close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నమస్తే సర్, మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, సిప్ మధ్య తేడా వివరించగలరు? వీటిలో ఎందులో ఇన్వెష్ట్ చేస్తే మంచిది అని చెప్పగలరు.

Asked by Kunuku vasu on
ఈక్విటీ అంటే షేర్ మార్కెట్ లో పెట్టుబడులు. నేరుగా కంపెనీ షేర్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పరోక్షంగా కూడా మార్కెట్ లో పెట్టుబడి పెట్టె అవకాశం ఉంటుంది. షేర్స్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో పెట్టుబడికి సమయం , నైపుణ్యం ఎంతో అవసరం. నిపుణులను సలహా కోరి మాత్రమే షేర్స్ ఎంచుకోవడం మేలు.  ప్రతి మ్యూచువల్ ఫండ్ కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. వారు ఎలాంటి షేర్స్ లో పెట్టుబడి పెట్టాలో నిర్ణయిస్తారు. మదుపరుల నుంచి డబ్బు ని  సమకూర్చుకుని 100-200 షేర్స్ లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. కాబట్టి, రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. ఇందులో పెట్టుబడి పెట్టడానికి రెండు మార్గాలు - లంప్సమ్ అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టడం లేదా సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా నెల నెలా క్రమంగా పెట్టుబడి పెట్టవచ్చు. సిప్ లో మర్కెట్స్ తో సంబంధం లేకుండా పెడ్తుంటాం కాబట్టి రిస్క్ మరి కాస్త తగ్గుతుంది. కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేసే ఉద్దేశం ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. 

మరిన్ని

మీ ప్రశ్న