఇంకా వేరే ఎవరో ఖాతాను మన నివేదికతో అనుసంధానించి ఉండొచ్చు. అలాంటప్పుడు క్రెడిట్ బ్యూరోకు అన్ని ఆధారాలు అందజేసి మీ నివేదికలో మార్పులు చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడటం ద్వారా బిల్లులను సకాలంలో చెల్లించడంలో జాప్యం జరగొచ్చు. క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లింపుల్లో చిన్న చిన్న లోపాల కారణంగా క్రెడిట్ స్కోర్ తక్కువ అవుతుంది. అందువల్ల తప్పదు అనుకుంటే ఒకటే క్రెడిట్ కార్డు వాడాలి. బిల్లు చెల్లింపులను గడువుతేదీలోపు చెల్లించాలి. క్రెడిట్ స్కోర్ సరిగా ఉండదని భావించేవారు దాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయోగాలు చేస్తుంటారు. అప్పుడు వ్యక్తిగత రుణం తీసుకుని చెల్లించేయడం వల్ల క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చని ఎవరో తెలియనవారు సలహా ఇవ్వవచ్చు. ఇది కేవలం అపోహ మాత్రమే. మీ సంపాదన, ఆర్థిక సామర్థ్యం వంటి పలు అంశాల ఆధారంగా బ్యాంకులు రుణం ఇవ్వడం గురించి ఆలోచిస్తాయి. అందులో క్రెడిట్ స్కోర్ కేవలం ఒక అంశం మాత్రమే. అందుకే అనవసరంగా రుణం తీసుకోకపోవడమే మంచిది. మీకు ప్రాముఖ్యత తెలియని కారణంగా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందని చింతించాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో చెల్లించకుండా ఉండిపోయిన క్రెడిట్ కార్డు బిల్లులను , ఈఎమ్ఐలను వీలైనంత తొందరగా చెల్లించేయాలి. చెల్లింపు గడువులోపే భవిష్యత్తు ఈఎమ్ఐలను క్రమం తప్పకుండా చెల్లించాలి. ఒక్కోసారి గడువులోపు రుణం చెల్లించనందువల్ల మీ క్రెడిట్స్కోర్ పై ప్రభావం పడుతుంది. అలాంటప్పుడు కొత్త రుణాలను తీసుకోకపోవడం మంచిది. ప్రస్తుత బాకీలను తీర్చడంపైనే దృష్టి కేంద్రీకరించాలి.
-
హలో సిరి, నేను సుమారుగా రూ. 22 లక్షల వరకు లార్జ్ కాప్, మిడ్ కాప్, టాక్స్ సేవర్, డెట్ ఫండ్స్ లో డిస్ట్రిబ్యూటర్ వెబ్సైటు ద్వారా మదుపు చేశాను. దీని వల్ల నాకు ఎంత నష్టం ఉంటుంది?
మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులుంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా ఆఫ్‌లైన్ పద్ధతి(లేదా వారి ఆన్లైన్ వెబ్సైటు ద్వారా అయినా)లో మ్యూచువల్ ఫండ్డ్ సలహాదారుని ద్వారా పెట్టుబడి చేయవచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో పంపిణీదారులు కొంత కమీషన్ తీసుకుంటారు. ఇది ఫండ్ ని బట్టి 1-2 శాతం వరకు ఉండొచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. మీరు మీ ఫండ్స్ ని డైరెక్ట్ ప్లన్స్ లోకి మార్చుకోవచ్చు. ముందుగా యూనిట్స్ అమ్మేసి, ఈ డైరెక్ట్ ప్లాన్ లో తిరిగి మదుపు చేయండి.
-
నమస్తే ఈనాడు, నేను ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాను. నా నెలసరి జీతం రూ. 21,000. నాకు సుమారుగా రూ. 4.50 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఇందులో స్నేహితుల వద్ద, వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు ఈఎంఐ లాంటివి ఉన్నాయి. ఇవి వీలైనంత త్వరలో తీర్చడానికి సలహా ఇవ్వండి.
నెలసరి జీతం లో ఈఎంఐ లు అన్ని కలిపి 30 శాతానికి మించకూడదు. అధిక రుణాల వల్ల ఇతర ఆర్ధిక లక్ష్యాల కోసం పొదుపు చేయడం కష్టతరం అవుతుంది. మీరు తీసుకున్న రుణాల్లో క్రెడిట్ కార్డు పై వడ్డీ అధికంగా ఉంటుంది. ముందుగా ఇది తీర్చడం ముఖ్యం. ఆ తరవాత చేతి రుణాల్లో అధిక వడ్డీ ఉంటే అలాంటి రుణాలని తీర్చాలి. బంగారం లేదా మీ వద్ద ఏదైనా డిపాజిట్ లు ఉన్నట్టయితే వాటి నుంచి ఈ రుణాలని తీర్చడం మంచిది. కుదరకపోతే మరి కాస్త వ్యక్తిగత రుణాన్ని తీసుకుని అధిక వడ్డీ ఉన్న రుణాలని తీర్చండి. మిగతా వాటికి ఈఎంఐ మీ జీతం నుంచి చెల్లించవచ్చు. మీ ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని మీ లక్ష్యాల కోసం పొదుపు చేస్తూ ఉండండి. అత్యవసరం అయితే తప్ప క్రెడిట్ కార్డు, వ్యక్తి గత రుణాల నుంచి దూరంగా ఉండడం మంచిది.
-
నమస్కారం. నా పేరు శివ, వయసు 35. హౌసింగ్ లోన్ 15 లక్షలు తీసుకుని ప్రతినెల 15000 బ్యాంకుకు చెల్లిస్తున్నాను. తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీజన్ ఆధారంగా మాదిరి సంపాదన, భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆర్థిక ప్రణాలికను సూచించగల ప్రార్థన.
ముందుగా మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. దీర్ఘకాలం పాటు, అంటే కనీసం 10 ఏళ్ళ పాటు సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్ సిరి, నేను ఈ క్రింది ఫండ్స్ లో ప్రతి నెలా ౩,౦౦౦ సిప్ చేస్తున్నాను. ఈ పోర్ట్ ఫోలియో లో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే సూచించగలరు. 1. ICICI Prudential Focused Bluechip Equity Fund - Growth 2. HDFC Mid-Cap Opportunities Fund - Regular Plan - Growth 3. DSP BlackRock Small/Micro Cap Fund - Regular Plan - Growth 4. Franklin India Smaller Companies Fund 5. Axis Long Term Equity Fund - Growth 6. Axis Multicap Fund 7. Aditya Birla Sun Life Frontline Equity Fund -Growth-Regular Plan 8. Aditya Birla Sun Life Tax Relief'96 Fund- Growth-Regular Plan 9. SBI Blue Chip Fund - Regular Plan - Growth 10. Aditya Birla Sun Life Pure Value Fund - Growth-Regular Plan 11. HDFC- Children gift fund
మీరు అధిక ఫండ్స్ లో మదుపు చేస్తున్నారు. దీని వల్ల ప్రత్యేకమైన లాభం ఉండదు. పైగా, వీటిని ట్రాక్ చేయడం కష్టతరం అవుతుంది. మీ సిప్ మొత్తం రెండు ఫండ్స్ లో మదుపు చేయడం మేలు. ఒక లార్జ్ కాప్, ఒక మిడ్ కాప్ ఎంచుకోవచ్చు. ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ ఎంచుకోవచ్చు. మార్కెట్ దిగువ లో ఉన్నప్పుడు కూడా కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ ఉండండి. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్ సిరి, నా పేరు క్రాంతి కుమార్. నేనొక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నేను 30 శాతం పన్ను స్లాబులో ఉన్నాను. పన్ను ఆదా చేసుకోవడానికి ఇంటి రుణం తీసుకోవడం మంచి ఆలోచనేనా?
అత్యధిక స్లాబులో ఉన్న వారు ఇంటి రుణం తీసుకుని అసలు పై సెక్షన్ 80C (గరిష్ట పరిమితి రూ. 1.50 లక్షలు), వడ్డీ పై సెక్షన్ 24 బి (ఏడాదికి రూ. 2 లక్షల వరకు ) ద్వారా పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, కేవలం పన్ను ఆదా చేసుకోడానికి ఇంటి రుణం తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. పైగా, మీకు వడ్డీ భారం ఉంటుంది. రుణాల ఈఎంఐ లు మొత్తం జీతం లో 30 శాతం దాటకుండా చూసుకోవాలి. మీకు ఇల్లు అవసరం ఉన్నట్టయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
-
నేను నవంబర్, 2021 లో పదవీ విరమణ తీసుకోబోతున్నాను. సుమారుగా రూ. 1 కోటి వరకు పొందే అవకాశం ఉంటుంది. అందులో రూ. 30 లక్షల వరకు ఇంటి రుణం తీర్చడానికి, రూ. 15 లక్షలు పీఎంవీవీవై, మరో రూ. 15 లక్షలు పెద్దల పొదుపు పధకం, రూ. 9 లక్షల వరకు పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్, రూ. 10 లక్షలు బ్యాంకు డిపాజిట్ లో మదుపు చేద్దామని ఆలోచన. మిగిలిన రూ. 20 లక్షలతో ఎలాంటి పథకాల్లో మదుపు చేయాలో సూచించండి. సురక్షితంగా ఉంటూ, ద్రవ్యోల్బణాన్ని మించే రాబడి అందించే పధకాలు సూచించండి.
మీరు ఎంచుకున్న పధకాలు మంచివే. అయితే, ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి పొందాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. 5-6 నెలల పాటు లేదా మీ వీలు ని బట్టి కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ ఉండడం మంచిది. కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేయగలిగితే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా, సగటు రాబడి 10 నుంచి 12 శాతం వరకు ఉంటె అవకాశం ఉంది. ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నా పేరు అంజిరెడ్డి. నేను పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు ఈయంఐ కట్టాల్సి వుంది. గత ఏడెనిమిది నెలల నుండి కడుతున్నాను. పర్సనల్ లోన్ మరో 8 నెలలు కట్టాలి. క్రెడిట్ కార్డు ఈయంఐ 24 నెలలు ఉంది. వీటిని ముందస్తుగా చెల్లించవచ్చా? ముందుగా చెల్లించడం వల్ల అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందా? మళ్లీ కావాలనుకున్నప్పుడు రుణం తీసుకునవచ్చా? దయచేసి తగిన సలహా ఇవ్వగలరు.
వ్యక్తిగత రుణం చెల్లించినప్పుడు బ్యాంకు ని బట్టి 2-5 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. దీని గురించి మీ బ్యాంకు తో మాట్లాడడం మేలు. అలాగే, క్రెడిట్ కార్డు కి కూడా కొంత వరకు చార్జీలు ఉండవచ్చు. క్రెడిట్ కార్డు పై అధిక వడ్డీ రేటు ఉంటుంది కాబట్టి కొంత చార్జీలు ఉన్నప్పటికీ ముందస్తుగా రుణం చెల్లించడం మేలు. క్రెడిట్ కార్డు పై 45 రోజుల వరకు బిల్లు చెల్లించే సమయం ఉంటుంది. ఈ లోపలే చెల్లించడం మేలు. కనీసం మొత్తం కడుతూ ఉండడం వల్ల 15 నుంచి 40 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. కొన్ని వస్తువులపై వడ్డీ లేని ఈఎంఐ అందిస్తుంటారు. ఇలాంటివి పరవాలేదు.
-
నమస్తే ఈనాడు, నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఐటీ రికృటర్ గా పని చేస్తున్నాను. నెలకు 45,000 జీతం. ఎలాంటి సేవింగ్స్ లేవు. సొంత ఇల్లు నా కల. కానీ గారెంటి లేని జాబ్ వల్ల రిస్క్ చేయలేకపోతున్నాను. అమ్మ, నాన్న, భార్య, ఒక కొడుకు నేనే ఆధారం. మంచి సలహా ఇవ్వగలరు.
పొదుపు లేకుండా మీరు నేరుగా రుణం తీసుకుని ఇల్లు కొనడం వల్ల సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. మీరు కొన్నేళ్ల పాటు పొదుపు చేసి మిగిలిన మొత్తం తో రుణం తీసుకోవడం మేలు. మీ ఆదాయం లో 30 శాతానికి మించి రుణాలు ఉండకుండా చూసుకోండి. 30-33 శాతం వరకు పొదుపు చేయండి, మిగిలిన మొత్తం తో ఖర్చులని నిర్వహించండి. స్వల్ప కాలం కోసం అయితే బ్యాంకు రికరింగ్ డిపాజిట్ లో నెల నెలా మదుపు చేయవచ్చు. దీర్ఘకాల లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్ మేలు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నమస్తే సర్, నేను రూ. 15,00,000 వరకు రుణం తెస్కోవలని అనుకుంటున్నాను. అయితే, ఏమైనా పధకం ద్వారా తీసుకుంటే మంచిదా? లేక వ్యక్తి గత రుణం తీసుకోవాలా(sbi, lic, చిట్ ఫండ్ లాంటివి), నా జీతం 35,000. ఇంకా 20 ఏళ్ళ సర్వీస్ ఉంది. దయచేసి నాకు సూచించగలరు.
వ్యక్తిగత రుణం లో వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా, 11 శాతం నుంచి 18 శాతం వరకు ఉండవచ్చు . అత్యవసరం అయితే తప్ప వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు రుణం తీసుకుపోవడం మంచిది. తక్కువ క్రెడిట్ స్కోరు ఉండి, ఎక్కువ మొత్తంలో రుణం అవసరం అనుకుంటే తిరిగి చెల్లించే వెసులుబాటు, స్వల్పకాలం నిమిత్తం రుణం తీసుకోవాలనుకుంటే బంగారు రుణం తీసుకోవడం మేలు. మంచి క్రెడిట్ స్కోరు కలిగి, స్థిరమైన ఆదాయం ఉండి, రుణ చెల్లించే కాలపరిమితి ఎక్కువ కావాలనుకుంటే వ్యక్తిగత రుణాలను తీసుకోవడం మంచిది. మీ వద్ద ఫిక్సిడ్ డిపాజిట్, బీమా పాలసీ, పీపీఎఫ్ లాంటి వాటిల్లో పెట్టుబడులు ఉన్నట్టయితే వాటి పై రుణం తీసుకోవచ్చు. వడ్డీ కాస్త తక్కువగా ఉంటుంది. వీలయితే రుణాల బదులుగా స్వల్ప కాలం పాటు పొదుపు చేయడం మేలు.
-
నేను ఒక రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని, పెన్షన్ వస్తోంది. నేను స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తుంటాను. దీనికి స్వల్ప కాల, దీర్ఘకాల మూలధన పన్ను ఎలా ఉంటుంది?
షేర్స్ కొనిగోలు చేసి 12 నెలల లోపు షేర్లను స్టాక్ మార్కెట్లో అమ్మినప్పుడు స్వల్పకాలిక మూలధన లాభం/నష్టంగా పరిగణిస్తారు. మీరు నిర్వహించే లావాదేవీల్లో స్వల్పకాలిక లాభం వచ్చిన సందర్భాల్లో లాభం పై పన్ను 15 శాతం చెల్లించాల్సి ఉంటుంది. షేర్స్ కొనిగోలు చేసి 12 నెలల తరవాత షేర్లను స్టాక్ మార్కెట్లో అమ్మినప్పుడు దీర్ఘకాలం మూలధన ఆదాయ పన్ను గా పరిగణిస్తారు. రూ. 1 లక్ష లాభం వరకు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ పైన మాత్రం 10 శాతం పన్ను ఉంటుంది.
-
ఏజెంట్ ద్వారా కాకుండా ఆన్లైన్ లో టర్మ్ పాలసీ తీసుకోవడం వలన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేక లాభం ఏమైనా ఉంటుందా?
సాధారణంగా, ఏజెంట్ ద్వారా బీమా పాలసీ తీసుకుంటే ఏజెంట్ కి కొంత వరకు కమిషన్ ఉంటుంది, కాబట్టి పాలసీ ప్రీమియం అధికంగా ఉంటుంది. దీని బదులు ఆన్లైన్ లో టర్మ్ పాలసీ తీసుకున్నట్లయితే నేరుగా కంపెనీ ద్వారా తీసుకుంటారు కాబట్టి ప్రీమియం తగ్గుతుంది. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మీకు ఇబ్బందులు ఉన్నట్టయితే నేరుగా కంపెనీ ని సంప్రదించవచ్చు.
-
హాయ్, నా పేరు మధు. నేను మాక్స్ లైఫ్ నుంచి టర్మ్ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటున్నాను. పాలసీబజార్ వెబ్సైటు లేదా మాక్స్ లైఫ్ వెబ్సైటు లో ఎక్కడ నుంచి తీసుకోవడం మేలు?
మీరు ఎంచుకున్న కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ చాలా బాగుంది. ఈ కంపెనీ కి సంబంధించిన పాలసీ ని మీరు మీ వీలు ప్రకారం . పాలసీబజార్ వెబ్సైటు లేదా మాక్స్ లైఫ్ వెబ్సైటు లో ఎక్కడ నుంచి తీసుకున్న పరవాలేదు. ముందుగా పాలసీ బజార్ వెబ్సైటు లో మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ కంపెనీ టర్మ్ పాలసీల ప్రీమియం పోల్చి చూసుకోండి. అలాగే, మాక్స్ లైఫ్ వెబ్సైటు లో కూడా మాక్స్ లైఫ్ టర్మ్ ప్లాన్ ప్రీమియం సరి చూసుకోండి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.
-
నమస్తే సర్, మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, సిప్ మధ్య తేడా వివరించగలరు? వీటిలో ఎందులో ఇన్వెష్ట్ చేస్తే మంచిది అని చెప్పగలరు.
ఈక్విటీ అంటే షేర్ మార్కెట్ లో మదుపు చేసేది అని అర్ధం. ఇందులో నేరుగా షేర్ ఎంచుకోవచ్చు లేదా కాస్త రిస్క్ తగ్గించుకుని మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా మార్కెట్ లో మదుపు చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ మీ వీలు ప్రకారం మదుపు చేయవచ్చు లేదా నెల నెలా క్రమంగా సిప్ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి ఫండ్ కి డబ్బులు చేరి మీకు యూనిట్స్ దక్కేలా కూడా చేయవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నమస్తే సర్, మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, సిప్ మధ్య తేడా వివరించగలరు? వీటిలో ఎందులో ఇన్వెష్ట్ చేస్తే మంచిది అని చెప్పగలరు.
ఈక్విటీ అంటే షేర్ మార్కెట్ లో పెట్టుబడులు. నేరుగా కంపెనీ షేర్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పరోక్షంగా కూడా మార్కెట్ లో పెట్టుబడి పెట్టె అవకాశం ఉంటుంది. షేర్స్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో పెట్టుబడికి సమయం , నైపుణ్యం ఎంతో అవసరం. నిపుణులను సలహా కోరి మాత్రమే షేర్స్ ఎంచుకోవడం మేలు. ప్రతి మ్యూచువల్ ఫండ్ కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. వారు ఎలాంటి షేర్స్ లో పెట్టుబడి పెట్టాలో నిర్ణయిస్తారు. మదుపరుల నుంచి డబ్బు ని సమకూర్చుకుని 100-200 షేర్స్ లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. కాబట్టి, రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. ఇందులో పెట్టుబడి పెట్టడానికి రెండు మార్గాలు - లంప్సమ్ అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టడం లేదా సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా నెల నెలా క్రమంగా పెట్టుబడి పెట్టవచ్చు. సిప్ లో మర్కెట్స్ తో సంబంధం లేకుండా పెడ్తుంటాం కాబట్టి రిస్క్ మరి కాస్త తగ్గుతుంది. కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేసే ఉద్దేశం ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు.
-
సర్, పీపీఎఫ్ ఖాతా 15 ఏళ్ళ కాల పరిమితి ముగిసాక దాన్ని కొనసాగించాలా లేక డబ్బు వెనక్కి తీసుకోవాలా? సలహా ఇవ్వగలరు.
పీపీఎఫ్ ఖాతా ద్వారా మంచి రాబడి తో పాటు సెక్ష 80C ద్వారా పన్ను ఆదా చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. దీన్ని 5 ఏళ్ళ చొప్పున కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ మీకు డబ్బు అవసరం లేకపోతే, ఖాతాని మరి 5 లేదా 10 ఏళ్ళ పాటు కొనసాగించవచ్చు. 60 ఏళ్ళు పైబడిన వారైతే పోస్ట్ ఆఫీస్ పెద్దల పొదుపు పధకం (SCSS) లో కూడా మదుపు చేయవచ్చు. దీని వడ్డీ పీపీఎఫ్ తో పోలిస్తే కొంత ఎక్కువగానే ఉంటుంది.
-
క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం ఎలా?
క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా గృహ, వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా బ్యాంకులు మన క్రెడిట్ స్కోర్‌నే ప్రామాణికంగా చూస్తాయి. క్రెడిట్ స్కోర్‌ను క్రెడిట్ సమాచార కంపెనీలు జారీ చేస్తాయి. వ్యక్తులకు రుణం ఇవ్వాలంటే రుణ సంస్థలు క్రెడిట్ బ్యూరోలను ఆశ్రయిస్తున్నాయి. బ్యాంకులు,బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు క్రెడిట్ బ్యూరోల వద్ద సభ్యత్వం పొంది వ్యక్తుల రుణ చరిత్రలను తెలుసుకుంటాయి. అలాగే వ్యక్తులు సైతం తమ రుణచరిత్ర నివేదికలను క్రెడిట్బ్యూరోల వద్ద పొందవచ్చు. ప్రస్తుతం దేశంలో వ్యక్తుల క్రెడిట్ స్కోర్లను అందించే సంస్థలు సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్, సీఆర్ఐఎఫ్ హైమార్క్. వీటిలో సిబిల్ ఎక్కువ ప్రాచుర్యం పొందింది.
-
హలో సర్, నేను 20 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్స్ లో నెల నెలా రూ. 1500 మదుపు చేయాలనుకుంటున్నాను. మంచి ఫండ్స్ సూచించండి.
దీర్ఘకాలం పాటు మదుపు చేయడం మంచి ఆలోచన. రిస్క్ తగ్గించుకుని మంచి రాబడి పొందాలనుకుంటే ఇండెక్స్ ఫండ్స్ లో మదుపు చేయడం మేలు. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
డియర్ సిరీ! నేను ప్రస్తుతం క్రింద పేర్కొన్న ఫండ్స్ లో ప్రతినెలా 8000/- (ఒక్కో ఫండ్ లో రూ.1000/- చొప్పున) SIP చేస్తున్నాను. 1. Axis midcap fund 2. DSP world gold fund 3. Edelweiss Greater china equity offshore fund 4. ICICI Pru US bluechip equity fund 5. IDFC G-Sec fund constant maturity plan 6. IDFC Nifty fund 7. Mirae Asset emerging blue chip fund 8. Nippon india nifty smallcap 250 index fund ఈ పోర్ట్ ఫోలియో లో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే సూచించగలరు.
మీరు వివిధ రకాల క్యాటగిరి లో ని 8 ఫండ్స్ లో మదుపు చేస్తున్నారు. అధిక ఫండ్స్ లో మదుపు చేయడం వల్ల ప్రత్యేకమైన లాభం ఉండదు. పైగా, వాటిని ట్రాక్ చేయడం కూడా కాస్త కష్టమైన విషయమే. మీరు IDFC Nifty ఫండ్, Axis మిడ్‌క్యాప్ ఫండ్ లో కొనసాగవచ్చు. ఈ ఫండ్స్ లో రూ. 4000 చొప్పున సిప్ చేయవచ్చు. కనీసం 10 ఏళ్ళ పాటు సిప్ చేస్తేనే రిస్క్ తగ్గి, మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నమస్తే సిరి. నా పేరు రవికుమార్. నాకు 3 సం.ల బాబు ఉన్నాడు. నాకు టర్మ్ ఇన్సూరెన్స్, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క వెయ్యి చొప్పున RD & PPF లో మదుపు చేస్తున్నాను.అలాగే axis Blue chip ఫండ్ లో కూడా మదుపు చేస్తున్నాను. బాబు భవిష్యత్ కోసం మంచి మ్యూచువల్ ఫండ్స్ సూచించండి. గ్రో యాప్ ద్వారా ఫండ్స్ లో మదుపు చేయడం మంచిదేనా?
స్వల్ప కాలం కోసం రికరింగ్ డిపాజిట్ మంచి ఆలోచనే. అలాగే, కొంత మొత్తాన్ని పీపీఎఫ్ లాంటి సురక్షితమైన పథకాల్లో మదుపు చేయవచ్చు. మీరు దీర్ఘకాలం, అంటే కనీసం 10 ఏళ్ళ పాటు యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. గ్రో యాప్ ద్వారా డైరెక్ట్ ప్లాన్ లో మదుపు చేయవచ్చు. మీ డబ్బు నేరుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీ వద్ద చేరుతుంది కాబట్టి ఇది సురక్షితమే.
-
నేను రూ. 1 కోటి బీమా హామీ తో టాటా ఏఐఏ, హెచ్డీఎఫ్సి నుంచి 2019 లో టర్మ్ పాలసీ తీసుకున్నాను. అప్పట్లో హెచ్డీఎఫ్సీ వారు నన్ను మెడికల్ రిపోర్ట్ కోరలేదు. క్లెయిమ్ సమయం లో ఇబ్బందులు రాకుండా ఇప్పుడు నేను లేటెస్ట్ రిపోర్ట్ రెండు కంపెనీస్ కి ఇచ్చే అవకాశం ఉందా?
సాధారణంగా, కొన్ని కంపెనీ ను మాత్రమే ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడానికి టెస్ట్ లు నిర్వహిస్తాయి. మిగతావన్నీ మీరు పాలసీ లో తెలిపిన వివరాలను బట్టి డాక్యుమెంట్ తయారు చేస్తాయి. కాబట్టి, పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఈ కంపెనీ లను సంప్రదించి వారికి మీ రిపోర్ట్స్ అందించవచ్చు. పాలసీ డాక్యుమెంట్ లోని వివరాల్లో ఏమైనా మారుపులు ఉన్న కూడా మీరు వారికి తెలుపవచ్చు.
-
నా వద్ద జీవన్ సరళ్ పాలసీ ఉంది, 2010 నుంచి రూ. 30,025 ప్రీమియం చెల్లించాను. సరెండర్ చేస్తే ఎంత వస్తుంది?
మీరు చెల్లించిన ప్రీమియం వార్షిక ప్రీమియం ఆ లేక పూర్తి ప్రీమియం ఆ అనేది తెలుపలేదు. సాధారణంగా, ఈ పాలసీ సరెండర్ చేసినట్టయితే గారంటీడ్ సరెండర్ వేల్యూ ప్రకారం మీరు చెల్లించిన ప్రీమియం లో (మొదటి ఏడాది ప్రీమియం మినహాయించి) 30 శాతం వరకు వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, స్పెషల్ సరెండర్ వేల్యూ ప్రకారం 5 ఏళ్ళ పైన ప్రీమియం చెల్లించినట్టైతే మీ పాలసీ లో తెలిపిన మెచ్యూరిటీ సమ్ ఎషూర్డ్ లో 100 శాతం వరకు వెనక్కి పొందొచ్చు. మరిన్ని వివరాల కోసం మీరు మీ పాలసీ లో తెలిపిన ఎల్ఐసి ఆఫీసు బ్రాంచీ ని సంప్రదించడం మంచిది. మీరు ఈ పాలసీ సరెండర్ చేయడం మంచి నిర్ణయమే. అయితే, పాలసీ మెచ్యూరిటీ కాల పరిమితి దగ్గర పడినట్టయితే (1-3 ఏళ్ళ లోపు ఉన్నట్టయితే) వేచి చూడవచ్చు. ఇలాంటి పాలసీల లో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువగానే ఉంటాయి. బీమా హామీ కోసం ఒక మంచి ఆన్లైన్ టర్మ్ పాలసీ ఎంచుకోవడం మేలు. పెట్టుబడి కోసం మీ అవసరాన్ని బట్టి పధకం ఎంచుకోవచ్చు.
-
నా దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయి. మా పాప పెళ్లి కి ఇంకా 5 ఏళ్ళ సమయం ఉంది. నా డబ్బు కి రిస్క్ లేకుండ మంచి రాబడి వచ్చే పథకాలు ఏమైనా చెప్పండి.
మీకు 5 ఏళ్ళ సమయం ఉందన్నారు కాబట్టి రిస్క్ లేని పథకాల్లో మదుపు చేయడమే మేలు. దీని కోసం మీరు బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ ఎంచుకోవచ్చు. మీ పెట్టుబడి కి సెక్షన్ 80C ద్వారా (సెక్షన్ పూర్తి మినహాయింపు రూ. 1.50 లక్షలు) పన్ను మినహాయింపులు కూడా పొందొచ్చు. ప్రభుత్వం రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ల పై బీమా కూడా అందిస్తుంది, కాబట్టి మీరు ప్రైవేట్ బ్యాంకులన్ని కూడా ఎంచుకోవచ్చు. ఆర్బీఎల్, యెస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ లాంటి బ్యాంకులను పరిశీలించండి. వీటి వడ్డీ రేటు కాస్త అధికంగా ఉంటాయి.
-
నేను బ్యాంకు నుంచి ఇంటి రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు మా భార్య పేరు మీద ఉంది. ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి. ఈ రుణానికి తాను అప్లికెంట్ , నేను కో అప్లికెంట్‌గా ఉన్నాము. ఇద్దరమూ కలిసి ఈఎంఐ కడుతున్నాము కాబట్టి ఇంటి రుణం మీద పన్ను మినహాయింపు ఇద్దరూ పొందొచ్చా?
మీ ఇద్దరూ కలిసి ఈఎంఐ చెల్లిస్తున్నప్పటికీ మీరు జాయింట్ ఓనర్ కానందున పన్ను మినహాయింపు పొందే వీలుండదు. ఇంటిని మీ పేరు మీద మార్చడం ద్వారా పన్ను మినహాయింపులు పొందొచ్చు. దీనికి మీరు గిఫ్ట్ డీడ్ పధ్ధతిని వాడటం మంచిది. ఈ పధ్ధతి ద్వారా ఇంటి బదిలీ పన్నులు ఉండవు. వివరాల కోసం మీరు న్యాయవాదిని లేదా ఛార్టర్డ్ అకౌంటెంట్ లాంటి పన్ను నిపుణులని సంప్రదించడం మంచిది.
-
సర్, నేను రూ . 1.50 కోటి బీమా హామీ తో టర్మ్ పాలసీ తీసుకున్నాను. 40 ఏళ్ళ పాలసీ, ప్రీమియం రూ. 24,650. దీని బదులు ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. 10 ఏళ్లలో ఏడాదికి రూ. 54,600 కడితే చాలంటున్నారు. సలహా ఇవ్వండి.
టర్మ్ పాలసీ లో ప్రీమియం వెనక్కి ఆశించకూడదు. ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీలలో ప్రీమియం అధికంగా ఉంటుందని గమనించండి. మీరు తెలిపిన పాలసీ లో 10 ఏళ్లలో సుమారుగా రూ. 5,46,000 వరకు ప్రీమియం చెల్లించాలి. అయితే, ద్రవ్యోల్బణాన్ని దృష్టి లో పెట్టుకుని 40 ఏళ్ళకి ఈ మొత్తం సుమారుగా రూ. 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. మీరు ఎంచుకున్న పాలసీ కంపెనీ పేరు తెలుపలేదు. ప్రీమియం ని పాలసీ బజార్ లేక కవర్ ఫాక్స్ లో పరిశీలించారని భావిస్తున్నాము. మాక్స్ లైఫ్, ఐసీఐసీఐ పాలసీల క్లెయిమ్ సెటిల్మెంట్ బాగుంటుంది.
-
నా పేరు ప్రదీప్, నిజామాబాదు వాసిని. నేను మే 2017 నుంచి కోటక్ స్టాండర్డ్ మల్టీ కాప్, ఎల్ అండ్ టీ మిడ్ కాప్ ఫండ్ లో రూ. 3000 చొప్పున సిప్ చేస్తున్నాను. గత 6 నెలలుగా ఎల్ & టీ మిడ్ కాప్ ఫండ్ రాబడి తగ్గుతూ ఉంది. ఇందులో కొనసాగాలా లేదా మారమంటారా?
మీరు పేర్కొన్న ఫండ్లలో ఒకటి మల్టీ కాప్, ఒకటి మిడ్ కాప్ ఫండ్. ఈ రెండు ఫండ్ల పని తీరు బాగుంది, కానీ ఇవి రిస్క్ తో కూడుకున్నవి. మిడ్ కాప్ ఫండ్ లో రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మార్కెట్ లో ఒడిదుడుకులు ఉన్నపుడు ఫండ్ నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీరు రిస్క్ తీసుకోగలిగితే ఈ రెండూ ఫండ్లలో కనీసం 10 ఏళ్ళు మదుపు చేయండి. లేదంటే ఒక ఐసీఐసీఐ పృ బ్లూచిప్ లాంటి ఒక లార్జ్ కాప్ ఫండ్ ని ఎంచుకోవచ్చు.
-
నా పేరు ప్రదీప్, నిజామాబాదు నివాసిని.నా నెలసరి జీతం రూ. 40 వేలు. గత నెలలో నేను రూ. 1.5 కోటి బీమా హామీ గల ఐసీఐసీఐ టర్మ్ పాలసీ తీసుకున్నాను,ప్రీమియం రూ. 24,064. ఇది మంచిదేనా?
మీరు ఎంచుకున్న కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ ఉత్తమమైన 3 కంపెనీల్లో ఒకటి. మీ వివరాలన్నీ సరిగ్గా ఇచ్చారని భావిస్తున్నాము. ఇలా చేయడం వాళ్ళ క్లెయిమ్ సమయం లో మీ కుటుంబానికి ఎటువంటి సమస్యలు ఉండవు. మీరు తీసుకున్న బీమా హామీ కూడా సరిపోతుంది. అలాగే ఆరోగ్య బీమా కోసం కూడా ఒక మంచి ఫ్లోటర్ పాలసీ తీసుకోండి. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్, సిగ్న టీటీకే వంటి కంపెనీల పాలసీలను పరిశీలించండి.
-
నా పేరు ప్రదీప్, హైదరాబాద్ నివాసిని. ప్రస్తుతం నేను మ్యూచువల్ ఫండ్లలో రూ. 6000 సిప్ ద్వారా మదుపు చేస్తున్నాను(రూ. 3000 కోటక్ మహీంద్రా లో, రూ. 3000 ఎల్ అండ్ టీ లో) 20 ఏళ్ళు చేద్దామనుకుంటున్నాను. చివరికి ఎంత లభిస్తుంది? సలహా ఇవ్వండి.
మ్యూచువల్ ఫండ్లలో ఎంత లభిస్తుందో ఖచ్చితంగా చెప్పలేము. కేవలం గత సంవత్సరాల రాబడి బట్టి ఒక అంచనా కి రావచ్చు. మీరు మదుపు చేసిన పధకాల పని తీరు సరి చూసుకోండి. వాటిని ప్రతి సంవత్సరం గమనిస్తూ ఉండండి. 20 ఏళ్ళ పాటు నెల నెలా రూ. 6000 సిప్ చేస్తే 12 శాతం రాబడి ప్రకారం సుమారుగా రూ. 60 లక్షలు సమకూర్చుకోవచ్చు. దీర్ఘకాలం పాటు మదుపు చేయాలనే మీ ఆలోచన సరైనదే.
-
సర్, క్రెడిట్ కార్డు తో బంగారం కొనుగోలు చేయవచ్చా? ఏదైనా చార్జీలు ఉంటాయా?
క్రెడిట్ కార్డు తో బంగారం లేదా ఏదైనా కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా, క్రెడిట్ కార్డు వాడకం పై చార్జీలు ఉండవు. మీరు ఒకసారి దుకానుదారుడితో ఈ విషయాన్ని తెలుసుకోవడం మంచిది. సకాలం లో బిల్లు ని చెల్లిస్తూ ఉండండి.
-
మ్యూచువల్ ఫండ్లలో 2000 చొప్పున 10 ఏళ్ళ చేస్తే ఎంత మొత్తం వస్తుంది ?
మ్యూచువల్ ఫండ్లలో ఎంత రాబడి వస్తుందో ముందే కచ్చితంగా చెప్పలేము. ఇది ఫండ్ వ్యూహం, ఫండ్ మేనేజర్ పని తీరు, మార్కెట్ స్థితిగతులు లాంటి వాటి పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ఒక ఇండెక్స్ ఫండ్ ఎంచుకుంటే సగటున 12 శాతం చొప్పున రాబడి ఆశించవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నా వద్ద రూ. 5 లక్షలు ఉన్నాయి. ఇందులో నుంచి నెలసరి వడ్డీ కావాలంటే ఎందులో మదుపు చేయాలి?
మీరు ఈ మొత్తాన్ని బ్యాంకు లో ఫిక్సిడ్ డిపాజిట్ చేయవచ్చు. కాల పరిమితి, వడ్డీ మొత్తాన్ని ఎంచుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో నెలసరి ఆదాయ పధకం కూడా ఎంచుకోవచ్చు.
-
సర్, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగి. నేను రూ 15 లక్షల విలువ గల స్థలంపై లోన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఏ బ్యాంకు మంచి వడ్డీని ఇస్తోంది. నెలకు రూ 25 వేలు చెల్లిస్తే ఎన్ని ఏళ్లలో రుణం తీరుతుంది?
స్థలంపై రుణం ఇవ్వటానికి మార్కెట్ విలువ కన్నా , స్థానిక ప్రభుత్వ రికార్డ్ ల ప్రకారం ధరను నిర్ణయిస్తాయి . ఈ విలువలో 75 శాతం మేరకు రుణం లభించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వడ్డీ రేట్లు 11-12 శాతం గా ఉంటాయి. రూ 12 లక్షల రుణంపై 12 శాతం వడ్డీ పరిగణించి, నెలకు రూ 25 వేలు చెల్లించ గలిగితే 66 నెలలు (అంటే ఐదున్నర ఏళ్ళు) పడుతుంది. అదే రూ. 15 లక్షల రుణం పొందితే, రూ. 25000 నెలసరి ఈఎంఐ చొప్పున 7 ఏళ్ళ 8 నెలలు పడుతుంది.
-
డియర్ సిరి, నేను ప్రభుత్వ ఉద్యోగిని. నా స్థూల ఆదాయం రూ. 36,928, నికర ఆదాయం రూ. 31,660. సీపీఎస్‌కి రూ.3288, టీఎస్జీఎల్ఐ కింద రూ.1000, పీటీ కి రూ.200, జీఐఎస్ కి రూ. 30 డిడక్ట్ అవుతున్నాయి. పీఎల్ఐ కి రూ.1000. ఎల్ఐసీకి రూ.4,600 చెల్లిస్తున్నాను. ఒక సంవత్సరం వయసు ఉన్న నా పాప కోసం రూ.1000 సుకన్య సమృద్ది యోజనలో డిపాజిట్ చేయాలనుకుంటున్నాను. నేను వడ్డీలేకుండా తీసుకున్న రుణం రూ.5.50 లక్షలు ఉంది. వ్యక్తిగత రుణం తీసుకుని నా మొత్తం రుణాలను చెల్లించాలనుకుంటున్నాను. నేను నా రుణాలను తీర్చి ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలు చేసేందుకు ఏమి చేయాలి?
ప్రారంభ రోజుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కాపౌండ్ వడ్డీని పొందవచ్చు. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా టర్మ్ పాలసీని తీసుకోండి. మీకు 60 సంవత్సరాలు వచ్చే వరకు పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. దానికి సంబంధించిన వివిధ బీమా రైడర్లను తీసుకోండి. వ్యక్తిగత రుణాలు, బయటి రుణాలలో వడ్డీ రేట్లు 13 నుంచి 16 శాతం ఉంటాయి. అందువల్ల వాటికి దూరంగా ఉండడమే మంచిది. మీ ఖర్చులను తగ్గించుకుని నెలవారీ ఆదాయం నుంచి దఫదఫాలుగా హ్యండ్లోను చెల్లించండి. ప్లాటుకు బదులుగా ఇంటిని కొనుగోలు చేయడం మంచిది. గృహ రుణాలు దీర్ఘకాలిక పెట్టుబడులు, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24బీ కింద వడ్డీని క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ డిపార్టుమెంటు నుంచి గృహ రుణం తీసుకోండి. హ్యాండ్లోను చెల్లించిన తరువాత సుకన్య సమృద్ధి యోజనకు ఎక్కువ మొత్తాన్ని కేటాయించండి.
-
నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
హెచ్డీఎఫ్సీ ప్రో గ్రోత్ ప్లస్ మదుపు, బీమా హామీ కలిపి ఇచ్చే ఒక యూలిప్ పాలసీ. ఇతర యూలిప్ పాలసీల వలే ఇందులో కూడా మోర్టాలిటీ, ఫండ్ మానేజ్మెంట్, రిస్క్ బెనిఫిట్ లాంటి ఎన్నో చార్జీలు విధిస్తారు. వీటి వల్ల మదుపు చేస్తే మొత్తం తగ్గిపోతుంది, కాబట్టి రాబడి కూడా తగ్గిపోతుంది. మీరు పాలసీని వెనక్కి ఇస్తే వచ్చే మొత్తం గురించి ఆరా తీసి కుదిరితే పాలసీ ని వెనక్కి ఇచ్చేయండి. ఇలా మిగిలిన డబ్బుని నెల నెలా సిప్ చేయండి. అలాగే మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 12 రెట్లు బీమా హామీ ఉండే టర్మ్ పాలసీ ని ఎంచుకోండి.
-
నా పేరు ప్రదీప్, హైదరాబాద్ నివాసిని. ప్రస్తుతం నేను మ్యూచువల్ ఫండ్లలో రూ. 6000 సిప్ ద్వారా మదుపు చేస్తున్నాను(రూ. 3000 కోటక్ మహీంద్రా లో, రూ. 3000 ఎల్ అండ్ టీ లో) 20 ఏళ్ళు చేద్దామనుకుంటున్నాను. చివరికి ఎంత లభిస్తుంది? సలహా ఇవ్వండి.
మ్యూచువల్ ఫండ్లలో ఎంత లభిస్తుందో ఖచ్చితంగా చెప్పలేము. కేవలం గత సంవత్సరాల రాబడి బట్టి ఒక అంచనా కి రావచ్చు. మీరు మదుపు చేసిన పధకాల పని తీరు సరి చూసుకోండి. వాటిని ప్రతి సంవత్సరం గమనిస్తూ ఉండండి. 20 ఏళ్ళ పాటు నెల నెలా రూ. 6000 సిప్ చేస్తే 12 శాతం రాబడి ప్రకారం సుమారుగా రూ. 60 లక్షలు సమకూర్చుకోవచ్చు. దీర్ఘకాలం పాటు మదుపు చేయాలనే మీ ఆలోచన సరైనదే.
-
సర్, క్రెడిట్ కార్డు తో బంగారం కొనుగోలు చేయవచ్చా? ఏదైనా చార్జీలు ఉంటాయా?
క్రెడిట్ కార్డు తో బంగారం లేదా ఏదైనా కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా, క్రెడిట్ కార్డు వాడకం పై చార్జీలు ఉండవు. మీరు ఒకసారి దుకానుదారుడితో ఈ విషయాన్ని తెలుసుకోవడం మంచిది. సకాలం లో బిల్లు ని చెల్లిస్తూ ఉండండి.
-
మ్యూచువల్ ఫండ్లలో 2000 చొప్పున 10 ఏళ్ళ చేస్తే ఎంత మొత్తం వస్తుంది ?
మ్యూచువల్ ఫండ్లలో ఎంత రాబడి వస్తుందో ముందే కచ్చితంగా చెప్పలేము. ఇది ఫండ్ వ్యూహం, ఫండ్ మేనేజర్ పని తీరు, మార్కెట్ స్థితిగతులు లాంటి వాటి పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ఒక ఇండెక్స్ ఫండ్ ఎంచుకుంటే సగటున 12 శాతం చొప్పున రాబడి ఆశించవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
ప్రస్తుతం బ్యాంక్ లో పొదుపు ఖాతాలో ఎంత వరకూ డబ్బు ఉంచవచ్చు. రూ. 5 లక్షల పైన ఉంటే ఆదాయపు పన్ను చెల్లించాలా?
బ్యాంకు ఖాతా కలిగిన వారు తమ ఖాతాలో ఎంత డబ్బునైనా పొదుపు చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను విషయం చూస్తే దాని ద్వారా వచ్చే రాబడిపై రూ. 10వేల వరకూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.10 వేలు పై బడి వచ్చిన రాబడికి పన్నుచెల్లించాలి. కొత్త గా బడ్జెట్ 2018 లో వచ్చిన మినహాయింపుల ప్రకారం సీనియర్ సిటిజన్లకు మాత్రం వడ్డీ గా లభించే ఆదాయం రూ.50 వేల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. రూ.50 వేల పైన వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించాలి. డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ ప్రకారం ప్రస్తుతం బ్యాంకుల్లో ఉన్న మొత్తం రూ. 1లక్ష వరకూ భద్రత ఉంటుంది. ప్రస్తుతం దాని స్థానంలో ఎఫ్ఆర్డీఐ బిల్లు వస్తే భద్రత ఉండదని ప్రచారంలో ఉంది. అయితే ఇది ఇంకా ఆమోదం పొందే వరకూ రాలేదు. ఇంకా బిల్లు డ్రాప్ట్ స్థాయిలో ఉంది. బిల్లు రూపొందాక సవరణలు జరిగాక ఆమోదం పొందితే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. అయితే ఆ బిల్లులో ఎంత మొత్తానికి భద్రత ఉంటుందనేది ఇంకా తెలియాలి. కాబట్టి బ్యాంకులో డబ్బు దాచుకునే విషయంలో ఆందోళన వద్దు.
-
ఎస్బిఐ లో రుణం తీసుకున్నాను. ఎం సి ఎల్ ఆర్ నుంచి రేపో రేట్ లోకి మారాలనుకుంటే రూ.5,800 లు ఫీ చెల్లించాలంటున్నారు . ఎందుకు?
రేపో రేట్ లోకి మారేటప్పుడు బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీ , స్టాంప్ డ్యూటీ కింద కొంత సొమ్ము వసూలు చేస్తాయి. ఎం సి ఎల్ ఆర్ కి , రేపో రేట్ కి వడ్డీ రేట్ లో ఎంత తేడా ఉందొ చూసుకోండి.
-
హాయ్ డియర్ సిరి, నా పేరు శివ ప్రసాద్ చౌదరి చింతా. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, నా పొదుపు ఖాతాను శాలరీ ఖాతాగా ఎలా మార్చుకోవాలి?
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ ఖాతాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిర్వహిస్తారు. మీకు ఎస్బీఐలో పొదుపు ఖాతా ఉంటే, మీ సంస్థలో జీతాలు పంపిణీ చేసే అధికారి వద్ద నుంచి మీ ఎంప్లాయి నెంబరు, బ్రాంచి, బ్యాంకు ఖాతా నెంబరు తదితర వివరాలతో, ఒక లేఖను తీసుకు రావాలి. ఈ లేఖను మీ హోమ్ బ్రాంచిలో సబ్మిట్ చేస్తే, మీ పొదుపు ఖాతాను శాలరీ ఖాతాగా మారుస్తారు. మీకు ఎస్బీఐలో కాకుండా వేరొక బ్యాంకులో ఖాతా ఉంటే అన్ని వివరాలలో మీకు జీతాలు పంపిణీ చేసే అధికారిని సంప్రదించవచ్చు.
-
హాయ్ సిరి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా పోస్ట్ ఆఫీస్ లో డిజిటల్ పొదుపు ఖాతా తెరిచి ఉపయోగించవచ్చా?
18 ఏళ్ళు నిండి, పాన్ (PAN), ఆధార్ కలిగి ఉన్న వారు డిజిటల్ పొదుపు ఖాతా ని తెరవవచ్చు. ఖాతా తెరచిన 12 నెలల లోపు కెవైసి వివరాలను పూర్తి చేయాలి . గరిష్టంగా రూ 2 లక్షల వరకు జమ చేయవచ్చు. కెవైసి పూర్తయిన తరువాత పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాతో లింక్ చేయవచ్చు.
-
సర్, నాకు పీఎంఏవై పధకం కింద రూ. 10 లక్షల రుణానికి రూ. 2 లక్షల వరకు సబ్సిడీ వచ్చింది. ఇది సరైనదేనా?
ఈ పధకం కింద వ్యక్తి వార్షిక ఆదాయం, ఇంటి చదరపు అడుగులు లాంటి వాటిని బట్టి సబ్సిడీ నిర్ణయిస్తారు. ఈ కింది కథనాలు చదివి వివరంగా తెలుసుకోవచ్చు: http://eenadusiri.net/PMAY-home-loans-subsidy-scheme-AAP6lVt http://eenadusiri.net/how-to-get-subsidy-under-PMAY-JkfYf38
-
సర్, నేను రూ . 1.50 కోటి బీమా హామీ తో టర్మ్ పాలసీ తీసుకున్నాను. 40 ఏళ్ళ పాలసీ, ప్రీమియం రూ. 24,650. దీని బదులు ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. 10 ఏళ్లలో ఏడాదికి రూ. 54,600 కడితే చాలంటున్నారు. సలహా ఇవ్వండి.
టర్మ్ పాలసీ లో ప్రీమియం వెనక్కి ఆశించకూడదు. ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీలలో ప్రీమియం అధికంగా ఉంటుందని గమనించండి. మీరు తెలిపిన పాలసీ లో 10 ఏళ్లలో సుమారుగా రూ. 5,46,000 వరకు ప్రీమియం చెల్లించాలి. అయితే, ద్రవ్యోల్బణాన్ని దృష్టి లో పెట్టుకుని 40 ఏళ్ళకి ఈ మొత్తం సుమారుగా రూ. 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. మీరు ఎంచుకున్న పాలసీ కంపెనీ పేరు తెలుపలేదు. ప్రీమియం ని పాలసీ బజార్ లేక కవర్ ఫాక్స్ లో పరిశీలించారని భావిస్తున్నాము. మాక్స్ లైఫ్, ఐసీఐసీఐ పాలసీల క్లెయిమ్ సెటిల్మెంట్ బాగుంటుంది.
-
నా పేరు ప్రదీప్, నిజామాబాదు వాసిని. నేను మే 2017 నుంచి కోటక్ స్టాండర్డ్ మల్టీ కాప్, ఎల్ అండ్ టీ మిడ్ కాప్ ఫండ్ లో రూ. 3000 చొప్పున సిప్ చేస్తున్నాను. గత 6 నెలలుగా ఎల్ & టీ మిడ్ కాప్ ఫండ్ రాబడి తగ్గుతూ ఉంది. ఇందులో కొనసాగాలా లేదా మారమంటారా?
మీరు పేర్కొన్న ఫండ్లలో ఒకటి మల్టీ కాప్, ఒకటి మిడ్ కాప్ ఫండ్. ఈ రెండు ఫండ్ల పని తీరు బాగుంది, కానీ ఇవి రిస్క్ తో కూడుకున్నవి. మిడ్ కాప్ ఫండ్ లో రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మార్కెట్ లో ఒడిదుడుకులు ఉన్నపుడు ఫండ్ నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీరు రిస్క్ తీసుకోగలిగితే ఈ రెండూ ఫండ్లలో కనీసం 10 ఏళ్ళు మదుపు చేయండి. లేదంటే ఒక ఐసీఐసీఐ పృ బ్లూచిప్ లాంటి ఒక లార్జ్ కాప్ ఫండ్ ని ఎంచుకోవచ్చు.
-
నా పేరు ప్రదీప్, నిజామాబాదు నివాసిని.నా నెలసరి జీతం రూ. 40 వేలు. గత నెలలో నేను రూ. 1.5 కోటి బీమా హామీ గల ఐసీఐసీఐ టర్మ్ పాలసీ తీసుకున్నాను,ప్రీమియం రూ. 24,064. ఇది మంచిదేనా?
మీరు ఎంచుకున్న కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ ఉత్తమమైన 3 కంపెనీల్లో ఒకటి. మీ వివరాలన్నీ సరిగ్గా ఇచ్చారని భావిస్తున్నాము. ఇలా చేయడం వాళ్ళ క్లెయిమ్ సమయం లో మీ కుటుంబానికి ఎటువంటి సమస్యలు ఉండవు. మీరు తీసుకున్న బీమా హామీ కూడా సరిపోతుంది. అలాగే ఆరోగ్య బీమా కోసం కూడా ఒక మంచి ఫ్లోటర్ పాలసీ తీసుకోండి. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్, సిగ్న టీటీకే వంటి కంపెనీల పాలసీలను పరిశీలించండి.
-
నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
హెచ్డీఎఫ్సీ ప్రో గ్రోత్ ప్లస్ మదుపు, బీమా హామీ కలిపి ఇచ్చే ఒక యూలిప్ పాలసీ. ఇతర యూలిప్ పాలసీల వలే ఇందులో కూడా మోర్టాలిటీ, ఫండ్ మానేజ్మెంట్, రిస్క్ బెనిఫిట్ లాంటి ఎన్నో చార్జీలు విధిస్తారు. వీటి వల్ల మదుపు చేస్తే మొత్తం తగ్గిపోతుంది, కాబట్టి రాబడి కూడా తగ్గిపోతుంది. మీరు పాలసీని వెనక్కి ఇస్తే వచ్చే మొత్తం గురించి ఆరా తీసి కుదిరితే పాలసీ ని వెనక్కి ఇచ్చేయండి. ఇలా మిగిలిన డబ్బుని నెల నెలా సిప్ చేయండి. అలాగే మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 12 రెట్లు బీమా హామీ ఉండే టర్మ్ పాలసీ ని ఎంచుకోండి.
-
హాయ్, నా పేరు అమర్, నాకు హైదరాబాద్‌లో ఒకటి, బెంగుళూరులో మరొకటి, మొత్తానికి రెండు ఇళ్ళు ఉన్నయి. మేము ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నాము. బడ్జెట్ 2019-20 ప్రకారం పన్ను మినహాయింపు కోసం రెండు గృహరుణాల వడ్డీని చూపించవచ్చా? ఒకవేళ అవును అయితే ఏ సెక్షన్ కింద, ఏవిధంగా రెండవ ఇంటిని చూపించాలి. నేను హైదరాబాద్‌లో ఉన్న ఇంటికి ( 8.25 శాతం వడ్డీ రేటు చొప్పున) దాదాపు రూ.1 లక్ష, బెంగుళూరులో ఉన్న ఇంటికి( 9.25 శాతం వడ్డీ రేటు చొప్పున) దాదాపు 2.2 లక్షలు వడ్డీ చెల్లిస్తున్నాను, హైదరాబాద్‌లో ఉన్న ఇంటిపై టాప్అప్లోన్ తీసుకుని, బెంగుళూరులో ఉన్న ఇంటిపై రుణం చెల్లించడం మంచిదేనా? తెలుపగలరు.
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24బీ ప్రకారం రెండు గృహ రుణాల వడ్డీపై మినహాయింపు పరిధి రూ. 2 లక్షలు. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్ లో బెంగుళూరు ఇంటిని అద్దెకు ఇచ్చి (నోషనల్ రెంట్ నెలకు రూ. 15 వేలు చూపించవచ్చు), హైదరాబాద్ ఇంటిలో మీరు ఉంటున్నట్లు చూపిస్తే, సెక్షన్ 24బీ ప్రకారం దాదాపుగా రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఇటివల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థిక మంత్రి రెండవ ఇంటిపై వచ్చే నోషనల్ రెంట్(అద్దె అంచనా) ఆదాయంపై పన్ను మినహాయింపును ప్రతిపాదించారు. అంటే, వచ్చే ఏడాది నుంచి మీకు రెండు ఇళ్ళు ఉంటే, ఇప్పటి లాగా కాకుండా రెండిళ్ళ లోను నివసిస్తున్నట్టుగా చూపించవచ్చు. సెక్షన్ 24b ప్రకారం పన్ను మినహాయింపు లో మార్పు లేదు. టాప్అప్ లోను తీసుకోవడం మంచిదికాదు. ప్రస్తుతం ఉన్న రుణంపై టాప్లోను తీసుకుంటే, ప్రస్తుతం మీరు చెల్లించే వడ్డీరేటుకు 1-1.50 శాతం అధిక వడ్డీ రేటును విధిస్తారు. వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్ ఫీజు అదనంగా ఉంటుంది. అలాగే, మీరు తక్కువ వడ్డీ రేట్లతో గృహ రుణాన్ని అందిస్తున్న వేరే బ్యాంకుకు గృహ రుణాన్ని బదిలీ చేసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజులను పరిగణలోనికి తీసుకోవాలి.
-
నా పేరు ప్రదీప్, హైదరాబాద్ నివాసిని. ప్రస్తుతం నేను మ్యూచువల్ ఫండ్లలో రూ. 6000 సిప్ ద్వారా మదుపు చేస్తున్నాను(రూ. 3000 కోటక్ మహీంద్రా లో, రూ. 3000 ఎల్ అండ్ టీ లో) 20 ఏళ్ళు చేద్దామనుకుంటున్నాను. చివరికి ఎంత లభిస్తుంది? సలహా ఇవ్వండి.
మ్యూచువల్ ఫండ్లలో ఎంత లభిస్తుందో ఖచ్చితంగా చెప్పలేము. కేవలం గత సంవత్సరాల రాబడి బట్టి ఒక అంచనా కి రావచ్చు. మీరు మదుపు చేసిన పధకాల పని తీరు సరి చూసుకోండి. వాటిని ప్రతి సంవత్సరం గమనిస్తూ ఉండండి. 20 ఏళ్ళ పాటు నెల నెలా రూ. 6000 సిప్ చేస్తే 12 శాతం రాబడి ప్రకారం సుమారుగా రూ. 60 లక్షలు సమకూర్చుకోవచ్చు. దీర్ఘకాలం పాటు మదుపు చేయాలనే మీ ఆలోచన సరైనదే.
-
హాయ్ సర్ నాపేరు అజయ్. మా నాన్నగారు, నేను పోలిస్ శాఖలో పని చేస్తున్నాము. మా నాన్న గారు ఈ మధ్య సొంత ఇల్లు కొన్నారు. దాని విలువ రూ.62 లక్షలు. మేము ఎల్ఐసీ హోం లోన్ తీసుకున్నాం. దానిని ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేశాం. ఎస్బీఐ ఎల్ఐసీకి రూ.38 లక్షలు ఇచ్చింది. అయితే మాకు PMAY వర్తిస్తుందా?
PMAY సబ్సిడీ కేవలం మొదటి సారి ఇల్లు కొనుగోలు చేసేవారికి మాత్రమే వర్తిస్తుంది. ఒక రుణదాత వద్ద రుణం తీసుకొని మరో బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేస్తే PMAY వర్తించదు.
-
సర్, క్రెడిట్ కార్డు తో బంగారం కొనుగోలు చేయవచ్చా? ఏదైనా చార్జీలు ఉంటాయా?
క్రెడిట్ కార్డు తో బంగారం లేదా ఏదైనా కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా, క్రెడిట్ కార్డు వాడకం పై చార్జీలు ఉండవు. మీరు ఒకసారి దుకానుదారుడితో ఈ విషయాన్ని తెలుసుకోవడం మంచిది. సకాలం లో బిల్లు ని చెల్లిస్తూ ఉండండి.
-
మ్యూచువల్ ఫండ్లలో 2000 చొప్పున 10 ఏళ్ళ చేస్తే ఎంత మొత్తం వస్తుంది ?
మ్యూచువల్ ఫండ్లలో ఎంత రాబడి వస్తుందో ముందే కచ్చితంగా చెప్పలేము. ఇది ఫండ్ వ్యూహం, ఫండ్ మేనేజర్ పని తీరు, మార్కెట్ స్థితిగతులు లాంటి వాటి పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ఒక ఇండెక్స్ ఫండ్ ఎంచుకుంటే సగటున 12 శాతం చొప్పున రాబడి ఆశించవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
భూమిపై ముద్ర లోన్ తీసుకోవాలి అనుకుంటున్నాను
ముద్ర రుణం అనేది స్వయం ఉపాధి మొదలు పెట్టాలనుకున్న వారి కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకం. మీరు మీ దగ్గరలోని బ్యాంకు ని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.
-
క్రెడిట్ కార్డు ద్వారా నగదు తీసుకుంటే చార్జీలు పడతాయా?
క్రెడిట్ కార్డు ద్వారా నగదు వెనక్కి తీసుకుంటే, తీసుకున్న మొత్తం మీద 2.5 నుంచి 3 శాతం వరకు చార్జీలు విధిస్తారు. కనీస చార్జీలు రూ. 250 నుంచి 300 వరకు ఉంటాయి. దీనితో పాటు మీరు తీసుకున్న నగదు పై వడ్డీ కూడా కట్టవలసి ఉంటుంది. ఇది నెలకు 2.70 నుంచి 2.85 శాతం వరకు ఉండవచ్చు. చక్ర వడ్డీ తో కలిపి చుస్తే ఏడాదికి 38 నుంచి 40 శాతం వరకు పడచ్చు. డబ్బు తీసుకున్న రోజు నుంచే వడ్డీ లెక్కిస్తారు. ఉదాహరణకి మీరు క్రెడిట్ కార్డు పై రూ. 25 వేలు నగదు తీసుకుంటే నగదు చార్జీలు, వడ్డీ తో కలిపి నెలకు రూ. 1500 చెల్లించాల్సి రావచ్చు. దీని బదులు వ్యక్తిగత రుణం, బంగారం, ఫిక్సిడ్ డిపాజిట్లు, బీమా పాలసీలు లాంటి వాటి పై రుణాలను పరిశీలించండి.
-
నా వద్ద రూ. 5 లక్షలు ఉన్నాయి. ఇందులో నుంచి నెలసరి వడ్డీ కావాలంటే ఎందులో మదుపు చేయాలి?
మీరు ఈ మొత్తాన్ని బ్యాంకు లో ఫిక్సిడ్ డిపాజిట్ చేయవచ్చు. కాల పరిమితి, వడ్డీ మొత్తాన్ని ఎంచుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో నెలసరి ఆదాయ పధకం కూడా ఎంచుకోవచ్చు.
-
నా పేరు కుమార్, మాది హైదరాబాద్, నేను రూ.10 లక్షల రుణం తీసుకుని హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకుంటున్నాను. రుణం తిరిగి చెల్లించేందుకు ఎంత కాలపరిమితి ఉండాలి? 20 సంవత్సరాల కాలవ్యవధి పెట్టుకోమని నా బ్రదర్ సూచిస్తున్నారు. 20 సంవత్సరాలకు వడ్డీ సమానంగా విభజిస్తారని, ఒకవేళ రూ.5 లక్షలు ఒకేసారి చెల్లిస్తే భవిష్యత్తులో వడ్డీ రాయితీ ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల తక్కువ లేదా ఎక్కువ కాలపరిమితులలో ఏది మంచిది తెలుపగలరు.
కాలపరిమితి పెరిగితే, మీరు చెల్లించవలసిన వడ్డీ మొత్తం కూడా పెరుగుతుంది. ఉదాహరణకి: మీరు 15 సంవత్సరాల కాలవ్యవధితో రూ. 10 లక్షల రుణం, 8.50 శాతం వడ్డీతో తీసుకుంటే, చెల్లించవలసిన ఈఎమ్ఐ నెలకు రూ.9,847. పూర్తి కాలపరిమితికి చెల్లించే మొత్తం వడ్డీ రూ.7.73 లక్షలు అదేవిధంగా కాలపరిమితి 20 సంత్సరాలు అయితే ఈఎమ్ఐ రూ.8,680. మీరు చెల్లించే మొత్తం వడ్డీ రూ.10.83 లక్షలు. ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో తిరిగి చెల్లించినా, మీరు చెల్లించవలసిన ఈఎమ్ఐలో మార్పు ఉండదు. చెల్లించవలసిన కాలవ్యవధిలో కొన్ని నెలలు తగ్గుతాయి. తద్వారా వడ్డీ భారం కొంత వరకు తగ్గుతుంది. ఒక వేళ మీరు 20 సంవత్సరాల కాలపరిమితి తీసుకుని, రెండు ఈఎమ్ఐల మధ్య వ్యత్యాసం రూ.1,167ను మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే అదనంగా చెల్లించే వడ్డీ మొత్తం రూ. 3.10 లక్షలు (రూ.10.83లక్షలు - రూ.7.73లక్షలు) 130నెలలు(11సంవత్సరాలలో) తిరిగి పొందవచ్చు.
-
నా వయసు 23 సంవత్సరాలు. నేను బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా? టర్మ్ పాలసీ లేదా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఏది తీసుకుంటే మేలు? సూచించగలరు.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇతర బీమా పాలసీలతో పోలిస్తే ప్రీమియం తక్కువగా ఉంటుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగి కాకపోతే టర్మ్ బీమా తీసుకోవాలి. మీ వార్షిక వేతనానికి 10-15 రెట్లు బీమా హామీనిచ్చే పాలసీని 60 ఏళ్ల వయసు వరకు ఉండేలా తీసుకోవాలి. భవిష్యత్తులో క్లెయిమ్ విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కచ్చితమైన వివరాలను బీమా సంస్థకు అందించాలి. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ లైఫ్ , మ్యాక్స్ లైఫ్ టర్మ్ బీమా పాలసీలను పరిశీలించండి
-
నమస్తే సర్, నా పేరు కృష్ణ. మా నాన్న వయసు 60, మా అమ్మ వయసు 45. ఇప్పుడు బీమా పాలసీలు తీసుకోవాలనుకొంటున్నారు. ఏవైనా మంచి పోలసీలు ఉంటే చెప్పండి.
జీవిత బీమా పాలసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాలసీ దారుడికి ఏదైనా జరిగితే వారి కుటుంబానికి ఆర్ధికంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం. ఒకవేళ మీరు సంపాదన పరులైతే మీ పేరు మీద పాలసీ తీసుకుంటే బాగుంటుంది. మీ తల్లిదండ్రులకి వీలయితే ఒక మంచి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోండి. మాక్స్ బూపా, అపోలో మునిచ్ లాంటి కంపెనీల ఫామిలీ ఫ్లోటర్ పాలసీలను పరిశీలించండి. వారి వయసుకి ప్రీమియం కాస్త ఎక్కువ ఉండవచ్చు.
-
ప్రస్తుతం బ్యాంక్ లో పొదుపు ఖాతాలో ఎంత వరకూ డబ్బు ఉంచవచ్చు. రూ. 5 లక్షల పైన ఉంటే ఆదాయపు పన్ను చెల్లించాలా?
బ్యాంకు ఖాతా కలిగిన వారు తమ ఖాతాలో ఎంత డబ్బునైనా పొదుపు చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను విషయం చూస్తే దాని ద్వారా వచ్చే రాబడిపై రూ. 10వేల వరకూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.10 వేలు పై బడి వచ్చిన రాబడికి పన్నుచెల్లించాలి. కొత్త గా బడ్జెట్ 2018 లో వచ్చిన మినహాయింపుల ప్రకారం సీనియర్ సిటిజన్లకు మాత్రం వడ్డీ గా లభించే ఆదాయం రూ.50 వేల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. రూ.50 వేల పైన వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించాలి. డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ ప్రకారం ప్రస్తుతం బ్యాంకుల్లో ఉన్న మొత్తం రూ. 1లక్ష వరకూ భద్రత ఉంటుంది. ప్రస్తుతం దాని స్థానంలో ఎఫ్ఆర్డీఐ బిల్లు వస్తే భద్రత ఉండదని ప్రచారంలో ఉంది. అయితే ఇది ఇంకా ఆమోదం పొందే వరకూ రాలేదు. ఇంకా బిల్లు డ్రాప్ట్ స్థాయిలో ఉంది. బిల్లు రూపొందాక సవరణలు జరిగాక ఆమోదం పొందితే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. అయితే ఆ బిల్లులో ఎంత మొత్తానికి భద్రత ఉంటుందనేది ఇంకా తెలియాలి. కాబట్టి బ్యాంకులో డబ్బు దాచుకునే విషయంలో ఆందోళన వద్దు.
-
మంచి బీమా కంపెనీల పేర్లు చెప్పగలరు.
బీమా కంపెనీ ఎంచుకునే సమయం లో దాని గత క్లెయిమ్‌ల చరిత్ర, కంపెనీ నిర్వహణ, ప్రీమియంలు లాంటివి దృష్టిలో పెట్టుకోవాలి. జీవిత బీమా పాలసీల్లో ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, మాక్స్ లైఫ్, ఎస్బీఐ కంపెనీల ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించవచ్చు. ఆరోగ్య బీమా కోసం మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్, సిగ్నా టీటీకే కంపెనీలను పరిశీలించవచ్చు.
-
హాయ్ సిరి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా పోస్ట్ ఆఫీస్ లో డిజిటల్ పొదుపు ఖాతా తెరిచి ఉపయోగించవచ్చా?
18 ఏళ్ళు నిండి, పాన్ (PAN), ఆధార్ కలిగి ఉన్న వారు డిజిటల్ పొదుపు ఖాతా ని తెరవవచ్చు. ఖాతా తెరచిన 12 నెలల లోపు కెవైసి వివరాలను పూర్తి చేయాలి . గరిష్టంగా రూ 2 లక్షల వరకు జమ చేయవచ్చు. కెవైసి పూర్తయిన తరువాత పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాతో లింక్ చేయవచ్చు.
-
హాయ సిరి, నా పేరు ప్రకాశ్. వయసు 31 సంవత్సరాలు. మా కుటుంబంలో మా అమ్మ (56), నా భార్య (25), బాబు (2) ఉంటాము. చిన్న ఉద్యోగం చేస్తున్నాను, వేతనం రూ.15 వేలు. ఇప్పటివరకు ఎటువంటి బీమా తీసుకోలేదు. ఈ కొత్త సంవత్సరంలో బీమా పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు, నా కుటుంబానికి ఉపయోగపడే ఒక బీమా పాలసీ, కంపెనీ వివరాలను తెలియజేయగలరు. బీమా పాలసీకి ఆరోగ్య బీమాకి తేడా ఉందా చెప్పగలరు..
ఆదాయం పొందుతున్న వ్యక్తిగా మీరు మీ వార్షిక వేతనానికి 10-15 రెట్లు బీమా హామీనిచ్చే పాలసీని 60 ఏళ్ల వయసు వరకు ఉండేలా తీసుకోవాలి. భవిష్యత్తులో క్లెయిమ్ విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కచ్చితమైన వివరాలను బీమా సంస్థకు అందించాలి. దీంతో పాటు బ్యాంకు లేదా పోస్టాఫీస్‌లో రికరింగ్ డిపాజిట్ ప్రారంభించి నెలకు కొంత బాబు ఉన్నత విద్య కోసం పొదుపు చేయడం మంచిది.
-
హాయ్ డియర్ సిరి, నా పేరు శివ ప్రసాద్ చౌదరి చింతా. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, నా పొదుపు ఖాతాను శాలరీ ఖాతాగా ఎలా మార్చుకోవాలి?
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ ఖాతాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిర్వహిస్తారు. మీకు ఎస్బీఐలో పొదుపు ఖాతా ఉంటే, మీ సంస్థలో జీతాలు పంపిణీ చేసే అధికారి వద్ద నుంచి మీ ఎంప్లాయి నెంబరు, బ్రాంచి, బ్యాంకు ఖాతా నెంబరు తదితర వివరాలతో, ఒక లేఖను తీసుకు రావాలి.
-
నా పేరు అమర్నాథ్. మాకు 2017 నవంబర్‌లో పాప పుట్టింది. కుటుంబంలో ఆర్జించేది నేనొక్కడినే. ప్రస్తుతం నాకు రూ.2 లక్షల విలువ చేసే ఎల్ఐసీ జీవన్ ఆనంద్, రూ.7 లక్షల విలువ గల ఎల్ఐసీ జీవన్ సరళ్ పాలసీలు ఉన్నాయి. నేను టర్మ్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. పాలసీ తీసుకునేటప్పుడు ప్యూర్ టర్మ్ పాలసీ తీసుకోవాలా లేదా మనీబ్యాక్, హోల్ లైఫ్ పాలసీ తీసుకోవాలా తెలపగలరు. పాలసీకి రైడర్లను జోడించాలా లేదా కూడా తెలుపగలరు.
మీరు ప్యూర్ టర్మ్ పాలసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీటిలో తక్కువ ప్రీమియానికే, అధిక హామీ మొత్తం(సమ్ అస్యూర్డ్) ఉంటుంది. అదే మనీబ్యాక్, హోల్ లైఫ్ అనేవి పొదుపుతో పాటు పెట్టుబడులకు ఉద్దేశించినవి. ఇందులో ప్రీమియం అధికంగా ఉండి, హామీ మొత్తం తక్కువగా ఉంటుంది. మీ వార్షికాదాయానికి 10 రెట్లు ఎక్కువ మొత్తానికి, 60 ఏళ్ల నుంచి ప్రస్తుత మీ వయసు తీసివేయగా వచ్చే కాలవ్యవధికి టర్మ్ పాలసీ తీసుకోండి. దీనికి అదనంగా రైడర్లను పాలసీతో కలిపి తీసుకోండి. రైడర్లతో మరికొంత తక్కువ ప్రీమియంతో అదనపు ప్రయోజనాలుంటాయి. కంపెనీ క్లెయిం పరిష్కార చరిత్ర ఆధారంగా పాలసీ తీసుకోవడం మంచిది. దీని కోసం మీరు ఐసీఐసీఐ ప్రు ప్రొటెక్ట్ స్మార్ట్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మాక్స్ లైఫ్ లాంటి పథకాలను పరిశీలించండి. ఎల్ఐసీలో కూడా టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. కానీ ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీకు అందుతున్న ప్రయోజనాలను బట్టి ప్రస్తుతమున్న ఎల్ఐసీ పాలసీలను కొనసాగించవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు. ఒక వేళ మీరు ఈ పాలసీలను కొనసాగించాలనుకుంటే టర్మ్ పాలసీకి నగదును సర్దుబాటు చేసుకోండి.
-
ప్రస్తుతం బ్యాంక్ లో పొదుపు ఖాతాలో ఎంత వరకూ డబ్బు ఉంచవచ్చు. రూ. 5 లక్షల పైన ఉంటే ఆదాయపు పన్ను చెల్లించాలా?
బ్యాంకు ఖాతా కలిగిన వారు తమ ఖాతాలో ఎంత డబ్బునైనా పొదుపు చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను విషయం చూస్తే దాని ద్వారా వచ్చే రాబడిపై రూ. 10వేల వరకూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.10 వేలు పై బడి వచ్చిన రాబడికి పన్నుచెల్లించాలి. కొత్త గా బడ్జెట్ 2018 లో వచ్చిన మినహాయింపుల ప్రకారం సీనియర్ సిటిజన్లకు మాత్రం వడ్డీ గా లభించే ఆదాయం రూ.50 వేల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. రూ.50 వేల పైన వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించాలి.
-
లయబిలిటీ బీమా ప్రీమియం గురించి తెలుపగలరు. జీవిత బీమా లయబిలిటీ బీమాను అందిస్తుందా ?
లయబిలిటీ బీమా అనేది మన వల్ల ఇతరులకు నష్టం వాటిల్లితే మన తరఫున బీమా సంస్థ నష్టపరిహారం చెల్లిస్తుంది . అందువల్ల కారు లేదా బైక్ లకు థర్డ్ పార్టీ బీమాను తప్పనిసరి చేశారు. అలాగే వృత్తి , వ్యాపారాలలో వినియోగదారునికి నష్టపరిహారం చెల్లిస్తారు. ఉదా : వైద్యవృత్తి, చార్టర్డ్ అకౌంటెంట్ , వస్తు సేవల్లో లోపాలు వంటి వాటి నుంచి నష్టం వాటిల్లితే , నష్ట పరిహారం చెల్లిస్తాయి. ఈ బీమాను సాధారణ బీమా సంస్థలు ఇస్తాయి . జీవిత బీమా సంస్థలు ఎండోమెంట్, మనీ బ్యాక్ , టర్మ్ జీవిత బీమా ను అందిస్తాయి.
-
సార్ ఆన్లైన్లో ఐసిఐసిఐ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేశాను. దానికి పాస్ బుక్కు, డెబిట్ కార్డు ఎలా వస్తాయి చెప్తారా?
ఈ విషయం గురించి మీరు నేరుగా ఐసీఐసీఐ బ్యాంకు ని సంప్రదించడం మంచిది. సాధారణంగా, మీరు ఆన్లైన్ ఖాతా లో తెలిపిన చిరునామా కి వారు వీటిని పంపిస్తారు.
-
స్మార్ట్ డిపాజిట్ గురించి చెప్పండి. నెల నెలా డిపాజిట్ చేయాలా లేక ఎప్పుడైనా చేయవచ్చా?
స్మార్ట్ డిపాజిట్ లో బ్యాంకు ని బట్టి నియమాలు ఉంటాయి. మీకు వీలు ఉన్నప్పుడల్లా ఇందులో డిపాజిట్ చేయవచ్చు. అవసరం ఉన్నప్పుడు అతి తక్కువ సమయం లో డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. వడ్డీ కూడా పొదుపు ఖాతా కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది.
-
నేను ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. మంచి పాలసీని సూచించండి.
ప్రస్తుతం ఉన్న వైద్య ఖర్చులను ద్రుష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా కలిగి ఉండడం ఏంతో అవసరం. మీరు తీసుకునే పాలసీ బీమా హామీ మొత్తం మీరు చెల్లించగలిగే ప్రీమియం, నివసించే ప్రాంతంలో ఉన్న వైద్య కర్చులను భరించగలిగేలా ఉండాలి. దీనికోసం కనీసం రూ. 3 నుంచి 5 లక్షల బీమా కల్పించే పాలసీ తీసుకోవడం మంచిది. భవిష్యత్తులో అవసరాన్ని బట్టీ ఈ మొత్తాన్ని పెంచుకునే వీలుని కూడా బీమా సంస్థలు కలిపిస్తున్నాయి. ఆరోగ్య బీమా మీకు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు అందరికీ ఉండడం అవసరం. దీనికోసం మీరు ఫామిలీ ఫ్లోటర్ పాలసీని తీసుకోవచ్చు. పాలసీ ఎంచుకునే ముందు పాలసీకి సంబంధించిన నెట్ వర్క్ ఆసుపత్రులు మీకు అందుబాటులో ఉన్నాయా, సబ్ లిమిట్, కో- పే, ముందుగా ఉన్న అనారోగ్యాలకు వెయిటింగ్ పీరియడ్, ఎంత వయసు వరకూ పాలసీని కొనసాగించే అవకాశం ఉంది, పాలసీ అందించే సంస్థ క్లెయిమ్ చెల్లింపులు ఎలా ఉన్నాయి అనే వివరాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. కింది పాలసీలను పరిశీలించవచ్చు ఐసీఐసీఐ లోమ్బార్డ్ కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అపోలో మ్యూనిక్ ఆప్టిమా రిస్టోర్ పాలసీ మాక్స్ భూపా హెల్త్ కంపానియన్ పాలసీ హెచ్ డీ ఎఫ్ సీ హెల్త్ సురక్షా Saranya Reddy CFA (ICFAI), Certified Financial Planner
-
మీ ఖాతా నంబర్ xxxx నుంచి, 22-11-2019 తరువాత చెల్లింపులు చేయబడవు, కెవైసి ని పూర్తిచేయండి . దీని అర్ధం తెలుపగలరు.
మీ బ్యాంకు బ్రాంచ్ కి వెళ్లి మీ పాన్ (PAN ) ను ఇవ్వవలసి ఉంటుంది. మీకు పాన్ (PAN ) లేకపోతె ఫారం 60 ని నింపి ఇవ్వాలి. మీరు ఆన్లైన్ లో కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా ’ UPDATE PAN ’ ని క్లిక్ చేసి మీ PAN లేదా ఫారం 60 ని అప్లోడ్ చేయవచ్చు. లేదా మీ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ వారికి ఇమెయిల్ ద్వారా కూడా పంపవచ్చు.
-
సర్, నా పేరు రవి కృష్ణ. పదవీ విరామనా తరువాత నెలసరి పెన్షన్ కోసం ఏ పాలసీ బాగుంటుంది? మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తే మంచిదా లేక పెన్షన్ పాలసీ ఆ?
మార్కెట్లో లభించే చాలా పెన్షన్ పాలసీలు అధిక చార్జీలు కలిగి ఉంటాయి. దీని వల్ల సరైన రాబడి లభించదు. మీరు పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం మ్యూచువల్ ఫండ్లు, ఎన్పీఎస్ లాంటి పథకాల్లో మదుపు చేయవచ్చు. ఎన్పీఎస్ లో పెన్షన్ కూడా లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్లలో సమకూర్చుకున్న నిధితో సిస్టమాటిక్ విత్డ్రావాల్ ప్లాన్ ద్వారా నెల నెలా మీ డబ్బుని వెనక్కి తీసుకోవచ్చు.
-
సెక్షన్ 80ttb అంటే ఏంటి?
ఈ సెక్షన్ ద్వారా 60 ఏళ్ళ పైన వయసు గల వారికి బ్యాంకు డిపాజిట్ల వడ్డీ పై ఏడాదికి రూ. 50 వేల వరకు మినహాయింపు పొందొచ్చు.
-
హాయ్ సిరి, నేను ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. బీమా హామీ రూ 5 లక్షలు. వార్షిక ప్రీమియం రూ 28 వేలు . మెచ్యూరిటీ 2040 సం . ఈ పాలసీ ఏమైనా ఉపయోగం ఉంటుందా ?
బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పధకాల (ఎండోమెంట్, హోల్ లైఫ్ , మనీ బ్యాక్, యూలిప్స్ లాంటివి) నుంచి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ . ముందుగా మీరు ఒక టర్మ్ జీవిత బీమా పాలసీ తీసుకోండి . టర్మ్ పాలసీ ని వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పీపీఎఫ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచివి. అలాగే పదవీవిరమణ కోసం ఎన్పీఎస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచివి.
-
సర్, ఒకవేళ పన్ను మినహాయింపు గల డిపాజిట్ కాల పరిమితి ముగిసే ముందే ఖాతాదారుడు మరణిస్తే నామినీ డిపాజిట్ ని మూసివేయచ్చ?
డిపాజిటరు మరణిస్తే, నామినీ కి రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, డిపాజిట్ ని యధావిధిగా కొనసాగించవచ్చు. రెండు, వెంటనే దాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఇలా చేస్తే ఎటువంటి నామినీ పై ఎటువంటి పెనాల్టీ విధించారు. నామినీ బ్యాంకు ని సంప్రదించకపోతే డిపాజిట్ కొనసాగుతూనే ఉంటుంది.
-
సర్, నా వయసు 32. నా నెలసరి జీతం రూ. 40 వేలు. నాకు 4 ఏళ్ళ పాప ఉంది. ఆర్ధిక సలహాలు ఇవ్వండి. మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేయాలా లేక సిప్ లో నా?
ముందుగా మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు, అంటే సుమారుగా రూ. 75 లక్షల బీమా హామీ ఉండేలా చూసుకోండి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. మీ పాప చదువు లేదా పెళ్లి కోసం సుకన్య సమృద్ధి పధకం ఎంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో కాస్ట్ రిస్క్ ఉంటుంది. ఒకోసారి ఫండ్ లో నష్టాలూ రావచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడానికి రెండు పద్ధతులు - ఒకటి లంప్సమ్, రెండు సిప్. సిప్ అంటే ప్రతి నెలా ఫండ్ లో నేరుగా మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు చేరి దానికి తగ్గ యూనిట్స్ కొనుగోలు చేయడం. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.
-
సర్ నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అటల్ పెన్షన్ యోజన ఖాతా ప్రారంభించాను. ఖాతాకు సంబంధించి బ్యాంకు ఎటువంటి పాస్‌బుక్ ఇవ్వలేదు. నగదు నా ఖాతా నుంచి నేరుగా ఏపీవై ఖాతాలో జమవుతుందని చెప్పారు. ఖాతాలో జమవుతుందో లేదో ఎలా తెలుసుకోవాలి. మా కుటుంబ సభ్యులు ఈ ఖాతాను నిర్వహించే అవకాశముందా?
మీరు పాన్ నంబర్, బ్యాంకు ఖాతా ఖాతా సంఖ్య ద్వారా ఈ కింద ఇచ్చిన లింక్ సాయంతో ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు. https://npslite-nsdl.com/CRAlite/EPranAPYOnloadAction.do అటల్ పెన్షన్ యోజన ఖాతాకు సంబంధించి అన్ని వివరాలు నమోదిత మొబైల్ నంబర్‌కి వస్తాయి. ఖాతాలో నగదు క్రెడిట్ అయినప్పడు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారమందుతుంది. చందాదారులు నామినీ పేరు, చిరునామా, ఫోన్‌నంబర్ వంటివి మార్చుకునే అవకాశం కూడా ఉంది. మీ ప్రాన్ నంబర్, బ్యాంకు ఖాతా సంఖ్య కుటుంబ సభ్యులకు తెలిస్తే వారు కూడా ఖాతాను నిర్వహించే అవకాశం ఉంటుంది.
-
డియర్ సిరి, 10 ఏళ్లలో రూ. 1 కోటి పొందాలంటే యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో ఎంత మదుపు చేయాలి? అలాగే, పదవీ విరమణ అనంతరం మంచి పెన్షన్ పొందాలంటే ఎందులో మదుపు చేయాలి?
10 ఏళ్ళ పాటు ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయడం మంచి ఆలోచన. అయితే, మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత రాబడి వస్తుందో ముందే ఊహించలేము. సగటుగా 12 శాతం రాబడి అనుకున్నట్టయితే నెల కి రూ. 43000 మదుపు చేస్తే 10 ఏళ్ళకి సుమారుగా రూ. 1 కోటి వరకు పొందగలరు. పదవీ విరమణ కోసం ఎన్పీఎస్ ఎంచుకోవచ్చు. అందులో పదవీ విరమణ నిధి తో పాటు మంచి పెన్షన్ కూడా పొందే అవకాశం ఉంటుంది.
-
సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?
బ్యాంకు టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి బ్యాంకు జనరల్ మేనేజర్ స్థాయి ఉన్నత అధికారుల ఈ-మెయిల్ తెలుసుకోవాలి. బ్యాంకు గ్రీవెన్స్ సెల్, జనరల్ మేనేజర్‌కు, బ్యాంకు అంబుడ్స్మను ఈమెయిల్ ద్వారా సమస్యను తెలియజేయండి.
-
సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్ అవ్వాలంటే సెబీ వద్ద ఎలా నమోదు చేసుకోవాలి? ఎలాంటి పరీక్ష రాయాలి? తేలియజేయగలరు.
ఈ పరీక్ష(5 మాడ్యూల్స్) రాయడానికి మీరు ఎఫ్‌పీఎస్‌బీ బోర్డు ని సంప్రదించవచ్చు. ఈ కింది లింక్ లో మీ ప్రశ్నలను వారిని అడగవచ్చు. https://india.fpsb.org/contact/
-
నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
హెచ్డీఎఫ్సీ ప్రో గ్రోత్ ప్లస్ మదుపు, బీమా హామీ కలిపి ఇచ్చే ఒక యూలిప్ పాలసీ. ఇతర యూలిప్ పాలసీల వలే ఇందులో కూడా మోర్టాలిటీ, ఫండ్ మానేజ్మెంట్, రిస్క్ బెనిఫిట్ లాంటి ఎన్నో చార్జీలు విధిస్తారు. వీటి వల్ల మదుపు చేస్తే మొత్తం తగ్గిపోతుంది, కాబట్టి రాబడి కూడా తగ్గిపోతుంది. మీరు పాలసీని వెనక్కి ఇస్తే వచ్చే మొత్తం గురించి ఆరా తీసి కుదిరితే పాలసీ ని వెనక్కి ఇచ్చేయండి. ఇలా మిగిలిన డబ్బుని నెల నెలా సిప్ చేయండి. అలాగే మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 12 రెట్లు బీమా హామీ ఉండే టర్మ్ పాలసీ ని ఎంచుకోండి
-
హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
మీరు ఎంచుకునే టర్మ్ పాలసీ లో బీమా మొత్తం మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ఐసీఐసీఐ, మాక్స్ లైఫ్ లేదా ఎస్బీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించవచ్చు.